governaments polacies
-
ప్రపంచ బ్యాంక్ కనుసన్నల్లో పాలన
ప్రభుత్వంపై ధ్వజమెత్తిన ఎమ్మెల్సీ శ్రీనివాసులురెడ్డి కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దుకు డిమాండ్ నెల్లూరు(పొగతోట): ప్రపంచ బ్యాంకు కనుసన్నల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాలన సాగిస్తున్నాయని ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డి ధ్వజమెత్తారు. యూటీఎఫ్ ఆధ్వర్యంలో శనివారం నెల్లూరులోని కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. ప్రపంచ బ్యాంకు ఆదేశాలతోనే కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని అమలులోకి తెచ్చారని విమర్శిం చారు. కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నాయని మండిపడ్డారు. పాత విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. రమణారెడ్డి, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సి. చంద్రశేఖర్ మాట్లాడుతూ పాలకుల తీరుకు నిరసనగా సెప్టెంబర్లో చేపట్టనున్న సమ్మెకు అందరూ మద్దతు పలకాలని కోరారు. నవంబర్ 29న చలో పార్లమెంట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. మొ దట ఆయన నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలంటూ సంతకాల సేకరణను ప్రారంభించారు. యూటీఎఫ్ నేతలు కె. తులసిరాంబాబు, ఎన్. నవకోటేశ్వరరావు,ఎం. మస్తానయ్య, నాగిరెడ్డి, ఎన్వి సు బ్బారావు, వివి. శేషులు, జివి. భాస్కÆ పాల్గొన్నారు. -
ప్రపంచ బ్యాంక్ కనుసన్నల్లో పాలన
ప్రభుత్వంపై ధ్వజమెత్తిన ఎమ్మెల్సీ శ్రీనివాసులురెడ్డి కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దుకు డిమాండ్ నెల్లూరు(పొగతోట): ప్రపంచ బ్యాంకు కనుసన్నల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాలన సాగిస్తున్నాయని ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డి ధ్వజమెత్తారు. యూటీఎఫ్ ఆధ్వర్యంలో శనివారం నెల్లూరులోని కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. ప్రపంచ బ్యాంకు ఆదేశాలతోనే కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని అమలులోకి తెచ్చారని విమర్శిం చారు. కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నాయని మండిపడ్డారు. పాత విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. రమణారెడ్డి, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సి. చంద్రశేఖర్ మాట్లాడుతూ పాలకుల తీరుకు నిరసనగా సెప్టెంబర్లో చేపట్టనున్న సమ్మెకు అందరూ మద్దతు పలకాలని కోరారు. నవంబర్ 29న చలో పార్లమెంట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. మొ దట ఆయన నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలంటూ సంతకాల సేకరణను ప్రారంభించారు. యూటీఎఫ్ నేతలు కె. తులసిరాంబాబు, ఎన్. నవకోటేశ్వరరావు,ఎం. మస్తానయ్య, నాగిరెడ్డి, ఎన్వి సు బ్బారావు, వివి. శేషులు, జివి. భాస్కÆ పాల్గొన్నారు.


