breaking news
goods train derails
-
పట్టాలు తప్పిన రైలు.. నదిలో బోగీలు
చండీగఢ్: హర్యానాలో ఓ గూడ్సు రైలు పట్టాలు తప్పింది. అంబాలా జిల్లాలో మార్కంద నది వంతెనపై వెళుతున్న రైలుకు చెందిన 15 బోగీలు పట్టాలు తప్పి నదిలో పడ్డాయి. ఈ బోగీల్లో బొగ్గు ఉన్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైలు డ్రైవర్ గార్డు సురక్షితంగా ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటన జరగడంతో అంబాలా-సహరాన్పూర్ మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తిరిగి యథాస్థితిని తీసుకొచ్చేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దెబ్బతిన్న వంతెనను కూడా బాగు చేస్తున్నారు. బ్రిడ్జిని దాటుతున్న రైలు ఎలా పట్టాలు తప్పిందో ఇంకా కారణాలు తెలియరాలేదని అధికారులు తెలిపారు. ఘటనా ప్రాంతానికి చండీగఢ్ 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. -
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
-
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు, ఒకరు మృతి
విశాఖ : విశాఖ జిల్లాపెద గంట్యాడ వద్ద ఓ గూడ్స్ రైలు మంగళవారం తెల్లవారుజామున పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో గార్డ్ మృతి చెందినట్లు తెలుస్తోంది. గూడ్స్ రైలు బొగ్గు లోడుతో గంగవరం పోర్ట్ కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో మరో ఇద్దరు గాయపడినట్లు సమాచారం. గాయపడినవారిని పోర్ట్ అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.