శంషాబాద్‌లో బంగారం స్వాధీనం
శంషాబాద్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనిఖీలు చేపడుతున్న కస్టమ్స్ అధికారులు ఓ వ్యక్తి నుంచి 226 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి శుక్రవారం ఇక్కడికి చేరుకున్న ఓ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొని అతని వద్ద ఉన్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.