breaking news
golden dollars
-
ట్రంప్ ముఖచిత్రంతో బంగారు డాలర్
వాషింగ్టన్: అమెరికా 250 ఏళ్ల అవతరణ వేడుకలను పురస్కరించుకుని ముద్రించ తలపెట్టిన దేశాధ్యక్షుడు ట్రంప్ ముఖచిత్రంతో కూడిన ఒక డాలర్ బంగారు నాణెం ఫొటోలను అమెరిక ఆర్థికమంత్రి స్కాట్ బెస్సెంట్ బుధవారం విడుదల చేశారు. అమెరికా దేశభక్తికి, స్వేచ్ఛకు ఇవి చిహ్నాలని ఆయన ‘ఎక్స్’లో వ్యాఖ్యానించారు. అమెరికా ఫెడరల్ చట్టాల ప్రకారం జీవించి ఉన్న వ్యక్తుల చిత్రాలతో నాణేలను ముద్రించడంపై నిషేధముంది. అయితే, అమెరికా 250వ వార్షికోత్సవ ప్రత్యేక డిజైన్ల చట్టం–2020 ప్రకారం ఈ నాణెం విడుదలకు చట్టపరంగా ఎటువంటి అడ్డంకులు లేవని ఆర్థికమంత్రిత్వ శాఖ చెబుతోంది. నాణెం ముద్రణ ఇప్పటికే మొదలైందని, త్వరలో మార్కెట్లోకి విడుదలవుతుందని తెలిపింది. గతంలో 1926లో అమెరికా 150వ వార్షికోత్సవం సందర్భంగా అప్పటి 30వ అధ్యక్షుడు కాలి్వన్ కూలిడ్జ్ తన సొంత చిత్రం, జార్జ్ వాషింగ్టన్ చిత్రంతో కూడిన అర–డాలర్ నాణేన్ని విడుదల చేశారు. -
డాలర్లు దొరక్క.. తిరుమల భక్తుల్లో అసంతృప్తి
సాక్షి, తిరుమల : అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా మంగళవారం తిరుమలలో శ్రీవారి బంగారు, వెండి డాలర్ల అమ్మకాలు జోరుగా సాగాయి. సాయంత్రం 6 గంటల వరకు సుమారు రూ.30 లక్షల వరకు అమ్మకాలు జరిగాయి. రూ.26,020 విలువ చేసే 10 గ్రాముల బంగారు డాలర్లు, రూ.13,225 విలువ చేసే 5 గ్రాముల బంగారు డాలర్ల అమ్మకాలు జరిగాయి. కాగా ఇందులో రూ.5,485 ధరతో విక్రయించే 2 గ్రాముల బంగారు డాలర్ల స్టాకు లేదు. అలాగే రూ.850లు విలువ చేసే10 గ్రాముల వెండి డాలర్లు, రూ.475 విలువ చేసే 5 గ్రాముల వెండి డాలర్లు మాత్రమే అమ్ముడయ్యాయి. రూ.275 ధరతో విక్రయించే 3 గ్రాముల వెండి డాలర్ల స్టాకు అందుబాటులో లేదు. అక్షయ తృతీయ రోజున శ్రీవారి బంగారు డాలర్లు కొనుగోలు చేద్దామని వచ్చిన భక్తులకు తక్కువ ధరతో ఉన్న డాలర్లు అందుబాటులో ఉంచడంలో టీటీడీ అధికారులు నిర్లక్ష్యం చేశారని పలువురు ధ్వజమెత్తారు. అలాగే డాలర్ల విక్రయ కేంద్రం కూడా ఆలయం ముందు భాగం నుంచి లడ్డూ కౌంటర్ల వద్దకు మార్చడంతో అమ్మకాలు తగ్గినట్టు కనిపిస్తున్నాయి.


