gold gifts
-
బంగారం 'గిఫ్ట్' వచ్చిందా.. ఈ రూల్స్ తెలుసా?
ప్రస్తుతం పసిడి ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, ప్రతి ఇంటా బంగారంపైనే చర్చ జరుగుతోంది. 2026 మార్చిలో 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.1.69 లక్షల ఆల్-టైమ్ గరిష్టాన్ని తాకి, ప్రస్తుతం స్వల్ప హెచ్చుతగ్గులతో రూ.1.50 లక్షల సమీపంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో, అక్షయ తృతీయ, పెళ్లిళ్ల సీజన్ సందర్భంగా బంగారం బహుమతులు ఇచ్చే వారు, తీసుకునే వారు తాజా పన్ను నిబంధనలు తెలుసుకోవడం చాలా అవసరం.బంగారం ధరలు భారీగా పెరగడంతో, బహుమతిగా ఇచ్చే నగలు లేదా కాయిన్ల విలువ కూడా పెరిగింది. దీనివల్ల పన్ను పరిమితులు త్వరగా దాటే అవకాశం ఉంది.ఇలా వస్తే పన్ను లేదు..బంధువుల నుంచి: భార్యాభర్తలు, తల్లిదండ్రులు, తోబుట్టువుల నుంచి ఎంత విలువైన బంగారం అందుకున్నా నయా పైసా పన్ను చెల్లించక్కర్లేదు.వివాహ కానుకలు: వివాహ సమయంలో స్నేహితులు లేదా ఇతరుల నుంచి వచ్చే గోల్డ్ గిఫ్ట్‌లకు పూర్తి మినహాయింపు ఉంటుంది. ధర ఎంత ఉన్నా పన్ను ఉండదు.వారసత్వ సంపద: తల్లిదండ్రుల నుంచి లేదా వీలునామా ద్వారా వచ్చే బంగారానికి పన్ను మినహాయింపు లభిస్తుంది.ఇలా అయితే పన్ను కట్టాల్సిందే..స్నేహితులు / ఇతరుల నుంచి: బంధువులు కాని వారు ఇచ్చే బంగారం విలువ ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50,000 మించితే, ఆ మొత్తం విలువపై మీ ఆదాయపు పన్ను స్లాబ్ ప్రకారం పన్ను కట్టాలి. ప్రస్తుతం బంగారం ధర రూ.1.5 లక్షలు దాటిన నేపథ్యంలో, చిన్న ఉంగరం బహుమతిగా ఇచ్చినా ఈ పరిమితి దాటే అవకాశం ఉందని గుర్తుంచుకోవాలి.బంగారం అమ్మితే పన్ను ఎంత? బడ్జెట్ 2026 నిబంధనల ప్రకారం బంగారం అమ్మకంపై పన్ను (Capital Gains Tax) గణనలో స్పష్టత వచ్చింది. దీర్ఘకాలిక మూలధన లాభం (LTCG): మీరు బంగారాన్ని 24 నెలల (2 ఏళ్లు)కంటే ఎక్కువ కాలం ఉంచుకుని అమ్మితే, వచ్చే లాభంపై 12.5% పన్ను పడుతుంది. ఇందులో 'ఇండెక్సేషన్' (ద్రవ్యోల్బణ సర్దుబాటు) ప్రయోజనం ఉండదు.స్వల్పకాలిక మూలధన లాభం (STCG): కొన్న 24 నెలల లోపే అమ్మితే, ఆ లాభాన్ని మీ వార్షిక ఆదాయానికి కలిపి, మీ ట్యాక్స్ స్లాబ్ (Slab Rate) ప్రకారం పన్ను విధిస్తారు.సావరిన్ గోల్డ్ బాండ్లు (SGB): మీరు నేరుగా ఆర్బీఐ నుంచి కొన్న బాండ్లను (Sovereign Gold Bonds) మెచ్యూరిటీ (8 ఏళ్లు) వరకు ఉంచుకుంటే లాభంపై పన్ను ఉండదు. కానీ, సెకండరీ మార్కెట్లో కొన్న వారికి ఈ మినహాయింపు వర్తించదు.కొనుగోలుపై జీఎస్టీ అదనంబంగారం ధరలతో పాటు పన్నుల (GST) భారం కూడా ఉంటుంది. గోల్డ్ వాల్యూపై 3 శాతం, మేకింగ్ చార్జీలపై 5% జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. డిజిటల్ గోల్డ్‌పై కూడా 3 శాతం జీఎస్టీ వర్తిస్తుంది.నిపుణుల సూచన: బంగారం ధరలు భారీగా ఉన్నందున, పెద్ద మొత్తంలో బంగారం బహుమతిగా వచ్చినప్పుడు భవిష్యత్తులో ఐటీ నోటీసుల ఇబ్బంది లేకుండా 'గిఫ్ట్ డీడ్' (Gift Deed) రాసి ఉంచుకోవడం ఉత్తమం.ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ ప్రకారం, బంగారం ధరలు 2026 చివరి నాటికి మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కాబట్టి పెట్టుబడి లేదా బహుమతుల విషయంలో పన్ను అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోండి.ఇదీ చదవండి: బంగారం, వెండి పెట్టుబడులకు కొత్త నిబంధనలు -
బర్త్‌డే బాసుకు.. బంగారం గిఫ్ట్
- పుట్టినరోజుకు కనీసం రెండు తులాల గొలుసు తేవాలట! - గోల్డ్ కాకుంటే రూ.50 వేలు, అంతకన్నా విలువైన బహుమతి - ఎస్సైలు, సీఐలకు ఎస్పీ టార్గెట్ - ఉన్నతాధికారులకు ఫిర్యాదులు సాక్షి, హైదరాబాద్ ‘‘రేపు సార్ పుట్టిన రోజు. స్పెషల్ గిఫ్ట్‌తో రావాలి. సార్‌ను ఆనందంలో ముంచేలా ఉండాలి. ఇందుకు బాగా ప్లాన్ చేసుకొని ఖరీౖదైన గిఫ్ట్ తీసుకురండి..’’ – ఇదీ ఓ జిల్లాలో పనిచేస్తున్న సబ్ ఇన్స్పెక్టర్లు/స్టేషన్ హౌజ్ ఆఫీసర్లకు ఎస్పీ కార్యాలయం నుంచి అందిన వాట్సాప్ మెసేజ్! ఈ సందేశాన్ని చూసిన ఎస్సైలు, ఇన్స్పెక్టర్లకు మైండ్ బ్లాంక్ అయ్యింది. ఎస్పీ పుట్టినరోజు అయితే తాము ఖరీదైన కానుకలు తేవడమేంటి? అవసరమైతే ఘనంగా పార్టీ ఇస్తే సరిపోతుందనిగానీ అనుకున్నారు. కానీ సదరు ఎస్పీ మూములోడు కాదని, ఎప్పుడు ఏ విషయంలో తమను బలిచేస్తాడోనన్న భయంతో ఆలోచనలో పడిపోయారు. సాదాసీదా గిఫ్ట్‌లు ఇష్టపడరట! ఎస్పీ కార్యాలయం నుంచి మెసేజ్ అందిన తర్వాత కొందరు ఎస్సైలు, ఇన్స్పెక్టర్లు ఎస్పీ దూతను సంప్రదించారు. అందుకు ‘‘సార్ సాదాసీదా గిఫ్ట్‌లు ఇష్టపడరు. ప్రతీ ఒక్క ఎస్సై/సీఐ కనీసం రెండు తులాల బంగారు గొలుసు గిఫ్ట్‌గా తీసుకురావాలి. లేకపోతే సార్ ఫీలవుతారు. ఆయన ఇబ్బంది పడితే మీరు కూడా ఇబ్బందిపడాల్సి ఉంటుంది..’’అని అవతలి వైపు నుంచి బెదిరింపుతో కూడిన సలహా వచ్చింది. ఇంకేముంది ఆ దూత చెప్పినట్టు బంగారు గొలుసు కోసం సిద్ధమయ్యారు. బంగారం ఇవ్వకపోతే కానుకగా రూ.50 వేలు లేదా అంతకుమించిన గిఫ్ట్ దూతకు అందించాలన్న హుకూం కూడా జారీ అయినట్టు ఆ జిల్లాలోని అన్ని ఠాణాల్లో చర్చ జరుగుతోంది. ఇవేవీ ఇవ్వకపోతే చార్జిమెమోలు, పీపీఐ(పోస్ట్‌పోన్ ఆఫ్ ఇంక్రిమెంట్), సెన్సూర్.. ఇలా ఏదో ఒక పనిష్మెంట్ ఇస్తాడన్న భయంతో అధికారులందరూ బంగారాన్ని బర్త్డ్గా కానుకగా అందించినట్టు తెలిసింది. అవాక్కయిన ఉన్నతాధికారులు వరంగల్, కరీంనగర్ రేంజ్లో ఉన్న ఓ జిల్లా ఎస్పీ తన బర్త్‌డే వేడుకలకు ఇలా కానుకలు డిమాండ్ చేయడంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. బర్త్‌డే వేడుకకు కానుకలు ఇవ్వకపోతే ఇబ్బంది పెడతారన్న భయంతో ఒక్కొక్కరు రెండు తులాల బంగారం కానుకగా ఇచ్చారని ఇంటెలిజెన్స్‌కు ఫిర్యాదులు అందాయి. సంబంధిత దూత నుంచి వెళ్లిన ఓ వాట్సాప్ మెసేజ్ నిఘా వర్గాలకు చేరినట్టు తెలిసింది. దీనిపై డీజీపీతోపాటు సంబంధిత ఉన్నతాధికారులు ఎస్పీ వ్యవహారంపై ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. బర్త్‌డే పార్టీకి బంగారం డిమాండ్ చేయడంపై ఐపీఎస్ అధికారులంతా అవాక్కయినట్టు తెలుస్తోంది. గతంలో కూడా ఓ డీఐజీ(ప్రస్తుతం ఐజీ) ర్యాంక్ అధికారి కూతురు బర్త్‌డేకు ఇలాంటి డిమాండ్ పెట్టి ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురయ్యారు. మొదట్నుంచీ వివాదాస్పదుడే.. గ్రూప్–1 నుంచి ప్రమోషన్‌పై ఐపీఎస్ అయిన సంబంధిత అధికారి మొదట్నుంచీ వివాదాస్పదుడిగానే ముద్రపడ్డాడు. ఓ ఉమ్మడి కమిషనరేట్‌కు డీసీపీగా పనిచేసిన ఆయన.. రాష్ట్ర విభజన తర్వాత రాజధాని శివారు జిల్లాకు ఎస్పీగా బదిలీ అయ్యాడు. సంబంధిత జిల్లా పరిధిలో ఎస్వోటీ అధికారులు ఓ రిసార్ట్‌పై దాడికి వెళ్లినప్పుడు ఎస్పీ పట్టుబడటం, ఆ తర్వాత విషయం బయటకు రాకుండా అక్కడ్నుంచి బదిలీ చేసి ఉన్నతాధికారులు చేతులు దులుపుకున్నారు. ఇప్పుడీ బర్త్‌డే వేడుకల అంశంపై ఉన్నతాధికారులు ఏం చర్య తీసుకుంటారోనన్న చర్చ పోలీస్ శాఖలో సాగుతోంది.


