breaking news
gold business global market
-
ఆర్థిక శాఖ ఆదేశాలు: పసిడి రుణాలను సమీక్షించుకోండి!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇస్తున్న పసిడి రుణాల్లో నిబంధనల ఉల్లంఘన జరుగుతుండటంపై కేంద్రం దృష్టి పెట్టింది. ఇలాంటి పలు ఉదంతాలు తమ దృష్టికి వచ్చాయని, ఈ నేపథ్యంలో బంగారం రుణాల పోర్ట్‌ఫోలియోను సమగ్రంగా సమీక్షించుకోవాలని పీఎస్‌యూ బ్యాంకులన్నింటికీ సూచించింది. ఈ మేరకు బ్యాంకుల చీఫ్‌లకు లేఖ రాసినట్లు ఆర్థిక సర్వీసుల విభాగం (డీఎఫ్ఎస్) కార్యదర్శి వివేక్ జోషి తెలిపారు. బంగారం రుణాలపై ఫీజులు.. వడ్డీల వసూళ్లు.. ఖాతాల మూసివేతలో అవకతవకలు జరుగుతుండటం, తగినంత విలువ గల బంగారాన్ని తనఖా పెట్టించుకోకుండానే రుణాలివ్వడం, నగదు రూపంలో రీపేమెంట్లు తీసుకోవడం తదితర ఉల్లంఘనలపై డీఎఫ్ఎస్ ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా 2022 జనవరి 1 నుంచి 2024 జనవరి 31 వరకు మంజూరైన రుణాలపై సమీక్ష జరగనుంది. ఇవి చదవండి: ఈ–స్కూటర్‌కు రూ.10,000 వరకు ఆర్థిక ప్రోత్సాహకం! -
బంగారం బహు ప్రియం
చెన్నై, సాక్షి ప్రతినిధి: బంగారు ధర రాష్ట్రంలో ఎనిమిదేళ్ల క్రితం నుంచే పరుగులు పెట్టడం ప్రారంభించింది. 2004లో గ్రాము ధర సరాసరి 600 నిలకడగా ఉండేది. బంగారు వ్యాపారం గ్లోబల్ మార్కెట్‌గా మారడంతో ధర పెరుగుతూ ఒక దశలో గ్రాము 3 వేలకు చేరుకుంది. నెల క్రితం సవరం ధర *20 వేలు పలికింది. వార ం క్రితం *22 వేలకు చేరింది. తమిళనాడు మార్కెట్లో బంగారు ధరను ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో సవరించడం ఆనవాయితీ. ఈ నెల 13వ తేదీ ఉదయం గ్రాము *2791, సాయంత్రానికి *2787 పలికింది. ఈ నెల 14న ధర తగ్గుముఖం పట్టి రెండు వేళల్లోనూ గ్రాము 2776 రూపాయలకు అమ్మారు. ఈ నెల 15న స్వాతంత్య్ర దినోత్సవ సెలవు కావడంతో అదే ధర కొనసాగింది. అరుుతే 16వ తేదీ గ్రాము ఉదయం *2904, సాయంత్రం *2881 చొప్పున అమ్మారు. శనివారం గ్రాము*2946, సవరం ధర *23,568 పలికారుు. కేవలం ఒక రోజులోనే సవరంపై *520 పెరిగింది. ఈ నెల 6న సవరం 21,144 రూపాయలకు విక్రరుుం చారు. శనివారం నాటి ధరతో పోలిస్తే కేవలం ఈ పది రోజుల్లో సవరంపై *2,424 పెరిగినట్లు అరుుంది. బంగారు దిగుమతులపై ఆంక్షలు, ప్రపంచ మార్కెట్లో ధర పెరగడమే ఈ పరిస్థితికి కారణమని వ్యాపారులు చెబుతున్నారు. రూపారుు పతనమే కారణం ప్రపంచ మార్కెట్లో ఒక ఔన్సు (31 గ్రాములు) బంగారాన్ని గత వారం 1250 డాలర్లు పెట్టి కొన్నామని తమిళనాడు బంగారు నగల వ్యాపారస్తుల సంఘం అధ్యక్షులు జయంతీలాల్ తెలిపారు. అదే శుక్రవారం 1365 డాలర్లకు కొనుగోలు చేశామని పేర్కొన్నారు. ధర ఒక వారంలోనే 115 డాలర్లు పెరిగిందని బంగారం బహు ప్రియంవివరించారు. బంగారు ధర పెరుగుదలకు రూపాయి పతనమే ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. మరో నెల వరకు ధర తగ్గే అవకాశం లేదని అన్నారు. విదేశాల నుంచి దిగుమతయ్యే బంగారంలో 25 నుంచి 35 శాతం నాణేలుగా మారిపోతున్నాయని వెల్లడించారు. ధర పెరుగుదల నేపథ్యంలో 22, 24 క్యారెట్ల బంగారు నాణేల అమ్మకాలను నిలిపేసినట్లు తెలియజేశారు. మరో వ్యాపారి మాట్లాడుతూ బంగారు అమ్మకాలపై గతంలో 4 శాతం ఉన్న పన్ను ఈ నెల 12న 10 శాతానికి పెంచేశారని చెప్పారు. ఈ పరిణామం బంగారు స్మగ్లింగ్‌కు దారితీసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడాది జనవరి-జూలై వరకు చెన్నై నుంచి *30 కోట్ల విలువైన బంగారు స్మగ్లింగ్‌కు వినియోగమైందని తెలిపారు. ఇదిలావుండగా తమిళనాడు సంప్రదాయం ప్రకారం శనివారం నుంచి శ్రావణమాసం ప్రవేశించింది. ఈ మాసంలో ప్రజలు వివాహాది శుభకార్యాలకు శ్రీకారం చుడతారు. ఈ క్రమంలో ఆభరణాల కొనుగోలు పెరుగుతుంది. ప్రస్తుతం బంగారం ధర పెరుగుదల నేపథ్యంలో కొనుగోళ్లపై జనం ఆసక్తి చూపకపోవచ్చు.