breaking news
God of cricket
-
క్రికెట్ గాడ్ సచిన్‌కు అత్యంత అపురూపమైన 13 నాణేల గురించి తెలుసా?
క్రికెట్ గాడ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ క్రికెట్‌ను 24 ఏండ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా ఏలి క్రికెట్లో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. చిన్నతనంలోనే క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చి లెజెండ్‌గా ఎదిగిన సచిన్ రమేశ్ టెండూల్కర్ పుట్టినరోజు ( ఏప్రిల్, 24) ఈ రోజు. ఈ సందర్భంగా ఒక విషయం ఫ్యాన్స్ మధ్య ఆసక్తికరంగా మారింది.ఒక ఇంటర్వ్యూలో మీరు సొంతంచేసుకున్న దాంట్లో దేన్ని మీరు ఉన్నతంగా భావిస్తారు అని అడిగినపుడు సచిన్ సమాధానం తెలుస్తే క్రికెట్ అభిమానులు ఆశ్చర్యపోవాల్సిందే. మహ్మద్ అలీ సంతకం చేసిన బాక్సింగ్ గ్లోవ్స్, డైర్ స్ట్రెయిట్స్ మార్క్ నాప్ఫ్లెర్ సంతకం చేసిన గిటార్, సర్ డాన్ బ్రాడ్‌మాన్ ఆటోగ్రాఫ్ చేసిన బ్యాట్ వీటిల్లో ఏది అపురూపంగా అనిపిస్తుంది అని అడిగినపుడు "నా కోచ్ అచ్రేకర్ సార్ నుండి పొందిన 13 నాణేలు నాకు చాలా ముఖ్యమైన జ్ఞాపకాలు’’ అని సమాధాన మిచ్చాడట సచిన్. ఇంతకీ ఆ నాణేల కథ ఏంటి అంటే.‘క్రికెట్ దేవుడు'గా అవతరించిన సచిన్ టెండూల్కర్ ప్రయాణంలో ఎత్తుపల్లాలుకూడా ఉన్నాయి. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ రాటుదేలేలా కీలక పాత్ర పోషించిన గురువు రమాకాంత్ అచ్రేకర్. శివాజీ పార్క్ జింఖానా మైదానంలోట్రైనింగ్ సెషన్లో కోచ్ అచ్రేకర్ అద్భుతమైన శిక్షణలో సచిన్ రాటు దేలాడు. ఆయన శిక్షణలో ఉన్నప్పుడు సచిన్ అలసిపోయినట్లు అనిపించినప్పుడల్లా అచ్రేకర్ ఒక ట్రిక్ వాడేవారట. క్రికెట్ స్టంప్ పైన ఒక రూపాయి నాణెం ఉంచేవారట. ఆ నాణెం గెలవాలంటే సచిన్ టెండూల్కర్‌ను అవుట్ చేయమని బౌలర్లను సవాలు చేశాడు. బౌలర్లు అతనిని అవుట్ చేయడంలో విఫలమైతే, అచ్రేకర్ సచిన్‌కు నాణెం ఇచ్చేవాడు. అలాగే ఆ నాణెం దక్కించు కోవాలంటే.. అవుట్ కాకుండా ఆడాలని సచిన్‌కు సవాల్ విసిరే వారట. అలా అటు బౌలర్లకూ ఇటు తనకూ ఇద్దరికీ ప్రేరణగా నిలిచేదనీ, ఇది భవిష్యత్తులో తన ఆటకు చాలా ఉపయోగపడిందని ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు సచిన్.'ద్రోణాచార్య' లేకపోతే నేను లేను2023, జనవరిలో సచిన్ టెండూల్కర్ ఎక్స్ ద్వారా కోచ్ అచ్రేకర్కి కృతజ్ఞతలు తెలిపాడు. ఆయన్ని 'ద్రోణాచార్య' అభివర్ణించాడు. తనను ప్రపంచ స్థాయి ఆటగాడిగా ఎలా మార్చాడో కూడా పంచుకున్నాడు. ‘‘టెక్నిక్, క్రమశిక్షణ, ముఖ్యంగా ఆటను గౌరవించడం నేర్పించారాయన. నేను ప్రతిరోజూ ఆయన గురించే ఆలోచిస్తాను. ఈ రోజు, ఆయన వర్ధంతి సందర్భంగా, నా జీవితంలోని ద్రోణాచార్యుడికి వందనం చేస్తున్నాను. ఆయన లేకపోతే. క్రికెటర్‌గా నేను లేను’’ అంటూ ఎమోషనల్ అయ్యాడు సచిన్.He taught me technique, discipline and most importantly, to respect the game.I think of him every day. Today, on his death anniversary, I salute the Dronacharya of my life. Without him, I wouldn’t have been the same cricketer. pic.twitter.com/JQ8uijHD9Y— Sachin Tendulkar (@sachin_rt) January 2, 2023కాగా సచిన్ టెండూల్కర్‌కు తొలుత టెన్నిస్‌పై ఆసక్తి ఉండేది. లెజెండరీ టెన్నిస్ ఆటగాడు జాన్ మెకెన్రోకి పెద్ద ఫ్యాన్ కూడా అయితే, తరువాతి కాలంలో సచిన్ సోదరుడు, అజిత్ టెండూల్కర్ అతనిని క్రికెట్‌కు పరిచయం చేయడంతో క్రికెట్‌పై మక్కువ పెంచుకున్నాడు. దీంతో అజిత్ ప్రఖ్యాత కోచ్ రమాకాంత్ అచ్రేకర్ వద్దకు సచిన్‌ను తీసుకెళ్లాడు. సచిన్ ఆటతీరు చేసిన అచ్రేకర్ అకాడమీకి ఎంపిక చేశాడు. లేదంటే క్రికెట్ ప్రపంచం, ఒక లెజెండ్‌ను మిస్ అయ్యేదేమో! -
క్రికెట్ బ్రాండ్ అంబాసిడర్.. క్రికెట్ దేవుడు!
-
రిమో ఆరంభ వేడుకల్లో క్రికెట్ దేవుడు
-
నేను దేవుడిని కాను
కేవలం సచిన్‌ను మాత్రమే.. టెండూల్కర్ వ్యాఖ్య లండన్: చాలా మంది అభిమానులు తనను క్రికెట్ దేవుడిగా భావిస్తున్నా... తాను మాత్రం సాధారణమైన వ్యక్తినేనని బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అన్నాడు. ‘నేను క్రికెట్ దేవుడ్ని కాను. మైదానంలో చాలా తప్పులు చేశా. కాకపోతే క్రికెట్ అంటే నాకు చాలా ఇష్టం. నేను కూడా సాధారణ సచిన్‌నే. అందుకు తగ్గట్టుగానే ఉంటా. చాలా మంది ప్రజలు నన్ను ఇష్టపడటం నా అదృష్టం. ఇది చాలా ప్రత్యేకమైంది. వాళ్ల ఆశీస్సులు నాపై ఉన్నాయి. దేవుడు అలాంటి స్థితిని కల్పించాడు. నేను కోరుకున్న ప్రతిదీ కష్టపడి సాధించుకున్నా. నాపై ఆదరాభిమానాలు చూపిస్తున్న ప్రతి ఒక్కరికి రుణపడి ఉన్నా’ అని మాస్టర్ పేర్కొన్నాడు. బిజీగా మారిపోయా... రిటైర్మెంట్ తర్వాత జీవితం బిజీగా మారిపోయిందని సచిన్ చెప్పాడు. ‘ఇప్పుడు నేను భిన్నమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నా. 24 ఏళ్లు కేవలం క్రికెట్‌పైనే దృష్టిపెట్టా. మిగతా వాటి గురించి పట్టించుకోలేదు. నా జీవితంలో తొలి ఇన్నింగ్స్ క్రికెట్ ఆడటం, ప్రపంచకప్ గెలవాలన్న నా కలను నెరవేర్చుకోవడానికి సరిపోయింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో అభిమానులు, ప్రజల రుణం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నా’ అని సచిన్ వెల్లడించాడు. ఎప్పటికైనా క్రికెట్లో టెస్టు మ్యాచ్‌లే అత్యుత్తమని చెప్పిన మాస్టర్ మిగతా ఫార్మాట్లలో లాభాలు, నష్టాలు రెండూ ఉన్నాయన్నాడు. 2008 ముంబైలో ఉగ్రవాదుల దాడుల తర్వాత చెన్నైలో ఇంగ్లండ్‌పై చేసిన సెంచరీ తన కెరీర్లో అర్థవంతమైందని సచిన్ తెలిపాడు. తన వారసత్వాన్ని కుమారుడికి అందించడంపై మాట్లాడుతూ... ఆట ఆడాలన్న కోరిక హృదయం, మనసులో బలంగా ఉంటే క్రికెట్ పిచ్చొడు అయిపోతాడని, అర్జున్‌లో ఇది ఉందన్నాడు. ప్రాంతీయ భాషల్లో సచిన్ పుస్తకం ఇప్పటికే అమ్మకాల్లో రికార్డులు సృష్టిస్తున్న సచిన్ ఆటోబయోగ్రఫీ ‘ప్లేయింగ్ ఇట్స్ మై వే’ పుస్తకాన్ని ప్రాంతీయ భాషల్లోకి అనువదించనున్నారు. చాలా మంది ప్రచురణకర్తల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తోందని ‘హచెట్టీ ఇండియా’ వెల్లడించింది. -
ఛాపెల్‌ను విమర్శించిన సచిన్
-
సచిన్.. క్రికెట్ దేవుడు: శ్రీకాంత్
భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌పై మాజీ క్రికెటర్ శ్రీకాంత్ ప్రశంసల వర్షం కురిపించారు. క్రికెట్ సచిన్ దేవుడు లాంటి వాడని అభివర్ణించారు. తన 200వ టెస్టు అనంతరం క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నట్టు మాస్టర్ ప్రకటించిన నేపథ్యంలో శ్రీకాంత్ స్పందించారు. మాస్టర్‌కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు ఇస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సుదీర్ఘ కెరీర్లో సచిన్ నెలకొల్పిన రికార్డులను బద్దలుకొట్టడం ఎవరికీ సాధ్యంకాదని శ్రీకాంత్ అన్నారు. సచిన్ తొలి మ్యాచ్ నుంచి ఇప్పటి వరకు నిలకడైన ఆటతీరుతో ఒకేలా ఆడుతున్నాడన్నారు.