breaking news
Gloucestershire
-
గ్లౌసెస్టర్షైర్లో ఘనంగా శ్రీవారి కళ్యాణ మహోత్సవం
గ్లౌసెస్టర్షైర్ ఇంటర్నేషనల్ హిందూ కమ్యూనిటీ అసోసియేషన్ (IHCAG) ఆధ్వర్యంలో నిర్వహించిన 2026 శ్రీ బాలాజీ శ్రీవారి కళ్యాణ మహోత్సవానికి ఆంధ్రప్రదేశ్ శాసన మండలి మాజీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎమ్మెల్సీ , వైస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగరెడ్డి సతీష్ రెడ్డి, స్లౌ డిప్యూటీ మేయర్ చంద్ర మువ్వల, పలువురు ప్రముఖ కమ్యూనిటీ నాయకులు హాజరై కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ పవిత్ర కార్యక్రమాన్ని టీటీడీ వేద పాఠశాల పూర్వ విద్యార్థులైన అర్చకులు వేదోక్తంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సతీష్ రెడ్డి బీబీసీ నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ త్వరలో ప్రసారం కానుంది. ఇంటర్వ్యూ సందర్భంగా IHCAG నిర్వాహకులు, ప్రతినిధి శివరామ రెడ్డి గూడూరు, గ్లౌసెస్టర్షైర్లో శ్రీ బాలాజీ ఆలయాన్ని నిర్మించాలనే IHCAG లక్ష్యాన్ని వివరించారు. ఈ మహత్తర స్వప్నాన్ని సాకారం చేసేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరి సహకారం, మద్దతు అవసరమని చర్చలో పేర్కొన్నారు. ప్రతిపాదిత ఆలయం ప్రస్తుత, భవిష్యత్ తరాలకు ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజిక సేవా కేంద్రంగా నిలవనుంది.ఈ కార్యక్రమంలో ఇంటర్వ్యూలను నిర్వహించి, మన సమాజం చేస్తున్న విలువైన సేవలను ప్రపంచానికి తెలియజేసిన మానీ మసీహ్కి నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆయన మహారాజు కింగ్ చార్లెస్ III నియమించిన డిప్యూటీ లెఫ్టినెంట్, బీసీసీ ప్రజెంటర్‌గా సేవలందిస్తున్నారు.చర్చల సందర్భంగా సతీష్ రెడ్డి భారతీయ రాజకీయాలు, సమాజ సేవ, సామాజిక బాధ్యత వంటి అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. అలాగే IHCAG ఈ మహత్తర సంకల్పానికి మద్దతుగా సంకల్పం తీసుకుని, తిరుమల తిరుపతి దేవస్థానాలు (TTD) నుంచి అవసరమైన మద్దతు, నిధులను సమకూర్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు సహకరిస్తానని తన నిబద్ధతను వ్యక్తం చేశారు.ఈ మహోన్నత కార్యక్రమానికి అందించిన ప్రోత్సాహం, మార్గదర్శకత్వం, మద్దతుకు సతీష్ రెడ్డికి నిర్వాహకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో, భక్తులు, శ్రేయోభిలాషులు, సమాజంలోని ప్రతి ఒక్కరి నిరంతర సహకారంతో, గ్లౌసెస్టర్షైర్లో శ్రీ బాలాజీ ఆలయాన్ని నిర్మించాలనే ఎన్నో సంవత్సరాలుగా ఉన్న చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకునే దిశగా ముందుకు సాగుతున్నామన్నారు. -
బ్రిటన్ గ్లౌసెస్టర్షైర్లో వెంకన్న ఆలయం.. టీటీడీ నిధుల కోసం సంకల్పం
సాక్షి, లండన్: బ్రిటన్‌లోని గ్లౌసెస్టర్షైర్లో శ్రీ బాలాజీ ఆలయం నిర్మించాలన్న చిరకాల స్వప్నం సాకారం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఈ ఆలయాన్ని ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజిక సేవా కేంద్రంగా తీర్చిదిద్దాలని నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కమ్యూనిటీ నాయకులతో కలిసి బీబీసీ నిర్వహించిన ఇంటర్వ్యూలో ఆలయ నిర్మాణ ప్రణాళికపై చర్చించారు.ఈ బీబీసీ ఇంటర్వ్యూలో సతీష్‌రెడ్డి, స్లౌ డిప్యూటీ మేయర్ చంద్ర మువ్వలతో పాటు పలువురు కమ్యూనిటీ నాయకులు పాల్గొన్నారు. గ్లౌసెస్టర్షైర్(Gloucestershire)లో బాలాజీ ఆలయాన్ని ఏర్పాటు చేయాలన్న తమ లక్ష్యం, ఇందుకు విస్తృత కమ్యూనిటీ మద్దతు అవసరం గురించి వివరించారు. ఆలయం ప్రస్తుత తరంతో పాటు భవిష్యత్ తరాలకు కూడా ఆధ్యాత్మిక, సాంస్కృతిక అనుబంధానికి వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు.టీటీడీ నిధుల కోసం సంకల్పంఈ సందర్భంగా సతీష్ రెడ్డి భారతీయ రాజకీయాలు, కమ్యూనిటీ సేవ తదితర అంశాలపై మాట్లాడారు. బాలాజీ ఆలయ నిర్మాణానికి అవసరమైన నిధుల సమీకరణలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నుంచి సహకారం పొందేందుకు కృషి చేస్తానని సంకల్పం తీసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందుకు ఆయన అందిస్తున్న ప్రోత్సాహం, సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.‘కమ్యూనిటీ మద్దతుతో కల సాకారం’బీబీసీ ప్రజెంటర్, కింగ్ చార్లెస్ నియమించిన డిప్యూటీ లెఫ్టినెంట్ మ్యానీ మసీహ్ ఈ ఇంటర్వ్యూలను నిర్వహించారు. బ్రిటన్‌లోని భారతీయ సమాజాల్లో జరుగుతున్న సేవా కార్యక్రమాలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు బాలాజీ ఆలయ నిర్మాణ ప్రయత్నాలపై కూడా చర్చించారు. విస్తృత కమ్యూనిటీ మద్దతు, దైవ ఆశీస్సులతో గ్లౌసెస్టర్షైర్లో బాలాజీ ఆలయం నిర్మించాలన్న చిరకాల ఆకాంక్షను సాకారం చేసుకుంటామని నిర్వాహకులు తెలిపారు.ఇదీ చదవండి: ఆస్ట్రేలియాలో ఘనంగా ఐసీఎస్ కన్వెన్షన్ వేడుకలు -
కౌంటీల్లో చెలరేగుతున్నాడు; సెలెక్టర్లకు చెన్నై చిన్నోడి వార్నింగ్!
కౌంటీ క్రికెట్లో తమిళనాడు క్రికెటర్ సాయి కిషోర్ తన ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. గ్లౌసెష్టర్‌షైర్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నై స్పిన్నర్ సాయి కిషోర్ అద్భుత బౌలింగ్‌తో తన జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. డెర్బీషైర్‌తో జరిగిన మ్యాచ్‌లో సాయి కిషోర్ 20 పరుగులకే ఐదు వికెట్లు పడగొట్టడంతో గ్లౌసెష్టర్‌షైర్ 213 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.ఓవరాల్‌గా ఏడు వికెట్లు తీసిన సాయి కిషోర్ (తొలి ఇన్నింగ్స్‌లో రెండు, రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు) డెర్బీషైర్ పాలిట సింహస్వప్నమయ్యాడు. అతడి ధాటికి 319 పరుగుల ఛేదనలో తడబడిన డెర్బీషైర్ 105 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లో సాయి కిషోర్ 18 ఓవర్లు వేస్తే అందులో 12 మెయిడెన్ ఓవర్లు కావడం విశేషం.దేశవాళీలో ఇటీవలీ రంజీ ట్రోఫీలో నిలకడను ప్రదర్శించిన సాయి కిషోర్ కౌంటీ క్రికెట్లోనూ అదే జోరును చూపిస్తున్నాడు. తాజాగా తన ప్రదర్శనతో సాయి కిషోర్ బీసీసీఐ సెలెక్టర్లకు తన ఎంపిక గురించి హెచ్చరికలు పంపాడు. దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన రికార్డు, ఎడమచేతి వాటం స్పిన్నర్‌గా ఉండటం, ఇంగ్లండ్ పరిస్థితుల్లోనూ రాణించే సామర్థ్యం.. ఇవన్నీ అతడికి కలిసొచ్చే అంశాలని చెప్పొచ్చు. సీనియర్ల వీడ్కోలుతో భారత టెస్టు జట్టు ప్రస్తుతం మార్పుల దశలో ఉంది. సీనియర్ ఆటగాళ్ల స్థానాలను భర్తీ చేసేందుకు యువ ప్లేయర్ల కోసం టీమ్ మేనేజ్మెంట్ చూస్తోంది. ఈ నేపథ్యంలో కోచ్ గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలో భారత టెస్టు జట్టు భవిష్యత్తు ప్రణాళికల్లో సాయి కిశోర్ కీలక ఎంపికగా మారే అవకాశం ఉంది. అతడి బౌలింగ్ శైలి కూడా గంభీర్ విధానాలకు తగినట్లుగా ఉండడం ఆసక్తికర విషయం. రాబోయే రోజుల్లో టీమిండియా న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో టెస్టు సిరీస్‌లు ఆడనుంది. మరి కౌంటీల్లో అద్భుత ప్రదర్శన చేస్తున్న సాయి కిషోర్ టీమిండియాకు ఎంపికవుతాడా లేదా అనేది చూడాలి.SAI KISHORE: 18-12-20-5 🤯🔥- One of the best spells in this County Championship, he is bowling his heart out. pic.twitter.com/qpY6gqe1IJ— Johns. (@CricCrazyJohns) September 6, 2026చదవండి: ‘మా అక్కలు ప్లాన్ చేస్తే మేము ఆచరిస్తాం’


