Gladiator 2 Movie
-
గ్రీకు వీరుడు రెండో రూపంలో...
ఓటీటీలో ఇది చూడొచ్చు అనేప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హాలీవుడ్ చిత్రం గ్లాడియేటర్ 2 ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.చరిత్రలో ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకుంది గ్రీకు సంస్కృతి. ఎన్నో వైవిధ్యమైన పోరాటాలకు, వీరోచితంగా పోరాడిన వీరుల కథలతో రోమ్ రాచరికపు చరిత్ర నిండి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని అన్ని భాషలలో గ్రీకు కథలకు సంబంధించి ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ 25 ఏళ్ల క్రితం హాలీవుడ్లో వచ్చిన ‘గ్లాడియేటర్’ సినిమా మాత్రం ప్రపంచ సినీ ప్రేక్షకులకు చాలా ప్రత్యేకం. అప్పట్లో 110 మిలియన్ డాలర్లతో రూపొందిన ఈ సినిమా 465 మిలియన్ డాలర్ల వరకు రాబట్టిందంటేనే తెలుస్తుంది ఈ సినిమా శక్తి ఏంటో. ప్రముఖ హాలీవుడ్ హీరో రస్సెల్ క్రోవ్ నటించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టయింది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా ‘గ్లాడియేటర్ 2’ రిలీజైంది. నాటి ‘గ్లాడియేటర్’తో పోలిస్తే అంత పెద్ద హిట్ కాకపోయినా నేటి టెక్నాలజీతో సినిమా ఆద్యంతం మంచి విజువల్స్‌తో ఆకట్టుకునేలా ఉంది. పాల్ మెస్కల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు నాటి ‘గ్లాడియేటర్’ దర్శకుడైన రిడీ స్కాటే దర్శకత్వం వహించారు. ఇక కథాపరంగా ‘గ్లాడియేటర్ 2’లో ఏముందంటే హీరో అయిన హన్నో భార్య అరిషత్ను చంపి, హన్నోను రోమన్ జనరల్ అకాసియస్ బానిసగా తీసుకెళతాడు.హన్నో కొలోసియంలో గ్లాడియేటర్‌గా పోరాడుతూ ఉండగా తన తల్లి ఆ రాజ్యపు పట్టపు రాణి అయిన లూసిల్లా అని, తాను మాక్సిమస్ వారసుడని తెలుసుకుంటాడు. మాక్సిమస్ కుట్రతో లూసిల్లాను కొలోసియంలో ఉరి తీయాలనుకుంటాడు. బానిసగా వచ్చిన హన్నో తన తల్లిని కాపాడుకుంటాడా? అలాగే తనను బానిసగా తెచ్చిన అకానియస్... హన్నోకి అండగా ఉంటాడా? అనేది మాత్రం ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమ్ అవుతున్న ‘గ్లాడియేటర్ 2’లోనే చూడాలి. మొదటి గ్లాడియేటర్ కన్నా ఈ గ్లాడియేటర్లో ఎక్కువ పోరాట సన్నివేశాలతో పాటు గ్రీకు సంస్కృతి సామాన్యులకు సైతం అర్థమయ్యేలా కథలో జొప్పించారు. తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా ఉంది కాబట్టి నాటి రోమ్ కథను హాయిగా మన భాషలో చూసేయొచ్చు. అయితే పిల్లలతో కాకుండా పెద్దవాళ్లు మాత్రం చూడదగ్గ మంచి అడ్వెంచరెస్ ఫిల్మ్. – హరికృష్ణ ఇంటూరు -
ఈ వారం ఓటీటీల్లో 22 సినిమాలు రిలీజ్
2024 పూర్తయ్యేందుకు రెడీ అయిపోయింది. మరో వారం ఉందంతే! ఈ క్రమంలోనే ఏడాది చివరలో అటు థియేటర్, ఇటు ఓటీటీల్లో బోలెడన్ని మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. తొలుత థియేటర్లలోకి వచ్చే వాటి విషయానికొస్తే మోహన్ లాల్ 'బరోజ్', శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్, మాక్స్, ఎర్రచీర, డ్రింకర్ సాయి తదితర తెలుగు మూవీస్ రాబోతున్నాయి. వీటితో పాటు కీర్తి సురేశ్ తొలి హిందీ మూవీ 'బేబీ జాన్' కూడా క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: అల్లు అర్జున్ ఇంటిపై దాడి..నిందితులకు బెయిల్)ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే ఈ వారం 20కి పైగా సినిమాలు-వెబ్ సిరీసులు రాబోతున్నాయి. వీటిలో 'సొర్గవాసల్', 'భూల్ భులయ్యా 3', 'గ్లాడియేటర్ 2' చిత్రాలతో పాటు 'స్క్విడ్ గేమ్ 2' సిరీస్ ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే?ఈ వారం రిలీజయ్యే మూవీస్ (డిసెంబర్ 23 నుంచి 29 వరకు)నెట్ఫ్లిక్స్యువర్ ఫ్రెండ్, నటా బర్గేట్జ్ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబర్ 24ఆరిజిన్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబర్ 25ఆస్ట్రాయిడ్ సిటీ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబర్ 25స్క్విడ్ గేమ్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - డిసెంబర్ 26భూల్ భులయ్యా 3 (హిందీ సినిమా) - డిసెంబర్ 27సొర్గవాసల్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - డిసెంబర్ 27మ్యాస్ట్రో ఇన్ బ్లూ సీజన్ 3 (గ్రీక్ సిరీస్) - డిసెంబర్ 28అమెజాన్ ప్రైమ్చీఫ్సాలిక్ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబర్ 24గ్లాడియేటర్ 2 (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబర్ 25జంప్ స్టార్ట్ మై హార్ట్ (స్పానిష్ సిరీస్) - డిసెంబర్ 25థానారా (మలయాళ సినిమా) - డిసెంబర్ 27యువర్ ఫాల్ట్ (స్పానిష్ మూవీ) - డిసెంబర్ 27పార్టీ టిల్ డై (హిందీ సిరీస్) - డిసెంబర్ 24 (అమెజాన్ ఎమ్ఎక్స్ ప్లేయర్)హాట్స్టార్డాక్టర్ హూ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబర్ 25బఘీరా (హిందీ డబ్బింగ్ సినిమా) - డిసెంబర్ 25జీ5ఖోజ్: పర్చైన్ కే ఉస్ పర్ (హిందీ సినిమా) - డిసెంబర్ 27జియో సినిమాడాక్టర్స్ (హిందీ సిరీస్) - డిసెంబర్ 27సురక్ష (భోజ్‌పురి మూవీ) - డిసెంబర్ 27మనోరమ మ్యాక్స్పంచాయత్ జెట్టీ (మలయాళ సినిమా) - డిసెంబర్ 24ఐ యామ్ కథలన్ (మలయాళ మూవీ) - డిసెంబర్ 25లయన్స్ గేట్ ప్లేమదర్స్ ఇన్స్టింక్ట్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబర్ 27డిస్కవరీ ప్లస్హ్యారీపోటర్ విజడ్జ్ ఆఫ్ బేకింగ్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబర్ 27(ఇదీ చదవండి: 'సన్నీ లియోన్' పేరుతో ప్రభుత్వాన్ని మోసం చేసిన కేటుగాడు) -
Gladiator 2 Trailer: నాకు ఆ రోజు జ్ఞాపకం ఉంది.. అది మరచిపోలేదు
ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న హాలీవుడ్ చిత్రం ‘గ్లాడియేటర్’. రిడ్లీ స్కాట్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2000లో వసూళ్ల పరంగా చరిత్ర సృష్టించింది. ఈ సినిమాకి సీక్వెల్‌గా రూపొందిన ‘గ్లాడియేటర్ 2’కి కూడా రిడ్లీ స్కాట్యే దర్శకత్వం వహించారు. పాల్ మెస్కల్, డెంజెల్ వాషింగ్టన్, పెడ్రో పాస్కల్, కొన్నే నిల్సన్, జోసెఫ్ క్విన్ వంటివారు నటించారు. ఈ చిత్రం నవంబరు 15న ఇంగ్లిష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో 4డీఎక్స్ మరియు ఐమ్యాక్స్ ఫార్మాట్లో రిలీజ్ కానుంది. ఇక ‘నాకు ఆ రోజు జ్ఞాపకం ఉంది.. నేను అది మరచిపోలేదు.. ఒక బానిస రాజుపై ప్రతీకారం తీర్చుకున్న క్షణం’ వంటి డైలాగ్స్ ‘గ్లాడియేటర్ 2’ ట్రైలర్లో ఉన్నాయి.