breaking news
Girls education rights activist
-
ఆడపిల్ల చదువుకు జీవితాన్ని ఇచ్చింది
‘ప్రపంచంలో చదువుకు దూరమైన అతి ఎక్కువ మంది ఆడపిల్లలున్న దేశం భారత్ ఒక్కటే’ అంటారు సఫీనా హుసేన్. స్కూల్లో ఉన్న ఆడపిల్లల కంటే స్కూల్ మానేసిన ఆడపిల్లలు ఎక్కువ ఉండటంతోవారిని తిరిగి స్కూళ్లకు పంపడానికి ఆమె ‘ఎడ్యుకేట్ గర్ల్స్’ స్థాపించారు. ఏళ్ల తరబడి ఆమె సాగించిన కృషి బాలికల జీవితాల్లో చదువును తెచ్చింది. ఆమెకు ‘రామన్ మెగసెసె ఆవార్డు’ తెచ్చిపెట్టింది. ఆసియా నోబెల్‌గా భావించే రామన్ మెగసెసెను సఫీనా స్థాపించిన ‘ఎడ్యుకేట్ గర్ల్స్’ ఎన్.జి.ఓకు ప్రకటించారు.‘మారుమూల గ్రామంలో అయినా సరే ఏ ఒక్క ఆడపిల్ల స్కూలుకు వెళ్లకుండా ఉండకూడదు. అదే మా ఎడ్యుకేట్ గర్ల్స్ లక్ష్యం’ అంటారు సఫీనా హుసేన్. 54 ఏళ్ల ఈ సామాజిక కార్యకర్త 2007 లో బాలికా విద్య కోసం ‘ఎడ్యుకేట్ గర్ల్స్’ ఎన్.జి.ఓను స్థాపించారు. ఆ రోజు నుంచి ఈరోజు వరకూ సుమారు నాలుగు లక్షల మంది బాలికలను అక్షరాస్యత వైపు నడిపించారు. అందుకే ఆమె సంస్థకు ప్రతిష్ఠాత్మక రామన్ మెగసెసె అవార్డు 2025ను ప్రకటించారు. 1958 నుంచి ఇస్తున్న ఈ అవార్డు కింద 50 వేల యు.ఎస్.డాలర్ల నగదు కూడా ఉంటుంది.‘ఎడ్యుకేట్ గర్ల్స్‌కు రామన్ మెగసెసే అవార్డు రావడం చాలా సంతోషాన్నిచ్చింది. ఇదొక చారిత్రాత్మక క్షణం. భారతదేశంలో బాలికల విద్యకోసం ప్రజలతో కలిసి మేము చేస్తున్న ఈ ఉద్యమం గురించి ఈ అవార్డు వల్ల ప్రపంచవ్యాప్తంగా తెలుస్తుంది. బాలికలను శక్తిమంతం చేయడానికి, వారు అడ్డంకులను ఛేదించి మరిన్ని విజయాలు సాధించడానికి మనమంతా మరెంతో దూరం ప్రయాణించాల్సి ఉంది’ అని అవార్డు ప్రకటన తర్వాత సఫీనా అన్నారు.‘టీమ్ బాలిక’ల విజయం‘ఎడ్యుకేట్ గర్ల్స్’ ద్వారా స్కూలు మానేయించిన బాలికలను తిరిగి స్కూలుకు పంపడానికి సఫీనా ఎన్నుకున్న మార్గం ప్రతి ఊరి నుంచి ఒక చురుకైన యువతి ని కార్యకర్తగా ఎంచుకోవడం. వీరిని ‘టీమ్ బాలిక’ అంటారు. ఈ బాలికలే ఇంటింటికి తిరిగి కుటుంబాలను ఒప్పించి డ్రాపవుట్ ఆడపిల్లలను తిరిగి బడికి చేరుస్తున్నారు. 2007లో 50 గ్రామాల్లో మొదలెట్టిన ఈ కార్యక్రమం నేడు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని 18 వేల గ్రామాల్లో బాలికలకు విద్యనందించేందుకు కృషి చేస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థలో 13 వేల మంది యువతులు టీమ్ బాలికలుగా గ్రామాల్లో పని చేస్తున్నారు. ‘నా ఊరు.. నా సమస్య... నేనే సమాధానం’ అనేది వీరి నినాదం. తమ ఊరిని తామే బాగు చేసుకుందామని వీరు ముందుకొస్తే పెద్దలు మద్దతు తెలుపుతున్నారు. ‘స్కూలు మాన్పించి ఇంటి పనులు చేయించడం బాలికల కలలను ఛిద్రం చేయడమే’ అంటారు సఫీనా. కేవలం బాలికల్ని బడికి పంపడమే కాకుండా పాఠశాలలకు సౌకర్యాలు అందించడం, బాగా చదివే పిల్లలను కళాశాలల్లో చేర్పించడం, వారి ఆరోగ్యంపై శ్రద్ధ చూపించడం వంటివి కూడా ‘ఎడ్యుకేట్ గర్ల్స్’ చేపడుతుంది.ఎవరీ సఫీనా?సఫీనా హుస్సేన్ 1971లో దిల్లీలో జన్మించారు. ఈమె తండ్రి యూసఫ్ హుసేన్ అనే టీవీ నటుడు. ‘లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్’ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సఫీనా 1998 నుంచి 2004 వరకు శాన్ ఫ్రాన్సిస్కోలోని ‘చైల్డ్ ఫ్యామిలీ హెల్త్ ఇంటర్నేషనల్’కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేశారు. 2005లో అమెరికా నుంచి ముంబయికి తిరిగొచ్చిన ఆమె స్థానిక పరిస్థితులను పరిశీలించారు. ప్రపంచంలో స్త్రీల జీవన విధానాలు అత్యంత దుర్భరంగా ఉన్న 20 దేశాల్లో భారత్ కూడా ఉందన్న సర్వే వివరాలు తెలుసుకొని ఆమె కలవరపడ్డారు. ప్రధానంగా విద్య విషయంలో తల్లిదండ్రులు ఆడ, మగ అంటూ భేదం చూపించడం, కొడుకును చదివిస్తూ కూతుర్ని ఇంటి పనుల్లో పెట్టడం వంటివి ఆమెను ఆలోచింపజేశాయి. ఆ పరిస్థితి మారాలంటే పల్లెల నుంచి పని మొదలుపెట్టాలని భావించారు. అలా 2007లో ‘ఎడ్యుకేట్ గర్ల్స్’ స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు. ఈమె చేస్తున్న కృషి నచ్చి కత్రినా కైఫ్ తనకు తానుగా ముందుకొచ్చి ‘ఎడ్యుకేట్ గర్ల్స్’కు అంబాసిడర్‌గా, టీమ్ బాలికగా పని చేశారు.2035 నాటికి కోటి మంది బాలికలు‘ఎడ్యుకేట్ గర్ల్స్’ చేసిన కృషి ఫలితంగా లక్షలాది బాలికలు బడులకు చేరి అక్షరాలు దిద్దారు. వారిలో కొందరు స్కూళ్లు దాటి కాలేజీల్లోనూ అడుగుపెట్టారు. ఇదంతా సమష్టి కృషితో సాధ్యం అంటారు సఫీనా హుస్సేన్. సంస్థ నిర్వహణలో తనకు సాయం అందించినవారు, తనతో కలిసి పనిచేస్తున్నవారందరి కృషి ఈ విజయంలో ఉందని అంటున్నారు. 2035 నాటికి కోటి మంది బాలికల్ని బడుల్లో చేర్పించడమే లక్ష్యంగా సాగుతున్నట్లు వివరించారు. -
ఆడపిల్లల చదువుకు ఐదేళ్ల జీతం.. పెద్ద మనసు చాటుకున్న ఎంపీ
పట్నా: బాలికల విద్య కోసం ప్రభుత్వాలు పలు పథకాలు అమలు చేస్తున్నాయి. వీటిని సద్వినియోగం చేసుకున్న ఆడపిల్లలు పలు రంగాలలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారు. అయితే బాలికల విద్య కోసం ఒక ఎంపీ తన ఐదేళ్ల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించి తన పెద్ద మనసు చాటుకున్నారు.బీహార్‌కు చెందిన లోక్‌సభ ఎంపీ శాంభవి చౌదరి తన ఐదేళ్ల పదవీకాలంలో వచ్చే జీతాన్ని బాలికల విద్యకు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. లోక్ జనశక్తి పార్టీ (రామ్‌విలాస్) ఎంపీ శాంభవి చౌదరి తన లోక్‌సభ నియోజకవర్గం సమస్తిపూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో బాలికల విద్యను ప్రోత్సహించేందుకు తన మొత్తం వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.2024 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ పలు సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్న శాంభవిని అభినందించారు. అలాగే ఆమెను ఎన్డీఏ అభ్యర్థిగా ఎంపికచేశారు. శాంభవి చౌదరి తన పదవీకాలంలో వచ్చే జీతాన్ని ‘పఢేగా సమస్తిపూర్ తో బఢేగా సమస్తిపూర్’ అనే ప్రచారం ఉద్యమంలో ఉపయోగించనున్నట్లు తెలిపారు. తనకు ప్రతినెలా జీతం రూపంలో వచ్చే డబ్బును ఆర్థిక ఇబ్బందులతో చదువు మానేసిన బాలికల కోసం వెచ్చించనున్నట్లు తెలిపారు. ఇది కూడా చదవండి: Guru Nanak Jayanti: కార్తీక పౌర్ణమి నాడే గురునానక్ జయంతి ఎందుకు చేస్తారంటే.. -
ఇక ఎంచక్కా చదువుకుంటాం!
లింగవివక్ష ఇంకా వెంటాడుతూనే ఉంది. ఒకే కుటుంబంలో పుట్టిన బాల, బాలికల మధ్య పెంపకంలో అంతరాలు తొలగిపోలేదు. ఇందు కు నిదర్శనమే అక్షరాస్యతలో తేడాలు. దేశంలో అక్షరాస్యత శాతం పెరుగుతున్నా.. స్త్ర్రీ, పురుషుల మధ్య అక్షరాస్యతలో మాత్రం తేడా కన్పిస్తోంది. సిద్దిపేట నుంచి ఈరగాని భిక్షం : అక్షరాస్యతలో బాలికల వెనుకబాటును గుర్తించిన కేంద్ర ప్రభుత్వం బాలికా విద్య ను ప్రోత్సహించేందుకు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలను (కేజీబీవీ) ప్రవేశ పెట్టింది. ఈ పాఠశాలల్లో కేవలం బాలికల కే ప్రవేశం కల్పిస్తారు. ప్రిన్సిపల్, ఉపాధ్యా యులు మహిళలే. దీంతో ఈ పాఠశాలల్లో చేరే విద్యార్థినుల సంఖ్య పెరుగుతోంది. బాలికల్లో అక్షరాస్యత తక్కువగా ఉండడా నికి కారణం.. బడీడు ఆడపిల్లలందరూ బడికి వెళ్లకపోవడం, మొదట జన్మించినది బాలికయితే.. రెండో సంతానాన్ని చూసు కోవడం కోసం ఇంటిపట్టునే ఉంచడం, ఆర్థిక పరిస్థితులు.. తదితర కారణాల వల్ల బాలికలను బడి మధ్యలోనే ఆపేస్తున్నారు. వీటన్నింటినీ విశ్లేషించిన కేంద్రం ముందు గా బాలకార్మికుల వివరాలను సేకరించిం ది. బడీడు పిల్లలు బడిలోనే ఉండాలని, పనిలో పెట్టుకుంటే నేరమని ప్రచారం చేసింది. ఈ క్రమంలోనే బడి మానిన వారి వివరాలు సేకరించింది. వారికి మూడు నెలల బ్రిడ్జి కోర్సు ప్రవేశపెట్టి కనీస సామర్థ్యాలు వచ్చేలా బోధించి కస్తూర్బాల్లో 6వ తరగతిలో ప్రవేశం కల్పించారు. 457 పాఠశాలల్లో 69,613 మంది.. హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లో కేజీబీవీలు ఉన్నాయి. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్య అందిస్తున్న కేజీబీవీలకు 2004లో జాతీ య మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆధ్వ ర్యంలో తొలిఅడుగు పడింది. 2005 నుంచి పలు జిల్లాల్లో కేజీబీవీలు ఏర్పాటయ్యా యి. మొదట వీటిని ఏపీఆర్ఎస్ నిర్వహిం చేది. 2011లో మరికొన్ని ప్రారంభించి సర్వశిక్ష అభియాన్ ద్వారా నడిపారు. 2015లో ఎస్ఎస్ఏ పరిధిలోకి తెచ్చారు. విద్యార్థినుల కోసం ప్రత్యేక వసతి, ఎదిగే పిల్లలకు అనువుగా పౌష్టికాహారం, పాలు, గుడ్లు, మాంసం, పండ్లు, ఇతర బలవర్థక పదార్ధాలు అందజేస్తున్నారు. 84 పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం పోటీ ప్రపంచంలో ఆంగ్ల మాధ్యమ బోధ న అవసరం. దీనిని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం నూతన జిల్లాలు, మండలాల ఏర్పాటులో భాగంగా కొత్త మండలాల్లో 84 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలను ఏర్పాటు చేసింది. వీటిల్లో 6 నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలో బోధించేందుకు అనువుగా ఇంగ్లిష్ భాషపై పట్టున్న టీచర్లను నియమించింది. ఇంటర్ కూడా ఉంటే .. కేజీబీవీల నుంచి యేటా ప్రభుత్వం అందచేసే డీఆర్డీఏ ప్రోత్సాహకాల తో విద్యార్థినులు కార్పొ రేట్ కళాశాలల్లో, త్రిపుల్ ఐటీల్లో చేరుతు న్నారు. అయితే ఈ అవకాశం కొద్ది మందికే దక్కుతోంది. దీంతో మిగిలిన వారు ఇంట ర్ చదివేందుకు బయటి కళాశాలకు వెళ్లాల్సి వస్తోంది. ఇది వారి తల్లిదండ్రులకు ఆర్థిక భారం అవుతుండడంతో కొందరు పదో తరగతి తర్వాత చదువును ఆపేస్తున్నారు. టెన్త్ తర్వాత కేజీబీవీల్లోనే ఒకేషనల్, వృత్తి విద్యా కోర్సులు ప్రవేశపెట్టి, ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు అర్హత సాధించేలా చూడాలని బాలికలు కోరుతున్నారు. జిల్లాల వారీగా కేజీబీవీలు.. వాటిల్లో చదువుకుంటున్న విద్యార్థినులు -
మలాలాకు అమెరికా లిబర్టీ మెడల్
వాషింగ్టన్: పాకిస్థాన్‌కు చెందిన బాలికా విద్య హక్కుల కార్యకర్త, నోబెల్ శాంతి బహుమతి విజేత మలాలా యూసఫ్‌జాయ్(17) ఈ ఏడాదికిగానూ అమెరికా లిబర్టీ మెడల్‌ను గెలుచుకుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజల స్వేచ్ఛ కోసం పోరాడే వ్యక్తులకు ఏటా ఈ అవార్డును అందిస్తారు. అమెరికా రాజ్యాంగం అమల్లోకి వచ్చి 200 ఏళ్లు పూర్తయినందుకు సూచికగా 1988లో నేషనల్ కాన్స్టిట్యూషన్ సెంటర్ ఈ అవార్డును ఏర్పాటు చేసింది. మంగళవారం పెన్సిల్వేనియా రాష్ట్రంలోని ఫిలడెల్ఫియాలో జరిగిన అవార్డు ప్రదానోత్సవంలో మలాలా ఈ మెడల్‌ను అందుకుంది.


