breaking news
Generic version
-
సెమాగ్లూటైడ్ జనరిక్స్ వెల్లువ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టైప్–2 మధుమేహం, ఊబకాయం నియంత్రణకు ఉపయోగించే సెమాగ్లూటైడ్ ఔషధం పేటెంట్ దేశీయంగా ముగియడంతో దేశీ ఫార్మా దిగ్గజాలు పెద్ద ఎత్తున చౌక జనరిక్ వెర్షన్లను మార్కెట్లో ప్రవేశపెట్టాయి. దీనితో వీటి ధరలు గణనీయంగా దిగి వచ్చాయి. జనరిక్ వెర్షన్‌ను ఆవిష్కరించిన దిగ్గజాల్లో డాక్టర్ రెడ్డీస్, నాట్కో, సన్ ఫార్మా, గ్లెన్‌మార్క్ మొదలైనవి ఉన్నాయి. ఇన్నోవేటర్ హోదాలో డెన్మార్క్‌కి చెందిన నోవో నార్డిస్క్ సంస్థ .. సెమాగ్లుటైడ్ మాలిక్యూల్‌తో తయారు చేసిన ఔషధాన్ని ఒజెంపిక్, వెగోవీ బ్రాండ్స్ పేరిట విక్రయిస్తోంది. నెలకు సరిపడే డోసేజీలకు సంబంధించి వీటి వ్యయాల పరిమాణం .. డోసేజీ, దశను బట్టి రూ. 8,800 నుంచి రూ. 11,175 వరకు ఉంటోంది. తాజాగా జనరిక్ వెర్షన్ల రాకతో ధరలు దాదాపు 80 శాతం వరకు దిగి వచి్చనట్లవుతుంది. మల్టీ–డోస్ వయల్స్, ప్రీ–ఫిల్డ్ పెన్ డివైజ్‌ల రూపంలో ఈ ఇంజెక్షన్లు అందుబాటులో ఉంటాయి. ఔషధం ఒకటే అయినప్పటికీ ప్యాకేజింగ్, తయారీ విధానం, సౌకర్యం కారణంగా ప్రీ–ఫిల్డ్ పెన్‌ల ధర వయల్స్ కన్నా ఎక్కువగా ఉంటుంది. → డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ సంస్థ ఒబెదా బ్రాండ్ పేరిట వారానికి ఒకసారి తీసుకునే సెమాగ్లూటైడ్ ఇంజెక్షన్‌ని ప్రీ–ఫిల్డ్, డిస్పోజబుల్ పెన్ రూపంలో ప్రవేశపెట్టింది. కనీసం నాలుగు వారాలకు సరిపడేలా 2ఎంజీ, 4 ఎంజీ డోసుల్లో ఇది లభిస్తుంది. నెలవారీ వ్యయం రూ. 4,200గా ఉంటుందని సంస్థ సీఈవో ఎరెజ్ ఇజ్రేలీ తెలిపారు. దీన్ని ఇతర దేశాల్లో కూడా ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు. డాక్టర్ రెడ్డీస్ భాగస్వామ్యంతో యూఎస్వీ సంస్థ యుసెమా బ్రాండ్ పేరిట ఇంజెక్షన్‌ని ఆవిష్కరించింది. → మరోవైపు, నాట్కో ఫార్మా సంస్థ మల్టీ–డోస్ వయల్స్‌ని సెమానాట్, సెమాఫుల్ పేరిట ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది. వీటి నెలవారీ వ్యయం రూ. 1,290–1,750 శ్రేణిలో ఉంటుంది. అలాగే రూ. 4,000 నుంచి రూ. 4,500 వరకు నెలవారీ వ్యయం ఉండే పెన్ డివైజ్‌ని వచ్చే నెలలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని పేర్కొంది. ఇక సెమాగ్లుటైడ్ జనరిక్ వెర్షన్‌ని దేశవ్యాప్తంగా పంపిణీ చేసేందుకు నాట్కో ఫార్మాతో ఒప్పందం ఉన్న ఎరిస్ లైఫ్ సైన్సెస్.. దీన్ని ’సండే’ పేరిట ప్రవేశపెట్టింది. అటు టోరెంట్ ఫార్మా సంస్థ సెంబాలిక్, సెమాలిక్స్ బ్రాండ్స్ పేరిట ఆవిష్కరించింది. ఇతర సంస్థల వివరాలిలా.. సన్ ఫార్మా: నావెల్ట్రీట్, సెమాట్రినిటీ బ్రాండ్స్ కింద ఇంజెక్షన్లను ఆవిష్కరించింది. నావెల్ట్రీట్ 0.25 ఎంజీ నుంచి 2.4 ఎంజీ వరకు అయిదు డోసేజీల్లో లభిస్తుంది. వారంవారీ వ్యయం సుమారు రూ. 900 నుంచి రూ. 2,000 వరకు ఉంటుంది. ఇక సెమాట్రినిటీ వ్యయం రూ. 750 నుంచి రూ. 1,300 వరకు ఉంటుంది. గ్లెన్‌మార్క్: గ్లిపిక్ పేరిట ఇంజెక్షన్‌ని ప్రవేశపెట్టింది. వయల్స్ వ్యయం వారంవారీగా రూ. 325 నుంచి రూ. 440 వరకు ఉంటుంది. పెన్‌ల రూపంలో కూడా ఇది అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. జైడస్ లైఫ్‌సైన్సెస్: సెమాగ్లిన్టీఎం, మాషెమాటీఎం, ఆల్టర్మెట్ బ్రాండ్స్ పేరిట ఇంజెక్షన్లను ఆవిష్కరించింది. సగటున నెలవారీ వ్యయం రూ. 2,200గా ఉంటుంది. ఆల్కెమ్ ల్యాబ్స్: సెమాసైజ్, ఒబీసిమా, హెపాగ్లైడ్ బ్రాండ్స్ పేరిట ఇంజెక్షన్లను ఆవిషఅకరించింది. ప్రీ–ఫిల్డ్ డిస్పోజబుల్ ఇంజెక్షన్ పెన్ నెలకు నాలుగు డోసుల కింద లభిస్తుంది. వారం వారీ వ్యయం సుమారు రూ. 450 నుంచి, నెలవారీ వ్యయం రూ. 1,800 నుంచి ప్రారంభమవుతుంది. రీయూజబుల్ పెన్ రూపంలో కూడా లభిస్తుంది. -
మైలాన్ రెమ్‌డెసివిర్ వచ్చేసింది
సాక్షి, హైదరాబాద్: కోవిడ్–19 చికిత్సలో ఉపయోగించే రెమ్‌డెసివిర్ ఔషధాన్ని అంతర్జాతీయ ఫార్మా దిగ్గజం మైలాన్ భారత్‌లో అందుబాటులోకి తెచ్చింది. డెస్రెమ్ పేరుతో కంపెనీ ఈ జనరిక్ వర్షన్‌ను రూపొందించింది. 100 ఎంజీ వయల్‌ను రూ.4,800లకు విక్రయించనున్నట్టు మైలాన్ ఇప్పటికే ప్రకటించింది. పిల్లలు, పెద్దల్లో కోవిడ్ అనుమానిత, నిర్ధారిత కేసులు, తీవ్ర లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరిన వారికి చికిత్సలో భాగంగా పరిశోధనాత్మక యాంటీ వైరల్ డ్రగ్‌గా రెమ్‌డెసివిర్‌ను ఉపయోగించేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి మంజూరు చేసింది. తొలి బ్యాచ్ వయల్స్‌ను ఇప్పటికే మార్కెట్లోకి ప్రవేశపెట్టామని.. ఈ ఔషధానికి డిమాండ్ పెరుగుతున్న దృష్ట్యా సరఫరాను పెంచుతామని కంపెనీ ఇండియా, ఎమర్జింగ్ మార్కెట్స్ ప్రెసిడెంట్ రాకేశ్ బమ్జాయ్ వెల్లడించారు. ఔషధం సరఫరా వివరాల కోసం హెల్ప్‌లైన్ నంబరును సైతం కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. బెంగళూరులోని ఇంజెక్టేబుల్ ఫెసిలిటీలో డెస్‌రెమ్‌ను మైలాన్ తయారు చేస్తోంది. ఈ ఔషధాన్ని ఇతర దేశాలకూ ఎగుమతి చేయనున్నట్టు సంస్థ తెలిపింది. రెమ్‌డెసివిర్ తయారీ, పంపిణీకై ఈ ఏడాది మే నెలలో యూఎస్‌కు చెందిన గిలియడ్ సైన్సెస్‌తో నాన్ ఎక్స్‌క్లూజివ్ లైసెన్సింగ్ ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీల్లో మైలాన్ కూడా ఉంది. హెటిరో, సిప్లా ఇప్పటికే రెమ్‌డెసివిర్ ఔషధాన్ని అందుబాటులోకి తెచ్చాయి. -
నాట్కో, హెటిరోల నుంచి దేశీయ మార్కెట్లోకి హెపటైటిస్-సి జెనరిక్ ఔషధం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హెపటైటిస్-సి వ్యాధి చికిత్సకు వినియోగించే సొవాల్డి జెనరిక్ వెర్షను దేశీయ మార్కెట్లో విక్రయించడానికి నాట్కో ఫార్మా, హెటిరో ల్యాబ్స్లకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ (డీజీసీ) అనుమతి మంజూరు చేసింది. అమెరికాకు చెందిన గిలీడ్ సెన్సైస్ హెపటైటిస్ -సి చికిత్సకు వినియోగించే ట్యాబ్లెట్లను సొవాల్డి బ్రాండ్ నేమ్‌తో విక్రయిస్తోంది. ఇప్పుడు వీటి జెనరిక్ వెర్షన్‌ను నాట్కో ‘సోఫాస్బువిర్’ పేరుతో త్వరలోనే దేశీయ మార్కెట్లోకి విడుదల చేయనుంది. 28 ట్యాబ్లెట్ల ధరను రూ. 19,900గా కంపెనీ నిర్ణయించింది. ఈ మధ్యనే ఈ ఔషధాన్ని నేపాల్ విక్రయించడానికి నాట్కో ఫార్మాకి అనుమతులు లభించిన సంగతి తెలిసిందే. ఇదే జెనరిక్ ఔషధాన్ని ‘సొఫోవిర్’ పేరుతో ఇండియా మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు హెటిరో ల్యాబ్స్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ జెనరిక్ ఔషధాన్ని 91 దేశాల్లో తయారు చేసి విక్రయించుకోవడానికి హెటిరో ల్యాబ్స్, నాట్కో ఫార్మాలు హక్కులు పొందాయి. ఈ వార్తల నేపథ్యంలో నాట్కో ఫార్మా గురువారం సుమారు 15 శాతం పెరిగి రూ. 2,057 వద్ద ముగిసింది.


