breaking news
general secretaries
-
టీపీసీసీ జంబో కార్యవర్గం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ)లో కొత్తగా 27 మంది ఉపాధ్యక్షులు, 69 మంది ప్రధాన కార్యదర్శులను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ఈ పదవుల్లో సామాజిక న్యాయానికి, మహిళలకు ప్రాధాన్యత ఇచ్చింది. 27 మంది ఉపాధ్యక్షులలో బీసీలకు 8, ఎస్సీలకు 5, ఎస్టీలకు 2, ముస్లింలకు 3 పదవులు ఇచ్చారు. 67 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టలకు ఇచ్చారు. అలాగే 69 ప్రధాన కార్యదర్శి పదవులలో బీసీలకు అత్యధికంగా 26, ఎస్సీలకు 9, ఎస్టీలకు 4, ముస్లింలకు 8 పదవులు ఇచ్చారు. ఇందులో 68 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పదవులు దక్కాయి.సోమవారం ఢిల్లీకి వచి్చన సీఎం ఎ.రేవంత్‌రెడ్డి ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో చర్చల అనంతరం కార్యవర్గ జాబితాను ఖరారు చేశారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆమోదించిన జాబితాను సోమవారం రాత్రి పార్టీ విడుదల చేసింది. నల్లగొండ ఎంపీ రఘువీర్‌రెడ్డితోపాటు ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ పీసీసీ ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు. 69 మంది ప్రధాన కార్యదర్శుల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు, పరి్ణకారెడ్డి, డా.మట్ట రాగమయిలకు అవకాశం ఇచ్చారు. మంత్రులకు శాఖల కేటాయింపుపై చర్చోప చర్చలు మంత్రివర్గ విస్తరణలో కొత్తగా ముగ్గురు మంత్రులు అధికారం చేపట్టడంతో వారికి కేటాయించాల్సిన శాఖలపై కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్‌రెడ్డి సుదీర్ఘంగా చర్చించారు. క్షేత్రస్థాయిలో ఉన్న అనుభవం దృష్టా వీరికి ఏయే శాఖలు కేటాయించాలన్న అంశంపై చర్చించారు. సీఎం వద్దే హోం, న్యాయ, మున్సిపల్, విద్య, మైనింగ్ వంటి కీలక శాఖలు ఉన్నందున వాటిని కొత్త మంత్రులకు కేటాయించే అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. అదే సమయంలో ఖాళీగా ఉన్న మరో మూడు స్థానాల్లో మంత్రులుగా ఎవరిని తీసుకోవాలన్న దానిపై చర్చించారు. మంత్రి పదవులు ఆశిస్తున్న సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్ రావు, మల్రెడ్డి రంగారెడ్డిలతో పాటు ఇద్దరు మైనార్టీ నేతల పేర్లపైనా చర్చ జరిగినట్లు సమాచారం. వీటితో పాటే చీఫ్ విప్, రెండు విప్ల పదవుల భర్తీపైన చర్చ జరిగింది. చీఫ్ విప్ పదవిని రెడ్డి లేదా వెలమ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేకు ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించారని తెలిసింది. టీపీసీసీ ఉపాధ్యక్షులు 1) టి.కుమార్ రావు 2) కె.రఘువీర్ రెడ్డి, ఎంపీ 3) నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్యే 4) డా. చిక్కుడు వంశీ కృష్ణ, ఎమ్మెల్యే 5) బల్మూర్ వెంకట్, ఎమ్మెల్సీ 6) బస్వరాజు సారయ్య, ఎమ్మెల్సీ 7) హనుమాండ్ల ఝాన్సీరెడ్డి 8) బండి రమేశ్ 9) కొండ్రు పుష్పలీల 10) కోట నీలిమ 11) బి. కైలాష్ కుమార్ 12) నమిండ్ల శ్రీనివాస్ 13) ఆత్రం సుగుణ 14) గాలి అనిల్ కుమార్ 15) చిట్ల సత్యనారాయణ 16) లకావత్ ధన్వంతి 17) ఎం. వేణుగౌడ్ 18) కోటంరెడ్డి వినయ్ రెడ్డి 19) కొండేటి మల్లయ్య 20) ఎం.ఏ.ఫహీమ్ (సంగారెడ్డి) 21) ఎస్. సురేష్ కుమార్ 22) బొంతు రామ్మోహన్ 23) అఫ్సర్ యూసుఫ్ జాహీ 24) ఎస్. జగదీశ్వర్ రావు 25) నవాబ్ ముజాహిద్ ఆలంఖాన్ 26) గుమ్ముల మోహన్ రెడ్డి 27) చిన్నపటాల సంగమేశ్వర్ పీసీసీ ప్రధాన కార్యదర్శులు 1) వెడ్మ బొజ్జు, ఎమ్మెల్యే 2) సీహెచ్ పరి్ణకా రెడ్డి, ఎమ్మెల్యే 3) డా.మట్ట రాగమయి, ఎమ్మెల్యే 4) సీహెచ్.రాంభూపాల్ 5) ఏ. సంజీవ్ ముదిరాజ్ 6) బొజ్జా సంధ్యా రెడ్డి 7) మల్లాది రాంరెడ్డి 8) అబ్దేశి సదాలక్ష్మి 9) ఎం. బేబి స్వర్ణ కుమారి 10) దారాసింగ్, తాండూరు 11) జి. శశికళా యాదవ రెడ్డి 12) ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి 13) ముహమ్మద్ అబ్దుల్ ఫహీమ్ 14) సంతోష్ కుమార్ రుద్ర 15) దుర్గం భాస్కర్ 16) ముహమ్మద్ ఖాజా ఫఖ్రుద్దీన్ 17) వి.జగదీశ్వర్ గౌడ్ 18) నరేశ్ జాదవ్ 19) అల్లం భాస్కర్ 20) డా. గిరిజ షెట్కార్ 21) కొప్పుల ప్రవీణ్ కుమార్ 22) ఏ. జంగా రెడ్డి 23) కస్బా శ్రీనివాస్ రావు 24) దుడ్డిల్ల శ్రీనివాస్ 25) బద్దం ఇంద్రకరణ్ రెడ్డి 26) చరగాని దయాకర్ 27) పీసారి మహిపాల్ రెడ్డి 28) గజ్జెల కాంతం 29) ఏడుపుగంటి సుబ్బా రావు 30) చకిలం రాజేశ్వర్‌రావు 31) ఎర్ల కొమరయ్య 32)డా.ఏ.రవిబాబు 33) నాగ సీతారాములు 34) సనెం శ్రీనివాస్ గౌడ్ 35) పృథ్వి చౌదరి వేణుల 36) అంబడి రాజేశ్వర్ 37) డి.డి.వెంకట్ రాజ్ 38) బొడ్డిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 39) పల్లె శ్రీనివాస్ గౌడ్ 40) మొహమ్మద్ సబీర్ అలీ 41) కట్ల రంగారావు 42) పి. శ్రీనివాస్ రెడ్డి 43) మడు సత్యనారాయణ గౌడ్ 44) టోపాజీ అనంత కిషన్ 45) వి. రామారావు గౌడ్ 46) అచ్యుత్ రమేష్ బాబు 47) పెద్దనొల్ల బాలమురళీ కృష్ణ (చిన్న) 48) ఎం. రాజీవ్ రెడ్డి 49) ఆదంరాజ్ దేకపాటి 50) షమీం ఆఘా 51) ఈ.వి.శ్రీనివాస్ రావు 52) మిథున్ రెడ్డి 53) అమొగోత్ వెంకటేశ్ పవార్ 54) రాయగిరి కల్పనా యాదవ్ 55) రాజేష్ కాశిపాక 56) రహమత్ హుస్సేన్ 57) పి. ప్రసన్న కుమార్ శర్మ 58) ముహమ్మద్ అసదుద్దీన్ 59) నందిమల్ల యాదయ్య ముదిరాజ్ 60) దైదా రవీందర్ 61) ఉప్పల శ్రీనివాస్ గుప్తా 62) గడ్డం చంద్రశేఖర్ రెడ్డి 63) జి. నాగభూషణం 64) ఉపేందర్ రెడ్డి 65) ధర్మారావు 66) నూతి సత్యనారాయణ గౌడ్ 67) దుర్గాప్రసాద్ 68) డా. సి. వేంకటగోవింద్ రావు 69) పెండ్లి శ్రీనివాసులు రెడ్డి -
వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శుల నియామకం
సాక్షి, గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పదవుల భర్తీ ప్రక్రియలో భాగంగా ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పలు నియామకాలు చేపట్టారు.పార్టీ ప్రధాన కార్యదర్శులు (సమన్వయం)గా మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వేంపల్లి సతీష్‌రెడ్డిని నియమించారు. పార్టీ మరో ప్రధాన కార్యదర్శి (అనుబంధ విభాగాలు)గా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని నియమించారు. అలాగే కొన్ని అనుబంధ విభాగాలకు కూడా నియామకాలు చేశారు. వైఎస్సార్సీపీ యువజన విభాగం అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను నియమించారు.బీసీ సెల్ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు, చేనేత విభాగం అధ్యక్షుడిగా గంజి చిరంజీవి, విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా పానుగంటి చైతన్యను నియమించారు. ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలను మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావుకు అప్పగించారు. -
మరింత దూకుడు పెంచిన రాహుల్
-
మరింత దూకుడు పెంచిన రాహుల్
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ పగ్గాలు రేపో, ఎల్లుండో చేపట్టేందుకు సిద్ధమైన ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన దూకుడును ప్రదర్శిస్తున్నారు. సోమవారం పార్టీ పార్టీ ప్రధాన కార్యాలయంలో సాధారణ కార్యదర్శలతో సమావేశం ఏర్పాటు చేసిన ఆయన కీలక అంశాలను ప్రస్తావనకు తెచ్చి చర్చించినట్లు తెలుస్తోంది. పార్టీ వర్గాలు అందించిన సమాచారం మేరకు.. నవంబర్ 8న నిర్వహించబోయే బ్లా డే నిరసన ప్రదర్శనలపైనే ఆయన ప్రధానంగా చర్చించారంట. అయితే అవి సాధారణ రీతిలో కాకుండా కాస్త వైవిధ్యంగా ఉండేలా పలు సూచనలు కూడా రాహుల్ చేసినట్లు చెబుతున్నారు. ఇందుకోసం ఏకే ఆంటోనీ, మోతిలాల్ వోరా జీ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు సమాచారం. మోదీ ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతను చాటి చెప్పేలా నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని రాహుల్ చెప్పినట్లు ఓ కార్యదర్శి తెలిపారు. ఇక సమావేశం అనంతరం రాహుల్ మీడియాతో మాట్లాడారు. నవంబర్8న(నోట్ల రద్దు ప్రకటించిన రోజు) ఓ విషాదం అని రాహుల్ అన్నారు. జాతి ప్రయోజనాలు, ప్రజల ఇబ్బందులను అర్థం చేసుకోకుండానే ప్రధాని పెద్దనోట్ల రద్దు నిర్ణయం ప్రకటించారని రాహుల్ విమర్శించారు. కాగా, ఈ సమావేశంలోనే నవంబర్ 19వ తేదీన నిర్వహించబోయే ఇందిరా గాంధీ శత జయంతి ఉత్సవాల నిర్వహణ, అదే తేదీన రాహుల్ కు పగ్గాలు అప్పజెప్పే విషయంపై చర్చ జరిగినట్లు జాతీయ మీడియాలు కథనం వెలువడుతున్నాయి. -
వైఎస్సార్సీపీ ఏపీ విభాగానికి ఎనిమిదిమంది ప్రధాన కార్యదర్శులు
జిల్లాలకు కొత్త అధ్యక్షులు.. నియామకాలు చేసిన జగన్ సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీ విభాగానికి 8 మంది ప్రధాన కార్యదర్శులతోపాటుగా పలు జిల్లాలకు కొత్త అధ్యక్షులను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం నియమించారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి విడుదలైన ఒక ప్రకటనలో వివరాలను వెల్లడించారు. ప్రధాన కార్యదర్శులుగా సుజయ్ కృష్ణ రంగారావు, ధర్మాన ప్రసాదరావు, మోపిదేవి వెంకటరమణ, జంగా కృష్ణమూర్తి, ఎంవీ మైసూరారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, వి.విజయసాయిరెడ్డి, పీఎన్వీ ప్రసాద్ నియమితులయ్యారు. జిల్లా అధ్యక్షులుగా రెడ్డి శాంతి (శ్రీకాకుళం), కోలగట్ల వీరభద్రస్వామి (విజయనగరం), గుడివాడ అమర్నాథ్ (విశాఖపట్టణం), జ్యోతుల నెహ్రూ (తూర్పు గోదావరి), ఆళ్ల నాని (పశ్చిమ గోదావరి), కె.పార్థసారథి (కృష్ణా -దక్షిణం), కొడాలి నాని (కృష్ణా-ఉత్తరం), మర్రి రాజశేఖర్ (గుంటూరు), బాలినేని శ్రీనివాసరెడ్డి (ప్రకాశం), నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి (నెల్లూరు), బుడ్డా రాజశేఖర్‌రెడ్డి (కర్నూలు), ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి (వైఎస్సార్), శంకరనారాయణ (అనంతపురం), కె.నారాయణస్వామిలను (చిత్తూరు) నియమించారు.