breaking news
general elections campaign
-
ఫైనల్ టచ్!
- నేడు జిల్లాకు సోనియా, కేసీఆర్, చంద్రబాబు - ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఆయా పార్టీల కార్యకర్తలు - అభ్యర్థుల ఆశలన్నీ అతిరథుల ప్రచారంపైనే.. సాక్షి, రంగారెడ్డి జిల్లా : సార్వత్రిక ప్రచారం కీలక దశకు చేరుకుంది. రెండ్రోజుల్లో తెరపడనున్న ఎన్నికల ప్రచారం తారస్థాయికి చేరింది. ముగ్గురు అగ్రనేతల రాకతో సార్వత్రిక పోరు అంతిమ దశకు చేరుకుంది. ఎన్నికల ప్రచారానికి ‘ఫైనల్ టచ్’ ఇచ్చేందుకు కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ల అతిరధులు జిల్లాకు తరలివస్తుండడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ, టీఆర్ఎస్ సారథి కేసీఆర్, దేశం దళపతి చంద్రబాబు జిల్లాలో జరిగే ప్రచారసభల్లో పాల్గొంటుండడంతో భారీగా జనసమీకరణ జరిపేం దుకు ఆయా పార్టీల నాయకత్వాలు సర్వశక్తులొడ్డుతున్నాయి. అగ్రనేతల సభలను సక్సెస్ చేయడం ద్వారా కార్యకర్తల్లో నూతనోత్తేజం నింపాలని భావిస్తున్నాయి. చేవెళ్లలో సోనియా.. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఆదివారం చేవెళ్లలో జరిగే బహిరంగ సభలో పాల్గొనున్నారు. జిల్లా గ్రామీణ ప్రాంతానికి తొలిసారిగా సోనియా రానుండడంతో పార్టీ కార్యకర్తలు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. సోనియా సభకు పెద్దఎత్తున జనాలను తరలించేందుకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తమైంది. సుమారు 700 బస్సుల ద్వారా ప్రజలను చేవెళ్లకు చేరవేసేందుకు సన్నాహాలు చేసింది. మధ్యాహ్నం 3 గంటలకు షాబాద్ మార్గంలో జరిగే సభ ఏర్పాట్లను మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దగ్గరుండి పర్యవేక్షించారు. కేసీఆర్ సుడిగాలి పర్యటన టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఆదివారం జిల్లాలో సుడిగాలి పర్యటన చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు తాండూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అనంతరం పరిగి, వికారాబాద్‌లలో జరిగే రోడ్‌షోల్లో పాల్గొంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో మేడ్చల్ చేరుకుంటారు. అక్కడ రోడ్‌షో అనంతరం ఎల్బీనగర్, ఉప్పల్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు. గ్రామీణ నియోజకవర్గాలపై గంపెడాశ పెట్టుకున్న టీఆర్ఎస్.. ఇక్కడ అధినేత సభలను విజయవంతం చేయడం ద్వారా ప్రత్యర్థులకు సవాల్ విసరాలని భావిస్తోంది. మహేశ్వరానికి టీడీపీ అధినేత బాబు.. చంద్రబాబు ఆదివారం మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలంలో పర్యటిస్తారు. తర్వాత ఇబ్రహీంపట్నంలో 3గంటలకు జరిగే సభలో ప్రసంగిస్తారు. -
చంద్రబాబుపై కోడిగుడ్లతో దాడి
సాక్షి, మంచిర్యాల : సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా బెల్లంపల్లికి వచ్చిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు పరాభవం ఎదురైంది. తెలంగాణవాదులు చంద్రబాబు సభలో కోడిగుడ్లు విసి రి తీవ్ర నిరసన తెలిపారు. బుధవారం బెల్లంపల్లిలోని సింగరేణి తిలక్‌స్టేడియంలో టీడీపీ ఆధ్వర్యంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఉదయం 10.30 గంటలకు చంద్రబాబు సభలో పాల్గొనాల్సి ఉండగా మధ్యాహ్నం సరిగ్గా 3 గంటలకు ప్రత్యేక హెలిక్యాప్టర్ ద్వారా బెల్లంపల్లికి చేరుకున్నారు. నాలుగున్నర గంటలు ఆలస్యంగా వచ్చిన చంద్రబాబు సభావేదికపైకి ఎక్కి ప్రసంగం మొదలుపెట్టిన పది నిమిషాల్లో నే సభికుల నుంచి నిరసన వ్యక్తమైంది. కొంద రు తెలంగాణవాదులు వెంట తీసుకొచ్చిన కోడిగుడ్లను చంద్రబాబుపైకి విసిరారు. సభా వేదిక దూరంగా ఉండటంతో ఆ గుడ్లు చంద్రబాబుకు ఐదు మీటర్ల దూరంలో పడ్డాయి. వెంటనే పోలీసులు అప్రమత్తమై సదరు యువకులను అదుపులోకి చితకబాదారు. ఆ తర్వాత బయట కు పంపించారు. దీంతో సభలో కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ముందస్తుగానే పోలీసులు పెద్ద ఎత్తున సభా వేదిక చుట్టూ రా మొహరించారు. అనుమానించినట్లుగానే తెలంగాణవాదులు కోడిగుడ్లు విసరడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఆ తర్వాత చంద్రబాబు టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పరుష పదజాలంతో దూషించారు. అంతలోనే మరో వ్యక్తి చంద్రబాబు ప్రసంగానికి అడ్డుతగలగా పోలీసులు అతన్ని బలవంతంగా బయటకు లాక్కెళ్లారు. జిల్లా అభివృద్ధికి కృషి చేస్తా : చంద్రబాబు ఆదివాసీల జిల్లా ఆదిలాబాద్‌ను అభివృద్ధి చే సేందుకు కృషి చేస్తానని, చంద్రబాబు అన్నారు. జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు, సి ర్పూర్ పేపర్ మిల్లును కాపాడుకునేందుకు చర్య లు, ఆదివాసీల రిజర్వేషన్ పెంపునకు ప్రయత్నిస్తానని ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో భా గంగా బుధవారం ఆయన జిల్లాలో పర్యటించా రు. బెల్లంపల్లి, కాగజ్‌నగర్, ఖానాపూర్, కడెం, ఇచ్చోడ, నిర్మల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ స భల్లో ఆయన పార్టీ నాయకులు, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఎన్టీఆర్, తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జిల్లా అభివృద్ధికి కృషి చేసినట్లు గుర్తు చేశారు. సింగరేణి కార్మికులకు లాభాల్లో వాటా, పరుగుపందెలా ద్వారా ఉద్యోగాలను కల్పించానని ప్రస్తావించారు. సిం గరేణిని లాభాల బాట పట్టించానని తెలిపారు. సిర్పూర్ పేపర్ మిల్లు కార్మికులకు తన హయాంలోనే న్యాయం జరిగిందని పేర్కొన్నారు. తమ ప్రభుత్వంలో బీసీ నాయకుడు కృష్ణయ్యను ముఖ్యమంత్రిగా, దళిత నాయకుడిని ఉపముఖ్యమంత్రిగా చేస్తానని హామీనిచ్చారు. జిల్లాలోని కడెం ప్రాజెక్టు ఎత్తుని పెంచి, రెండు పంటలకు సరిపడా నీరందించేలా చేస్తామని అన్నారు. గిరిజనులకు 12 శాతం రిజర్వేశన్ కల్పిస్తామని హామీనిచ్చారు. భూమి లేని నిరుపేద గిరిజనులకు రెండు ఎకరాల సాగుభూమిని పంపిణీ చేస్తామని అన్నారు. జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసి, పర్యాటక ఆకర్షణీయ ప్రాంతాలుగా మారుస్తామని ప్రకటించారు. ఇంటికి ఒక ఉద్యోగం కల్పించి, జిల్లాలోని ఆదివాసి, దళిత బహుజన వెనకబడిన వర్గాల్లోని యువతకు న్యాయం చేస్తామని తెలిపారు. డ్వాక్రా రుణాల మాఫీ, వారికి స్వయం ఉపాధి అవకాశాల కల్పన చేస్తామని అన్నారు. జిల్లాలోని ఆపార ఖనిజ నిల్వల ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని, అప్పుడు ఆదిలాబాద్ ఎంపీ రాథోడ్ రమేశ్‌ను గిరిజన శాఖ మంత్రిని చేస్తానని అన్నారు. ఆయా బహిరంగ సభల్లో పార్లమెంటరీ అభ్యర్థులు రాథోడ్ రమేశ్, జానాపాటి శరత్‌బాబు, తూర్పు, పశ్చిమ జిల్లాల అధ్యక్షుడు అరిగెల నాగేశ్వర్రావు, లోలం శ్యాంసుందర్, ఆయా నియోజక వర్గాల అభ్యర్థులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మిశ్రమ స్పందన టిక్కెట్ల కేటాయింపు, పొత్తుల ఖరారులో నెలకొ న్న ఇబ్బందుల ప్రభావం చంద్రబాబు పర్యట నపై స్పష్టంగా కన్పించింది. జిల్లాలో నిర్వహిం చిన సభల్లో జనం పల్చగా కన్పించారు. దీనికి తోడు నిర్దేశిత సమయం కంటే దాదాపు 4 గంట ల ఆలస్యంగా చంద్రబాబు ఆయా సభలకు హా జరుకావడంతో, వచ్చిన కార్యకర్తలు నిరుత్సాహానికి గురయ్యారు. నిర్దేశిత సమయానికి చేరుకున్న కార్యకర్తలు చంద్రబాబు ఆలస్యంగా వస్తారని భావించి, మధ్యలోనే ఇంటిముఖం పట్టడం కన్పించింది. నిర్మల్‌లో చంద్రబాబు బస నిర్మల్ : టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం రాత్రి నిర్మల్‌లో బస చేశారు. పట్టణంలోని ఏఎన్‌రెడ్డి కాలనీలోని ఓ ఇంట్లో బస చేశారు. గురువారం ఉదయం పార్టీ ముఖ్యనేతలతో సమావేశం కా నున్నారు. నిర్మల్‌లో నిర్వహించిన రోడ్‌షోలో టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి రాథోడ్ రమేశ్, నిర్మ ల్ అసెంబ్లీ అభ్యర్థి మిర్జాయాసిన్బేగ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అయ్యన్నగారి భూమయ్య, టీడీపీ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోలం శ్యాం సుందర్, నాయకులు యూసున్అక్భానీ, భూషణ్‌రెడ్డి, మెడిసెమ్మ రాజు, గండ్రత్ రమేశ్, తదితరులు పాల్గొన్నారు.