breaking news
Geeta singh
-
ప్రాణంగా పెంచుకున్న కొడుకు చనిపోయాడు: గీతా సింగ్
గీతా సింగ్ (Geeta Singh) అనగానే గుర్తొచ్చే మూవీ కితకితలు. అందులో గీతా యాక్టింగ్, అమాయకత్వం అందరినీ కట్టిపడేశాయి. ఎన్నో సినిమాలు చేసినప్పటికీ అందరూ తనను కితకితలు హీరోయిన్‌గానే గుర్తుపెట్టుకున్నారు. ఇటీవల గీతా సింగ్ బరువు తగ్గి కాస్త సన్నబడింది. ఆ విశేషాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. అలాగే బిగ్‌బాస్ షోపై తన ఆసక్తిని వెల్లడించింది. బిగ్‌బాస్‌కు వెళ్లాలనుందిగీతా సింగ్ మాట్లాడుతూ.. మా స్వస్థలం నిజామాబాద్. జై సినిమా ఆడిషన్స్ జరుగుతున్నాయంటే వెళ్లాను. అలా ఇండస్ట్రీలోకి వచ్చాను. ఎవడి గోల వాడిదే సినిమాతో గుర్తింపు వచ్చింది. కితకితలు చిత్రం నా జీవితాన్ని మలుపు తిప్పింది. ఈ సినిమాకు రూ.60 లక్షలు పెడితే దాదాపు రూ.9 కోట్లు వచ్చాయి. బిగ్‌బాస్ షోకు వెళ్లాలనుంది. కానీ ఇంత పేరు తెచ్చుకున్న మమ్మల్ని వదిలేసి కొత్తవారినే సెలక్ట్ చేస్తున్నారు. బిగ్‌బాస్ 9కి ఛాన్స్ వస్తే తప్పకుండా వెళ్తాను. అయితే వెళ్లినప్పుడు ఫస్ట్ నాగార్జునకు ముద్దు పెట్టాకే మాట్లాడతాను. కష్టాల్లో ఎవరూ తోడుగా లేరుబరువు తగ్గడం అంటే అంత ఈజీ కాదు. కడుపు మాడ్చుకుని కష్టపడుతుంటే ఏడుపొచ్చేసేది. అయినా ఇంకా తగ్గడానికి ప్రయత్నిస్తున్నాను. నా వ్యక్తిగత విషయానికి వస్తే.. డబ్బున్నప్పుడు అందరూ వస్తారు. కానీ, కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ తోడుగా ఉండరు. నేను నా కొడుకును కోల్పోయినప్పుడు నా దగ్గర ఎవరూ లేరు. కనీసం తిన్నావా? లేదా? ఎలా ఉన్నావు? అని అడిగేవాళ్లే లేరు. నాకు నేనే ధైర్యం చెప్పుకుని బతికాను. నిజానికి వాడు నా కొడుకు కాదు, అన్నయ్య కొడుకు. నేను దత్తత తీసుకుని పెంచుకున్నాను. పిల్లల కోసమే పెళ్లి చేసుకోలే24 ఏళ్లు ప్రాణంగా పెంచుకున్నాను. యాక్సిడెంట్లో చనిపోయాడు. తట్టుకోలేకపోయాను. నెమ్మదిగా ఆ బాధ నుంచి బయటపడుతున్నాను. అన్నయ్య రెండో కొడుకును కూడా నేనే చూసుకుంటున్నాను. కజిన్ అన్నయ్య కూతురు కూడా నా దగ్గరే ఉంటుంది. పిల్లల కోసమే నేను పెళ్లి చేసుకోకుండా ఉన్నాను. కానీ, దేవుడేమో ఇలా చేశాడు. నేను వెయ్యికి పైగా సినిమాలు చేశాను. కానీ, అందులో చాలావరకు రిలీజవ్వలేదు అని గీతా సింగ్ చెప్పుకొచ్చింది.చదవండి: స్టార్స్ రీయూనియన్.. జల్సాకు బదులు సేవ చేయొచ్చుగా -
'మిస్ యూ మై సన్'.. ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ తీవ్ర భావోద్వేగం!
ప్రముఖ తెలుగు లేడీ కమెడియన్, కితకితలు హీరోయిన్ గీతాసింగ్ కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో గీతా సింగ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. సరిగ్గా రెండేళ్ల క్రితం చేతికి అందివచ్చిన కుమారుడిని కోల్పోయిన గీతాసింగ్ తీవ్ర భావోద్వేగానికి గురైంది. ఫిబ్రవరి 18న తన కుమారుడి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించింది. తన కొడుకు తనతో ఉన్న క్షణాలను గుర్తు చేసుకుంటూ.. మిస్ యూ రా అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. (ఇది చదవండి: కమెడియన్ గీతాసింగ్ ఇంట విషాదం)అయితే.. గీతాసింగ్ ఇప్పటివరకు అసలు పెళ్లే చేసుకోలేదు. తన సోదరుడి కుమారులను దత్తత తీసుకుని పోషిస్తున్నారు. వారిలో పెద్దబ్బాయి ఈ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఇకపోతే కితకితలు, ఎవడిగోల వాడిది సినిమాలో గీతా సింగ్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా దాదాపు 50కి పైగా చిత్రాలు చేసింది. ప్రస్తుతం మాత్రం సినిమాలకు దూరంగా ఉంటోంది. View this post on Instagram A post shared by Geeta Singh (@kithakithalu_geetasingh) -
కమెడియన్ గీతాసింగ్ ఇంట విషాదం
ప్రముఖ లేడీ కమెడియన్, కితకితలు హీరోయిన్ గీతాసింగ్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ విషయాన్ని నటి కరాటే కల్యాణి సోషల్ మీడియాలో వెల్లడించింది. 'దయచేసి కారులో అయినా, బైక్‌పై అయినా వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కమెడియన్ గీతాసింగ్ అబ్బాయి యాక్సిడెంట్ వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఓ శాంతి' అని కల్యాణి ఫేస్బుక్ పోస్టులో పేర్కొంది. ఈ పోస్టుపై అభిమానులు, నెటిజన్లు స్పందిస్తూ నటి కుమారుడి మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా గీతాసింగ్ ఇప్పటివరకు అసలు పెళ్లే చేసుకోలేదు. తన సోదరుడి కుమారులను దత్తత తీసుకుని పోషిస్తున్నారు. వారిలో పెద్దబ్బాయి ఈ రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు సమాచారం. ఇకపోతే కితకితలు, ఎవడిగోల వాడిది సినిమాలో గీతా సింగ్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా దాదాపు 50కి పైగా చిత్రాలు చేసింది. ప్రస్తుతం మాత్రం అవకాశాలు లేక సినిమాలకు దూరంగా ఉంటోంది. చదవండి: కథ వెనుక కథ టీజర్ చూశారా? -
ఇద్దరు హీరోయిన్లు నన్ను అవమానించారు: గీతా సింగ్
కితకితలు సినిమాతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది గీతా సింగ్. లావుగా ఉన్నా కూడా హీరోయిన్గా చేయొచ్చని నిరూపించింది. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ ఇప్పటికీ ఆమెను కితకితలు గీతాసింగ్‌గానే గుర్తు చేసుకుంటారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో చేదు అనుభవాలను పంచుకుంది. ఓ ఇద్దరు హీరోయిన్స్ తనను అందరిముందు అవమానించారని తెలిపింది. 'అల్లరి నరేశ్ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించాను. షూటింగ్ గ్యాప్‌లో క్యారవాన్ ఎక్కాను. అప్పటికే అందులో బాంబే హీరోయిన్స్ ఉన్నారు. వారు నన్ను చూసి ఏంటి? ఈమె క్యారవాన్ ఎక్కింది, జూనియర్ ఆర్టిస్ట్ అని చులకనగా మాట్లాడారు. అప్పుడు మిగతా నటులు నిన్ను ఇలా అంటున్నారేంటి అని అడిగారు. వారికేదో తెలియక అలా అంటున్నారులే అని క్యారవాన్ దిగి లొకేషన్లో ఓ చోటున కూర్చున్నా. ఈ విషయం తెలిసి అల్లరి నరేశ్.. నన్ను హీరోయిన్స్ దగ్గరకు తీసుకెళ్లాడు. ఈమె నా ఫస్ట్ హీరోయిన్, తన నుంచే నాకు బ్రేక్ వచ్చింది అని చెప్పాడు. దీంతో ఆ హీరోయిన్స్ అప్పటినుంచి నన్ను మేడమ్ అని పిలవడం ప్రారంభించారు. నరేశ్‌కు తన గురించి బాంబే హీరోయిన్స్ దగ్గర చెప్పాల్సిన అవసరం లేకపోయినా చెప్పారు. అదే ఆయనకు ఉన్న గొప్ప లక్షణం' అని చెప్పుకొచ్చింది గీతా సింగ్. చదవండి: తండ్రిని ఇష్టపడని టబు, ఎందుకంటే? -
సొంతవాళ్లే మోసం చేశారు, నటి వల్ల రూ. 6 కోట్లు నష్టపోయా: గీతా సింగ్
లేడీ కమెడియన్ గీతా సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆమె పేరు వినగానే టక్కున గుర్తొచ్చే చిత్రం కితకితలు. ఈ సినిమాలో అల్లరి నరేశ్ సరసన హీరోయిన్గా నటించింది. ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన ఆమె మూవీ అప్పట్లో మంచి విజయం సాధించింది. ఈ చిత్రంతో గీతా సింగ్ రాత్రికి రాత్రే స్టార్డమ్ తెచ్చుకుంది. ఇందులో తన కామెడీతో కడుబ్బా నవ్వించడమే కాదు.. లావుగా ఉండే భార్య పడే కష్టాలను చూపించి అందరి చేత కన్నీరు పెట్టించింది. అలా ఎన్నో చిత్రాల్లో లేడీ కమెడియన్‌గా నటించి తెరపై ప్రేక్షకులను నవ్వించింది. చదవండి: ఆ ఫొటో చూసి పెళ్లయిందా? అంటూ ప్రశ్నల వర్షం, క్లారిటీ ఇచ్చిన పూనమ్ అయితే కొంతకాలంగా ఆమె తెరకు దూరమైన సంగతి తెలిసిందే. తాజాగా ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించిన ఆమె జీవితంలో చోటు చేసుకున్న చేదు సంఘటనలను గుర్తు చేసుకుంది. అలాగే ఇండస్ట్రీలో అవకాశాలు రావడం లేదని, అందుకే తాను నటించడం లేదని చెప్పింది. పరిశ్రమలో అసలు సపోర్ట్ లేదంటూ గీతా సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడసలు సినిమాల్లో ఫిమేల్ యాక్టర్స్ ఎక్కడ కనిపిస్తున్నారని, అందరు మేల్ యాక్టర్సే కదా అని వ్యాఖ్యానించింది. ‘పరిశ్రమలో పురుషాధిక్యం ఎక్కువ. మహిళా నటులకు అసలు అవకాశాలు ఇవ్వడం లేదు. మనకు ఎంతమంది లేడీ కమెడియన్స్ లేరు.. ఇప్పుడు ఎవరైనా ఏ సినిమాలో అయినా కనిపిస్తున్నారా?’ అని ప్రశ్నించింది. అనంతరం ఇటూ ఇండస్ట్రీ సపోర్ట్ , నమ్ముకున్న బంధువుల మద్దుతు లేకపోవడంతో ఒంటరిగా పోరాడుతున్నానంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘నమ్మిన వాళ్లే.. దారుణంగా మోసం చేశారు. డబ్బులు అవసరం ఉంటేనే నా కుటుంబానికి గుర్తుకు వస్తాను. డబ్బు అవసరం ఉన్నంత వరకే నాతో ఉండేవాళ్లు. నా సొంత చెల్లెల్లు కూడా నన్ను డబ్బు కోసం వాడుకున్నారు’ అంటూ కన్నీటీ పర్యంతరం అయ్యింది. ఇక ఇండస్ట్రీలో ఎంతో కష్టపడి సంపాందిచుకున్న డబ్బును ఓ మనిషిని నమ్మి పోగొట్టుకున్నాని, ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ని దగ్గర చిట్టీలు వేశానని చెప్పంది. చదవండి: నిర్మాతగా వరుస విజయాలు.. ‘తగ్గేదే లే’ అంటున్న ‘అమ్ము’ హీరోయిన్ అయితే చివరకు ఆమె మోసం చేయడంతో సుమారు రూ. 6 కోట్ల వరకు నష్టపోయానని చెప్పుకొచ్చింది. ఇటు ఆఫర్స్ లేక, చేసుకోడానికి పని లేక ఒత్తిడికి గురయ్యానని, బాధలో రెండుసార్లు ఆత్మహత్యాయత్నం కూడా చేశానని చెప్పింది. అయితే తన స్నేహితురాలు చూసి తనని కాపాడిందని తెలిపింది. ప్రస్తుతం తనకు ఆ స్నేహితురాలే పెద్ద దిక్కని, తన అన్నయ్య పిల్లలను దత్తత తీసుకుని వారితో కలిసి జీవిస్తున్నానంటూ గీతా సింగ్ చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన ‘మా’ ఎలక్షన్స్‌లో మంచు విష్ణు ప్యానెల్ తరపున గీతా సింగ్ పోటీ చేసి గెలుపు పొందిన సంగతి తెలిసిందే. -
ఈవీవీ పునర్జన్మనిచ్చారు
కొవ్వూరు :దర్శకుడు తేజ తనకు సినిమా పరిశ్రమలో జన్మనిస్తే, దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ పునర్జన్మనిచ్చారని నటి గీతాసింగ్ తెలిపారు. కొవ్వూరు మండలం పశివేదలలో ఓ చిత్రం షూటింగులో పాల్గొనేందుకు వచ్చిన ఆమె ‘సాక్షి’తో ముచ్చటించారు. ప్రస్తుత సినిమాలో పోలీసు కానిస్టేబుల్‌గా నటిస్తోన్న గీతాసింగ్ రాజస్థానీ అమ్మాయి. కితకితలు సినిమాలో హీరోయిన్గా అవకాశం ఇచ్చి, తెలుగును స్వచ్ఛంగా మాట్లాడేలా తర్ఫీదునిచ్చిన ఈవీవీకి రుణపడి ఉంటాన్నారు. ఆ సినిమా తెలుగుతో పాటు తమిళంలో కూడా రీమైకై హిట్టయ్యిందన్నారు. ఇప్పటివరకూ 80 వరకూ తెలుగు చిత్రాల్లో నటించానని, కామెడీతో కూడిన పోలీసాఫీసర్ క్యారెక్టర్ చేయాలని ఉందని అన్నారు. ప్రస్తుతం తెలుగులో మూడు, కన్నడంలో ఒక సినిమా చేస్తున్నట్టు చెప్పారు.