breaking news
Ganta Srinivasa Rao Daughter Marriage
-
వైభవంగా మంత్రి గంటా కుమార్తె వివాహం
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రమంత్రి గంటా శ్రీనివాసరావు కుమార్తె సాయి పూజిత వివాహం బుధవారం విశాఖపట్నంలో వైభవంగా జరిగింది. సాయి పూజితకు పశ్చిమ గోదావరిజిల్లా భీమవరం ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులు కుమారుడు వెంకట్రామ్ ప్రశాంత్‌తో జరిగిన ఈ వివాహానికి రాష్ట్రవ్యాప్తంగా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఆంధ్రాయూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో ఉదయం 9.05 గంటలకు జరిగిన వివాహానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. కేంద్రమంత్రులు చిరంజీవి, కిల్లి కృపారాణి, కావూరి, ఎంపీలు లగడపాటితోపాటు పలువురు రాష్ట్రమంత్రులు, సినీనటులు వివిధ శాఖల ఉన్నతాధికారులు భారీగా తరలివచ్చి వధూవరులను ఆశీర్వదించారు. ఈ వివాహానికి వివిధ ప్రాంతాలనుంచి రకరకాల వంట నిపుణులను తీసుకువచ్చి అతిథులకు విందు ఏర్పాటుచేశారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, సినీ నిర్మాత రామానాయుడు, వైఎస్సార్సీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, కొణతాల రామకృష్ణ, దాడివీరభద్రరావు, సోమయాజులు, జ్యోతుల నెహ్రూ, విశాఖ నగర కన్వీనర్ వంశీకృష్ణ, జిల్లా కన్వీనర్ చొక్కాకుల, ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు ఈ వివాహానికి హాజరయ్యారు. దేవినేని రాజశేఖర్ కుమారుని నిశ్చితార్థానికి సీఎం విజయవాడ: మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ కుమారుడు, సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ కన్వీనర్ దేవినేని అవినాష్ నిశ్చితార్థ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హాజరయ్యారు. బుధవారం రాజమండ్రి నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకున్న ఆయన నేరుగా ఎ కన్వెన్షన్ సెంటర్‌కు వచ్చి కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. -
స్టెప్పులేసిన మంత్రులు కాసు, ఏరాసు
విశాఖపట్టణం: మంత్రులు కాసు కృష్ణారెడ్డి, ఏరాసు ప్రతాపరెడ్డి కాసేపు డాన్సర్ల అవతారం ఎత్తారు. సరదాగా స్టెప్పులేసి అందరినీ అలరించారు. రాష్ట్ర పెట్టుబడులు, మౌళిక సదుపాయాల మంత్రి గంటా శ్రీనివాసరావు కూతురి వివాహ వేడుకలో ఈ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. అక్కడున్న ఓ అమ్మాయి చేయి పట్టుకుని సరదాగా నాలుగు స్టెప్పులు వేయడంతో గంటా శ్రీనివాసరావు సహా అక్కడున్న అందరూ సరదా పడ్డారు. సోమవారం రాత్రి నిర్వహించిన సంగీత్ కార్యక్రమంలో కాసు, ఏరాసు డాన్స్ చేసి ఔరా అనిపించారు. ఏఎన్నార్ పాటలకు ఉత్సాహంగా నృత్యాలు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఏరాసు ప్రతాపరెడ్డి భరతనాట్యం చేశారు. కాగా గంటా శ్రీనివాసరావు కుమార్తె వివాహం బుధవారం జరగనుంది.