breaking news
gangadhara nellore mla
-
‘...అందకపోతే కాళ్లు చంద్రబాబు నైజం’
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకోవడం చంద్రబాబు నైజమని గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి విమర్శించారు. హైదరాబాద్ వస్తే నరేంద్ర మోదీని అరెస్టు చేయిస్తామని గతంలో హెచ్చరించిన చంద్రబాబే మోదీ కాళ్లకు మొక్కారని, ఆయన దేనికైనా సమర్థుడని నారాయణస్వామి ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రధాని మోదీ కాళ్లకు మొక్కుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయని ఆయన తెలిపారు. సోషల్‌మీడియాలో కనిపిస్తున్న ఫొటోలను నారాయణస్వామి మీడియాకు విడుదల చేశారు. తప్పుడు ప్రచారం చేయొద్దు సభలో ప్రధానమంత్రికి విజయసాయిరెడ్డి పాదాభివందనం చేయకపోయినా చేసినట్లు తప్పుడు ప్రచారం సాగించడం సరైంది కాదు. ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి ఉన్నప్పుడు నమస్కారం పెట్టడం మామూలే. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి చెందిన నేను కూడా మంగళవారం రాజ్యసభలో ప్రధాని మోదీకి నమస్కరించా. పెద్దలకు నమస్కారం చేయడం మన భారతీయ సంప్రదాయం, సంస్కృతిలో భాగం. – టి.సుబ్బిరామిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎంపీ సభలో విజయసాయిరెడ్డి కనిపించలేదు సభలో ఫేర్వెల్ స్పీచ్ ఇచ్చే వరకూ మేమంతా కామ్‌గా ఉంటామని, ఆ తర్వాత నిరసన కొనసాగిస్తామని తెలియజేశాం. ప్రధానమంత్రి సభలో ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి ఎక్కడ ఉన్నారో కూడా కనిపించలేదు. నేను ప్రధానమంత్రికి నమస్కారం పెట్టానో లేదో నాకైతే గుర్తులేదు. పెద్దవాళ్లు వస్తూ పోతూ ఉన్నప్పుడు నమస్కారం, ప్రతి నమస్కారం అనేది మన సంస్కారం. అది భారతదేశ సంస్కృతి. పెద్దవాళ్లు కనిపిస్తే దగ్గరికెళ్లి నమస్కారం పెడతాం. అది సహజం, అందులో తప్పులేదు. – సుజనా చౌదరి, టీడీపీ ఎంపీ -
వైఎస్ఆర్ సీపీ నేతలపై బాబు కక్ష సాధింపు
తిరుమల: వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ నేతలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి అన్నారు. శుక్రవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆయన కుటుంబ సభ్యులతో కలసి వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మాట్లాడుతూ ప్రజా సంక్షే మ కార్యక్రమాలపై దృష్టి సారించ కుండా ప్రతి పక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులపై దౌర్జన్యంగా కేసులు పెట్టే కార్యక్రమానికి చంద్రబాబు మక్కువ చూపుతున్నారని అన్నారు. అసెంబ్లీలో ప్రమాణం చేసిన విధంగా ప్రజలందరికీ సమాన పరిపాలన అందించటంలో బాబు విఫలమవుతున్నారన్నారు. ఎటువంటి కక్షలు లేకుండా ప్రజలకు మంచి పాలన అందించాలని స్వామి సన్నిధి నుంచి ముఖ్యమంత్రిని కోరుతున్నట్టు తెలిపారు. ఆయనకు మంచి బుద్ధిని ప్రసాదించి కుంటుపడిపోయిన అభివృద్ధిపై దృష్టిసారించేలా చూడాలని శ్రీవారిని కోరుకున్నానన్నారు. రాజకీయలకు అతీతంగా ప్రతి ఒక్క నేత రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు.