breaking news
gama music awards
-
ప్రతిష్టాత్మక గామా అవార్డ్స్.. ప్రదానం చేసేది ఎప్పుడంటే?
ప్రతిష్టాత్మక గామా అవార్డుల వేడుక అంతా సిద్ధమైంది. ఈ ఏడాది జరగనున్న ఐదో ఎడిషన్‌కు సంబంధించిన వివరాలను దుబాయ్ వేదికగా ప్రకటించారు. దుబాయ్‌లోని మైత్రి ఫార్మ్‌లో నిర్వహించిన ఈవెంట్లో తేదీ, వేదికను ఖరారు చేశారు. ఈ వేడుకలో ప్రముఖ సింగర్ రఘు కుంచె సమక్షంలో జ్యూరీ కమిటీని అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు గామా అవార్డ్స్ గ్రాండ్ రివీల్ పేరిట ఈవెంట్ నిర్వహించారు. ఈ ప్రత్యేకమైన వేడుకకు దుబాయ్‌లోని 500 మందికి పైగా తెలుగువారు హాజరయ్యారు. వీరితో పాటు తెలుగు కళా, సంగీత ప్రపంచానికి చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు.మొట్టమొదటి సారి చాలా వినూత్నంగా ఈ గ్రాండ్ రెవీల్ ఈవెంట్ నిర్వహించారు. గామా అవార్డ్స్-2025 వేడుక 5వ ఎడిషన్ జూన్ 7, 2025న దుబాయ్ షార్జా ఎక్స్పో సెంటర్లో నిర్వహించనున్నారు. ఈ జ్యూరీ చైర్ పర్సన్స్ సభ్యులుగా టాలీవుడ్ సినీ దర్శకులు ఏ. కొదండ రామిరెడ్డి , సంగీత దర్శకులు కోటి , సినీ దర్శకులు బి. గోపాల్ వారి ఆధ్వర్యంలో ఎంపికైన టాలీవుడ్ నటీనటులకు, సినిమాలకు గామా అవార్ద్స్ అందజేస్తారు.ఈ సందర్బంగా కుంచె రఘు గారు మాట్లాడుతూ.. 'తెలుగు ఇండస్ట్రీ లో నాలాంటి కళాకారులు ఎందరో ఆసక్తిగా ఎదురు చూసే ఈవెంట్ గామా అవార్డ్స్. గామాతో మాకు చాలా మంచి అనుబంధం ఉంది. మా కళా కారుల అందరిని మంచి వసతులు ఇచ్చి చాలా బాగా చూసుకుంటామని చెప్పారు. కాగా.. ఈ వేడుకలో యాంకర్, సింగర్ తిరు, శరణ్య తమ చక్కటి ప్రదర్శనలతో వచ్చిన అతిధులను ఆకట్టుకున్నారు. సంగీత ప్రదర్శనలతో పాటు, ప్రత్యేకమైన వినోద కార్యక్రమాలతో ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. -
'బాహుబలి' గురించి ప్రభాస్ చెప్పిన సీక్రెట్స్ !
దుబాయి: ప్రతిష్టాత్మక గామా టాలీవుడ్ మ్యూజిక్ అవార్డ్స్ వేడుక శుక్రవారం దుబాయిలో అట్టహాసంగా జరిగింది. వరుసగా మూడో ఏడాది నిర్వహిస్తున్న ఈ వార్షిక పురస్కారాల ప్రధానోత్సవంలో ఈసారి 'బాహుబలి' ప్రభాస్ హల్చల్ చేశాడు. గల్ఫ్ ఆంధ్ర ఈవెంట్స్ ఆధ్వర్యంలో దుబాయి జబీల్ పార్క్ లో జరిగిన ఈ వేడుకలో 'బాహుబలి' చిత్రం 'బెస్ట్ మూవీ ఆఫ్ ది ఇయర్' అవార్డ్ అందుకుంది. హీరో ప్రభాస్, రాణా, తమన్నా, నిర్మాతలు శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ స్వయంగా విచ్చేసి స్థానిక షేక్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. రెబల్ స్టార్ కృష్ణం రాజుకు జీవితసాఫల్య పురస్కారం ప్రదానం చేశారు. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ప్రభాస్ చెప్పిన సీక్రెట్! అవార్డు అందుకున్న సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ 'మొదటగా ఈ చిత్రం గురించి, రాజమౌళి గురించి మాట్లాడాలంటే.. 15 రోజులు మాట్లాడాలి, అంత టైం లేదు కాబట్టి, నేను ఎప్పట్నుంచో చెప్దామనుకుంటున్న విషయం దుబాయి తెలుగు వారి ముందు చెప్తున్నాను. మొట్టమొదట బాహుబలి కథ విని అందరం రాజమౌళితో కూచుని, బాహుబలి ఒకటే పార్ట్ అనుకున్నాం. కథ మొత్తం నెరేషన్ అయి పేపర్ మీదకి లెక్కలేసినాక ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇది కమర్షియల్ గా వర్క్ అవుట్ అవదని రాజమౌళే నిర్మాతలకు చెప్పేశాడు. ప్రభాస్ తో బాక్సింగ్ నేపథ్యంతో ఓ సినిమా చేద్దామని చెప్పాడు. నిర్మాతలు ప్రభాస్ సంగతేంటి అని అడిగితే.. అతను నా బెస్ట్ ఫ్రెండ్ నేను చూసుకుంటానులే అని రాజమౌళి చెప్పాడు. కానీ సినిమా అంటే ఎంతో ప్యాషన్ ఉన్న శోభు యార్లగడ్డ - దేవినేని ప్రసాద్ మాత్రం 'ఎంత ఖర్చైనా ఫరవాలేదు మేము సప్పోర్ట్ చేస్తాం. స్టాటిస్టిక్స్ చూసుకోవద్దు. రాజమౌళి గారు మీరు ముందుకువెళ్లండి. మేమున్నాం' అంటూ ఈ సినిమాకు ప్రాణం పోశారు. ఇంత రిస్క్ తీసుకున్నందుకు శోభు, దేవినేని ప్రసాద్‌లను ఎంతైనా అభినందించాలి. నేను ఎప్పట్నుంచో ఈ విషయం చెప్దామనుకున్నా. కానీ అవకాశం రాలేదు. వచ్చినా నేను ఎక్కువ మాట్లాడను. అయాం సో థాంక్ ఫుల్.. టు దిస్ ప్రొడ్యూసర్స్' అని అన్నారు లైఫ్ టైం అఛీవ్ మెంట్ అవార్డు అందుకున్న కృష్ణంరాజు మాట్లాడుతూ.. 'మా రోజుల్లో నిర్మాతలకిచ్చే గౌరవం వేరు. నిర్మాత బతికితేనే సినిమాలో 24 క్రాఫ్ట్స్ కి పని దొరుకుతుంది. అటువంటి నిర్మాత ఇప్పుడెక్కడున్నాడు. ఇప్పుడు నిర్మాత పరిస్థితి ఏమిటి అనుకుంటున్న తరుణం లో నిర్మాతలంటే మేము అంటూ ముందుకొచ్చారు శోభు, ప్రసాద్. వందేళ్ళ తెలుగు సినీ చరిత్రలో తొలిసారి హాలీవుడ్ కి ఏమాత్రం తగ్గకుండా.. అద్భుతంగా తెరకెక్కించిన చిత్రం బాహుబలి. ఈ చిత్రంతో హాలీవుడ్ కి దీటుగా తెలుగు సినిమా స్థాయిని పెంచాడు రాజమౌళి. ప్రభాస్ ఆమధ్య నాతో మాట్లాడుతూ.. పెద పాజి మీరు ఇండస్ట్రీకొచ్చి 50 ఏళ్ళైంది. నేను అతి త్వరలో ఈ 50 ఏళ్ళ పండగ అద్భుతం గా చేస్తా అన్నాడు. అలా అనుకోగానే ఇలా గామా అవార్డ్స్ లో లైఫ్ టైం అఛీవ్ మెంట్ అవార్డ్ ని ప్రకటించారు. నా 50 ఏళ్ళ నట జీవితానికి సెలబ్రేషన్స్ ఇలా దుబాయి లో మొదలవడం చాలా సంతోషంగా ఉంది' అని అన్నారు. దేవి శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ 'గామాఅవార్డ్ ని మా నాన్న తో పాటు అనూప్ గారి తల్లికి అంకితమిస్తున్నాను. ఎందుకంటే వారం వ్యవధిలోనే మా ఇద్దరి ప్రధాన బలమైన మానాన్న, అనూప్ వాళ్ళ అమ్మ వెళ్ళిపోవడం అన్న బాధ ఎవరూ తీర్చలేనిది. ఇద్దరం ఒకే విధమైన విచారంలో ఉన్నాం. అందుకని వాళ్ళిద్దరికీ అంకితమిస్తున్నాను' అని తెలిపారు. 'సూపర్ మచ్చి' పాటని సూపర్ గామా అంటూ పాట పాడి ఆడియన్స్ ను అలరించాడు దేవిశ్రీ ప్రసాద్. మంచు లక్ష్మి బెస్ట్ సెలబ్రిటీ సింగర్ అవార్డ్ తీసుకుంటుంటే కృష్ణం రాజు గారితో విజిల్స్ వేయించి సందడి చేసాడు దేవిశ్రీ గామా అవార్డ్ 2015 విజేతలు వీళ్ళే : క్యాటగిరీ ఆఫ్ అవార్డ్స్ : గామా బెస్ట్ మూవీ ఆఫ్ ద యియర్ - బాహుబలి గామా లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డ్ - రెబల్ స్టార్ కృష్ణం రాజు బెస్ట్ ఫిమేల్ సింగర్ : రమ్య బెహరా - ధీవర - బాహుబలి బెస్ట్ సెలబ్రిటీ సింగర్ - లక్ష్మి మంచు - ఏందిరో ఈ మగాళ్ల గొప్ప - దొంగాట బెస్ట్ టైటిల్ సాంగ్ : రామజోగయ్య శాస్త్రి - శ్రీమంతుడు బెస్ట్ లిరిసిస్ట్ : సిరివెన్నెల సీతారామ శాస్త్రి - కంచె - విద్వేషం బెస్ట్ లవ్ సాంగ్ - ఎస్ ఎస్ తమన్ & జోనిత గాంధి - కిక్ 2 - నువ్వే నువ్వే బెస్ట్ డ్యూయెట్ సాంగ్ - కార్తిక్ - దామిని - పచ్చబొట్టేసిన - బాహుబలి బెస్ట్ అప్ కమింగ్ సింగర్ - స్ఫూర్తి - కిక్ 2 - కిక్ బెస్ట్ కమర్షియల్ సాంగ్ - దేవిశ్రీ ప్రసాద్ & శ్రావణ భార్గవి- సూపర్ మచ్చి - S/o సత్యమూర్తి బెస్ట్ పోయెటిక్ వాల్యూ సాంగ్ - శ్రీమణి - బెంగాల్ టైగర్ - చూపులతో బెస్ట్ మ్యూజికల్ సాంగ్ - గోపి సుందర్ & రేణుక అరుణ్ - ఎందరో మహానుభావులు - భలే భలే మొగాడివోయ్ బెస్ట్ అప్ కమింగ్ లిరిసిస్ట్ - రామాంజనేయులు - కుమారి 21F - లవ్ చేయాలా వద్దా బెస్ట్ అప్ కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్ - బీంస్ శశిరోలియో - బెంగాల్ టైగర్ బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ సాంగ్ - అనూప్ రుబెన్స్ - గోపాల గోపాల స్పెషల్ జ్యూరీ అవార్డ్ - చంద్రబోస్ - సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ - తెలుగంటే బెస్ట్ అప్ కమింగ్ సింగర్ మేల్ - యాజీన్ నిజార్ - శ్రీమంతుడు - చారు శీల & S/0 సత్యమూర్తి - సీతాకాలం