breaking news
G Janardhana Reddy
-
బల్దియాకు బహుమానం
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల కోసం బాండ్ల జారీ ద్వారా రూ.200 కోట్లు సేకరించినందుకు ప్రోత్సాహకంగా రూ.26 కోట్ల చెక్కును ప్రధాని మోదీ.. మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డికి అందజేశారు. లక్నోలో శనివారం 2 రోజుల ‘ట్రాన్స్ఫార్మింగ్ అర్బన్ ల్యాండ్ స్కేపింగ్’ సదస్సు ముగింపు సందర్భంగా అమృత్ పథకం కింద ఈ బహుమతిని, ప్రత్యేక ప్రశంసాపత్రాన్ని అందజేశారు. మేయర్, కమిషనర్.. ప్రధానికి స్వచ్ఛ నమ స్కారం అంటూ గౌరవిస్తూ ప్రత్యేకత చూపారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మం త్రులు రాజ్‌నాథ్ సింగ్, హరిదీప్‌సింగ్, గవర్నర్ రాంలాల్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ‘సింగం చెరువు’ లబ్ధిదారుతో ప్రధాని భేటీ హైదరాబాద్‌లోని సింగం చెరువు తండా డబుల్ బెడ్రూం ఇళ్ల కాలనీలో ఇల్లు పొందిన గిరిజన మహిళ జ్యోతితో ప్రధాని సమావేశమయ్యారు. కూలి చేసుకునే తమకు రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇంటిని నిర్మించి ఉచితంగా ఇచ్చిందని తెలిపింది. గుడిసెలో ఉన్నప్పుడు ఎండ, వానలకు ఇబ్బందులను ఎదుర్కొనేవారమని.. ఇప్పుడు తమ కుటుంబం సంతోషంగా ఉందని చెప్పింది. సూచన పాటించారు.. బహుమతి పొందారు స్థానిక సంస్థలు.. ముఖ్యంగా మునిసిపల్ కార్పొరేషన్లు స్వయం సమృద్ధికి బాండ్ల జారీ ద్వారా నిధు లు సమీకరించుకోవాలని, దీనికి తెలంగాణ ప్రభు త్వం చొరవ చూపాలని మెట్రోరైలు ప్రారంభోత్స వానికి నగరానికి వచ్చిన ప్రధాని.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు సూచించారు. దీంతో మంత్రి బాండ్ల ద్వారా నిధులు సేకరించాలని జీహెచ్ఎంసీ ని ఆదేశించారు. నగరంలో చేపట్టనున్న ఎస్సార్డీపీ, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం వెయ్యి కోట్లు సేకరించాలనే లక్ష్యంతో కృషి చేసి సఫలమయ్యారు. పుణే తర్వాత జీహెచ్ఎంసీ మాత్రమే బాండ్ల ద్వారా నిధులు సేకరించాయి. జీహెచ్ఎంసీలోని ఆర్థిక క్రమశిక్షణ, ఆస్తులు, వనరులు తదితరమైన వాటిని పరిగణనలోకి తీసుకున్న పలు సంస్థలు వెయ్యి కోట్లకు పైగా నిధులిచ్చేందుకు ముంబై స్టాక్ ఎక్సే్ఛంజ్‌లో పోటీలు పడ్డాయి. తొలిదశలో ఎస్సార్డీపీ పనులకు రూ.200 కోట్లు సేకరించారు. సొంతంగా నిధులు సేకరించే స్థానిక సంస్థలకు ప్రోత్సాహకంగా బాండ్ల ద్వారా తీసుకున్న మొత్తానికి వడ్డీని కేంద్రమే అందజేయాలని కేటీఆర్ కోరారు. ఈ మేరకు సీఎస్ ఎస్కే జోషి కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించారు. సుముఖత వ్యక్తం చేసిన కేంద్రం జీహెచ్ఎంసీని ఇందుకు ఎంపిక చేసింది. ప్రజోపయోగానికి రూ. 26 కోట్లు... జీహెచ్ఎంసీ బాండ్ల రూపంలో నిధులను సేకరించినందున కేంద్రం ప్రోత్సాహకంగా అందజేసిన రూ.26 కోట్లను వినూత్న కార్యక్రమాలకు ఉపయోగించాలని కేటీఆర్ సూచించారు. దీంతో ప్రత్యేక ప్రజోపయోగ కార్యక్రమానికి ఈ నిధులు వినియోగించాలని, దీనికి ప్రజాభిప్రాయాన్నీ సేకరించనున్నట్లు కమిషనర్ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. -
డ్రైవర్ సూసైడ్.. 'గాలి'పై బ్లాక్‌మనీ ఆరోపణలు
కర్ణాటక ప్రభుత్వ అధికారికి చెందిన ఓ డ్రైవర్ బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఆత్మహత్యకు సంబంధించి వెలుగుచూసిన లేఖలో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డిపై డ్రైవర్ సంచలన ఆరోపణలు చేసినట్టు వార్తాసంస్త ఏఎన్ఐ ట్విట్టర్లో తెలిపింది. గాలి జనార్దన్ రెడ్డి రూ. 100 కోట్ల నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకున్నారని, ఇందుకోసం తన యాజమాని అయిన ప్రభుత్వ అధికారి 20శాతం కమిషన్ తీసుకున్నారని డ్రైవర్ రమేశ్ గౌడ తెలిపారు. ఈ విషయం తనకు తెలియడంతో మానసికంగా వేధిస్తున్నారని డ్రైవర్ తన సూసైడ్ లేఖలో పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
’ఆ పెళ్లికి డుమ్మా కొడితేనే మంచిది’
బెంగళూరు: దేశమంతా డబ్బు సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నా అంబరాన్నంటే సంబురంతో గాలి జనార్దన్ రెడ్డి జరిపిస్తున్న తన కుమార్తె వివాహానికి కొంతమంది బీజేపీ నేతలు డుమ్మాకొడుతున్నట్లు తెలిసింది. బీజేపీలో మాజీ మంత్రిగా పని చేసిన జనార్దన్ రెడ్డి తన కుమార్తె వివాహానికి హాజరుకావాల్సిందిగా ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులను, రాజకీయ పెద్దలకు ఆహ్వానాలు పంపించారు. అయితే, ఈ వివాహ కార్యక్రమానికి వెళ్లకుండా దూరంగా ఉండాలని బీజేపీ అగ్రనాయకత్వం తమ పార్టీకి చెందిన కొందరు నేతలకు అంతర్గతంగా సూచనలు చేసినట్లు సమాచారం. అయితే, అధికారికంగా ఈ సూచనలు చేయనప్పటికీ ఆ వివాహానికి వెళ్లకుండా దూరంగా ఉంటేనే మంచిదని చెప్పినట్లు తెలిసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అనుకూలంగా లేనందున గైర్హాజరు అయితే బాగుంటుందని చెప్పారట. కాగా, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప, బీ శ్రీరాములు ఈ వివాహానికి హాజరవుతున్నట్లు సమాచారం. కొంతమంది కేంద్రమంత్రులు గైర్హాజరయ్యే అవకాశం ఉంది.