breaking news
Furniture Design
-
బంజారాహిల్స్‌లో ఫర్నెస్ట్రీ..
సాక్షి, సిటీబ్యూరో: ఢిల్లీకి చెందిన అత్యాధునిక ప్రీమియం ఫర్నిచర్ బ్రాండ్ ‘ఫర్నెస్ట్రీ’ హైదరాబాద్‌లో అడుగుపెట్టింది. బంజారాహిల్స్‌లో 5 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో తొలి ఎక్స్పీరియన్స్ స్టూడియోను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫర్నెస్ట్రీ ఫౌండర్ మాన్సీ అలెన్ మాట్లాడుతూ.. కస్టమర్లు కోరుకున్న విధంగా ప్రీమియం ఫర్నీచర్, వాల్ ఆర్ట్ వంటి గృహాలంకరణలను తయారు చేసి ఇస్తామని తెలిపారు.కస్టమర్లకు డిజైన్ కాన్సెప్్టలను విజువలైజ్ చేయడానికి ప్రత్యేకమైన కాంప్లిమెంటరీ మూడ్ బోర్డ్లను ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ స్టూడియోలో ఆధునిక, సంప్రదాయ హస్తకళను మిళితం చేస్తూ డైనింగ్ టేబుల్స్, స్థానిక కళాకారుల వాల్ ఆర్ట్, స్కాండినేవియన్ డిజైన్‌తో జపనీస్ సౌందర్యాన్ని మిళితం చేసే జపాండీ ఫ్యూజన్ ఫర్నిచర్ వంటివెన్నో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.ఇవి చదవండి: సిబ్లింగ్ రైటర్స్..! రచయితలుగా రాణిస్తున్న అక్కా, తమ్ముళ్లు.. -
Ridhi Khosla Jalan: మన జీవితానికి మనమే డిజైనర్లం..
సొంతంగా ఇంటి అలంకరణ లో ఎదుర్కొన్న ఇబ్బందులు పిల్లల కోసం కొత్తగా ఏదైనా సృష్టించాలనే ఆలోచన రిధి ఖోస్లా జలాన్ని ఈ రోజు ఉన్నతంగా నిలబెట్టింది. హోమ్ డెకార్‌లో డిజైన్ ఇన్ఫ్లుయెన్సర్గా పేరొందిన రిధి పిల్లల కోసం లిటిల్ నెస్ట్ పేరుతో ఏర్పాటు చేసిన డిజైన్ స్టోర్‌తో మార్కెట్లో ఆమెను వ్యాపారవేత్తగా మార్చింది. ముంబై నుంచి ఇటీవల హైదరాబాద్‌లోని ఫిక్కీ వైఎఫ్‌ఎల్‌ఓ ఏర్పాటు చేసిన సెషన్లో పాల్గొన్న ఈ యంగ్ ఎంట్రప్రెన్యూర్ తన జీవితాన్ని ఎలా డిజైన్ చేసుకుందో వివరించింది. ‘మనలో ఉన్న అభిరుచి ఏంటో తెలుసుకుని, దానిని అమలులో పెడితే విజయం మన వెన్నంటే ఉంటుంది’ అంటుందామె. స్ఫూర్తివంతమైన ఆమె మాటలు... సాధారణ గృహిణిగా ఉన్న రిధి తన జీవితాన్ని ఈ రోజు ఉన్నత స్థితికి చేరుకోవడానికి ఎలాంటి మలుపులు తిప్పిందో వివరించింది. ఇంటీరియర్ డిజైనర్ నుండి కిడ్స్ ఫర్నీచర్ స్టోర్ యజమాని వరకు రిధి పేరొందింది. ‘‘ఫైనాన్స్, మార్కెటింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేశాక పెళ్లవడంతో ముంబై వెళ్లిపోయాను. మొదటి బిడ్డ పుట్టాక నాలో తన కోసం ప్రత్యేకమైన డిజైనింగ్ రూమ్ ఉంటే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. అంతేకాదు పిల్లల బట్టలు, వారికి కావల్సిన వస్తువుల విషయంలోనూ ఆలోచన పెరిగింది. అప్పుడే ఇంటీరియర్ డిజైన్‌కు సంబంధించిన కోర్సు చేయాలనుకున్నా. రెండవసారి ప్రెగ్నెంట్ అయిన టైమ్‌లోనే ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సులో చేరాను. అలా ఆ అభిరుచే వృత్తిగా మారింది. నా లైఫ్‌లో ఇదొక స్పెషల్ జర్నీ అని చెప్పవచ్చు. పిల్లల గదులను డిజైన్ చేయడం అనే నా హాబీ నన్ను చాలామందికి చేరువ చేసింది. మొదట ఈ రంగంలో పెరుగుతున్న డిమాండ్‌ను గుర్తించాను. ఫర్నీచర్, డెకార్ వస్తువుల కోసం ఎక్కడ షాపింగ్ చేయాలనే దానిపై స్నేహితులు తరచూ సలహాలు అడుగుతుండేవారు. వ్యక్తిగతంగానూ, నా స్నేహితులు పడుతున్న కష్టాన్ని గమనించినప్పుడు నా డిజైనింగ్‌లో ఎలాంటి మార్పులు ఉంటే బాగుంటుందో స్వయంగా తెలుసుకున్నాను. స్నేహితులకు సూచనలు ఇచ్చే క్రమంలో నాకూ చాలా విషయాల పట్ల అవగాహన పెరిగింది. కిడ్స్ డెకార్ బ్రాండ్‌ను ప్రారంభించడానికి ముందు మార్కెట్ పోకడలను గమనించాను. అప్పుడు ‘లిటిల్ నెస్ట్’ పేరుతో స్టోర్ ప్రారంభించాను. ఈ క్రియేటివ్ డిజైన్ నన్ను చాలా మందికి చేరువ చేసింది. ముందు కుటుంబమే నాకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని, చేస్తున్న వర్క్ప్రోగ్రెస్ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తుంటాను. ఒక ప్రశ్న– సమాధానంతో సోషల్ మీడియా వీడియోను ప్రారంభించాను. ఏడాది లోపు ఐదు లక్షలకు పైగా ఫాలోవర్లకు చేరువయ్యాను. ప్రజలు కోరుకునే సమాచారాన్ని అందించడంపై పెట్టే దృష్టి నన్ను ఇంతమందికి చేరువ చేసింది. అయితే, ఇల్లే నా మొదటి ప్రాధాన్యత. ఇంటిని మేనేజ్ చేయగలగితే చాలు, బయట అన్ని పనులను సులువుగా చక్కబెట్టవచ్చు. ఇందుకు నా పిల్లల సాయం కూడా ఉంటుంది. నా బిజీ వర్క్, ప్లానింగ్ చూస్తూ పెరుగుతున్న నా పిల్లలు కూడా వారి పనులు వారు చేసుకుంటారు. నా వర్క్ వల్ల సోషల్‌గా అందరితోనూ అంతగా కలిసే సమయం ఉండదు. మొదట్లో అన్నీ బ్యాలెన్స్ చేయగలిగాను. కానీ, డెకార్ వర్క్, కంటెంట్ క్రియేటివ్‌కు ఎక్కువ టైమ్ పడుతుంది. ఇదొక డైనమిక్ జర్నీ అవడంతో నా ముందున్న మార్పులను కూడా ఉత్సాహంగా చేసుకుంటూ వెళుతున్నాను. గ్లోబల్ డిజైన్ మ్యాప్‌లో మన దేశం నుంచి నేను ఉండాలన్నది నా కల. ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎంతోమందికి చేరవయ్యాను. ఆఫ్‌లైన్‌లో వ్యక్తిగతంగా చాలా మందికి రీచ్ కావాలని కోరుకుంటున్నాను. రెండు వారాలకు ఒకసారి.. ఎంత పని ఉన్నా రెండు వారాలకు ఒకరోజు పూర్తి విశ్రాంతి తీసుకుంటాను. నా కోసం నేను అన్నట్టుగా ఉంటాను. ఆ రోజులో ఎక్కువ సమయం బుక్స్ చదవడానికి సమయాన్ని కేటాయిస్తాను. రోజువారీ పనితో ఏ మాత్రం సంబంధం లేని పనులను చేస్తాను. దీంతో మరింత ఉత్సాహంగా మారిపోతాను’’ అని తన విజయానికి వేసుకున్న బాటలను ఇలా మన ముందు ఉంచారు రిధి. అప్డేట్గా ఉంటాను.. ఇంటీరియర్ డిజైన్ స్టూడియో మెయింటెయిన్ చేయాలంటే ఎప్పుడూ అప్డేట్గా ఉండాలి. ప్రతిరోజూ నాలుగు పేజీల షెడ్యూల్‌ని వేసుకుంటాను. ఇల్లు, వర్క్‌స్పేస్, అప్డేట్స్, నా వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేవి ప్రోత్సాహాన్ని కలిగించే కోట్స్ నోట్ చేసుకుంటాను. దీని వల్ల ప్రతిదీ ఏ రోజు కా రోజు ప్లానింగ్‌గా జరిగిపోతుంటుంది. భవిష్యత్తు గురించి అంటే మరో ఐదేళ్లలో నా ప్రాజెక్ట్స్ గ్లోబల్ లెవల్‌కి వెళ్లాలి. ప్రపంచంలోని అత్యుత్తమ డిజైన్ ఇన్ ఫ్లుయెన్సర్లలో ఒకరిగా ఉండాలన్నదే నా లక్ష్యం. – నిర్మలారెడ్డి -
వాయనం: ఫర్నిచర్ కొంటున్నారా?
ఒంటికి వాడే వి కొనేటప్పుడు మన ఇష్టానికే ప్రాధాన్యం ఇస్తాం కానీ ఇంటికి సంబంధించినవి కొనేటప్పుడు మాత్రం ఇష్టాయిష్టాలతో పాటు మరికొన్ని విషయాలు కూడా గుర్తు పెట్టుకోవాలి. ముఖ్యంగా ఫర్నిచర్ విషయంలో! సొంత ఇల్లు అయితే ఫర్వాలేదు... ఫర్నిచర్‌ని కదల్చాల్సిన పని ఉండదు. కానీ అద్దె ఇల్లు అయితే మారినప్పుడు కష్టమవుతుంది. అందుకే అద్దె ఇళ్లలో ఉండేవారయితే కాస్త తేలికపాటివి కొనుక్కోవడమే మంచిది. కలపవి కొనేట్లయితే అది ఎలాంటి కలప, ఎంతవరకు మన్నుతుంది వంటివి తెలుసుకోవాలి. ఇనుము తదితర లోహాలతో చేసినవి అయితే... అది ఏ లోహం, తుప్పు పడుతుందా వంటివి చూసుకోవాలి. కాలం గడిచేకొద్దీ వాటిలో ఎలాంటి మార్పులు రావచ్చో తెలుసుకోవడం మంచిది. ఫర్నిచర్ మెటీరియల్‌ని బట్టి... వాటిని శుభ్రం చేసే విధానాన్ని అడగడం మర్చిపోకూడదు. ఏ వస్తువు కొన్నా, ఒక్కచోట చూసి కొనేయకుండా, నాలుగైదు చోట్ల రేట్లు వాకబు చేసి కొనుక్కోవడం లాభకరం! ఫర్నిచర్‌ని ఆన్లైన్లో కొనకపోవడం మంచిది. ఎందుకంటే... పొరపాటున ఏదైనా తేడా ఉంటే దాన్ని తిప్పి పంపడం, మళ్లీ మరో సెట్ వచ్చేవరకూ ఎదురు చూడటం... వీటన్నిటికీ బోలెడంత టైమ్ వేస్టవుతుంది. అదేదో షాపుకెళ్లి మనకి నచ్చింది సెలెక్ట్ చేసుకుంటే ఒక్కసారికి పనైపోతుంది. మొక్కజొన్న... ఒలవండిలా! ప్రపంచమే మెచ్చిన పౌష్టికాహారం... మొక్కజొన్న. దీనిలో ఉండే ఫైబర్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. కొలెస్ట్రాల్ పెరగకుండా చేస్తుంది. మధుమేహం, గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. ఇన్ని ఉపయోగాలున్నాయి కాబట్టే మొక్కజొన్నని వీలైనంత ఎక్కువగా తినమని వైద్యులు చెబుతుంటారు. తినడం మనకూ ఇష్టమే. కానీ దాన్ని ఒలుచుకోవడమే పెద్ద పని. ఈ మధ్య ఒలిచిన గింజలు కూడా దొరుకుతున్నాయి గానీ ప్రతిసారీ అవి అందుబాటులో ఉండాలి కదా! అందుకే ‘కార్న్ స్ట్రిప్పర్’ని కొనుక్కోవడం బెటర్. కంప్యూటర్ మౌస్లా ఉండే ఈ చిన్ని యంత్రం... మొక్కజొన్న గింజల్ని ఇదిగో, ఇంత తేలిగ్గా ఒలిచి పెట్టేస్తుంది మనకి. అసలు ధర 500 రూపాయలు. ఆన్లైన్లో అయితే రెండు మూడొంద ల్లో కూడా వచ్చేస్తోంది! ప్లాస్టిక్ సీసాతో ఫ్లవర్‌వాజ్! ఇంటిని అందంగా అలంకరించుకోవాలని అందరికీ ఉంటుంది. కానీ ఫ్లవర్‌వాజులు, ప్లాస్టిక్ పూలు, వాల్ హ్యాంగింగ్స్ అంటూ ఖర్చు పెట్టడం కాస్త తలకు మించిన భారమే. అలాంటప్పుడు ఇంట్లో ఉండే పనికిరాని వస్తువులతో అలంకరణ సామగ్రిని తయారు చేసుకోవచ్చు కదా! అదేం పెద్ద కష్టం కూడా కాదు. కావాలంటే ప్లాస్టిక్ సీసాతో ఇలా ఫ్లవర్‌వాజ్ చేసి చూడండి... మీకే అర్థమైపోతుంది ఎంత ఈజీయో! ఖాళీ అయిపోయిన అర లీటరు కూల్‌డ్రింక్ బాటిల్‌ను శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. తరువాత దాన్ని మధ్యకు కట్ చేయాలి. అడుగున కొంతమేర వదిలేసి, మిగిలిన భాగాన్ని పొడవుగా కత్తిరించుకోవాలి (ఫొటో చూడండి). ఇప్పుడు బాటిల్‌ని తిరగేసి, నేలమీద పెట్టి గట్టిగా నొక్కితే, కత్తిరించిన ముక్కలన్నీ వెనక్కి వంగి పువ్వులా అవుతాయి. ఆపైన ఒక్కో ముక్కనీ ఫొటోలో చూపినట్టుగా క్రాస్‌గా సగానికి మడవాలి. అంతే... అందమైన ఫ్లవర్‌వాజ్ రెడీ. ఇందులో మీకు నచ్చిన పూలను అమర్చి టేబుల్ మీద పెడితే సూపర్‌గా ఉంటుంది!