breaking news
Funiture Destroyed
-
హైదరాబాద్ బాచుపల్లి లో భారీ అగ్నిప్రమాదం
-
బెంగళూరులో రెండోరోజూ కొనసాగిన ఆందోళన
బెంగళూరు: ఆరేళ్ల బాలికపై ఇద్దరు పాఠశాల సిబ్బంది అత్యాచారానికి పాల్పడిన ఘటనపై వరుసగా రెండో రోజు ఆందోళనలు కొనసాగాయి. పసిబాలికపై ఘోరానికి పాల్పడిన కామాంధులను కఠినంగా శక్షించాలని డిమాండ్ చేస్తూ బాధితురాలి తరపువారు, ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఆగ్రహంతో పాఠశాలపై దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. తూర్పు బెంగళూరులోని ఓ టాప్ ఇంటర్నేషనల్ స్కూల్ లో సోమవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. నిందితులపై ఇప్పటివరకు చర్య తీసుకోకుండా, జరిగిన నేరాన్ని దాచిపెట్టేందుకు పాఠశాల యాజమాన్యం ప్రయత్నిస్తోందని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాడతామని బాధితురాలి తండ్రి నీలేష్ స్పష్టం చేశారు. ఇంగ్లీషు వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి


