breaking news
Fundraising Scam
-
చిన్న సాయం చేయండి.. తేజ్దీప్ను కాపాడండి
సాక్షి, హైదరాబాద్: మూడేళ్ల చిన్నారి తేజ్ దీప్ ప్రమాద కరమైన కేనర్స్తో బాధపడుతూ ప్రాణాలు నిలుపుకోవడానికి పోరాడుతున్నాడు. వెంగళ వినయ్ కుమార్, సాహిత్యల కుమారుడు తేజ్ దీప్ అరుదైన యక్యూట్ లింపోబ్లాస్టిక్ లుకేమియాతో బాధ పడుతున్నాడు. హైదరాబాద్లోని కాంటినెంటల్ హాస్పటల్లో బాబుకు ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. బాబుకు చికిత్స అందించడానికి రూ. 15 లక్షలు ఖర్చు అవుతుంది. అంతా డబ్బు కట్టలేని ఆ కుటుంబం ఆదుకునే ఆపన్న హస్తాల కోసం ఆశగా ఎదురు చూస్తోంది. మీరు చేసే చిన్న సాయం బాబు ప్రాణాలను కాపాడగలదు. సాయం అందిచాలనుకునే వారు ఇండియా ఫండ్ రైసింగ్ సైట్ కిటో ద్వారా అయిన అందించవచ్చు. https://www.ketto.org/fundraiser/savethejdeep?cause=cancer&payment=form లేదా Name: Vengala vinay kumar(He is also a recruiter ) A/C No.:914010006683077 Bank Name: Axis Bank IFSC Code:UTIB0000008 లేదా Google Pay: 9440938053-VS Vinaii చెయ్యగలరు. -
ఆంధ్రజ్యోతి ఎండీని అరెస్టు చేయాలి
వరంగల్: ఏబీఎన్, ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని వీణావాణీల తల్లిదండ్రులు మారగాని మురళి, నాగలక్ష్మి సోమవారం డిమాండ్ చేశారు. తమ పిల్లల పేరుతో డబ్బులు వసూలు చేసి సొంత ఖాతాలో వేసుకున్నారని ఆరోపించారు. వసూలు చేసిన డబ్బులు తమకు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్న రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వరంగల్ జిల్లా నర్సింహులపేట మండలం బీరిశెట్టిగూడెంలో ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. వీరికి గ్రామస్తులు మద్దతు తెలిపారు. అనంతరం వారు రహదారిపై రాధాకృష్ణ దిష్టిబొమ్మను దహనం చేశారు. పోలీసులు వచ్చి బాధితులతో మాట్లాడి ఆందోళనను విరమింపజేశారు.