breaking news
Fundamental
-
Eid ul-Adha 2024: పరిపూర్ణ ఆరాధన హజ్జ్
ఇస్లామ్ ధర్మం ఐదు మౌలిక సూత్రాలపై ఆధారపడి ఉంది. ఇందులో ఏ ఒక్కదాన్ని విస్మరించినా విశ్వాసం పరిపూర్ణం కాదు. మొట్టమొదటిది సృష్టికర్త ఒక్కడే అన్న విశ్వాసం. రెండవది నమాజ్, మూడవది రోజా, నాల్గవది జకాత్, ఐదవది హజ్జ్. దైవ విశ్వాస ప్రకటనకు ఇవి ఆచరణాత్మక సాక్ష్యాలు. ఒక మనిషి విశ్వాసి/ ముస్లిమ్ అనడానికి రుజువులు. అన్ని ఆరాధనలకూ ‘హజ్జ్’ ఆత్మ వంటిది. ఆర్ధిక స్థోమత కలిగిన ప్రతి ముస్లింపై హజ్ విధిగా నిర్ణయించడం జరిగింది. అందుకని ఆర్థిక స్థోమత కలిగినవారు జీవిత కాలంలో కనీసం ఒక్కసారైనా కాబా సందర్శన యాత్ర చేయడం తప్పనిసరి. ఈ‘హజ్’ జిల్ హజ్ మాసం పదవ తేదీన అరేబియా దేశంలోని మక్కా నగరంలో జరుగుతుంది. ఆ రోజే ప్రపంచంలోని ముస్లింలంతా పండుగ జరుపుకుంటారు. అదే ‘ఈదుల్ అజ్ హా’. దీన్ని బక్రీద్ పండుగ అని, ఈదె ఖుర్బాన్ అని కూడా అంటారు. ‘హజ్జ్ ’ఒక విశ్వజనీన, విశ్వవ్యాపిత ఆరాధన. ఇందులో శ్రీమంతులు, నిరుపేదలు, తెల్లవారు, నల్లవారు, అరబ్బులు, అరబ్బేతరులు అన్న భేద భావం మచ్చుకు కూడా కనిపించదు. ‘మానవులంతా ఒక్కటే’ అన్న విశ్వమానవతా భావంతో అందరూ ముక్తకంఠంతో అల్లాహ్‌ను కీర్తిస్తూ, ఆయన ఘనతను, ఔన్నత్యాన్ని కొనియాడుతూ భక్తిపారవశ్యంతో తాదాత్మ్యం చెందడమే హజ్ యాత్రలోని పరమార్థం. మక్కా నగర ఆవిర్భావంమక్కానగర ఆవిర్భావం దాదాపు ఐదువేల సంవత్సరాలకు పూర్వం జరిగింది. కొండలూ కోనల నడుమ, ఎలాంటి వనరులూ లేకుండా నిర్మానుష్యంగా పడి ఉన్న ఎడారి ్రపాంతంలో మహనీయ హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం తన ధర్మపత్ని హజ్రత్ హాజిరా అలైహిస్సలాంను, తనయుడు ఇస్మాయీల్ అలైహిస్సలాంను వదిలేసి వెళ్ళిపోతారు. అప్పుడు, శ్రీమతి హాజిరా, ’అదేమిటీ.. నన్నూ, నాబిడ్డను ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతున్నారేమిటీ.?’అని ప్రశ్నించగా..,’ఇది దైవాజ్ఞ.’ అని మాత్రమే చెప్పి, అల్లాహ్‌పై అచంచల విశ్వాసంతో కనీసం వెనుదిరిగైనా చూడకుండా వెళ్ళిపోతారు హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం.కనీసం నాలుక తడుపుకోడానికి సైతం చుక్క నీరులేని ఆఎడారి ప్రదేశంలో చిన్నారి ఇబ్రాహీం దాహానికి తాళలేక గుక్కపట్టి ఏడుస్తున్న క్రమంలో ఆయన కాలి మడమలు రాసుకుపోయిన చోట అల్లాహ్ ఆజ్ఞతో అద్భుతమైన నీటి ఊట ఉబికింది. ‘జమ్ జమ్ ’అనే పేరుగల ఆ పవిత్ర జలంతో తల్లీ తనయులు తమ దాహం తీర్చుకున్నారు. ఆ నీరే ‘ఆబెజమ్ జమ్’ పేరుతో ప్రసిద్ధి గాంచింది. ఆనాడు కేవలం రెండు ్రపాణాలకోసం వెలసిన ఆ జలం ఈనాడు హజ్ యాత్ర నిమిత్తం మక్కావెళ్ళే లక్షలాదిమంది ప్రజలతోపాటు, స్థానికులకూ నిరంతరం సమృద్ధి్ధగా సరఫరా అవుతూ, యాత్రికులందరూ తమ తమ స్వస్థలాలకు తీసుకు వెళుతున్నా ఏమాత్రం కొరత రాకుండా తన మట్టాన్ని యథాతథంగా ఉంచుకోవడం అల్లాహ్ ప్రత్యక్ష మహిమకు నిదర్శనం. ఆ నాటి ఆ నిర్జీవ ఎడారి ్రపాంతమే ఈనాడు అత్యద్భుత సుందర మక్కానగరంగా రూపుదిద్దుకొని విశ్వవ్యాప్త ముస్లిం ప్రజానీకానికి పవిత్ర పుణ్యక్షేత్రంగా భాసిల్లుతోంది. తరువాత కొంతకాలానికి అల్లాహ్ ఆదేశం మేరకు హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం మక్కాకు తిరిగొచ్చి కుటుంబాన్ని కలుసుకొని, తనయుడు ఇస్మాయీల్ సహాయంతో ‘కాబా’ ను నిర్మించారు. చతుస్రాకారంలో ఉన్న ఆ రాతికట్టడాన్ని హజ్రత్ ఇబ్రాహీం, హజ్రత్ ఇస్మాయీల్ అలైహిముస్సలాంలు అల్లాహ్‌కు సమర్పించుకున్నారు. దీంతో కాబా దైవగృహంగా పేరు΄÷ందింది.అలౌకికానందంమక్కా చేరగానే ప్రతి హాజీ (యాత్రికుడు) కాబావైపు పరుగులు తీస్తాడు. పవిత్ర కాబాను చూడగానే భక్తులు ΄÷ందే ఆనంద పారవశ్యాలు వర్ణనాతీతం. ఒకానొక అలౌకిక ఆనందంతో, భక్తిపారవశ్యంతో కాబా చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణ చేస్తారు. దీన్ని’తవాఫ్’ అంటారు. ప్రతి తవాఫ్ లోనూ హాజీలు కాబాగోడలో అమరి ఉన్న ’హజ్రె అస్వద్ ’ (నల్లనిశిల) ను ముద్దాడడానికి ప్రయత్నిస్తారు. దైవ గృహమైన కాబాకు సమీపంలో క్రీ. శ. 570 లో ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జన్మించారు. కనుక భక్తులు ఆ జ్ఞాపకాలనూ నెమరు వేసుకుంటారు. ’జమ్ జమ్ ’బావిలోని పవిత్ర జలాన్ని తనివి తీరా సేవిస్తారు. తరువాత సఫా, మర్వా కొండల మధ్య ’సయీ’చేస్తారు. దీని తరువాత కొన్నిరోజులు ఎవరి నివాసాల్లో వారు దైవచింతన, నమాజులతో కాలం గడిపి, ’జిల్ హజ్ ’మాసం ఎనిమిదవ తేదీన ’మినా’ గ్రామం వెళ్ళి ఒక రోజంతా అక్కడ ఉంటారు. తొమ్మిదవ తేదీన ప్రపంచం నలుమూలలనుండీ వచ్చిన హాజీలంతా ‘అరఫాత్ ’మైదానంలో గుమిగూడి దైవకారుణ్యాన్ని అభిలషిస్తూ ్రపార్ధనలు చేస్తారు. ఈ సందర్భంలోనే ఆనాడు ముహమ్మద్ ప్రవక్త (స) అశేష భక్తజనాన్ని ఉద్దేశించి తమ అంతిమ సందేశం వినిపించారు. అందుకని భక్తులు ఆ మహనీయుడు నిలిచిన ప్రదేశాన్ని కూడా దర్శించి పులకించి పోతారు. సూర్యాస్తమయానికి తిరుగు ప్రయాణం ్రపారంభించి’ముజ్దలఫా’ దగ్గర రాత్రి మజిలీ చేస్తారు. అక్కడే మగ్రిబ్, ఇషా నమాజులు కలిపి సామూహికంగా చేస్తారు. మదీనాసాధారణంగా మక్కాను దర్శించుకున్న యాత్రికులు మదీనాను కూడా సందర్శిస్తారు. మదీనా మక్కాకు రెండువందల మైళ్ళ దూరంలో ఉంది. ముహమ్మద్ ప్రవక్త (స) మక్కా నుండి మదీనాకు వలసవెళ్ళి అంతిమ దినాలు అక్కడే గడిపారు. మస్జిదెనబవి సందర్శనకు, హజ్జ్ కు ఎలాంటి సంబంధం లేకపోయినా అది ఇస్లామీయ జగత్తుకు జీవనాడి లాంటిది. ప్రవక్త మసీదు సందర్శన సున్నత్. కనుక దూరతీరాలనుండి వచ్చిన భక్తులు మస్జిదె నబవిని కూడా సందర్శించి, నమాజులు చేసి తమ యాత్ర సఫలమైందని భావిస్తారు. ఈ విధంగా ఒకహాజీ అన్ని నియమాలను పాటిస్తూ, అల్లాహ్ ఏకత్వానికి ప్రతీకగా నిలిచిన పవిత్రకాబా గహాన్ని సందర్శిస్తాడు. యాత్రాక్రమంలో అతనికి అడుగడుగునా హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం, హజ్రత్ ఇస్మాయీల్ అలైహిస్సలాం గార్ల సహనశీలత, త్యాగనిరతి, పాపభీతి, వాగ్దానపాలన, దైవాదేశపాలన లాంటి అనేక సుగుణాలను ఒంటబట్టించుకుంటాడు. అంతేకాదు, ఇంకా మరెన్నో సుగుణాలను మానవుల్లో జనింపజేసి మానవ సమానత్వానికి, విశ్వమానవ సౌభ్రాతృత్వానికి పూలబాటలుపరిచి, వారి ఇహపర సాఫల్యానికి హామీగా నిలుస్తుంది హజ్జ్ . ఇదే కాబా గృహ సందర్శనాయాత్ర అసలు పరమార్థం. అల్లాహ్ మనందరికీ ఈ విషయాలను అర్థం చేసుకొని, ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుకుందాం. తఖ్వా ప్రధానందేవుని ఏకత్వానికి ప్రతీకగా నిలిచిన హజ్జ్‌ను సకల ఉపాసనా రీతులు ఇముడ్చుకున్న పరిపూర్ణ దైవారాధన అని కూడా చెప్పుకోవచ్చు. హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం తన కుమారుడు ఇస్మాయీల్ (అ)తో కలిసి నిర్మించిన కాబా గృహ సందర్శనలో ఉపాసనా, ఆరాధనా రీతులన్నీ పరిపూర్ణతను సంతరించు కున్నాయి. యాత్ర, నిరాడంబర సాధు వస్త్రధారణ, దైవ్రపార్థన, వ్రతనిష్ఠ, ఖుర్బానీ ఇవన్నీ సమన్వయం చెంది, ఒకేచోట కేంద్రీకృతమై, ఏకైక ప్రభువు సన్నిధిలో, హజ్ ఆరాధనలో ప్రదర్శితమవుతాయి. అందుకని కాబా గృహ సందర్శనార్ధం చేసే హజ్జ్ వల్ల ఉపాసనా రీతులన్నిటినీ ఆచరించి దైవానుగ్రహం ΄÷ందినట్లే అవుతుంది. ఈ కారణంగానే ముస్లిం స్త్రీ పురుషులందరూ జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా హజ్ చేయాలని అభిలషిస్తారు. ఆ మహాభాగ్యంకోసం ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. – యండి. ఉస్మాన్ ఖాన్ -
కొత్త ఇన్వెస్టర్లు తప్పక తెలుసుకోవాల్సినవి..
స్టాక్మార్కెట్లో కొత్తగా పెట్టుబడి పెట్టేవారు కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మార్కెట్లో నిర్ణయాలు తీసుకునే సమయంలో కొన్ని పదాలకు సరైన అర్థం తెలుసుకోకపోతే డబ్బు నష్టపోవాల్సి ఉంటుంది. కంపెనీలు తమ వ్యాపారాలు నిర్వహించాలంటే ఉబ్బు అవసరం అవుతుంది. ప్రమోటర్లు ఇన్వెస్ట్ చేసిన డబ్బు సంస్థ అవసరాలకు సరిపోదు. దాంతో సంస్థలో కొంత షేర్‌ను ఇన్వెస్టర్లకు ఇచ్చి దానివల్ల సమకూరే డబ్బుతో వ్యాపారం చేస్తాయి. కంపెనీలు సంపాదించే లాభంలో వారికి వాటా ఇస్తుంటాయి. ఈ క్రమంలో కొత్తగా మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినవారు, ఇకపై పెట్టుబడి పెట్టాలనుకునే వారు తెలుసుకోవాల్సిన కొన్ని అంశాల గురించి తెలుసుకుందాం.సెబీసెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) భారతీయ స్టాక్ మార్కెట్‌ను పర్యవేక్షిస్తోంది. కంపెనీలు, పెట్టుబడిదారులు, వ్యాపారులు, బ్రోకర్లు చేసే లావాదేవీలు, కార్యకలాపాలపై నిఘా వేయడానికి ఈ రెగ్యులేటర్‌ను ఏర్పాటు చేశారు.డీమ్యాట్ అకౌంట్డీమ్యాట్ లేదా డీమెటీరియలైజ్డ్ ఖాతా, ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో కస్టమర్ షేర్లు, ఇతర సెక్యూరిటీలను కలిగి ఉండే సాధనం. డీమ్యాట్ ఖాతా ద్వారా కంపెనీ షేర్లను కొనడం లేదా విక్రయించడం లాంటివి చేయొచ్చు. భారత్‌లో షేర్ మార్కెట్ లావాదేవీల కోసం డీమ్యాట్ ఖాతా తప్పనిసరిగా ఉండాలి.స్టాక్ స్ప్లిట్కంపెనీ షేరు ధర భారీగా పెరిగినా, ప్రైస్ టు ఎర్నింగ్ నిష్పత్తి ఎక్కువగా ఉన్నట్లు భావించినా ప్రస్తుత షేరును బహుళ షేర్లుగా విభజిస్తారు. ఉదాహరణకు ఒక కంపెనీ 1:2 స్టాక్ స్ప్లిట్‌ను ప్రకటిస్తే ప్రతి 1 షేరుకు పెట్టుబడిదారులు 2 అదనపు షేర్లు డీమ్యాట్‌లో చేరుతాయి.బుల్/బేర్ మార్కెట్బుల్ మార్కెట్లో కంపెనీల షేర్లను ఎక్కువ మంది కొనుగోలు చేస్తారు. దాంతో ఆ మార్కెట్లో షేర్ ధర పెరుగుతోంది. అయితే ఈ ట్రెండ్ చాలాకాలంపాటు కొనసాగుతుంటూ దాన్ని బుల్ మార్కెట్ అంటారు. ఇటీవల నెలకొన్న అంతర్జాతీయ అనిశ్చితులు, భౌగోళిక అస్థిరత వల్ల మార్కెట్లు కుప్పకూలాయి. ఆ ట్రెండ్ కొంతకాలంపాటు సాగింది. దాన్ని బేర్ మార్కెట్ అంటాం.స్టాక్ బ్రోకర్కంపెనీలను సంప్రదించి నేరుగా షేర్లను కొనుగోలు చేసే ప్రక్రియ లేదు. కాబట్టి దీని కోసం స్టాక్ బ్రోకర్ అనే వ్యవస్థ ఉంది. ఈ స్టాక్‌బ్రోకర్లు తమ క్లయింట్స్ కోసం షేర్లను కొనుగోలు చేయడం, అమ్మడం చేస్తారు. ఉదాహరణకు జెరోధా, అప్‌స్టాక్స్, ఫయ్యర్స్.. వంటివి స్టాక్‌బ్రోకర్లుగా ఉన్నాయి.డివిడెండ్కంపెనీ త్రైమాసిక ఫలితాలు విడుదల చేసినపుడు లాభానష్టాలు ప్రకటిస్తాయి. లాభాలు ఆర్జించినప్పుడు దానిలో కొంత భాగాన్ని షేర్ హోల్డర్స్‌కు పంచుతాయి. కంపెనీలు పెట్టుబడిదారులకు స్వల్ప మొత్తంలో డివిడెండ్‌ను పంపిణీ చేస్తాయి. ఇది దీర్ఘకాలిక వాటాదారులకు ప్రధాన ఆదాయ వనరుగా మారుతుంది. డివిడెంట్ చెల్లింపులు నగదుగా, స్టాక్స్ లేదా వివిధ రూపాల్లో జారీ చేయొచ్చు.ప్రైమరీ మార్కెట్/ఐపీఓఒక కంపెనీ మొదటిసారి షేర్లను జారీచేసి మూలధనం సమకూర్చాలంటే ఐపీఓ ద్వారా మార్కెట్లో లిస్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఈ షేర్ల జారీని ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) అంటారు. కంపెనీలకు ఇది ఒక ముఖ్యమైన దశ. ఐపీఓ ద్వారా ఒక సంస్థకు సంబంధించిన షేర్లను కొనుగోలు చేయొచ్చు. ఐపీఓ ద్వారా సేకరించిన నిధులు నేరుగా కంపెనీకి వెళ్తాయి. కంపెనీ పెరుగుదలకు, విస్తరణకు ఉపయోగపడతాయి. -
పాలమూరుః 10
తెలంగాణ రాష్ట్రంలో వాహనాల గుర్తింపునకు ఇక నుంచి ‘టీఎస్’ సీరిస్ రానుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్నాళ్లూ రవాణాశాఖ ఆంధ్రప్రదేశ్ స్టేట్ రీజినల్ ట్రాన్స్‌పోర్టు అథారిటీ(ఏపీఎస్ ఆర్టీఏ) పేర సేవలందించింది. ఇక కొత్త రాష్ట్రం ఆవిర్భావంతో ఈనెల 2 నుంచి తెలంగాణ స్టేట్ రీజినల్ ట్రాన్స్‌పోర్టు అథారిటీ(టీఎస్ ఆర్టీఏ)పేరిట సేవలు అందించనుంది. ఈ మేరకు మరో నాలుగురోజుల్లో జీఓ రానున్నట్లు సమాచారం. మహబూబ్‌నగర్ జిల్లాకు ‘టీఎస్ 10’ నెంబర్ కేటాయించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మహబూబ్‌నగర్ క్రైం: జిల్లా వాహన గుర్తింపు నెంబర్ ఇక మారనుంది. గతంలో మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన వాహనాలకు సంబంధించి ఏపీ 22వ సీరిస్ నెంబర్ ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడంతో జిల్లాకు ‘టీఎస్ 10’ నెంబర్ కేటాయించే అవకాశం ఉందని ఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో మోటర్‌సైకిల్ నుంచి లారీ వరకు అన్ని కలిపి 2.20లక్షల వాహనాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన జూన్ 2 నుంచి జిల్లావ్యాప్తంగా సుమారు రెండువేల వాహనాలు షోరూంల నుంచి ఆన్‌రోడ్డు పైకి వచ్చాయి. జూన్ నుంచి రూ.1.08 కోట్లు వివిధ పన్నులు, రిజిస్ట్రేషన్ ఫీజులు, త్రైమాసిక పన్నులు, ట్యాక్సీలు, అపరాధ రుసుములు వసూలయ్యాయి. జిల్లాలో విద్యాసంస్థలకు చెందిన 749 బస్సుల్లో ఇప్పటివరకు 350 వరకు ఫిట్నెస్ను పరీక్షించినట్లు ఆర్టీఓ కిష్టయ్య తెలిపారు. గత పాతవిధానంలోనే జిల్లాలకు టీఎస్ నెంబర్లు కేటాయిస్తారని, తెలంగాణ రాష్ట్రంలోని 10 జిల్లాలకు కూడా అక్షరక్రమం మాదిరే నెంబర్లు కేటాయించొచ్చని ఆయన పేర్కొన్నారు ఫిట్నెస్ మాటేంటి? విద్యాసంస్థలకు చెందిన బస్సులను ఆర్టీఎ అధికారులు ఫిట్నెస్ పరీక్షించడంలో చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.ఆర్టీఏ నిబంధనలు ఉల్లంఘించి విద్యాసంస్థల యాజమానులు ఫిట్నెస్ లేని బస్సులను నడిపిస్తూ విద్యార్థుల జీవితాలతో చెల గాటమాడుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగిన సమయంలోనే హడావిడి తనిఖీలు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 800వరకు వివిధ విద్యాసంస్థలకు చెందిన బస్సులు ఉన్నట్లు సమాచారం. ఇందులో 70శాతం బస్సులు మాత్రమే ఫిట్నెస్ కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. వాటిపట్ల అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. కొత్త రాష్ట్రంలోనైనా రోడ్డు భద్రతాచర్యలను పకడ్బందీగా చేపట్టాలని పలువురు కోరుతున్నారు. నిబంధనలు పాటించాలి విద్యాసంస్థలకు చెందిన వాహనాలకు ఫిట్నెస్ పరీక్ష చేయించాలి. వాహనాల రికార్డులను ‘ఆన్లైన్’తో పాటు రిజిస్టర్లో రాయాలని ఎంవీఐలను ఆదేశించాం. ఇప్పటివరకు 10 బస్సుల ఫిట్నెస్ పూర్తయింది. ఫిట్నెస్ చూపించకుండా.. నిబంధనలు పాటించని వాహనాలను నడిపితే కఠినచర్యలు తీసుకుంటాం. -కిష్టయ్య, ఆర్టీఓ