breaking news
French Toast
-
Recipe: ఫాస్ట్‌గా బ్రేక్‌ఫాస్ట్.. మసాలా ఫ్రెంచ్ టోస్ట్ ఇలా తయారు చేసుకోండి!
రోజూ ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ తప్పనిసరి. స్కూలు, కాలేజీ విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లే వాళ్లకైతే ఎంత త్వరగా లేచినా సమయం సరిపోకపోగా రోజూ ఇడ్లీ, దోశ, ఉప్మాలు విసుగు పుట్టించేస్తుంటాయి. ఇటువంటి వారు వెరైటీగా ఈ బ్రేక్‌ఫాస్ట్ ట్రై చేయొచ్చు.. మసాలా ఫ్రెంచ్ టోస్ట్ కావలసినవి: ►బ్రౌన్ బ్రెడ్ స్లైసులు – మూడు ►గుడ్లు – నాలుగు ►బటర్ – వేయించడానికి సరిపడా ►పాలు – రెండు టేబుల్ స్పూన్లు ►బరకగా దంచిన ఎండు మిర్చి పొడి – టేబుల్ స్పూను ►ఉప్పు – రుచికి సరిపడా ►కొత్తిమీర తరుగు – మూడు టేబుల్ స్పూన్లు ►మిరియాల పొడి – పావు టేబుల్ స్పూను ►ఉల్లిపాయ –ఒకటి(సన్నగా తరగాలి) ►పచ్చిమిర్చి –మూడు (సన్నగా తరగాలి) తయారీ: ►గుడ్ల సొనను గిన్నెలో వేసి చక్కగా బీట్ చేసుకోవాలి. ►దీనిలోనే పాలు, బరక మిరప పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి మరోసారి బీట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ►స్టవ్ మీద పాన్‌పెట్టి బటర్ వేయాలి. బటర్ వేడెక్కిన తరువాత బ్రెడ్ స్లైస్‌ను గుడ్ల సొనలో ముంచి పాన్‌పై పెట్టాలి. ►బ్రెడ్స్లైస్ ఒకవైపు కాలుతుండగానే.. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగును పైన వేయాలి. ►ఈ ముక్కలపైనే కొద్దిగా గుడ్లసొన మిశ్రమం వేయాలి. ►బ్రెడ్ స్లైస్‌ను రెండు వైపులా లైట్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు కాల్చి సర్వ్‌చేసుకోవాలి. ఇవి కూడా ట్రై చేయండి: Chicken Strips Recipe: మైదా, బ్రెడ్ ముక్కల పొడి.. చికెన్ స్ట్రిప్స్ ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి! Egg Poha Recipe: అటుకులు, కోడిగుడ్లు.. ఎగ్ పోహా తయారీ ఇలా! -
కొత్తకొత్తగా
ఓన్లీ 5 మినిట్స్! ఫాస్ట్ ఫుడ్స్‌ని మర్చిపోయి, హాయిగా హామిల్టన్ బీచ్ డ్యూయల్ బ్రేక్‌ఫాస్ట్ శాండ్విచ్ మేకర్ని ఉపయోగించి డెలిషియస్ శాండ్విచ్లు ఐదు నిమిషాలలో తయారుచేసుకోవచ్చు. ఈ మెషిన్ పనిచేసే విధానం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇందులో తయారైన శాండ్విచ్ కావలసిన విధంగా వస్తుంది. చీజ్ కూడా చక్కగా కరిగిపోతుంది. కోడి గుడ్డును పెట్టి ఐదు నిమిషాలు టైమ్ సెట్ చేస్తే, గుడ్డు రుచికరంగా, ఎక్కువతక్కువలు కాకుండా చక్కగా ఉడుకుతుంది. మీరు గుడ్డు కోసం ఏ మెస్కీ వెళ్లక్కర్లేదు. ఇంటి దగ్గరే పర్ఫెక్ట్ బ్రేక్‌ఫాస్ట్ తయారు చేసుకోవచ్చు. త్వరగా తయారు కావడమే కాకుండా, త్వరగానే చల్లారుతుంది. ఉపయోగించిన తరువాత ఈ మెషీన్‌ను అతి సులువుగా శుభ్రం చేసుకోవచ్చు. ఒకేసారి రెండు శాండ్విచ్లు తయారుచేసుకోవచ్చు. ధర: 33.14 డాలర్లు (రూ.2300) మీ అభిరుచి మేరకు... మీరు కాఫీ ప్రియులా. అయితే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. నింజా కంపెనీ కొత్త కాఫీ మేకర్ని లాంచ్ చేసింది. మీ రుచికి, అభిరుచికి అనుగుణంగా ఇది రూపొందింది. ఇందులో కస్టమ్, సిగ్నేచర్ అని రెండు రకాల కాఫీ మేకర్‌ను అమర్చారు. రుచిగా, మృదువుగా, కావలసిన ఫ్లేవర్‌లో తయారుచేసుకోవచ్చు. కోల్డ్ కాఫీ, హాట్ కాఫీ... రెండూ తయారుచేసుకోవచ్చు. ఇందులోనే ఫిల్టర్ శాశ్వతంగా అమర్చి ఉంది. ఒకేసారి పది కప్పుల కాఫీ తయారుచేసుకోవచ్చు. మనం ఏ మోతాదులో తాగాలనుకుంటున్నామో సెలక్ట్ చేసుకోవచ్చు. కప్, ఎక్సెల్కప్, ట్రావెల్, ఎక్సెల్ మల్టీమీడియా... ఇలా మన అభిరుచి మేరకు సెలక్షన్ కూడా ఉంటుంది. ధర: 179.80 డాలర్లు (రూ.12,300) పవర్ఫుల్ పదును! కూరలు తరుక్కోవడానికి, మాంసాహారాన్ని సమానంగా ముక్కలు చేయడానికి, ఫ్రెంచ్ టోస్ట్ చేయడానికి అనువుగా బ్రెడ్ కట్ చేయడానికి ఈ ఎలక్ట్రిక్ నైఫ్‌లు బాగా ఉపయోగపడతాయి. ఇందులో రెండు పెద్ద బ్లేడ్లు ఉండటం వల్ల మనం ఏది కట్ చేయాలన్నా సులువుగా చేసుకోవచ్చు. ఈ బ్లేడ్లు స్టెయిన్లెస్ స్టీల్‌తో తయారయ్యాయి. పదునుగా ఉంటాయి. పట్టుకోవడానికి అనుగుణంగా హ్యాండిల్ రూపొందింది. కుడి చేతి వాటమైనా ఎడమచేతి వాటమైనా ఇబ్బంది లేని విధంగా ఇవి రూపొందాయి. ఉపయోగించాక లాక్ చేసుకునే విధానం కూడా ఉంది. వాడిన తర్వాత టేబుల్లో పెట్టేయడానికి అనువుగా రూపొందించారు. కత్తిని ఉపయోగించని సమయంలో బటన్ నొక్కితే చాలు లాక్ అయిపోతుంది. కావాలనుకున్నప్పుడు మళ్లీ బటన్ నొక్కితే, తెరుచుకుంటుంది. వాడిన వెంటనే శుభ్రంగా కడిగి, ఆరబెట్టేసిన తర్వాతే లాక్ వేయాలి. మనం సాధారణంగా వాడే కత్తి కంటె ఇది రెండు రెట్లు అధిక పదును కలిగి ఉంది. ధర: 37.59 డాలర్లు (రూ.2600) -
పీచ్ ప్రెంచ్ టోస్ట్