breaking news
Freedom oil
-
ఐపీఓకి సిద్ధమవుతున్న ఫ్రీడమ్ ఆయిల్స్ మాతృ సంస్థ
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ప్రముఖ వంటనూనెల తయారీ సంస్థ ఫ్రీడమ్ ఆయిల్స్ మాతృ కంపెనీ ‘జెమిని ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ (జీఈఎఫ్ఎల్)’ పబ్లిక్ ఇష్యూకి (ఐపీవో) సిద్ధమవుతోంది. పరిశ్రమ దిగ్గజం ప్రదీప్ కుమార్ చౌదరి సారథ్యంలో వేగంగా విస్తరిస్తున్న ఈ సంస్థ ఐపీవోలో భాగంగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా 4.115 కోట్ల షేర్లను విక్రయించనుంది.విక్రయదారుల్లో బ్లాక్ రివర్ ఫుడ్ 2 (3.086 కోట్ల షేర్లు), ఇన్వెస్ట్మెంట్ అండ్ కమర్షియల్ ఎంటర్ప్రైజ్ (61.7 లక్షల షేర్లు), ప్రమోటర్ అల్కా చౌదరి, జీఏఐఈ (చెరో 20.6 లక్షల షేర్లు) ఉన్నారు.ఆర్థిక వృద్ధి.. తయారీ సామర్థ్యంవంటనూనెలు, స్పెషాలిటీ ఫ్యాట్స్ తయారీ, ట్రేడింగ్, మార్కెటింగ్‌లో పట్టు సాధించిన జీఈఎఫ్ఎల్ వినియోగ ఉత్పత్తుల సమగ్ర ప్లాట్‌ఫామ్‌గా ఎదిగేందుకు మసాలా దినుసులు, కన్వీనియెన్స్ ఫుడ్స్‌ను పోర్ట్‌ఫోలియోలోకి తెచ్చింది. డీఆర్‌హెచ్‌పీలోని సమాచారం ప్రకారం, 2020-2025 ఆర్థిక సంవత్సరాల మధ్య బ్రాండెడ్ ఆదాయం ఏటా 20.5% కాంపౌండ్ వృద్ధిని నమోదు చేసింది. 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.9,053.84 కోట్లుగా ఉన్న కంపెనీ మొత్తం ఆదాయం, 2026 ఆర్థిక సంవత్సరం నాటికి 16.83% వార్షిక వృద్ధితో రూ.12,650 కోట్లకు చేరుకుంది.ఉత్పత్తి కేంద్రాలు..ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ (రెండు ప్లాంట్లు), కృష్ణపట్నం (ఒక ప్లాంట్)ల్లో ఉన్న మూడింటి ఉమ్మడి రిఫైనింగ్ సామర్థ్యం వార్షికంగా 12.22 లక్షల మెట్రిక్ టన్నులు కాగా 2026 నివేదిక ప్రకారం 6.66 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని సాధించింది.తదుపరి వ్యూహందక్షిణాది ప్యాకేజ్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ రిటైల్ విపణిలో ఆదాయంపరంగా 22.2% వాటాతో జీఈఎఫ్ఎల్ అగ్రస్థానంలో ఉంది. 1,600 డిస్ట్రిబ్యూటర్లు, 3 లక్షలకు పైగా రిటైల్ ఔట్లెట్లు, 60కి పైగా వేర్‌హౌస్‌ల బలమైన నెట్‌వర్క్‌తో దాదాపు 31.8 కోట్ల మంది వినియోగదారులకు కంపెనీ చేరువైందని ప్రతినిధులు చెప్పారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశాల్లో మార్కెట్ లీడర్షిప్ను కాపాడుకుంటూనే తెలంగాణ, కర్ణాటకలతో పాటు కేరళ, పశ్చిమ బెంగాల్, ఇతర రాష్ట్రాల్లోని మార్కెట్లకు తమ నెట్‌వర్క్‌ను విస్తరించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని తెలిపారు.ఇదీ చదవండి: తాతముత్తాతల ఆస్తి హక్కులు పొందడం ఎలా? -
రూ. 50 లక్షల విరాళమిచ్చిన ‘ఫ్రీడం’
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్‌పై చేస్తున్న పోరుకు సహకారంగా ఫ్రీడం హెల్తీ కుకింగ్ ఆయిల్స్ తయారీదారు జెమినీ ఎడిబల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా సంస్థ ప్రధానమంత్రి సహా యనిధికి రూ. 50 లక్షల విరాళాన్ని అందజేసినట్టు శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. సంస్థ ఉద్యోగులు 640మంది సైతం ముందుకు వచ్చి వారి ఒక రోజు వేతనం రూ. 9.25 లక్షలను పీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ఇచ్చారని పేర్కొంది. -
ఆయిల్ మిల్క్
అనంతపురం, నార్పల: నియోజకవర్గం లోని నార్పల పరిధిలో కల్తీపాల గుట్టు రట్టైంది. పోలీసులు ఏకకాలంలో దా డులు నిర్వహించి 2050 లీటర్ల కల్తీ పాలతో పాటు అందుకోసం ఉపయోగిస్తున్న సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇం దులో భాగంగానే ముగు రు నిందితులను అరెస్టు చేశారు. ఎస్ ఐ శ్రీనివాసులు ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. తమ కు వచ్చిన సమాచారం మేరకు కేశేపల్లి, నార్పలల్లో దాడులు చేశామన్నా రు. కేశేపల్లిలోని పాలవిక్రయదారుడు రాజశేఖరరెడ్డి ఇంటిలో, నార్పలలోని కూతలేరు బ్రిడ్జి వద్ద ఉన్న సాయి మిల్క్‌డైరీ, ఉయ్యాలకుంటలోని భూ షణ పాలకేంద్రంలోని కల్తీ పాలు, పె రుగును స్వాధీనం చేసుకున్నామని వివరించారు. కల్తీపాల తయారు కో సం వినియోగిస్తున్న ఫ్రీడమ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్లతో పాటు మూడు మిక్సీలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ పాల డైరీలలో తయారు చేస్తున్న కల్తీ పాలను అనంతపురం పట్టణంలో విక్రయిస్తున్నారని చెప్పారు. కల్తీపాలు త యారు చేసి విక్రయిస్తున్న సుబ్బరా యుడు, నాగభూషణ, రాజశేఖరరెడ్డిల ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశామన్నారు. మరోవైపు ఫుడ్‌సేఫ్టీ అధికారి రవిశంకర్ కల్తీపాలను పరీక్ష కోసం ల్యాబ్‌కు పంపినట్లు చెప్పారు. -
రెండేళ్లలో దేశవ్యాప్తంగా ‘ఫ్రీడం’ ఆయిల్
సాక్షి ఇంటర్వ్యూ ⇒ జెమిని ఎడిబుల్స్ ఎండీ ప్రదీప్ చౌదరి ⇒ త్వరలో మార్కెట్లోకి రైస్ బ్రాన్ ఆయిల్ ⇒ ప్లాంట్ల ఆధునీకరణకు రూ. 35 కోట్లు ⇒ పశ్చిమ తీరంలో రూ. 250 కోట్లతో రిఫైనరీ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫ్రీడం బ్రాండ్‌తో వంట నూనెల తయారీలో ఉన్న జెమిని ఎడిబుల్స్, ఫ్యాట్స్ ఇండియా (జెఫ్) దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. ప్యాకేజ్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ అమ్మకాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో తొలి స్థానం కైవసం చేసుకున్న ఈ సంస్థ.. ఇప్పుడుఛత్తీస్గఢ్, కర్ణాటక, తమిళనాడు మార్కెట్‌పై దృష్టిసారించింది. ఫ్రీడ ంను రెండేళ్లలో దేశవ్యాప్త బ్రాండ్‌గా తీర్చిదిద్దుతామని అంటున్నారు జెఫ్ వ్యవస్థాపకులు, ఎండీ ప్రదీప్ చౌదరి. జెఫ్‌లో అంతర్జాతీయ అగ్రి దిగ్గజం గోల్డెన్ అగ్రి రిసోర్సెస్ వాటా కైవసం చేసుకోవడం బూస్ట్‌నిచ్చిందని సాక్షి బిజినెస్ బ్యూరోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. 2016-17లో రూ.2,000 కోట్ల టర్నోవర్‌కు చేరతామన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కంపెనీ విస్తరణ, మార్కెట్ తీరుతెన్నులపై ఆయనేమన్నారంటే.. మూడు నెలల్లో రైస్బ్రాన్లోకి.. ప్రస్తుతం ఫ్రీడం బ్రాండ్‌లో సన్‌ఫ్లవర్, సోయాబీన్ నూనెను, అలాగే ఫస్ట్ క్లాస్ బ్రాండ్‌లో పామోలిన్, వనస్పతి విక్రయిస్తున్నాం. ఆహార పదార్థాల తయారీ కంపెనీలకు వీటితోపాటు ఇతర నూనెలు, కొవ్వులను సరఫరా చేస్తున్నాం. మే నెలలో రైస్‌బ్రాన్ ఆయిల్‌ను ప్యాకేజ్డ్ విభాగంలోకి తీసుకొస్తున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ప్యాకేజ్డ్ సన్‌ఫ్లవర్ నూనె నెలకు 25-30 వేల టన్నులు అమ్ముడవుతోంది. ఇందులో ఫ్రీడంకు 27 శాతం వాటా ఉంది. మూడేళ్లలో 35 శాతం లక్ష్యంగా చేసుకున్నాం. ఒడిశాలో 31 శాతం వాటా చేజిక్కించుకున్నాం. నెలకు 30 వేల టన్నులు అమ్ముడవుతున్న కర్ణాటకలో 2017కల్లా 20 శాతం వాటా దక్కించుకుంటాం. అంతర్జాతీయ సంస్థ.. జెఫ్‌లో రుచి సోయా ఇండస్ట్రీస్‌కు ఉన్న 50 శాతం, ప్రమోటర్ల నుంచి 25 శాతం వాటాను ఇండోనేసియాకు చెందిన గోల్డెన్ అగ్రి సుమారు రూ.140 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. పామాయిల్ తోటలు, రిఫైనరీలతో అంతర్జాతీయంగా పేరున్న గోల్డెన్ అగ్రి టర్నోవర్ రూ.60,000 కోట్లకుపైనే. వారి చేరికతో మార్కెట్ పరంగా, ఆర్థికంగా, టెక్నాలజీ పరంగా జెఫ్‌కు బలం చేకూరింది. పెద్ద ఎత్తున వృద్ధి చెందాలన్న లక్ష్యంతో భారత్‌లో ఎంతైనా పెట్టుబడి పెట్టేందుకు గోల్డెన్ అగ్రి సుముఖంగా ఉంది. మరో రిఫైనరీ.. కంపెనీకి కృష్ణపట్నం, కాకినాడ వద్ద రిఫైనరీలు ఉన్నాయి. కృష్ణపట్నం ప్లాంటు సామర్థ్యం రోజుకు 900 టన్నులు, కాకినాడ ప్లాంటు 250 టన్నులుంది. రెండు రిఫైనరీలకు ఇప్పటికే రూ.155 కోట్లు ఖర్చు చేశాం. వీటిని ఆధునీకరించేందుకు రూ.35 కోట్లు వెచ్చిస్తున్నాం. పశ్చిమ తీరంలో రూ.250 కోట్లతో రిఫైనరీని ఏర్పాటు చేస్తున్నాం. ఇందుకు మహారాష్ట్ర లేదా గుజరాత్‌ను పరిశీలిస్తున్నాం. ఆరు నెలల్లో స్పష్టత వస్తుంది. 2013-14లో జెఫ్ రూ.1,455 కోట్ల టర్నోవర్ నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,600 కోట్లు ఆశిస్తున్నాం. ఐదేళ్లలో 100 శాతం.. భారత్‌లో వంట నూనెల వినియోగం ఏటా 1.6 కోట్ల టన్నులుంది. ప్యాకేజ్డ్ విభాగం 20 శాతం వృద్ధితో 55-60 శాతానికి చేరింది. బ్రాండెడ్ నూనెలపట్ల కస్టమర్లలో అవగాహన పెరుగుతుండడంతో ఐదేళ్లలో ఈ విభాగం 100 శాతానికి చేరడం ఖాయం. ఇక నూనెల వినియోగం చూస్తే ప్రపంచ సగటు 21-22 కిలోలుంది. భారత్‌లో ఇది 15 కిలోలు మాత్రమే. 10 ఏళ్ల తర్వాత ప్రపంచ సగటును మించిపోవడం ఖాయం. ఆదాయాల పెరుగుదల, మారుతున్న ఆహారపుటలవాట్లు ఇందుకు కారణం.


