breaking news
free bus passes
-
బస్టాండులు సరే... బస్సులేవి
► విధ్యార్థులకు ఉచిత బస్సుపాసులు ఇచ్చిన అవి నిరుపయోగమే. రాజాపూర్: జాతీయ రహదారిని ఎక్స్‌ప్రెస్ హైవేగా మార్చి రహదారిపై ఉన్న గ్రామాల వద్ద ప్రయాణికులకోసం అందమైన బస్టాండులు నిర్మించారు కాని బస్సులేవి మరి అంటు ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. రాజాపూర్ మండలంలోని ముదిరెడ్డిపల్లి, రాజాపూర్, రంగారెడ్డిగూడ, కేతిరెడ్డిపల్లి తదితర గ్రామాల బస్టాపుల వద్ద జీఎమ్మార్ సంస్థ బస్టాండ్లు నిర్మించింది కాని ఇటు జడ్చర్ల, అటు షాద్‌నగర్, జిల్లా కేంద్రానికి వెళ్లాలన్నా ఆర్టీసి సంస్థ ఆర్డినరి బస్సులు నడపకపోవడం మూలంగా ప్రయాణికులు ప్రయివేటు జీపులు, ఆటోలను ఆశ్రయించి ప్రమాదాలకు గురవుతున్నారు. గతంలో షాద్‌నగర్ డిపోకు చెందిన లోకల్ బస్సులు నడిచేవని దీంతో ప్రయాణికులకు సమస్య ఉండేది కాదని ప్రజలు పేర్కొంటున్నారు. ముఖ్యంగా మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన విధ్యార్థులు జడ్చర్ల, బాలానగర్, షాద్‌నగర్ పట్టణాలకు విద్యానభ్యశించేందుకు పాఠశాలలకు, కళాశాలలకు ప్రతినిత్యం వెలుతుంటారు. పట్టణాలనుండి పల్లెల్లో, మండల కేంద్రంలో పనిచేసేందుకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు వస్తుంటారు. విధ్యార్థులకు ఉచిత బస్సు పాసులు ఇచ్చిన బస్సులు లేకపోవడంతో అవి నిరుపయోగమే అవుతున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని బస్సులు ఆపేవిదంగా చర్యలు తీసుకోవాలని మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఆర్టీసీ ఆర్డినరి బస్సులు లేక ప్రయివేటు వాహనాల్లో వెళ్లక తప్పడంలేదు : గతంలో షాద్‌నగర్ డిపోకు చెందిన షెటిల్ బస్సులు జడ్చర్ల,షాద్‌నగర్ పట్టణాలకు నడిపేవారు. అవి రద్దు చేయడంతో పాఠశాలకు వెళ్లేందుకు పిల్లలు బాగ ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్తులకు ఉచిత బస్సుపాసులు ఇచ్చారు. బస్సులే లేవు బస్సులు ఎంచేసుకోవాలి. తప్పని పరీస్థీతుల్లో ప్రయివేటు జీపులు, ఆటోలు ఆశ్రయించక తప్పడం లేదు. -
ఉచిత బస్సు పాసుల పంపిణీ
టీనగర్: విద్యార్థులకు ఉచిత బస్సు పాసుల పంపిణీ పథకాన్ని ముఖ్యమంత్రి జయలలిత శనివారం ప్రారంభించారు. సచివాలయంలో ఉదయం తిరువళ్లూరు జిల్లా, గుమ్మిడిపూండిలో రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన డ్రైవర్ల పరిశోధనా శిక్షణ కేంద్రానికి శంఖుస్థాపన, రవాణా సంస్థ భవనాలను ప్రారంభించారు. అధికారులకు జీపులను అందచేశారు. గుమ్మిడిపూండిలో రవాణాసంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా నిర్మించిన అతిథి గృహా నికి శంఖుస్థాపన చేశారు. కుంభకోణం, కోయంబత్తూరు, తిరునెల్వేలి ప్రాంతాల్లో నిర్మించిన భవనాలను ప్రారంభించారు. విద్యార్థులకు ఉచిత బస్సు పాసుల పంపిణీ : ముఖ్యమంత్రి జయలలిత పాఠశాలకు వెళ్లే విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని 28 లక్షల 50వేల విద్యార్థులకు ఉచిత బస్సు పాసులను అందచేసే పథకం కింద ముగ్గురు విద్యార్థినులకు ఉచిత బస్సు పాసులను అందచేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ముఖ్యమంత్రి జయలలితకు తమ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రవాణాశాఖ మంత్రి వి.సెంథిల్ బాలాజీ, ప్రధాన కార్యదర్శి మోహన్ వర్గీస్ సుందర్, తమిళనాడు ప్రభుత్వ సలహాదారుడు షీలా బాలకృష్ణన్, హోంశాఖ ప్రధాన కార్యదర్శి అపూర్వ వర్మ, రవాణా శాఖ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ టి.ప్రభాకరరావు, రవాణాశాఖ అధికారులు పాల్గొన్నారు. -
టాపర్ల భవిత ఉజ్వలం
* సీఎం జయలలిత ఆకాంక్ష * ర్యాంకర్లకు సత్కారం * నగదు ప్రోత్సాహం సాక్షి, చెన్నై: రాష్ట్రంలో విద్యాభ్యున్నతి లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. విద్యార్థులను ప్రోత్సహించే విధంగా పథకాలు అమల్లో ఉన్నాయి. ఉచిత విద్యా, ఉచిత బస్సు పాసులు, ఉచిత పుస్తకాలు, యూని ఫాం, షూ, పాదరక్షలు, సైకిళ్లు, ల్యాప్‌టాప్‌లు ఇలా విద్యార్థులను బడి బాట పట్టించే విధంగా సంక్షేమ పథకాలను అందజేస్తూ వస్తున్నారు. ప్రతి ఏటా ప్రభుత్వ స్కూళ్లల్లో చదువుకుని తమిళ మాధ్యమంతో పదో తరగతి, ప్లస్‌టూ పరీక్షల్లో ర్యాంకులు సాధించే విద్యార్థులను స్వయంగా సీఎం సత్కరించడం ఆనవాయితీ.ఇందులో భాగంగా 2013-14కు గాను పదో తరగతి, ప్లస్ టూ పరీక్షల్లో మొదటి ర్యాంక్ సాధించిన విద్యార్థులకు శుక్రవారం ఉదయం సచివాలయంలో నిరాడంబరంగా సత్కారం చేశారు. ప్రోత్సాహం: ఇది వరకు మొదటి మూడు ర్యాంకులు సాధించే విద్యార్థులకు నగదు ప్రోత్సాహం అందించే వారు. అయితే, ఈ ఏడాది తొలి ర్యాంకులోనే 19 మంది విద్యార్థులు ఉండడంతో, టాపర్లను మాత్రమే సత్కరించేందుకు చర్యలు తీసుకున్నారు. పదో తరగతిలో మొదటి ర్యాంకు సాధించిన 19 మంది విద్యార్థులకు తలా రూ.25 వేలు చొప్పున సీఎం జయలలిత అందజేశారు. ఆది ద్రావిడ, గిరిజన సంక్షేమ పాఠశాలల్లో చదువుకుంటూ మొద టి మూడు ర్యాంకులు సాధించిన విద్యార్థులకు తలా రూ.10 వేలు చొప్పున నగదు ప్రోత్సాహం అందించారు. ప్రత్యేక ప్రతిభావంతుల పాఠశాలల్లో తొలి ర్యాంకు సాధించిన ఒక అంధ విద్యార్థికి, ఒక బధిర విద్యార్థికి రూ.25 వేలు చొప్పున, సాంఘిక సంక్షేమ, పౌష్టికాహార పథకం, ప్రభుత్వ సేవా ఇల్లంలో చదువుకుంటూ తొలి ర్యాంకు సాధించిన ముగ్గురు విద్యార్థులకు తలా రూ.5 వేలు చొప్పున, అటవీ శాఖ పరిధిలోని పాఠశాలల్లో చదువుకుంటూ మొదటి ర్యాంకులో నిలిచిన ఒక విద్యార్థికి రూ.25 వేలు అందజేశారు. మొత్తంగా పదో తరగతిలో మొదటి ర్యాంకు సాధించిన 28 మంది విద్యార్థులకు ఆరు లక్షల పదిహేను వేలు నగదు ప్రోత్సహం అందజేశారు. ప్రశంసా పత్రాల్ని అందజేశారు. ఈ విద్యార్థుల ఉన్నత చదువుల బాధ్యతలను ప్రభుత్వం భరించనున్నది. ప్లస్ టూ: పదో తరగతి విద్యార్థుల సత్కారం అనంతరం ప్లస్‌టూలో మొదటి ర్యాంకులో నిలిచిన విద్యార్థులను సీఎం జయలలిత సన్మానించారు. మొదటి ర్యాంకు విద్యార్థికి రూ. 50 వేలు, మైనారిటీ, వెనుకబడిన సంక్షేమ పాఠశాలల్లో చదువుకుని మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థికి రూ.50వేలు, ఆదిద్రావిడ, గిరిజన సంక్షేమ పాఠశాలల్లో చదువుకున్న మొదటి ర్యాంకులు సాధించిన ముగ్గురు విద్యార్థులకు రూ.10వేలు చొప్పున, ప్రత్యేక ప్రతిభావంతుల స్కూళ్లలో మొదటి ర్యాంకు సాధించిన ఒక అంధ విద్యార్థికి, ఒక బధిర విద్యార్థికి తలా రూ. 50 వేలు సీఎం జయలలిత అందజేశారు. అలాగే, సాంఘిక సంక్షేమ, పౌష్టికాహార పథకం, ప్రభుత్వ సేవా ఇల్లంలో చదువుకుని మొదటి ర్యాంకు సాధించిన ముగ్గురు విద్యార్థులకు తలా రూ. 6 వేలు చొప్పున, అటవీ శాఖ పాఠశాలల్లో మొదటి ర్యాంకులు సాధించిన ముగ్గురు విద్యార్థులకు తలా రూ. 50 వేలు అందజేశారు. మొత్తంగా 14 మంది మొదటి ర్యాంకర్లకు నాలుగు లక్షల 92 వేలు నగదు ప్రోత్సాహం పంపిణీ చేశారు. టాపర్లుగా నిలిచిన విద్యార్థులందరితో సీఎం జయలలిత ముచ్చటించారు. అందరికీ మంచి భవిష్యత్తు ఉందని, ఉన్నత చదువుల్లో మరింతగా రాణించాలని కాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పి వలర్మతి, సుబ్రమణియన్, కేసీ వీరమని, ఎంఎస్ఎం ఆనందన్, అబ్దుల్ రహీం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్ వర్గీస్, సలహాదారు షీలా బాలకృష్ణన్, పాఠశాల విద్యా శాఖ కార్యదర్శి సబిత తదితరులు పాల్గొన్నారు.