followed
-
నేహా చెప్తే వింటారు! మనీ డీలింగ్.. మాస్ ఫాలోయింగ్
నేహా నాగర్.. దేశంలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న మహిళా పర్సనల్ ఫైనాన్స్ ఇన్ఫ్లుయెన్సర్. ఇన్స్‌స్టాగ్రామ్‌లో ఈమెకు 1.9 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆ పాపులారిటీతోనే ‘కాండేరే హురున్ ఇండియా ఉమెన్ లీడర్స్ లిస్ట్ 2025’లో స్థానం సంపాదించింది. సంపద సృష్టికర్తలు, పెట్టుబడిదారులు, దాతలు, సాంస్కృతిక రూపకర్తలు, యువ నాయకులు, ప్రొఫెషనల్స్, ఇన్ఫ్లుయెన్సర్ ఫౌండర్లతో సహా అన్ని కేటగిరీల్లోని మహిళలతో ఈ జాబితాను రూపొందించారు.దేశ పర్సనల్ ఫైనాన్స్ ల్యాండ్ స్కేప్‌లో నాగర్ ఒక మార్గదర్శక స్వరం. వైవిధ్యంతో ఆమె అందించే కంటెంట్, ఆర్థిక పాఠాలు నేహా నాగర్‌ను ఆన్ లైన్ లో దేశంలోనే అత్యంత విశ్వసనీయమైన ఫైనాన్షియల్ ఎడ్యుకేటర్లలో ఒకరిగా చేశాయి. ఫైనాన్స్ కంటెంట్ క్రియేటర్, ఎంటర్ప్రెన్యూర్, ఏంజెల్ ఇన్వెస్టర్ అయిన నాగర్ పన్నులు, బడ్జెట్, ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్మెంట్ వంటి సంక్లిష్ట ఆర్థిక అంశాలను సులభతరం చేయడంలో ప్రసిద్ధి చెందారు.👉 30 ఏళ్ల నాటి షేర్లు.. అప్పుడు లక్ష.. ఇప్పుడు ఎన్ని కోట్లో తెలుసా?వివిధ ప్లాట్‌ఫామ్‌లలో 5 మిలియన్లకు పైగా ఫాలోవర్లను కలిగి ఉన్న ఆమె ఆర్థిక పాఠాలను వినోదంతో మిళితం చేసి కంటెంట్ ఫాలోవర్లకు అందిస్తుంది. అందరికీ అర్థమయ్యే బాలీవుడ్, క్రికెట్ వంటి అంశాలతో ఈమె ఫైనాన్స్ కంటెంట్ మిళితమై ఉంటుంది. నైకా, క్రెడ్, ఎయిర్ టెల్ వంటి టాప్ బ్రాండ్లతో కలిసి పనిచేసిన నేహా.. ఆర్థిక స్వావలంబన సాధించడానికి అవసరమైన పరిజ్ఞానం అందించి జనానికి సాధికారత కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెబుతోంది.చార్టర్డ్ అకౌంటెంట్ కావాలన్న ఆకాంక్షలతో మొదలైన నాగర్ ప్రయాణం ఎంబీఏ, వెల్త్ మేనేజ్ మెంట్ కు దారితీసింది. ముఖ్యంగా మహిళలకు సహాయం చేయాలనే తపనతో, వాళ్లు డబ్బును అర్థం చేసుకోవడం, నిర్వహించుకోగలగడంలో తన వంతు సాయం అందించడానికి ఆమె చివరికి డిజిటల్ ఫైనాన్స్ పాఠాల వైపు మొగ్గు చూపారు. పిల్లల్ని కనడానికి ముందు అవసరమైన ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి ఆమె చేసిన ఒక పోస్ట్ వైరల్ అయ్యి జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. ఆర్థిక అక్షరాస్యతకు ఆమె చేసిన కృషికి ఫోర్బ్స్, సీఎన్‌బీసీ, ఎన్డీటీవీ, టీఈడీఎక్స్, ఇతర ప్రముఖ వేదికలలో కూడా ఆమె స్థానం పొందారు. -
‘ఎక్స్’లెంట్ ఫాలోయింగ్! అత్యధిక ఫాలోవర్లున్న ప్రముఖులు (ఫొటోలు)
-
తమిళ త్రివిక్రమ్ గా పాపులర్ అవుతున్న తల
-
దొంగల దుశ్చర్య: కారును బైక్‌తో ఢీకొట్టి..వెంబడించి..
సాక్షి, బనశంకరి: బెంగళూరు నగరంలో అర్ధరాత్రి ఇద్దరు దొంగలు బైక్‌పై ఓ కారును ఢీకొట్టి వారిని ఐదు కిలోమీటర్లు వెంబడించారు. ఈ ఘటనతో కారులో ఉన్న దంపతులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. వివరాలు... ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో సర్జాపుర రోడ్డులో దంపతులు కారులో ఇంటికి వెళ్తున్నారు. ఎదురుగా బైక్‌లో వచ్చిన వ్యక్తులు అదే పనిగా కారును ఢీకొట్టాడు. డ్యాష్‌బోర్డులో ఉన్న కెమెరాలో ఈ దృశ్యం రికార్డయింది. అనంతరం బైక్‌లో ఉన్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు కారు వద్దకు వెళ్లి దంపతులను కిందకు దిగాలని అడిగాడు. వారు నిరాకరించడంతో కిటికీ అద్దాలపై కొట్టాడు. దీంతో వారు రివర్స్ తీసుకుని ముందుకు వెళ్లిపోతుండగా ఐదు కిలోమీటర్లు బైక్‌లో వీరి వాహనాన్ని వెంబడించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. నగర ప్రజలకు రక్షణ లేదనే విషయం అవగతమవుతోందని నెటిజన్లు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. సర్జాపుర రోడ్డు సోపాస్ మోర్ వద్ద ఈ ఘటన జరిగింది. రోడ్ల పక్కన విద్యుత్ దీపాలు అమర్చి గస్తీ పెంచాలని నెటిజన్లు నగర ట్రాఫిక్ పోలీసులు, బీబీఎంపీ కమిషనర్‌కు ట్యాగ్ చేశారు. ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తూర్పువిభాగ ట్రాఫిక్ డీసీపీ కళాకృష్ణస్వామి తెలిపారు. Horrific incident reported on Sarjapur road near Sofas & More around 3 am today. Miscreant riders collided purposefully to a couple traveling in car. They chased the car for 5km till their society in Chikkanayakanahalli. Don't open your car in night. Use dash cam. @BlrCityPolice. pic.twitter.com/4QVYtBZ67B — Citizens Movement, East Bengaluru (@east_bengaluru) January 29, 2023 (చదవండి: భార్యను హత్య చేసి ఢిల్లీకి పరార్..విచారణలో అతడు..) -
ప్రపంచంలోనే సుష్మాస్వరాజ్ ది ప్రథమ స్థానం!
ట్విట్టర్ ఫాలోయర్స్ అధికంగా ఉన్న ప్రపంచంలోని టాప్ టెన్ నాయకుల జాబితాలో ఇద్దరు భారతీయులు నిలువగా... అందులో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ మొదటి స్థానంలో ఉన్నారు. ట్విట్టర్ ఫాలోయర్స్ అధికంగా ఉన్న ఏకైక మహిళా నాయకురాలుగా సుష్మా మొదటి ర్యాంకును సంపాదించగా... ప్రధాని మోదీ మూడో స్థానంలో ఉన్నారు. సోషల్ నెట్వర్క్ సైట్ ట్విట్టర్ లో దాదాపు 20 మిలియన్ లమంది ఫాలోయర్స్ ఉన్న మహిళా నాయకురాలుగా సుష్మాస్వరాజ్ గుర్తింపు పొందారు. ఎక్కువ మంది ఫాలోయర్స్ కలిగిన ట్విట్టర్ టాప్ టెన్ మహిళా నాయకుల జాబితాలో సుష్మా మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత 5 మిలియన్లమంది ఫాలోయర్స్ కలిగిన పురుష నాయకుడుగా ప్రధాని నరేంద్ర మోదీ మూడో స్థానాన్ని పొందినట్లు ఓ అధ్యయనం ద్వారా వెల్లడైంది. ఇకపోతే అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు బారాక్ ఒబామా 75 మిలియన్ లమంది ఫాలోయర్స్ తో ప్రథమ స్థానంలో నిలువగా, 29 మిలియన్ల ట్విట్టర్ అనుచరులున్న పోప్ ఫ్రాన్సిస్ రెండో స్థానాన్ని సంపాదించారు. అలాగే భారతీయ నాయకుల్లో రెండో స్థానాన్ని పొందిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ స్థాయిలో అత్యధిక ట్విట్లర్ అనుచరులు ఉన్న నాయకుడిగా నాలుగో స్థానంలో ఉన్నారు. పీఎంఓ ఇండియా ఖాతాతో నరేంద్రమోదీ మొత్తం 11మిలియన్ల మంది అనుచరులను కలిగి ఉన్నారు. అలాగే జోర్దాన్ క్వీన్ రైనా.. 4.7 మిలియన్లమంది ఫాలోయర్స్ తో ప్రపంచంలో రెండో మహిళా నాయకురాలుగా నిలిచారు.


