ఫ్లయింగ్ మిషన్
భావి ఇంజనీర్లు తమలోని సాంకేతిక నైపుణ్యానికి పదును పెట్టారు. సృజనకు రూపాన్నిచ్చి... మైక్రో ఎయిర్ వెహికల్స్‌ను తయారు చేసి ప్రదర్శించారు. కూకట్పల్లి జేఎన్టీయూహెచ్లో మూడు రోజులుగా ‘మైక్రో ఎయిర్ వెహికల్స్ నిర్వహణ, అభివృద్ధిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం’ అంశంపై జరుగుతున్న సదస్సు శుక్రవారంతో ముగిసింది. వర్సిటీ బీటెక్, ఎంటెక్ మెకానిక్ విభాగం, ఎంఎల్ఆర్ఐటీ కళాశాల ఏరోనాటికల్ విద్యార్థులు తయారు చేసిన 15కు పైగా బుల్లి విమానాలు ప్రదర్శించారు. నగరానికి చెందిన మైక్రో ఎయిర్ వెహికల్స్ తయారీ సంస్థ అంతరిక్ష జేఎన్టీయూహెచ్తో కలసి ఈ సదస్సు నిర్వహించింది. జేఎన్టీయూహెచ్ విద్యార్థులు ఎగ్జిబిట్ చేసిన ఫిక్స్డ్ వింగ్ డెల్టా మోడల్ వెహికల్, ఏరియల్ ఫొటోగ్రఫీ డ్రోన్ మోడల్ యంత్రం, ఎంఎల్ఆర్ విద్యార్థుల స్పైరికల్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ అబ్బురపరిచాయి.
- కేపీహెచ్‌బీకాలనీ