breaking news
Five generations
-
ఆ కుటుంబంలో 140 మందికి పైగా డాక్టర్లు! ఐదు తరాలుగా..
ఒక కుటుంబంలోని ఇద్దరు వ్యక్తులు ఒకే వృత్తిని ఎంచుకోవడమే కష్టం. అలాంటిది ఒక కుటుంబంలో మొత్తం 140 మందికి పైగా డాక్టర్లు ఉన్నారు. ఇలా ఎక్కడోగానీ జరగదు. తరతరాలు ఓకే వృత్తిని కుటుంబ వారసత్వంగా కొనసాగిస్తూ.. ప్రతి తరంలో ఒక వ్యక్తి దాన్ని అనుసరించడం విశేషం. ఇలా ఐదు తరాలు వైద్య వృత్తినే అనుసరించారు. ఆ ఇంటికి వచ్చిన కోడలు కూడా డాక్టరే అయ్యి ఉండాలట. అంతేగాదు ఐదు తరాలుగా ప్రతి ఒక్క సభ్యుడు డాక్టర్‌గా ఉన్న ఏకైక కుటుంబంగా అరుదైన రికార్డుని దక్కించుకుంది. ఇంతకీ ఇదంతా ఎక్కడ జరిగిందంటే..డిల్లీకి చెందిన సబర్వాల్ కుటుంబం ఈ ఘనతను దక్కించుకుంది. ఇదంతా వారి ముత్తాత లాలా జీవన్మల్ నుంచి మొదలయ్యిందని డాక్టర్ రవీంద్ర సబర్వాల్ చెబుతున్నారు. లాహోర్‌లో స్టేషన్ మాస్టర్‌గా పనిచేస్తున్న లాలా జీవన్ముల్ ఒకరోజు మహాత్మా గాంధీ ఆరోగ్యం, విద్య ప్రాముఖ్యత గురించి మాట్లాడటం విన్నాడట. ఇక అప్పుడే ఆయన ఆస్పత్రిని నిర్మించాలని గట్టిగా నిర్ణయించుకున్నాడట. అంతేగాదు తన నలుగురు కుమారులు బోధిరాజ్, త్రిలోక్ నాథ్, రాజేంద్ర నాథ్, మహేంద్ర నాథ్ లను మెడిసిన్ చదివించాలని భావించాడట. అలా వారి కుటుంబంలో 1902లో తొలి డాక్టర్‌గా బోధిరాజ్ ఈ వృత్తిని చేపట్టారు. అదే ఏడాది పాకిస్తాన్‌లోని జలాల్పూర్ జట్టన్లో జీవన్ ఆసుపత్రిని నిర్మించారు. ఆయన అక్కడ వైద్యుడిగా సేవలందించారు. అప్పటి నుంచి ఈ వృత్తిని కుటుంబంలోని తదుపరి తరం చేపట్టాలని, అలాగే వైద్య విద్యనభ్యసించిన వధువునే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే విభజన సమయంలో లాహోర్ నుంచి ఢిల్లీకి తరలి వెళ్లాల్సి వచ్చింది ఈ కుటుంబం.ప్రస్తుతం ఢిల్లీలో ఆ కుటుంబానికి మొత్తం ఐదు ఆస్పత్రులు ఉన్నాయి. అంతేగాదు కరోల్ బాగ్, ఆశ్రమం, వసంత్ విహార్‌లో వాటికి సంబంధించిన వివిధ శాఖలు కూడా ఉన్నాయి. ఇలా ప్రతి తరం డాక్టర్ కావడంతో ఆస్పత్రి కారిడార్ కూడా పెరుగుతూ వచ్చింది. అంతేగాదు ఆ కుటుబంలోని తొలి డాక్టర్ భోధిరాజ్ హయాం నుంచి.. తర్వాతి తరం మెడిసిన్ నాల్లోవ సంవత్సరం చదువుతుండగానే.. ఒక సరికొత్త స్టెతస్కోప్‌ను అందజేయడం ఆచారంగా పాటిస్తారట. దీన్ని వాళ్లు ఆశీర్వాదంగా భావిస్తారట. ఈ మేరకు నేత్ర నిపుణుడు డాక్టర్ వికేష్ సబర్వాల్ మాట్లాడుతూ..డాక్టర్ బోధిరాజ్ కుటుంబ సభ్యులందర్నీ వైద్యులుగా తీర్చిదిద్దేలా గట్టిగా కృషి చేశారని చెప్పారు. తమకు అరటిచెట్టుకు ఇంజెక్షన్లు ఇవ్వడం నుంచి ప్రాక్టీస్ చేయించినట్లు తెలిపారు. ఆఖరికి డిన్నర్ టేబుల్ సంభాషణల్లో కూడా ఆస్పత్రి గురించే మాట్లాడటం, చర్చలు జరుగుతాయని అన్నారు. అలాగే తమ పిల్లలు ఆపరేషన్ థియేటర్ లోపలే హోంవర్క్‌లు చేస్తారని గర్వంగా చెప్పారు. ప్రమాద బాధితులు ఆస్పత్రికి వచ్చినట్లు తెలియగానే తమ కుటుంబం అప్రమత్తమైపోతుందని చెబుతున్నారు. ఎవ్వరూ వ్యతిరేకించ లేదా..?కుటుంబంలో ప్రతి ఒక్కరినీ డాక్టర్‌గా మార్చే నినాదాన్ని ఎవ్వరు వ్యతిరేకించి లేదా అంటే..? వారి ఆలోచనని మార్చడంలో కుటుంబం పూర్తిగా విజయం సాధించిందని అంటారు ఆ కుటుంబ సభ్యులు. ఎవ్వరైనా తాము వేరే కెరీర్‌ని ఎంచుకుంటాం అనగానే కుటుంబ అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తారట. అదికూడా ఆస్పత్రిలోనే సమావేశమై నిర్ణయాన్ని మార్చుకునేలా చేస్తామని చెబుతోంది ఆ కుటుంబం. ఇక కుమారుల్లో ఒకరు బయోకెమిస్ట్ చేసిన భార్యను వివాహం చేసుకుంటే..ఆమెను పదేపదే మెడిసిన్ చదవమని చెప్పడంతో..ప్రస్తుతం ఆమె అమెరికాలో డాక్టర్‌గా స్థిరపడిందని చెబుతున్నారు నాలుగోతరం కోడలు డాక్టర్ గైనకాలజిస్ట్ శీతల్. ఇక ఆ కుటుంబంలోని ఆరవతరం సమర్వీర్ అనే 11 ఏళ్ల బాలుడు కూడా తనని తాను డాక్టర్ సమర్వీర్గా పరిచయం చేసుకోవడం విశేషం. అయితే తమ కుటుంబంలోని ఆరవ తరం దియా సబర్వాల్ అనే 21 ఏళ్ల అమ్మాయి తమ కుటుంబ వారసత్వ వృత్తికి విరుద్ధమైన రంగాన్ని ఎంచుకుని ఇంగ్లీష్, కంప్యూటర్ సైన్స్‌లలో డబుల్ డిగ్రీని పూర్తి చేసిందని చెబుతున్నారు కుటుంబ సభ్యులు. అలాగే 16 ఏళ్ల ఆర్యన్ కూడా ఇలానే వేరే రంగం(క్రికెట్) అంటే మక్కువ..కానీ నానమ్మ కుటుంబ వారసత్వం వృత్తినే ఎంచుకోమని బలవంతం చేస్తోందని చెబుతున్నాడు. ఇలా ఒక నినాదంతో కుటుంబం అంతా ఒక తాటిపై నిలబడి ఆ వృత్తినే చేపట్టడం అంత ఈజీ కాదు కదా..!.(చదవండి: తొలిసారిగా వృద్ధుడికి ట్రిపుల్-ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్..!) -
ఐదు తరాల నటులతో నటించా
మూడు వందల సినిమాలలో విలన్‌గా నటించి విలనిజానికి నిజమైన నిర్వచనం ఇచ్చాడు. దర్శకుడిగా, కథారచయితగా, నిర్మాతగా పలు సినిమాలను నిర్మించి చిత్ర పరిశ్రమలో గుర్తింపుపొందాడు. నాలుగు దశాబ్దాలపాటు వెండితెరపై ఐదు తరాల నటులతో నటిస్తూ ఎన్నో పాత్రలు పోషించిన విలక్షణ నటుడు గిరిబాబు సోమవారం రేవనపల్లిలో జరిగిన ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని’ అనే సినిమా షూటింగ్ పాల్గొనడానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన తన సినీజీవిత విశేషాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే.. నా మొదటి సినిమా ‘జగమేమాయ’. ప్రము ఖ దర్శకుడు అయ్యన్మూర్తి నాకు సినిమాలో అవకాశం కల్పించారు. 1973లో నటులు కావాలని దినపత్రికలో వచ్చిన ప్రకటనను చూసి ఫొటో పంపిస్తే ఆ సినిమాకు సెలక్ట్ అయ్యాను. అప్పుడు నా వయస్సు 29 ఏళ్లు. నాతో పాటు మురళీమోహన్, కె.విజయ ముగ్గురికి ఈ సినిమానే మొదటి సినిమా. ఈసినిమా షూటింగ్ జరుగుతుండగానే మరో 7 సినిమాలలో నాకు నటించే అవకాశం వచ్చింది. 300 సినిమాలలో విలన్‌గా.. ఇప్పటివరకు నటించిన మొత్తం సినిమాలలో 300 సినిమాలలో విలన్‌గా నటించాను. మిగతా 250 సినిమాలు పౌరాణిక, జానపద, కౌబాయ్, సాంఘిక, కామెడీ చిత్రాలలో నటించాను. నాటి ఏఎన్నార్, ఎన్టీఆర్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్‌బాబు నుంచి నేటి తరం వరకు ఐదు తరాల నటులతో కలిసి నటిం చడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. పది సినిమాలకు దర్శకత్వం చేశా..... కథా, స్క్రీన్‌ప్లే, దర్శకుడిగా, నిర్మాతగా 10 సినిమాలను నిర్మించాను. ముఖ్యంగా దేవతలారా దీవించండి, సింహగర్జన, ముద్దు ముచ్చట, సంధ్యారాగం, మెరుపుదాడి, ఇంద్రజిత్, రణరంగం, నీ సుఖమే కోరుకున్నా సినిమాలన్నీ సూపర్‌హిట్టయ్యాయి. నేను తీసిన సినిమాలన్నీ జానపద, బందిపోటు, సస్పెన్స్ థ్రిల్లర్, అడవి బ్యాక్‌డ్రాప్‌లో ఉన్నవే. సెలక్టెడ్ పాత్రలే చేస్తున్నా... ప్రస్తుతం సినిమా అవకాశాలకు కొదవలేదు. కానీ వయస్సు మీదపడుతుంది కాబట్టి సెల క్టెడ్ పాత్రలే చేస్తున్నాను. ఇటీవల విడుదలైన లడ్డూబాబు, పాండవులు పాండవులు తుమ్మెదాతో పాటు విడుదలకు సిద్ధంగా ఉన్న టాప్‌ర్యాంకర్స్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తోపాటు ఐదారు సినిమాలలో నటిస్తున్నాను. నందులు నేను ఇచ్చా..... బంగారు నందులను నా చేతుల మీదుగా ఇ చ్చాను కానీ.. నేను నంది అవార్డును మాత్రం అందుకోలేదు. 550కి పైగా సినిమాల్లో నటించినా ఇంతవరకు నంది అవార్డు రాలేదు. కానీ నంది అవా ర్డు, రఘుపతి వెంకయ్య అవార్డు ఎంపిక కమిటీలో సభ్యుడిగా ఉన్నాను. ప్రేక్షకుల ఆదరణ ముందు బిరుదులు, అవార్డులు చాలా చిన్నవి. అయితే అమెరికాలోని వెస్ట్ ప్రూఫ్ యూనివర్సిటీ నాకు డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది. నాటకాలే ప్రేరణ.... మాది ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని రావినూతల గ్రామం. మాది రైతు కుటుంబం. నాన్న ఎర్ర నాగయ్య, అమ్మ నాగరత్నం. కుటుంబంలో నేనొక్కడినే సంతానం. అయితే చదువుకునే రోజులలో ఇంటర్‌కాలేజీ పోటీలలో సరదాగా నాటకాలు వేసేవాడిని. అధ్యాపకులు కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. తరువాత కళాప్రపూర్ణ కళానాట్యమండలి స్థాపించి గ్రామంలో 25వరకు నాటకాలు వేసి మెప్పించాను. నాటకరంగ అనుభవం సినిమాలో నటించడానికి ప్రేరణ కల్గింది. నా పెద్ద కుమారుడు రఘుబాబు అతి తక్కువ కాలంలో 250 సినిమాలలో అనేక పాత్రలు పోషిస్తూ చిత్ర పరిశ్రమలో రాణిస్తూ మంచిపేరు తెచ్చుకుంటున్నాడు. కొడుకు ప్రయోజకుడైతే తండ్రికి అంతకంటే ఆనందం ఏముంటుంది. అలాగే చిన్న కుమారుడైన బోసుబాబు కూడా నాలుగైదు సినిమాలలో నటించాడు. భూదాన్‌పోచంపల్లి : శ్రీ రామలక్ష్మి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని’ అనే సినిమా షూటింగ్ మండలంలోని ముక్తాపూర్, రేవనపల్లి గ్రామాలలో సోమవారం జరిగింది. సూపర్‌స్టార్ కృష్ణ మేనల్లుడు, ప్రేమకథా చిత్రమ్ ఫేమ్ సుధీర్‌బాబు, హీరో తల్లిదండ్రుల పాత్రలు పోషిస్తున్న ప్రముఖ నటుడు గిరిబాబు, పద్మినిప్రకాష్లపై పలు సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు చందు మాట్లాడుతూ కన్నడంలో విజయవంతమైన 6 చిత్రాలను నిర్మించానని పేర్కొన్నాడు. తెలుగులో కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని తన మొదటి చిత్రమని చెప్పారు. ఇది పూర్తిగా అందమైన ప్రేమ కథా చిత్రమని అన్నారు. చిత్రంలో హీరోయిన్గా నందిత, ప్రముఖ నటులు బ్రహ్మానందం, అలీ, జయప్రకాష్, ఎంఎస్ నారాయణ, సప్తగిరి, రాంబాబు ప్రధాన ప్రాతలో నటిస్తున్నట్లు తెలిపారు. నిర్మాత లగడపాటి శ్రీధర్, సంగీతం గౌరవ హరి, పాటలు హరి, రామజోగయ్య శాస్త్రి, కెమరామెన్ కెఎస్. చంద్రశేఖర్‌లు వహిస్తున్నారని తెలిపారు.