first semi-final
-
సెమీస్ సమరానికి సిద్ధం
టి20 ప్రపంచ కప్ చరిత్రలో రెండు టీమ్‌లదీ దాదాపు ఒకే రకమైన పరిస్థితి...ఇరు జట్లు ఒక్కో సారి ఫైనల్ వరకు చేరగలిగినా టైటిల్ గెలుచుకోలేక రన్నరప్‌గానే సంతృప్తి చెందాయి. లీగ్ దశలో అద్భుతంగా ఆడుతున్నా, ప్రత్యర్థి జట్లకు సవాల్ విసురుతున్నా అసలు సమయంలో మాత్రం ఈ టీమ్‌లు చేతులెత్తేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి ఫైనల్ చేరి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ సిద్ధమయ్యాయి. రెండు టీమ్‌లలో ఒకరికి మాత్రమే టైటిల్ వేటలో పోటీ పడేందుకు అవకాశం ఉంది. ఈ క్రమంలో తుది పోరుకు అర్హత సాధించేందుకు రెండు జట్లూ సై అంటున్నాయి. ఈడెన్ గార్డెన్స్‌లో హోరాహోరీ పోరులో ఏ జట్టు పైచేయి సాధిస్తుందనేది ఆసక్తికరం. కోల్‌కతా: టి20 వరల్డ్ కప్ తొలి నాకౌట్ సమరానికి రంగం సిద్ధమైంది. నేడు (బుధవారం) జరిగే తొలి సెమీఫైనల్లో గత టోర్నీ రన్నరప్ దక్షిణాఫ్రికాతో న్యూజిలాండ్ తలపడుతుంది. టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్‌లలో కూడా విజయాలు సాధించే దక్షిణాఫ్రికా అజేయంగా సెమీస్ చేరగా...కివీస్ ప్రస్థానం మాత్రం తడబడుతూ సాగింది. లీగ్ దశలో మూడు బలహీన జట్లను ఓడించిన న్యూజిలాండ్, సూపర్ ఎయిట్స్‌లో ఒకటే విజయంతో ముందంజ వేసింది. ఈ టోర్నీలో ఇరు జట్ల మధ్య జరిగిన పోరులో దక్షిణాఫ్రికా అలవోక విజయాన్ని అందుకుంది. ఇప్పుడు అదే ప్రదర్శనతో దక్షిణాఫ్రికా ఫైనల్ చేరుతుందా లేక గత మ్యాచ్‌కు కివీస్ ప్రతీకారం తీర్చుకుంటుందా చూడాలి. అద్భుత ఫామ్‌లో... 2024 వరల్డ్ కప్ ఫైనల్లో దాదాపు చివరి వరకు ఆధిపత్యం ప్రదర్శించి అనూహ్యంగా ఓడిన దక్షిణాఫ్రికా ఈ సారి మెగా టోర్నీకి బాగా సన్నద్ధమై వచ్చినట్లు కనిపించింది. ప్రత్యర్థులకు ఎక్కడా ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఆ జట్టు చెలరేగిపోతోంది. అఫ్గనిస్తాన్‌పై పోరు సూపర్ ఓవర్ వరకు వెళ్లినా...భారత్, న్యూజిలాండ్, వెస్టిండీస్‌లను ఓడించిన తీరు జట్టు బలాన్ని చూపించింది. కెప్టెన్ మార్క్రమ్ తన కెరీర్లోనే అత్యుత్తమ ఫామ్‌లో కనిపిస్తున్నాడు. టాపార్డర్‌లో డికాక్, రికెల్టన్‌లనుంచి అతనికి సరైన మద్దతు లభిస్తోంది. బ్రెవిస్, మిల్లర్, స్టబ్స్‌లతో మిడిలార్డర్ చాలా పటిష్టంగా ఉంది. మిల్లర్ చాలా కాలంగా నిలకడగా రాణిస్తుండగా, బ్రెవిస్ మెరుపు బ్యాటింగ్‌తో ఏ టీమ్‌పైనైనా చెలరేగిపోగలడు. యాన్సెన్, బాష్ రూపంలో ఇద్దరు చక్కటి ఆల్‌రౌండర్లు ఉండటం జట్టు బలాన్ని పెంచింది. బౌలింగ్‌లో ఇద్దరు బెస్ట్ ఫాస్ట్ బౌలర్లు జట్టును నడిపిస్తున్నారు. రబాడ, ఎన్గిడి ప్రతీ మ్యాచ్‌లో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయడంలో సఫలం కావడంతో పాటు వరుస విరామాల్లో వికెట్లు తీసి కోలుకోకుండా చేస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల తన ఆటను అమాంతం మెరుగుపర్చుకున్న ఎన్గిడి ‘స్లో బంతులు’ బ్యాటర్లకు పెద్ద సమస్యగా మారాయి. జట్టులో ఏకైక స్పిన్నర్‌గా కేశవ్ మహరాజ్ తన సత్తాను ప్రదర్శిస్తున్నాడు. ఓవరాల్‌గా అన్ని రంగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న సఫారీలకే గెలుపు సానుకూలత ఎక్కువగా ఉంది. తడబడుతూనే... ప్రత్యర్థితో పోలిస్తే న్యూజిలాండ్ కాస్త బలహీనంగా కనిపిస్తోంది. టోర్నీ ఆరంభానికి ముందు బలాబలాల్లో ఏ జట్టుకూ కూడా తీసిపోనట్లు కనిపించిన కివీస్ అసలు సమయంలో మాత్రం ఆ స్థాయి ప్రదర్శనను చూపించలేకపోయింది. ఏ ఆటగాడు కూడా ఒంటిచేత్తో టీమ్‌ను గెలిపించేలా కనిపించడం లేదు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో కూడా జట్టులో తడబాటు కనిపిస్తూనే ఉంది. టాప్–3 బ్యాటర్లు సీఫెర్ట్, అలెన్, రచిన్‌లలో ఎవరూ గొప్పగా ఆడలేదు. ఫిలిప్స్‌లో కూడా నిలకడ లోపించగా...చాప్మన్ పూర్తిగా విఫలమయ్యాడు. ఇటీవల భారత్‌తో సిరీస్‌లో చెలరేగిన మిచెల్ పెద్దగా ప్రభావం చూపలేకపోగా...కెపె్టన్ సాంట్నర్ వైఫల్యం జట్టును దెబ్బ తీసింది. బౌలింగ్‌లో విఫలమైన సాంట్నర్ బ్యాటింగ్‌లో కూడా ఒక్క ఇన్నింగ్స్ మినహా ఎక్కడా బాగా ఆడలేదు. ఇంగ్లండ్ చేతిలో పరాజయం జట్టు బలహీనతలను స్పష్టంగా చూపించింది. బౌలింగ్‌లో ఫెర్గూసన్‌పైనే ప్రధానంగా పేస్ భారం ఉంది. వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వెళ్లిన హెన్రీ సెమీస్ వరకు తిరిగి వస్తాడని మేనేజ్మెంట్ చెప్పినా, దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఒక వేళ హెన్రీ రాకపోతే అతని స్థానంలో డఫీ బరిలోకి దిగుతాడు. కివీస్ ఏకంగా ఐదుగురు స్పిన్నర్లతో ఆడుతున్నా ఒక్కరు కూడా ప్రమాదకరంగా కనిపించడం లేదు. అందరూ ధారాళంగా పరుగులిస్తున్నారు. తుది జట్లు (అంచనా) దక్షిణాఫ్రికా: మార్క్రమ్ (కెప్టెన్), డికాక్, రికెల్టన్, బ్రెవిస్, మిల్లర్, స్టబ్స్, యాన్సెన్, బాష్, రబాడ, మహరాజ్, ఎన్గిడి న్యూజిలాండ్: సాంట్నర్ (కెప్టెన్), సీఫెర్ట్, అలెన్, రచిన్, ఫిలిప్స్, చాప్మన్, మిచెల్, మెక్‌కోన్‌కీ, సోధి, ఫెర్గూసన్, హెన్రీ / డఫీ5-0 టి20 వరల్డ్ కప్ చరిత్రలో ఇరు జట్ల మధ్య 5 మ్యాచ్‌లు జరగ్గా...ఐదు కూడా దక్షిణాఫ్రికానే గెలిచింది. పిచ్, వాతావరణంబ్యాటింగ్‌కు బాగా అనుకూలమైన పిచ్. భారీ స్కోర్లకు అవకాశం ఉంది. మంచు ప్రభావంతక్కువగా ఉన్నా సరే ఇక్కడ ఛేదన చాలా సులువు. భారత్, విండీస్ మధ్య పోరులో కూడా ఇది కనిపించింది. మ్యాచ్ రోజు వర్ష సూచన లేదు. -
కొడితే కొట్టాలిరా ఆసీస్‌ను...
భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌లు ఏకపక్షంగా మారిపోయాయి... వేర్వేరు కారణాలతో యాషెస్ సమరాలు గత కొన్నేళ్లుగా కళ తప్పాయి... అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పుడు అన్నింటికంటే ఆసక్తికర పోరు అంటే భారత్, ఆ్రస్టేలియా మధ్య జరిగేదే. ఫార్మాట్ ఏదైనా హోరాహోరీ పోరాటాలు, అత్యుత్తమ స్థాయిలో వ్యక్తిగత ప్రదర్శనలు వెరసి ఇరు జట్ల మధ్య మ్యాచ్‌లను ఆకర్షణీయంగా మార్చేశాయి. ఇప్పుడు అభిమానులు ఎదురు చూసినట్లుగా మరోసారి రెండు అగ్రశ్రేణి టీమ్‌ల మధ్య నాకౌట్ సమరానికి సర్వం సిద్ధమైంది. ఐసీసీ టోర్నీల్లో ప్రత్యేకంగా నాకౌట్ మ్యాచ్‌లలో భారత్, ఆసీస్ మధ్య మ్యాచ్ ఉండే తీవ్రతే వేరు... వన్డే వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత ఈ ఫార్మాట్లో ఇరు జట్లు మళ్లీ ఇప్పుడే తలపడబోతున్నాయి. చాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ మ్యాచ్‌కు, వరల్డ్ కప్ ఫైనల్‌కు మధ్య స్థాయి అంతరం ఎంతో ఉన్నా... ఆసీస్‌ను ఓడించి ఇంటికి పంపిస్తే వచ్చే మజాయే వేరు. ఈ టోర్నీలో లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌లలో గెలిచి టీమిండియా అజేయంగా నిలవగా, అగ్రశ్రేణి ఆటగాళ్లు లేకున్నా... ఇంగ్లండ్‌పై ఛేదన ఆసీస్ పట్టుదలను చూపించింది. దుబాయ్: చాంపియన్స్ ట్రోఫీలో లీగ్ దశ తర్వాత ఇప్పుడు అత్యంత కీలక మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో నేడు జరిగే తొలి సెమీఫైనల్లో మాజీ చాంపియన్లు భారత్, ఆ్రస్టేలియా తలపడనున్నాయి. వనరులు, ఫామ్‌ను బట్టి చూస్తే రోహిత్ బృందానిదే అన్ని రకాలుగా పైచేయిగా కనిపిస్తుండగా, చెప్పుకోదగ్గ బౌలింగ్ లేని ఆసీస్ పూర్తిగా తమ బ్యాటింగ్‌నే నమ్ముకుంది. భారత్ స్పిన్ చతుష్టయాన్ని కంగారులు ఎలా ఎదుర్కొంటారనేదే ఆసక్తికరం. అదే జట్టుతో... న్యూజిలాండ్‌తో చివరి లీగ్‌కు ముందు పేసర్ హర్షిత్ రాణాకు విశ్రాంతినిస్తూ జట్టు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని ఎంచుకుంది. తనకు లభించిన ఈ అవకాశాన్ని అద్భుతంగా వాడుకున్న అతను ఐదు వికెట్లతో తన విలువను ప్రదర్శించాడు. ఆసీస్ టాప్–7 ఆటగాళ్లలో మ్యాక్స్‌వెల్, స్మిత్‌లకు మాత్రమే వరుణ్‌ను ఎదుర్కొన్న అనుభవం ఉంది. స్టీవ్ స్మిత్ కూడా 2021 తర్వాతి అతని బౌలింగ్‌లో ఆడలేదు. ఆ తర్వాతే వరుణ్ తన బౌలింగ్‌ను మెరుగుదిద్దుకొని మరింతగా రాటుదేలాడు. కాబట్టి అతడిని పక్కన పెట్టి మళ్లీ రెండో పేసర్‌ను ఆడించే అవకాశం లేదు. మిగతా ముగ్గురు స్పిన్నర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ కూడా ఎంతో ప్రభావం చూపిస్తున్నారు. కాబట్టి ఇక్కడి పిచ్‌పై మన నలుగురు స్పిన్నర్లు మంత్రం బాగా పని చేస్తున్నట్లే. షమీకి తోడుగా హార్దిక్ పాండ్యా పేస్ బౌలింగ్ ఓవర్ల కోటా పూర్తి చేయగలిగితే చాలు. బ్యాటింగ్‌లో టాప్–3 గత మ్యాచ్‌లో విఫలమైనా... ఈ కీలక పోరులో చెలరేగిపోగల సత్తా వారికి ఉంది. శ్రేయస్ అయ్యర్ తన ఫామ్‌ను కొనసాగిస్తుండగా, కేఎల్ రాహుల్ కూడా రాణించాడు. అయితే రాహుల్ తన కీపింగ్‌లో మరింత చురుగ్గా ఉండాల్సిన అవసరం ఉంది. అక్షర్ బ్యాటింగ్‌లో అంచనాలకు మించి రాణిస్తుండటం సానుకూలాంశం. పాండ్యా దూకుడైన బ్యాటింగ్ చివర్లో భారత్‌కు భారీ స్కోరు అందించగలదు. ఓవరాల్‌గా చూస్తే టీమిండియా దాదాపు ఎలాంటి లోపాలు లేకుండా అన్ని రకాలుగా పటిష్టంగా కనిపిస్తోంది. బ్యాటర్లు రాణిస్తేనే... ముగ్గురు ప్రధాన పేసర్లు స్టార్క్, కమిన్స్, హాజల్‌వుడ్ దూరం కావడంతో టోర్నీకి ముందే ఆ్రస్టేలియా విజయావకాశాలు తగ్గిపోయాయి. అయితే ఇంగ్లండ్‌పై 352 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించడంతో ఆ జట్టు స్థాయి ఏమిటో కనిపించింది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ రద్దు కాగా, అఫ్గానిస్తాన్‌పై కూడా మ్యాచ్ ఆగే సమయానికి ఆసీస్ విజయం వైపు వెళుతోంది. బ్యాటింగ్‌లో ట్రవిస్ హెడ్, ఇన్గ్లిస్లు దూకుడుగా ఆడగల సమర్థులు కాగా... లబుషేన్, స్మిత్ ఇన్నింగ్స్‌ను నడిపించగలరు. మన టీమ్‌పై హెడ్ ఆట ఏమిటో కొత్తగా చెపాల్సిన అవసరం లేదు. చివర్లో కేరీ, మ్యాక్స్‌వెల్ వేగంగా పరుగులు రాబట్టగలరు. షార్ట్ గాయంతో దూరం కావడంతో అతని స్థానంలో వచ్చిన ఆల్‌రౌండర్ కూపర్ కనోలీ బరిలోకి దిగుతాడు. బ్యాటింగ్‌తో పాటు అతని లెఫ్టార్మ్ స్పిన్ కూడా కీలకం కానుంది. రెగ్యులర్ స్పిన్నర్ ఆడమ్ జంపా ఒక్కడే కాగా, మ్యాక్స్‌వెల్‌పై అదనపు భారం ఉంది. పిచ్‌ను బట్టి చూస్తే ముగ్గురు పేసర్లుతో ఆసీస్ ఆడుతుందా అనేది సందేహమే. డ్వార్షూయిస్ స్థానంలో మరో స్పిన్నర్ తన్వీర్ సంఘాను ఎంచుకునే అవకాశం కూడా ఉంది. స్పిన్, అనుభవం లేని పేస్‌తో భారత్‌ను నిలువరించడం అంత సులువు కాదు కాబట్టి అనుభవజ్ఞులైన బ్యాటర్లపై జట్టు ఆధారపడుతోంది. పిచ్, వాతావరణం టోర్నీలో ఇప్పటి వరకు జరిగిన అన్ని మ్యాచ్‌ల తరహాలోనే ఇప్పుడూ నెమ్మదైన పిచ్ సిద్ధంగా ఉంది. స్పిన్నర్లు సహజంగానే ప్రభావం చూపిస్తారు. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకోవడం ఖాయం. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: రోహిత్ (కెపె్టన్), గిల్, కోహ్లి, అయ్యర్, రాహుల్, అక్షర్, పాండ్యా, జడేజా, కుల్దీప్, షమీ, వరుణ్. ఆ్రస్టేలియా: స్మిత్ (కెప్టెన్), హెడ్, ఇన్‌గ్లిస్, లబుõÙన్, కనోలీ, కేరీ, మ్యాక్స్‌వెల్, ఎలిస్, స్పెన్సర్, జంపా, డ్వార్షుయిస్/సంఘా. -
భారత క్రికెట్లో ఓ చీకటి రోజు!
సాక్షి, స్పోర్ట్స్ : సరిగ్గా 22 ఏళ్ల క్రితం ఇదే రోజున భారత క్రికెట్ చరిత్రలో ఓ చీకటి రోజుగా నిలిచిపోయింది. భారత్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో భాగంగా 1996 మార్చి 13న కోల్‌కతా ఈడెన్ గార్డెన్ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు అవమానకర రీతిలో ఓటమి పాలైంది. అభిమానుల ఆగ్రహావేశాల మధ్య ప్రపంచకప్ పోటీ నుంచి నిష్ర్కమించింది. ప్రపంచకప్ సొంతమవుతోందని కలలు కన్న భారత అభిమానులకు కన్నీళ్లే మిగిలాయి. దీంతో అభిమానుల ఆగ్రహావేశాలు ప్రపంచ క్రికెట్ ముందు బీసీసీఐని దోషిగా నిలబెట్టాయి. ఒక బ్లాక్ డేగా మిగిలి పోయిన ఆనాటి మ్యాచ్‌ను ఒకసారి నెమరువేసుకుందాం. సచిన్ ఒక్కడే.. మహ్మద్ అజహరుద్దీన్ నాయకత్వంలోని టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 251 పరుగులు చేసింది. ఒక పరుగుకే రెండు వికెట్లు కోల్పోయిన లంక తర్వాత అనూహ్యంగా పుంజుకుంది. అరవింద్ డిసిల్వా, రోహన్ మహనామ అర్థసెంచరీలతో జట్టును నిలబెట్టారు. ముఖ్యంగా డిసిల్వా దుమ్మురేపే బ్యాటింగ్ తో భారత బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. 47 బంతుల్లో 14 ఫోర్లతో 66 పరుగులు బాదాడు. మహనామ జాగ్రత్తగా ఆడి 101 బంతుల్లో 6 ఫోర్లతో 58 పరుగులు చేశాడు. 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 8 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. అయితే సచిన్ టెండూల్కర్, మంజ్రేకర్ ఆచితూచి ఆడి 98 పరుగుల వరకు మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. 98 పరుగుల వద్ద సచిన్ రెండో వికెట్ గా అవుటయ్యాడు. తర్వాత వచ్చిన కెప్టెన్ అజహరుద్దీన్ డకౌట్ కావడంతో 99 పరుగుల వద్ద మూడో వికెట్ చేజార్చుకుంది. అక్కడి నుంచి టీమిండియా బ్యాటింగ్ పేకమేడల్లా కుప్పకూలింది. వచ్చిన బ్యాట్స్ మన్ వచ్చినట్టే పెవిలియన్‌కు క్యూ కట్టారు. 34.1 ఓవరల్లో 120 పరుగులు మాత్రమే చేసి 8 వికెట్లు కోల్పోయింది. ముగ్గురు ఆటగాళ్లు డకౌట్ కావడం విశేషం. అభిమానుల ఆగ్రహం.. భారత ఆటగాళ్ల నిర్లక్ష్యపు ఆటతో అభిమానుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కనీస పోరాటపటిమ కనబరచకుండా టీమిండియా బ్యాట్స్‌మెన్ నిష్క్రమించడంతో మైదానంలోని ప్రేక్షకులు విరుచుకుపడ్డారు. స్టేడియంలోని కొన్ని స్టాండ్లకు నిప్పుపెట్టారు. వాటర్ బాటిళ్లు మైదానంలోకి విసిరేశారు. దీంతో కొద్దిసేపు మ్యాచ్ నిలిచిపోయింది. ఆట మళ్లీ మొదలైన తర్వాత కూడా రగడ ఆగలేదు. ప్రేక్షకులు మరోసారి బాటిళ్లు విసిరారు. దీంతో మ్యాచ్ రిఫరీ ఆటను నిలిపివేశారు. అప్పటివరకు నమోదైన స్కోర్ల ప్రకారం శ్రీలంక గెలిచినట్టు ప్రకటించారు. ఫలితంగా తొలిసారిగా శ్రీలంక వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఇలా అభిమానుల కారణంగా మ్యాచ్ నిలిపోవడం అప్పటి వరకు అదే తొలిసారి. ఇక ఫైనల్లో ఆస్ట్రేలియాను 7 వికెట్ల తేడాతో ఓడించి లంకేయులు తొలిసారిగా విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. -
టీమిండియాకు ఘోర పరాభవం!
సరిగ్గా 21 ఏళ్ల క్రితం ఇదే రోజున వన్డే ప్రపంచకప్ లో టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది. 1996 ప్రపంచకప్ లో భాగంగా కోల్ కతా ఈడెన్ గార్డెన్ లో శ్రీలంకతో జరిగిన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు అవమానకరరీతిలో ఓటమి పాలైంది. అభిమానుల ఆగ్రహావేశాలతో ప్రపంచకప్ పోటీ నుంచి నిష్క్రమించింది. మహ్మద్ అజహరుద్దీన్ నాయకత్వంలోని టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 251 పరుగులు చేసింది. ఒక పరుగుకే రెండు వికెట్లు కోల్పోయిన లంక తర్వాత అనూహ్యంగా పుంజుకుంది. అరవింద్ డిసిల్వా, రోహన్ మహనామ అర్థసెంచరీలతో జట్టును నిలబెట్టారు. ముఖ్యంగా డిసిల్వా దుమ్మురేపే బ్యాటింగ్ తో భారత బౌలర్లకు వణుకు పుట్టించాడు. 47 బంతుల్లో 14 ఫోర్లతో 66 పరుగులు బాదాడు. మహనామ జాగ్రత్తగా ఆడి 101 బంతుల్లో 6 ఫోర్లతో 58 పరుగులు చేశాడు. 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 8 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. అయితే సచిన్ టెండూల్కర్, మంజ్రేకర్ ఆచితూచి ఆడి 98 పరుగుల వరకు మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. 98 పరుగుల వద్ద సచిన్ రెండో వికెట్ గా అవుటయ్యాడు. తర్వాత వచ్చిన కెప్టెన్ అజహరుద్దీన్ డకౌట్ కావడంతో 99 పరుగుల వద్ద మూడో వికెట్ చేజార్చుకుంది. అక్కడి నుంచి టీమిండియా బ్యాటింగ్ సైకిల్ స్టాండ్ ను తలపించింది. వచ్చిన బ్యాట్స్ మన్ వచ్చినట్టే పెవిలియన్ వరుస కట్టారు. 34.1 ఓవరల్లో 120 పరుగులు మాత్రమే చేసి 8 వికెట్లు కోల్పోయింది. ముగ్గురు ఆటగాళ్లు డకౌటయ్యారు. ఈ దశలో అభిమానుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కనీస పోరాటపటిమ కనబరచకుండా టీమిండియా చేతులేత్తేయడంతో మైదానంలోని ప్రేక్షకులు విరుచుకుపడ్డారు. స్టేడియంలోని కొన్ని స్టాండ్లకు నిప్పుపెట్టారు. వాటర్ బాటిళ్లు మైదానంలోకి విసిరేశారు. దీంతో కొద్దిసేపు మ్యాచ్ నిలిచిపోయింది. ఆట మళ్లీ మొదలైన తర్వాత కూడా రగడ ఆగలేదు. ప్రేక్షకులు మరోసారి బాటిళ్లు విసిరారు. దీంతో మ్యాచ్ రిఫరీ ఆటను నిలిపివేశారు. అప్పటివరకు నమోదైన స్కోర్ల ప్రకారం శ్రీలంక గెలిచినట్టు ప్రకటించారు. ఫలితంగా తొలిసారిగా శ్రీలంక వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఫైనల్లో ఆస్ట్రేలియాను 7 వికెట్ల తేడాతో ఓడించి లంకేయులు మొదటిసారిగా విశ్వవిజేతలుగా నిలిచారు.


