breaking news
Film Academy New York
-
అక్క చెప్పింది... చెల్లి వస్తోంది!
అతిలోకసుందరి శ్రీదేవి, నిర్మాత బోనీ కపూర్ల పెద్దకుమార్తె జాన్వీ కపూర్ ‘ధడక్’ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పైకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వారి చిన్న కుమార్తె ఖుషీ కపూర్ త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి సన్నాహాలు జరుగుతున్నాయని టాక్. ఈ విషయాన్ని జాన్వీ కపూర్ ఓ చాట్ షోలో భాగంగా కన్ఫార్మ్ చేశారు. ‘‘ఖుషీ యాక్టింగ్‌ని సీరియస్‌గా తీసుకుంది. ఏదో అలా వచ్చాంలే అనుకోకుండా ముందు ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటోంది. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో నటనలో శిక్షణ తీసుకోనుంది. ఈ విషయంపై నాన్న బోనీ కపూర్ కూడా కాస్త ఎగై్జటింగ్‌గానే ఉన్నారు’’ అని చెప్పుకొచ్చారు జాన్వీకపూర్. ఇక.. జాన్వీని ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసిన కరణ్ జోహారే తనను కూడా ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుందనే ఆలోచనను వ్యక్తపరిచారట ఖుషీకపూర్. ఆలియా భట్, సిద్దార్ధ్‌మల్హోత్రా, వరుణ్‌ధావన్ ఇలా చాలామంది స్టార్స్ కొడుకులు, కూతుర్లను కరణ్ ఇండస్ట్రీకి పరిచయం చేసిన సంగతి తెలిసిందే. అందరూ కూడా కెరీర్లో దూసుకెళుతున్నారు. -
శంకర్ మాటిచ్చారు
యువత తమ ప్రతిభకు సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి అద్భుతాలు సృష్టిస్తున్న రోజులివి. ఇంతకుముందు 10, 15 ఏళ్లు సహాయ దర్శకులుగా పనిచేసిన తర్వాతనే దర్శకులమయ్యేవారు. ఇప్పటి తరం వారు రెండు మూడేళ్లు ఫిలిం ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొంది నేరుగా మెగాఫోన్ పట్టేస్తున్నారు. వినూత్న శైలిలో సరికొత్త ఆలోచనలతో చిత్రాలను తెరపై ఆవిష్కరిస్తున్నారు. అలా తెర వెనుక, తెర ముందు ప్రతిభను చాటుకున్న యువకుడు కేజీ.సెంథిల్‌కుమార్. ఈ తిరుపూర్ యువకుడు హాలీవుడ్‌లోని న్యూయార్క్ ఫిలిం అకాడమీ మూడేళ్లు శిక్షణ పొందారు. తర్వాత ఇరవైకి పైగా షార్ట్ ఫిల్మ్‌లు చేశారు. వీటిలో కొన్ని అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో అవార్డులు అందుకున్నాయి ఆ అనుభవంతో కథ, దర్శకత్వం, నిర్మాత, కథా నాయ కుడు అన్నితానై తమిళంలో విళిమూడి యోసిత్తాల్ అనే చిత్రాన్ని తెరపై ఆవిష్కరించారు. తొలి ప్రయత్నంలోనే విజయం సాధించానన్నారు సెంథిల్‌కుమార్. తన చిత్రం రజనీకాంత్ లింగా ధాటికి తట్టుకుని ఇంకా నగరంలో నాలుగైదు థియేటర్లలో ప్రదర్శితమవుతోందని సంతోషం వ్యక్తం చేశారు. ఎఆర్.మురుగదాస్ తొలి చిత్రం తీస్తే ఎలా ఉంటుందో అలా తన చిత్రం ఉందని పత్రికల వారు ప్రశంసించారని అన్నారు. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు నటిస్తే గజిని చిత్రం అంత విజయం సాధించేదని పలువురు అన్నారని తెలిపారు. విళిమూడి యోసిత్తాల్ రొమాంటిక్ థ్రిల్లర్‌తో కూడిన రివెంజ్ కథా చిత్రమన్నారు. తన చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు శంకర్ చూస్తానని చెప్పడం ఆనందంగా ఉందన్నారు. తెలుగులో చేయాలని ఉంది. తమిళంలో తానే హీరోగా, దర్శక, నిర్మాతగా తెరకెక్కించిన చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయూలనుందని సెంథిల్‌కుమార్ అన్నారు. తెలుగులో ప్రభాస్, మహేష్‌బాబు, అల్లు అర్జున్‌లలో ఎవరు నటించినా ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉందన్నారు. ఆ ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు.