breaking news
Fiat Group Automobiles India
-
మార్కెట్లోకి ఫియట్ అవెంచురా
ధర రూ. 5.99 - రూ. 8.17 లక్షలు న్యూఢిల్లీ: కార్ల తయారీ దిగ్గజం ఫియట్ గ్రూప్ ఆటోమొబైల్స్ ఇండియా మంగళవారం భారత మార్కెట్లో స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం (ఎస్యూవీ) అవెంచురాను ఆవిష్కరించింది. దీని ధర రూ. 5.99- రూ. 8.17 లక్షల శ్రేణిలో (ఢిల్లీ ఎక్స్‌షోరూం) ఉంటుంది. ఇది పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభిస్తుందని కంపెనీ తెలిపింది. పెట్రోల్ వేరియంట్ రేటు రూ. 5.99-రూ. 7.05 లక్షల శ్రేణిలో, డీజిల్ వేరియంట్ ధర రూ. 6.89- రూ. 8.17 లక్షల శ్రేణిలో ఉంటుందని వివరించింది. మహారాష్ట్రలోని రంజన్‌గావ్ ప్లాంటులో అవెంచురాను ఉత్పత్తి చేస్తామని, ప్రాథమికంగా దేశీ మార్కెట్లోనే విక్రయిస్తామని సంస్థ భారత విభాగం ఎండీ నగేశ్ బసవనహళ్లి తెలిపారు. ఇప్పటిదాకా 500 ప్రీ-లాంచ్ బుకింగ్స్ జరిగాయని.. 15,000 పైచిలుకు ఎంక్వైరీలు వచ్చాయని నగేశ్ వివరించారు. ఈ ఏడాది మొత్తం అయిదు మోడల్స్‌ను ప్రవేశపెట్టాలని నిర్దేశించుకున్న ఫియట్... త్వరలో లగ్జరీ కారు అబార్త్ 500ను అందుబాటులోకి తేవాలని యోచిస్తోంది. ఇక, రాబోయే అయిదేళ్లలో 12 మోడల్స్‌ను ఆవిష్కరించాలని, 2015 నాటికి జీప్ బ్రాండ్ వాహనాలను భారత్‌లో ఉత్పత్తి చేయాలని సంస్థ భావిస్తోంది. ప్రస్తుతం కంపెనీ వార్షిక వాహన ఉత్పత్తి సామర్థ్యం 1,35,000గా ఉంది. దీన్ని 2018 నాటికల్లా 2,45,000 యూనిట్లకు పెంచుకోవాలని ఫియట్ నిర్దేశించుకుంది. -
4.55 లక్షల ధరతో మార్కెట్ లోకి ఫియట్ బుల్లికారు!
న్యూఢిల్లీ: మార్కెట్ లో ఎదురవుతున్న పోటీని ఎదుర్కోవడానికి పుంటో ఏవో పేరుతో మార్కెట్ లోకి చిన్నకారును ఫియట్ గ్రూప్ ఆటోమొబైల్స్ ఇండియా విడుదల చేసింది. పుంటో ఏవో కారు విలువ 4.55 లక్షల నుంచి 7.19 (ఢిల్లీ ఎక్స్ షోరూం ధర) లక్షల వరకు ఉంటుందని ఫియట్ కంపెనీ వెల్లడించింది. మారుతి స్విఫ్ట్, హుందాయ్ ఐ20, హోండా బ్రియోలకు పోటీగా డీజిల్, పెట్రోల్ వెర్షన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. డీజీల్ వెర్షన్ 5.27 లక్షల నుంచి ప్రారంభమై.. 7.19 లక్షల వరకు ఉంటుందని ఫియట్ ఇండియా అధ్యక్షుడు, ఎండీ నాగేశ్ బసవ్వన్ హల్లీ తెలిపారు. కస్టమర్ల అవసరాలకు దృష్టిలో ఉంచుకుని, భారతీయ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా కార్లను డిజైన్ చేస్తున్నామని ఫియట్ కంపెనీ తెలిపింది. ఫియట్ కంపెనీకి దేశవ్యాప్తంగా 93 పట్టణాల్లో 116 అవుట్ లెట్లు ఉన్నాయని నాగేశ్ తెలిపారు.