breaking news
feud
-
‘సమఉజ్జీల సమరం’ ఏమాత్రం కాదు!
దుబాయ్: ‘ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం...అదే ఒకడు మీద పడిపోతే దండయాత్ర’... తెలుగు సినిమాలో ఒక డైలాగ్ ఇది. భారత టి20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సరిగ్గా ఇదే అర్థం వచ్చేలా పాకిస్తాన్ గురించి చెప్పాడు. భారత్, పాక్ మధ్య మ్యాచ్ అంటే ఇప్పుడు పూర్తిగా ఏకపక్షమని అతను గుర్తు చేశాడు. అసలు ఇరు జట్ల మధ్య ఆటను ‘వైరం’తో పోల్చాల్సిన అవసరమే లేదని అతను స్పష్టం చేశాడు. భారత్, పాక్ మధ్య 2018 నుంచి జరిగిన గత 7 వన్డేల్లో భారత్ 6 గెలవగా, 1 మ్యాచ్ వర్షంతో రద్దయింది. ఇరు జట్ల మధ్య మొత్తం 15 టి20 మ్యాచ్‌లు జరగ్గా... భారత్ 11 గెలిచి, 3 మాత్రమే ఓడింది. వరుసగా గత 4 మ్యాచ్‌లలో మనదే పైచేయి. 2022లో ఓటమి తర్వాత రెండు ఫార్మాట్లు కలిపి మన జట్టు వరుసగా 7 మ్యాచ్‌లలో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో టీమిండియా ఆధిపత్యంపై సూర్య తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ‘భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌లకు ‘వైరం’ అనే మాటను ఇకపై వాడవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. అసలు ఇరు జట్ల మధ్య వైరం అనాల్సినంతగా పోటీ ఎక్కడ ఉంది. నా అభిప్రాయం ప్రకారం రెండు జట్ల మధ్య 15–20 మ్యాచ్‌లు జరిగి ఇద్దరూ 7–7తో సమంగా ఉండి లేదా 8–7తో కాస్త ఆధిక్యంలో ఉంటే సమ ఉజ్జీల సమరం అని చెప్పవచ్చు. కానీ సరిగ్గా అంకెలు గుర్తు లేవు కానీ ప్రస్తుతం ఇది 13–0 లేదా 10–1గా ఉంది. కాబట్టి ఇకపై ఇది అసలు పోటీనే కాదు’ అని సూర్య ఘాటుగా వ్యాఖ్యానించాడు. దూబే స్పెల్ కీలక మలుపు... పాక్ ఇన్నింగ్స్ డ్రింక్స్ విరామ సమయంలో ఆట మలుపు తిరిగిందని సూర్యకుమార్ అన్నాడు. సాధారణంగా పవర్‌ప్లే తర్వాత ఆట మారుతుందని, కానీ 10–17 ఓవర్ల మధ్య తాము పాక్‌ను కట్టడి చేయడంలో సఫలమయ్యామని కెపె్టన్ చెప్పాడు. ఈ 8 ఓవర్లలో పాక్ 38 పరుగులు మాత్రమే చేయగలిగింది. ‘స్పిన్నర్లు బాగానే బౌలింగ్ చేసినా నా దృష్టిలో శివమ్ దూబే స్పెల్ ఆటను మలుపు తిప్పింది. ఈసారి అతను తనకు లభించిన అవకాశాన్ని సమర్థంగా వాడుకుంటూ పూర్తి కోటా ఓవర్లు బౌలింగ్ చేశాడు. ప్రాక్టీస్ సెషన్లలో దూబే బౌలింగ్‌లో బాగా శ్రమించాడు. కొత్త బంతితో కూడా సాధన చేశాడు. ఈ మ్యాచ్‌లో పక్కా ప్రణాళికతో అతను వచ్చాడు’ అని సూర్య చెప్పాడు. మరోవైపు నీరు–నిప్పులాంటి గిల్, అభిషేక్ భాగస్వామ్యంపై కూడా సారథి ప్రశంసలు కురిపించాడు. ‘అభిషేక్ బ్యాటింగ్ శైలి అలాగే ఉంటుంది. పవర్‌ప్లే తర్వాత కూడా అతను తగ్గడు. గిల్ ఎలా ఆడతాడో కూడా అందరికీ తెలుసు. ఏ రకంగానైనా అతను పరుగులు రాబట్టగలడు. మైదానం బయట కూడా మంచి స్నేహం ఉంటే ఫలితం ఎలా ఉంటుందో వీరిద్దరు చూపించారు. నీరు–నిప్పులాంటి వీరిద్దరు కలిసి ఆడుతుంటే సమన్వయానికి ఒక కనుసైగ చాలు’ అని కెపె్టన్ వ్యాఖ్యానించాడు. ‘వాళ్లు అలా చేయడం నచ్చలేదు’ భారత్, పాక్ మ్యాచ్‌లలో సహజంగా కనిపించే కవ్వింపులు, మాటల యుద్ధం ఆదివారం మ్యాచ్‌లో కూడా కనిపించింది. వేర్వరు సందర్భాల్లో అభిషేక్ శర్మ, శుబ్ మన్ గిల్‌లకు హారిస్ రవూఫ్, షాహిన్ అఫ్రిదిలతో వివాదం రేగింది. దీనిపై మ్యాచ్ తర్వాత అభిషేక్ స్పష్టతనిచ్చాడు. పాక్ ఆటగాళ్ల ప్రవర్తన వల్లే తాను స్పందించాల్సి వచి్చందని అతను చెప్పాడు. ‘ఎలాంటి కారణం లేకుండా వారు మాపైకి దూసుకొచ్చి కవి్వంచే ప్రయత్నం చేశారు. అది నాకు అస్సలు నచ్చలేదు. నేను దూకుడుగా ఆడి చెలరేగడమే దానికి సరైన మందు అని భావించాను’ అని అభిషేక్ వెల్లడించాడు. తన బాల్య మిత్రుడు గిల్‌తో కలిసి భారీ భాగస్వామ్యం నెలకొల్పడం, అది జట్టు విజయానికి కారణం కావడం పట్ల అభిషేక్ సంతోషం వ్యక్తం చేశాడు. మరోవైపు హాఫ్ సెంచరీ చేశాక తాను గన్ షూటింగ్ తరహాలో చేసిన సంబరంలో ఎలాంటి తప్పూ లేదని పాక్ బ్యాటర్ సాహిబ్జాదా ఫర్హాన్ అన్నాడు. ‘ఆ క్షణంలో వచి్చన ఆలోచనతోనే నేను గన్ తరహాలో బ్యాట్‌తో అలా చేశాను. నేను సాధారణంగా 50 దాటినప్పుడు ఎలాంటి సంబరాలు చేసుకోను. అప్పటికప్పుడు నాకు అలా చేయాలనిపించింది. జనం దాని గురించి ఎలా ఆలోచిస్తారనేది నాకు అనవసరం. దానిని నేను పట్టించుకోను’ అని ఫర్హాన్ స్పష్టం చేశాడు. -
బాంబు పేల్చిన మస్క్.. ట్రంప్‌పై సంచలన ఆరోపణ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రముఖ బిలీయనీర్ ఎలాన్ మస్క్‌ల మధ్య గొడవలు నాటకీయ పరిణామాల నడుమ రోజురోజుకీ ముదురుతున్నాయి. ఇరువురు పరస్పరం సంచలన ఆరోపణలతో పోటాపోటీ పడుతున్నారు. తాజాగా.. ట్రంప్‌ను అభిశంసించి ఆ స్థానంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ను అధ్యక్షుడిగా చేయాలంటూ మస్క్ బహిరంగంగా ఒప్పుకున్నాడు. ఈ క్రమంలో మరో సంచలన ఆరోపణ చేశాడు.వాషింగ్టన్: ప్రముఖ బిలీయనీర్ ఎలాన్ మస్క్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై సంచలన ఆరోపణలకు దిగాడు. ‘‘పెద్ద బాంబులాంటి విషయాన్ని చెప్పాల్సిన సమయం వచ్చింది. ఎప్స్టీన్ ఫైల్స్(EPSTEIN FILES)లో ట్రంప్ పేరు ఉంది. అందుకే ఆ ఫైల్స్ వివరాలను బయటపెట్టడం’’ లేదంటూ ఓ పోస్ట్ చేశాడు. బిగ్ బ్యూటీఫుల్ బిల్ వ్యవహారంలో మస్క్ తీరునుతో తాను విసిగిపోయానంటూ ట్రంప్ మీడియా ముఖంగా చెప్పిన గంటలోపే మస్క్ ఈ ట్వీట్ చేయడం గమనార్హం. Time to drop the really big bomb:@realDonaldTrump is in the Epstein files. That is the real reason they have not been made public.Have a nice day, DJT!— Elon Musk (@elonmusk) June 5, 2025 ఎప్స్టీన్ ఫైల్స్(EPSTEIN FILES) అనేది అమెరికాలో సంచలనం సృష్టించిన జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణానికి సంబంధించిన కీలక పత్రాల వ్యవహారం. ఈ ఫైల్స్‌లో ఎప్స్టీన్ కాంటాక్ట్ లిస్ట్, ఫ్లైట్ లాగ్‌లు, అతనికి వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలు ఉన్నాయి. అయితే ఈ కేసులో ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు ఉన్నారని ఆరోపణలూ ఉన్నాయి. ప్రముఖ ఇన్వెస్టర్ అయిన ఎప్స్టీన్ లైంగిక వేధింపుల ఆరోపణలతో మీటూ ఉద్యమ సమయంలో అరెస్ట్ అయ్యాడు. ఆపై 2019లో జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించగా.. ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు ప్రకటించారు. అయితే ఈ ఫైల్స్ ఇప్పటిదాకా బయటకు రాకపోవడంతో అమెరికా రాజకీయాల్లో, మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. అంతకు ముందు.. తన మద్దతు లేకుంటే 2024 అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్, రిపబ్లికన్ పార్టీ నేతలు ఓటమి పాలయ్యేవారని టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ వ్యాఖ్యానించారు. ‘నేను లేకుంటే ట్రంప్ ఓడిపోయేవారు. ప్రతినిధుల సభపై డెమోక్రాట్లు ఆధిక్యం సాధించేవారు. సెనెట్‌లో రిపబ్లికన్లు 5149తో ఉండేవారు’ అని ఆయన గురువారం స్పష్టం చేశారు. అయితే.. అయితే మస్క్ వ్యాఖ్యలను ట్రంప్ తోసిపుచ్చారు. రిపబ్లికన్ ట్యాక్స్ బిల్లును మస్క్ వ్యతిరేకించడంతో తాను అసంతృప్తికి గురయ్యానని, శ్వేతసౌధంలో తన స్నేహితుడు(మస్క్‌ను ఉద్దేశించి..) లేకపోవడం విచారకరమని ట్రంప్ సైతం వ్యాఖ్యానించారు. తాను ఎన్నికల్లో విజయం సాధించడానికి మస్క్ అవసరం లేదని స్పష్టం చేశారు. మస్క్ లేకుండానే పెన్సిల్వేనియాలో తాను గెలిచేవాడినని తెలిపారు. మస్క్ వ్యాపారాలకు ఉపయోగపడే ప్రభుత్వ కాంట్రాక్టులకు, రాయితీలకు కోత వేస్తానని ట్రంప్ హెచ్చరించారు. అదే సమయంలో మస్క్ వరుసగా ఎక్స్‌లో స్పందించారు. ట్రంప్ చెప్పిందంతా అబద్ధమని అన్నాడు. బెదిరింపులకు తలొగ్గనని, అవసరమైతే స్పేస్ఎస్ ఒప్పందాన్ని ఆపేస్తానని బదులిచ్చాడు.In light of the President’s statement about cancellation of my government contracts, @SpaceX will begin decommissioning its Dragon spacecraft immediately pic.twitter.com/NG9sijjkgW— Elon Musk (@elonmusk) June 5, 2025 అదే సమయంలో.. కొత్త పార్టీ పెట్టవచ్చా? అని అభిమానులను ప్రశ్నించారు. ‘80శాతం మందికి ప్రాతినిధ్యం వహించేలా అమెరికాలో కొత్త పార్టీ పెట్టడానికి ఇది సమయమేనా?’ అని అడిగాడు. అలాగే ట్రంప్‌ను తొలగించాలంటూ ఓ వ్యక్తి వేసిన ప్రశ్నకు అవుననే బదులిచ్చాడు. Yes https://t.co/rqRsX8B4Hg— Elon Musk (@elonmusk) June 5, 2025తాను ప్రతిపాదించిన ఫెడరల్ ప్రభుత్వ వ్యయ నియంత్రణ బిల్లును.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ వ్యతిరేకించడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ బిల్లులోని ముఖ్యఅంశాలు తెలిసి కూడా వ్యతిరేకించారని, దాంతో తాను నిరాశ చెందానని చెప్పారు. ప్రభుత్వ వ్యయ నియంత్రణకు ఉద్దేశించిన ప్రభుత్వ సామర్థ్య విభాగం (డోజ్)కు మస్క్ అధిపతిగా ఉండడం, ఈ బిల్లును చూసిన తరువాత ఆ పదవికి రాజీనామా చేయడం గమనార్హం. గురువారం ట్రంప్ శ్వేత సౌధంలోని ఓవల్హౌస్లో విలేకరులతో మాట్లాడుతూ ఒక్క విద్యుత్తు వాహనాల అంశం తప్ప బిల్లులోని మిగిలిన అంశాలపై మస్క్‌కు అభ్యంతరాలు లేవని అన్నారు.‘మస్క్‌కు ఎంతో చేశాను. ఇద్దరి మధ్య గొప్ప స్నేహం ఉంది. అది కొనసాగుతుందో లేదో చెప్ప లేను. ఆయన నా గురించి ఎంతో గొప్పగా చెప్పారు. చెడుగా ఒక్క మాట అనలేదు. అయినా ఆయనతో అసంతృప్తి చెందా’ అని వ్యాఖ్యానించారు. ట్రంప్ వ్యాఖ్యలపై మస్క్ ఎక్స్‌లో స్పందిస్తూ వ్యయ నియంత్రణ బిల్లును తనకు చూపలేదని తెలిపారు. తన సహకారం లేకుంటే ఎన్నికల్లో ట్రంప్ గెలిచి ఉండేవారు కాదని అన్నారు. -
USA Presidential Elections 2024: వైషమ్యాలను పెంచుతారు
వాషింగ్టన్: రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ వ్యక్తులను పరస్పరం ఎగదోసి వారిమధ్య వైషమ్యాలు పెంచే రకమంటూ డెమొక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్ దుయ్యబట్టారు. ట్రంప్ కంటే చాలా మెరుగైన వ్యక్తి మాత్రమే అమెరికాకు నాయకత్వం వహించాలని అభిప్రాయపడ్డారు. స్వింగ్ రాష్ట్రమైన విస్కాన్సిన్లో ఆమె శుక్రవారం విలేకరులతో మాట్లాడారు.రాజకీయ ప్రత్యర్థులను, తనకు ఓట్లేయని వారని శత్రువులుగా భావించే ప్రమాదకరమైన మనస్తత్వం ట్రంప్ సొంతమని ఆక్షేపించారు. ఆయన జేబులో రాసిపెట్టుకున్న శత్రువుల జాబితా నానాటికీ పెరిగిపోతూనే ఉందన్నారు. ‘‘మరోవైపు రిపబ్లికన్ల నుంచి కూడా ఒకరికి నా మంత్రివర్గంలో చోటివ్వాలన్న మనస్తత్వం నాది. మా ఇద్దరి మధ్య ఇదే తేడా’’అని చెప్పుకొచ్చారు. భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం రాణిస్తుందన్నారు. -
నువ్వా.. నేనా
♦ పతాక స్థాయికి అధిపత్య పోరు ♦ టీడీపీ పాత, కొత్త నేతల మధ్య పెరుగుతున్న వైరం ♦ అధికారుల బదిలీలే వేదిక నిన్న అద్దంకి సీఐ బదిలీ వ్యవహారం... ♦ నేడు ఇరిగేషన్ ప్రాజెక్టుల ఎస్ఈ రమణమూర్తి బదిలీ ♦ రమణమూర్తిని కరణం బదిలీ చేయించారని ప్రచారం... ♦ బదిలీని నిలిపివేయాలని పట్టుబట్టిన గొట్టిపాటి ♦ గొట్టిపాటిని ప్రోత్సహిస్తున్న కరణం వ్యతిరేక వర్గం సాక్షి ప్రతినిధి, ఒంగోలు: టీడీపీ పాత, కొత్త నేతల మధ్య అధిపత్యపోరు పతాక స్థాయికి చేరింది. ముఖ్యంగా పాత నేత కరణం బలరాం కొత్తగా పార్టీలో చేరిన ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఢీ అంటే ఢీ అంటూ టీడీపీ వర్గవిభేదాలను పతాకస్థాయికి చేర్చారు. ఇటీవల అద్దంకి సీఐ బేతపూడి ప్రసాద్ వ్యవహారంలో ఇరువర్గాల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. సీఐని గొట్టిపాటి బదిలీ చేయిస్తే... కరణం ఆ బదిలీని అడ్డుకున్నారు. ఈ విషయం సమసిపోక ముందే ఇరిగేషన్ ప్రాజెక్టుల ఎస్ఈ రమణమూర్తి బదిలీ వ్యవహారం రచ్చకెక్కింది. రమణమూర్తిని ఇటీవల ఉన్నతాధికారులు విజయనగరం జిల్లాకు బదిలీ చేశారు. రమణమూర్తి బదిలీ వెనుక కరణం హస్తం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అద్దంకి నియోజకవర్గంలో నీరు-చెట్టు పనుల కోసం కరణం వర్గీయులు రూ.9 కోట్లతో ప్రతిపాదనలు ఇచ్చారు. చివరకు రూ.5 కోట్ల పనులు మాత్రమే మంజూరయ్యాయి. మిగిలిన పనులు మంజూరు కాకపోవడానికి ప్రాజెక్టుల ఎస్ఈ రమణమూర్తి కారణం అని భావించిన కరణం ఎస్ఈ బదిలీ కోసం ఒత్తిడి తెచ్చినట్లు ప్రచారం ఉంది. కరణంతో పాటు మరికొందరు అధికార పార్టీ నేతలు కూడా ఎస్ఈ బదిలీ కోసం ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. ఎస్ఈ బదిలీని అడ్డుకుని కరణం ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయాలని భావించిన కరణం వ్యతిరేక వర్గం గొట్టిపాటిని ముందు పెట్టి పావులు కదిపింది. దీంతో ఎస్ఈ బదిలీని నిలిపివేయాలంటూ గొట్టిపాటి రవికుమార్ శుక్రవారం గుంటూరులో ముఖ్యమంత్రిని కలిసి గట్టిగా విన్నవించారు. గొట్టిపాటి తానొక్కడే వెళ్లకుండా ఫిరాయింపు ఎమ్మెల్యేలతో కలిసి ఎస్ఈ బదిలీని నిలిపివేయాలని కోరారు. కరణం నిబంధనలకు విరుద్ధంగా పనులు మంజూరు చేయాలని ఎస్ఈపై ఒత్తిడి తెచ్చారని, ఆయన మాట విననందుకే ఎస్ఈ బదిలీకి కరణం పట్టుపట్టారని గొట్టిపాటితో పాటు ఫిరాయింపు ఎమ్మెల్యేలు సీఎంకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్ఈ బదిలీ వ్యవహారం ఎలా జరిగిందన్న దానిపై ముఖ్యమంత్రి ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమను విచారించినట్లు సమాచారం. అనంతరం ఎస్ఈ రమణమూర్తి బదిలీని నిలిపివేయాలంటూ ముఖ్యమంత్రి ఉన్నతాధికారులకు సూచించినట్లు ప్రచారం ఉంది. మరోవైపు జిల్లా ఉన్నతాధికారి సైతం రమణమూర్తి బదిలీని నిలిపివేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. రమణమూర్తి బదిలీ ఆగిపోతే టీడీపీ వర్గపోరు పతాకస్థాయికి చేరడం ఖాయం. ఇప్పటికే అద్దంకి సీఐ వ్యవహారంలో ఓటమి చెందిన గొట్టిపాటి ఎస్ఈ బదిలీని నిలుపుదల చేయించి కరణం ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయాలని గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఇక నుంచి ఒంటరిగా కాక, తనతో పాటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను వెంటబెట్టుకోవడంతో పాటు టీడీపీలో కరణం వ్యతిరేక వర్గీయుల మద్దతును కూడగట్టి కరణంపై అమీతుమీకి సిద్ధపడుతున్నట్లు సమాచారం. ఇదే సమయంలో కరణం సైతం తనకు మద్దతు పలుకుతున్న పాత నేతలతో కలిసి సీఎం వద్దే తేల్చుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇరువర్గాల గొడవ తీవ్రరూపం దాల్చుతోంది. చివరకు ఎవరిది పై చేయి అవుతుందో వేచి చూడాల్సిందే...! -
హ్యాపీ బర్త్ డే ఇక అందరిదీ...
ప్రపంచంలో అత్యంత గుర్తింపు పొందిన పాటల్లో ఒకటైన 'హ్యాపీ బర్త్ డే' పాటకు అడ్డంకులు తొలగిపోయాయి. ఇప్పుడు అందరూ హాయిగా పాడుకునే అవకాశం ఏర్పడింది. పేటెంట్ హక్కుల బంధనాలు వీడి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఆమెరికా పబ్లిషర్ 'వార్నర్ ఛాపెల్ మ్యూజిక్' సెటిల్ మెంట్ కు రావడంతో దీర్ఘకాలంపాటు కొనసాగిన చట్టపరమైన వివాదం ముగిసింది. మ్యూజిక్ సంస్థ గతంలో ఈ పాటకు 15 మిలియన్ డాలర్లు చెల్లించి పేటెంట్ హక్కులు పొందింది. హ్యాపీ బర్త్ డే టు యు.. అంటూ పుట్టినరోజు సందర్భాల్లో అందరూ పాడుకునే పాటపై 2013 లో వివాదం మొదలైంది. అమెరికాకు చెందిన వార్నర్ ఛాపెల్ మ్యూజిక్ కంపెనీ ఇప్పటిదాకా ఈ పాటకు రాయల్టీ పొందుతోంది. అయితే ఓ సినీ నిర్మాత ఈ పాటను తన సినిమాలో వాడుకోవడంతో కాపీరైట్ చట్టం కింద తనకు 1,500 డాలర్లు చెల్లించాలంటూ వార్నర్ చాపెల్ డిమాండ్ చేయడంతో వివాదం మొదలైంది. దాదాపు వందేళ్ళ క్రితం నుంచే అమెరికాలో ప్రముఖంగా వినిపించడమే కాక.. ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ పాడుకుంటున్న ఆ పాటకు రాయల్టీ చెల్లించాల్సిన అవసరం లేదని సినీ నిర్మాత సహా మరికొందర్ని భాగస్వాములుగా చేర్చి క్లాజ్ యాక్షన్ దావా దాఖలు చేశారు. దీంతో అప్పట్నుంచీ వివాదం కొనసాగుతోంది. అయితే తాజాగా ఆమెరికా లాస్ ఏంజిల్స్ ఫెడరల్ కోర్టు ముందు ఆ వివాదానికి తెరపడింది. పాటకు రాయల్టీగా పబ్లిషింగ్ హౌస్ కు 14 మిలియన్ డాలర్లను చెల్లించేందుకు, 2030 వరకూ అమల్లో ఉన్న రాయల్టీ చెల్లింపులు ఇక్కడితో ముగించేందుకు ఒప్పందం కుదిరింది. అయితే చాపెల్ సంస్థకు చెల్లించాల్సిన మొత్తంలో ఫిల్మ్ మేకర్స్, న్యాయవాదులు 4.62 మిలియన్ డాలర్లు... మిగిలిన మొత్తాన్ని ఈ పాట వాడుకున్న వారందరూ కలసి చెల్లించాలని కోర్టు నిర్ణయించింది. ఇలా ఒప్పందం కుదరడం ఎంతో ఆనందంగా ఉందని, ఇటువంటి సమస్య మరోసారి తలెత్తకుండా ఉండాలని ఫిర్యాదుదారులు కోరుకుంటున్నారు. గతంలో ఫిల్మ్ మేకర్స్ వార్నర్ చాపెల్ కు ఎటువంటి రాయల్టీ చెల్లించాల్సిన అవసరం లేదని అమెరికా సెంట్రల్ కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్ ఫెడరల్ కోర్టు తీర్పునిచ్చింది. అయితే ఈ పాట అందరికీ అందుబాటులోకి రావాలని, పబ్లిక్ డొమైన్ గా మారాలన్న ఉద్దేశ్యంతో తిరిగి కేసును కొసాగించారు. చివరికి తాజా తీర్పుతో వివాదం సర్దుమణిగింది. ఈ హ్యాపీ బర్త్ డే పాట 1893 లో వచ్చిన గుడ్ మార్నింగ్ టు ఆల్ అనే పాటనుంచి వాడకంలోకి వచ్చింది. ఆ పాటను అప్పట్లోనే అమెరికా స్కూళ్ళలో పాడినట్లుగా తెలుస్తోంది. తర్వాత గుడ్ మార్నింగ్ టు ఆల్ నుంచి హ్యాపీ బర్త్ డే గా ఇందులోని పదాలు మారాయి. ఇంగ్లీష్ లో అన్ని పాటలకంటే హ్యాపీ బర్త్ డే సాంగ్ ఎంతో ప్రాచుర్యం పొందినట్లు గిన్నిస్ బుక్ లెక్కలు చెప్తున్నాయి.


