breaking news
festival Navratri
-
Jute Jewellery: ఆకర్షణీయమైన అలంకరణకు ముచ్చటైన నారహారాలు..!
దేవీ నవరాత్రుల సందర్భంగా అతివలు తమ అలంకరణలో గ్రాండ్‌గా కనిపించే ఆభరణాలను మెడనిండుగా ధరించడాన్ని ఇష్టపడుతుంటారు. కొంత అడవి బిడ్డల ఆత్మీయత.. మరికొంత కోవెల ఆరాధన ఈ రెండింటినీ జత కలిపితే రూపొందిన డిజైన్లే జనపనార హారాలు, చోకర్లు. సంప్రదాయ చీరకట్టుకైనా, వెస్ట్రన్ డ్రెస్‌కైనా ఈ జనపనార ఆభరణం అందంగా ఆకట్టుకుంటుంది. జనపనారతో తయారు చేసిన దుస్తులు, తాళ్లు.. ఇతరత్రా వస్తువుల గురించి మనకు తెలిసిందే. కొంతవరకు జనపనార గొలుసుల మీదా ఆలోచన ఉండే ఉంటుంది. కానీ, సంప్రదాయ బంగారు పతకాన్ని గొలుసుకట్టుగా ఉండే హారానికి జత చేస్తే ఎంత అందంగా ఉంటుందో ఈ డిజైన్లను చూస్తే అర్థమైపోతుంది. రంగురంగులుగా వేసుకునే దుస్తుల మీదకు, ఈ తరహా ఫ్యూజన్ జ్యువెలరీ మరింత ఆకర్షణీయంగా కళ్లకు కడుతుంది. విడిగా నార గొలుసులను తీసుకొని వాటికి బంగారం లేదా వన్‌గ్రామ్ గోల్డ్ లేదా సిల్వర్ లేదా కలపతో తయారుచేసిన పెద్ద పెండెంట్‌ను జత చేస్తే చూడముచ్చటైన హారం అలంకరణకు సిద్ధంగా ఉంటుంది. ఈ హారానికి నప్పే చెవి హ్యాంగింగ్స్‌ను విడిగా తీసుకోవచ్చు. తక్కువ ధరలో కావాలో, వేలల్లో ఖర్చుపెట్టి తయారు చేయించుకోవాలో అది మన ఆసక్తిని బట్టి ఉంటుంది. ఎందుకంటే, వందల రూపాయల నుంచి వేల రూపాయల వరకు వీటి ఖరీదు ఉన్నాయి. విడివిడిగా కావల్సినవి సేకరించుకొని, ఇంట్లోనే ఈ హారాలను తయారు చేసుకోవచ్చు. జనపనార పోగులకు రంగులు అద్ది కూడా వీటికి భిన్నమైన డిజైన్లు తీసుకురావచ్చు. చదవండి: చర్మసౌందర్యానికి మరింత మేలు చేసే విటమిన్ ‘ఎ’ ఆహారం.. -
నవరాత్రుల్లో 'ఆర్ట్ ఆఫ్ లివింగ్'
ముంబైః దేశ వాణిజ్య రాజధాని ముంబై నగరంలో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సామాజిక సంస్థ 'ది ఆర్ట్ ఆఫ్ లివింగ్స్' ముంబై ఛాప్టర్ నవరాత్రి ఉత్సవాలను వైదిక మంత్రాలు, భజనలు, యజ్ఞ యాగాదులతోపాటు, చండీహోమం, శ్రీ సుబ్రహ్మణ్య హోమం, రుద్రహోమం, వాస్తు శాంతి హోమం వంటి అనేక హోమాలతో సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నట్లు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఓ ప్రకటనలో తెలిపింది. దసరా ఉత్పవాల్లో భాగంగా నిర్వహిస్తున్నరుద్ర హోమం ఆనారోగ్యాలను హరించేందుకు సహకరిస్తుందని, అలాగే సుదర్శన హోమం బద్ధకాన్ని తగ్గించి కొత్తఉత్సాహాన్నివ్వడంతోపాటు, జ్ఞానాన్ని పెంచుతుందని ఆర్ట్ ఆఫ్ లివింగ్ నిర్వాహకులు చెప్తున్నారు. ముఖ్యంగా ఇటువంటి ఏ హోమాలు నిర్వహించడం వల్ల వాతావరణం పరిశుద్ధమౌతుందని, అన్ని రకాలుగా ఎంతో మేలు చేకూరుతుందని తెలిపారు. భక్తులంతా ఒకేచోట చేరి ధ్యానాది ధార్మిక కార్యక్రమాలు నిర్వహించడం వల్ల పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనడంతోపాటు, మానసిక ప్రశాంతతను పొందుతారని చెప్తున్నారు. ముఖ్యంగా అక్టోబర్ 7 నుంచి 9 వరకు జరిగే ప్రత్యేక కార్యక్రమాల్లో అష్టమినాడు (దసరాల్లో ఎనిమిదవ రోజు) నిర్వహించే చండీ హోమం నవరాత్రి ఉత్సవాల్లోనే అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంటుందని వెల్లడించారు. చండీ సప్తశతిలో ఉండే 700 మంత్రాలు ఎంతో ప్రతీతిని పొందాయని ఈ మంత్రాలు ఎంతో శక్తిమంతమైనవని, నవరాత్రుల్లోని అష్టమినాడు వీటిని పఠిస్తూ హోమం నిర్వహించడంవల్ల సమాజానికి ఎంతో మేలు జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఎక్కడ చండీ ఆరాధనలు జరుగుతాయో అక్కడ దుర్బిక్షం ఉండదని, దుఃఖం అనేది దరికి చేరదని, లోకకల్యాణంకోసం నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని నిర్వాహకులు సూచించారు.