breaking news
Feroz Khan
-
ఎవరికి టికెట్ ఇవ్వాలన్నది పార్టీ నిర్ణయిస్తుంది :ఫిరోజ్ ఖాన్
-
Dailouge War:పొన్నం ప్రభాకర్ vs ఫిరోజ్ ఖాన్
-
రాహుల్, ప్రియాంక వయనాడ్‌లో పుట్టి పెరిగారా?
కాంగ్రెస్ పార్టీలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రగడ మొదలైంది. అభ్యర్థి ఎంపికపై అధిష్టానం ఫోకస్ పెంచడం.. స్థానికుడికే టికెట్ కేటాయించాలని నిర్ణయించడం.. గతంలో పోటీ చేసి ఓడిన అజారుద్దీన్‌కే టికెట్ దాదాపు ఖాయమనే సంకేతాలు అందిస్తోంది. ఈ తరుణంలో మరో మైనారిటీ నేత ఫిరోజ్ ఖాన్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ అభ్యర్థిగా అజారుద్దీన్ వైపు అధిస్థానం మొగ్గు చూపుతున్న వేళ.. ఆ టికెట్ ఆశావహుడు ఫిరోజ్ ఖాన్ మీడియా ముందుకు వచ్చారు. స్థానికులకే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తామన్న మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తం చేశారాయన. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వయనాడ్‌లో పుట్టి పెరిగారా? వాళ్లెందుకు వయనాడ్‌లో పోటీ చేస్తున్నారు? అని ఫిరోజ్ ఖాన్ ప్రశ్నించారు. ఎన్నికల్లో పోటీ అనేది అభ్యర్థి సత్తా, ప్రచారం జరిగే తీరుపై ఆధారపడి ఉంటాయని అంటున్నారాయన. ‘‘సీఎం ఉండే నియోజకవర్గం ఇది. ఈ ఉప ఎన్నిక కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకం. జూబ్లీహిల్స్‌లో ఇల్లు ఉంటేనే సీటు ఇస్తారా?. వయనాడ్‌లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ స్థానికులా?. స్థానికులకే ఇస్తామనడం సరికాదు’’... అని ఫిరోజ్ ఖాన్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల రేసులో తొలి నుంచి అజారుద్దీన్‌తో పాటు రోహిన్ రెడ్డి, విజయారెడ్డి, ఫిరోజ్ ఖాన్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. ఫిరోజ్ ఖాన్ ఇప్పటిదాకా నాలుగుసార్లు నాంపల్లి(హైదరాబాద్) నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఒకసారి ప్రజారాజ్యం, ఒకసారి టీడీపీ, రెండుసార్లు కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడారాయన. అయితే.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో.. నాంపల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఫిరోజ్ ఖాన్ పోటీ చేసి ఓడారు. మజ్లిస్ అభ్యర్థి మాజిద్ హుస్సేన్‌కు 39,360 ఓట్లు రాగా, ఫిరోజ్‌కు 36,363 ఓట్లు పోలయ్యాయి. సోషల్ మీడియాలోనూ ఫిరోజ్ ఖాన్ స్పీచ్‌లకు, డైలాగులకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది.