breaking news
fb messenger
-
ఫేస్బుక్లో మరో సరికొత్త ఆప్షన్
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్.. తన మెసెంజర్ యాప్ కోసం ఓ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సోషల్ మీడియా ద్వారా చాటింగ్ చేసేటపుడు ఉండే ఎన్క్రిప్షన్ సదుపాయం ఇప్పటివరకు వాట్సప్‌లో మాత్రమే ఉండగా, ఇకమీదట అలాంటి అవకాశం ఫేస్బుక్ మెసెంజర్‌లోనూ ఉంటుంది. 'సీక్రెట్ కన్వర్సేషన్స్' అనే ఫీచర్‌ను టాగిల్ కీ లా ఉపయోగించుకోవచ్చు. అంటే వాట్సప్‌లో అయితే మనం కావాలనుకున్నా, వద్దనుకున్నా కూడా ఎన్క్రిప్షన్ ఆటోమేటిగ్గా జరిగిపోతుంది. కానీ మెసెంజర్లో మాత్రం మనం కావాలనుకున్న వాటికి మాత్రమే అది ఉంటుంది. అయితే.. ఇక్కడో మెలిక కూడా ఉంది. ఒకసారి మనం ఆటోమేటిక్ ఎన్క్రిప్షన్ ఆన్ చేసుకుంటే.. మెసెంజర్లో ఉన్న దాదాపు వంద కోట్ల మంది యూజర్లు కూడా ప్రతి మెసేజికి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారి కొత్త వెర్షన్ డౌన్లోడ్ చేసుకుంటే ఈ సమస్య ఉండబోదని, కొత్త మెసేజి స్క్రీన్ మీద కుడిచేతి వైపు పైన 'సీక్రెట్' అనే కీ కనపడుతుందని, దాన్ని ట్యాప్ చేస్తే సరిపోతుందని ఫేస్బుక్ వర్గాలు అంటున్నాయి. అయితే సందేశాలు పంపేవాళ్లు, అందుకునేవాళ్లు కూడా కొత్త వెర్షన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. -
ఇక ఫేస్బుక్ మెసెంజర్‌లోనూ గేమ్స్ ఆడొచ్చు
ఫేస్బుక్ మెసెంజర్ అనగానే స్నేహితులతో చాటింగ్ చేయడం ఒక్కటే మనకు తెలుసు. కానీ ఇప్పుడు అందులోనూ గేమ్స్ ఆడుకునేలా సరికొత్త ఫీచర్ వచ్చి చేరుతోంది. డూడుల్ డ్రా గేమ్ ఒకదాన్ని ముందుగా అందులో యాక్టివేట్ చేశారు. యాప్‌తో పాటే ఈ గేమ్ అందుబాటులో ఉంటుంది. మెసెంజర్ ఓవర్‌ఫ్లో మెనూలో ఈ గేమ్ కనపడుతుంది. దాంతోపాటు అనేక యుటిలిటీ యాప్‌లు కూడా ఉంటాయి. అయితే, ఆటాడుకోవాలంటే మాత్రం ఒకసారి దాన్ని గూగుల్ ప్లే లేదా యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఫేస్బుక్ తన మెసెంజర్ యాప్‌ను విడుదల చేసిన తర్వాత లాంచ్ చేసిన మొదటి గేమ్ డూడుల్ డ్రా. వుయ్ చాట్, లైన్, వైబర్ లాంటి ఇతర మెసేజింగ్ యాప్‌లలో అయితే గేమ్స్ ఉన్నాయి. వీటి ద్వారా.. యూజర్లు చాటింగ్ చేయనప్పుడు కూడా తమ యాప్‌లు ఓపెన్ చేసేలా చూసుకుంటున్నాయి. ఇప్పుడు ఫేస్బుక్ మెసెంజర్లో కూడా అదే వ్యూహాన్ని అనుసరిస్తున్నారు.