breaking news
fasal beema yojana
-
బీమా కంపెనీలపై 12 శాతం పెనాల్టీ!
పంటల బీమా చెల్లించడంలో సంస్థలు ఆలస్యం చేస్తే 12 శాతం పెనాల్టీ విధిస్తామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో పంటల బీమా కోసం 3.51 కోట్ల దరఖాస్తులు రాగా, ఇప్పుడు వాటి సంఖ్య 8.69 కోట్లకు పెరిగిందన్నారు. రైతులు రూ.32,404 కోట్ల ప్రీమియం చెల్లించి మొత్తం రూ.2.71 లక్షల కోట్ల బీమా పొందారని తెలిపారు.ఈ మేరకు లోక్‌సభలో మంత్రి మాట్లాడుతూ..‘ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై ) కింద రైతులకు చెల్లించాల్సిన బీమా ఆలస్యం చేస్తే కంపెనీలపై 12 శాతం పెనాల్టీ విధిస్తాం. ఇది నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతుంది. పంటల బీమాకు సంబంధించి రాష్ట్రాల ప్రీమియం విడుదలలో జాప్యం జరుగుతోంది. బీమా చెల్లింపుల్లో జాప్యం జరగకుండా కేంద్ర ప్రభుత్వం వెంటనే తన వాటాను విడుదల చేస్తుంది. గత ప్రభుత్వంలో పంటల బీమా కోసం 3.51 కోట్ల దరఖాస్తులు రాగా, ఇప్పుడు అది 8.69 కోట్లకు పెరిగింది. రైతులు రూ.32,404 కోట్ల ప్రీమియం చెల్లించి మొత్తం రూ.2.71 లక్షల కోట్లకు బీమా పొందారు. సహజ కారణాల వల్ల నష్టపోయిన పంటలను ఈ పథకం కవర్ చేస్తోంది. 2023లో 5.01 లక్షల హెక్టార్ల పంట భూమి ఈ బీమా పరిధిలోకి వచ్చింది. అది 2024లో 5.98 లక్షల హెక్టార్లకు విస్తరించింది. దీని ద్వారా 3.57 కోట్ల మంది రైతులు ప్రయోజనం పొందుతున్నారు’ అని చెప్పారు.ఇదీ చదవండి: టీవీ ఛానెల్ ప్రసారాలకు కొత్త ఓటీటీ -
అధికారంలోకి వస్తే రూ.2 లక్షల రుణమాఫీ
శంకరపట్నం(మానకొండూర్) : తెలంగాణలో మేం అధికారంలోకి వస్తే రైతులకు రూ.2లక్షల రుణ మాఫీ చేస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శంకరపట్నం మండలం కేశవపట్నం వ్యవసాయ సబ్ మార్కెట్లో ఆదివారం బీజేపీ బహిరంగ సభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. మార్కెట్ ఆవరణలో నిర్వహించే సభాప్రాంగణాన్ని పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం పేదల ఒ క్కో ఇంటి నిర్మాణం కోసం రూ.1,55,000 రాష్ట్రానికి అందిస్తే.. ఒక్క డబుల్ బెడ్రూం నిర్మించలేదని ఆరోపించారు. వేల కోట్ల నిధులను తెలం గాణ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందన్నారు. ఫసల్‌బీమా రాష్ట్ర ప్రభుత్వం వైఖరితో ఎక్కువ సంఖ్యలో చేయలేదని మండిపడ్డారు, తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఈనెల 4న శంకరపట్నం మండలకేంద్రంలో నిర్వహించే బహిరంగ సభలో ఎండగడతామన్నా రు. సభకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, శాననసభాపక్ష నేత కిషన్‌రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి దత్తాత్రేయ, సీనియర్ నాయకులు హాజరవుతారని చెప్పారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షుడు అలివేలి సమ్మిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు ఇనకొండ నాగేశ్వర్‌రెడ్డి, గణపతి, ఉపాధ్యక్షుడు గుర్రాల వెంకటరెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ చదువు రాజేందర్‌రెడ్డి, కార్యదర్శి వెంకట్‌రెడ్డి, నాయకులు సూదగోని శ్రీనివాస్, కోరెం శ్రీనివాస్‌రెడ్డి, దండు కొంరయ్య, పుట్టపాక సమ్మయ్య, చల్ల ఐలయ్య, నరేందర్, జైపాల్, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. -
‘ఫసల్’ తుస్
ఫసల్ బీమా యోజన పథకానికి రుణమాఫీ అడ్డంకి నత్తనడకన రుణాల ప్రక్రియ.. 32 వేల మందికే వర్తింపు జిల్లాలో ఐదు లక్షల మందికిపైగా మొండిచేయి వ్యవసాయశాఖ వైఫల్యమూ కారణమే గజ్వేల్: జిల్లా రైతులను ‘ఫసల్ బీమా’ పథకం ఆదుకోలేకపోతోంది. పంట ఏ దశలో ఉన్నా ప్రీమియం చెల్లిస్తే నష్టపరిహారం వస్తుందంటూ పాత పథకానికి కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధన విధించినా.. ఆశించిన మేర విజయం సాధించలేదు. ఈ క్రమంలో బ్యాంకులు సైతం మూడో విడత రుణమాఫీ అందించడంలో జాప్యం చేసి రైతన్నలు భారీగా పంటనష్టాన్ని మూటగట్టుకునేలా చేశాయి. దీంతో ఇప్పటికే వరి, మొక్కజొన్న ఎండిపోగా మిగతా పంటలూ ఇదే దారి పట్టాయి. ఈసారి 3.72 లక్షల హెక్టార్లలో సాగు జిల్లాలో ఈసారి 3.72 లక్షల హెక్టార్లలో పంటలు సాగులోకి వచ్చాయి. ఇందులో మొక్కజొన్న 1.22 లక్షల హెక్టార్లు, పత్తి 84,175 లక్షల హెక్టార్లు, వరి 34,272 హెక్టార్లు, కంది 40,593 హెక్టార్లు, సోయాబీన్ 29,396 హెక్టార్లు, పెసర్లు 27,351 హెక్టార్లు, మినుములు 16,287 హెక్టార్లు, జొన్న 8,738 హెక్టార్లు, చెరకు 6,814 హెక్టార్లు సాగులోకి వచ్చాయి. ఆగస్టు మొదటి, రెండో వారాల్లో వర్షాలు లేకపోవడంతో ప్రధానంగా మొక్కజొన్న పంటకు భారీనష్టం వాటిల్లింది. వాస్తవానికి జూలై చివరి వారం నుంచి ఆగస్టు రెండో వారం వరకు మొక్కజొన్నకు కీలకదశ. అదునులో వర్షాలు లేక చెల్క భూముల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మిగతా పంటలపైనా నష్టం ఎక్కువగానే ఉంది. వరి పైర్లు ఎక్కడికక్కడ ఎండిపోయాయి. ఇలాంటి దశలో పంటల బీమా ఆదుకుంటుందన్న ఆశ రైతుల్లో ఏమాత్రం లేదు. మార్పులతో లాభమేనా?! ఈసారి పంటల బీమా పథకానికి మార్పులు చేసి సమర్థంగా అమలు చేయడానికి కేంద్రం నిర్ణయించింది. కొత్తగా తీసుకొచ్చిన పథకంలో ఖరీఫ్‌లో సాగుచేసే ఆహార, నూనె గింజలు, వాణిజ్య, ఉద్యాన పంటలకు పంటల వారీగా, ప్రాంతాల వారీగా ప్రీమియం నిర్థేశించారు. అగ్నిప్రమాదం, పిడుగుపాటు, గాలివాన, వడగళ్లు, తుఫాను, అనావృష్టి, వరదలు, నీట మునగడం, తెగుళ్ల వల్ల దిగుబడులకు నష్టం వాటిల్లితే పరిహారం చెల్లిస్తారు. అంతేకాకుండా ప్రతికూల వాతావరణం వల్ల విత్తకపోవడం, నార్లు వేయకపోవడం వల్ల కలిగే ఆర్థిక నష్టాలకు బీమా మొత్తంలో దాదాపు 25 శాతం సత్వర పరిహారం అందించే అవకాశం ఉంది. పంట మధ్యకాలంలో నష్టపోతే పరిహారంలో 25 శాతం చెల్లించే వెసులుబాటు కూడా ఉంది. అదేవిధంగా కోతల తర్వాత పొలంలో ఆరబెట్టిన పంటకు 14 రోజుల్లోపు తుఫాను కారణంగా నష్టం జరిగితే షరతులతో కూడిన చెల్లింపులు జరుగుతాయి. ‘యూనిట్’ లెక్కలు మొక్కజొన్న పంటను గ్రామ యూనిట్‌గా మిగిలిన పంటలను మండల యూనిట్‌గా అమలు చేస్తున్నారు. ఈ నిబంధనల ప్రకారం జిల్లాలో ప్రభుత్వం మొక్కజొన్న ఎకరాకు రూ.20 వేల బీమా సౌకర్యాన్ని కల్పించగా ఇందులో రైతు 2 శాతం అంటే రూ.400 ప్రీమియం చెల్లించాలి. వరి ఎకరాకు రూ.28 వేల బీమా వర్తింపునకు 1.5 శాతం అనగా రూ.420, జొన్న ఎకరాకు రూ.10 వేల బీమా అవకాశముండగా 2 శాతం రూ.200, కందికి రూ.13 వేల బీమాకు 2 శాతం రూ.260, పెసర్లు రూ.10 వేల బీమాకు 2 శాతంగా రూ. 200, మినుములు రూ.10 వేల బీమాకు 2 శాతం రూ.200 ప్రీమియం చెల్లించాలి. వర్షాధారంగా సాగుచేసే వేరుశనగ ఎకరాకు రూ.16 వేల బీమాకు 2 శాతం రూ.320 ప్రీమియం చెల్లించాలి. మిర్చికి ఎకరాకు రూ.24 వేలు ఇచ్చే అవకాశం ఉండగా ఇందులో 5 శాతంగా రూ.1200 ప్రీమియం చెల్లించాలి. ఇక సోయాబీన్ ఎకరాకు రూ.13 వేల బీమా అందే అవకాశముండగా 2 శాతంగా రూ.260 ప్రీమియంగా రైతు చెల్లించాలి. నెమ్మదించిన రుణాల ప్రక్రియ జిల్లాలో మూడో విడత రుణమాఫీలో భాగంగా రైతులకు రూ.483 కోట్ల బడ్జెట్ అందాల్సి ఉంది. కానీ, ఇప్పటి వరకు విడుదలైంది రూ.240 కోట్లు మాత్రమేనని జిల్లా వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఫలితంగా రుణాల పంపిణీ ప్రక్రియ నెమ్మదించింది. ఫసల్ బీమా యోజన బ్యాంకులో రుణాలు పొందే ప్రతి రైతు నుంచి నిర్బంధంగా ప్రీమియం డబ్బులు వసూలు చేసి పథకాన్ని వర్తించేలా చూస్తారు. కానీ, జిల్లాలో ఇప్పటి వరకు రుణాలు పొందింది కేవలం 32 వేల మంది రైతులు మాత్రమే. దాదాపు 5 లక్షల మందికిపైగా రైతులు రుణాలు పొందాల్సి ఉంది. బ్యాంకు రుణాలతో ఫసల్‌బీమా వర్తించే గడువు ఆగస్టు 10తో ముగిసింది. ఫలితంగా వీరందరి ఆశలు అడియాశలు అయ్యాయి. ఇదిలా ఉండగా, రుణాల ప్రక్రియతో ప్రమేయం లేకుండా ప్రీమియం చెల్లించుకునేలా రైతులను చైతన్య పర్చడంలో వ్యవసాయశాఖ పూర్తిగా విఫలం కావడం కూడా మరో కారణం. బ్యాంకోల్ల చుట్టూ తిరిగినా లాభం లేదు బ్యాంకుల్లో రుణాలు పొందే రైతులకు ఆగస్టు 10 వరకు మాత్రమే ఫసల్‌బీమా వర్తిస్తుందని తెల్సింది. బ్యాంకోల్ల చుట్టూ తిరిగినా బడ్జెట్ సరిగ్గా రాలేదని రుణం ఇయ్యలే. నాకు 8 ఎకరాల సొంత భూమి ఉంది. మరో 20 ఎకరాలు కౌలుకు తీసుకున్నా. ఇందులో 9 ఎకరాల్లో మొక్కజొన్న, 17 ఎకరాల్లో పత్తి, 4 ఎకరాల్లో వరి వేశా. మొక్కజొన్న పాడైంది. బ్యాంకు లోన్ ముందుగా వచ్చి ఉంటే నష్టం అంతగా ఉండేది కాదు. - రైతు నరేందర్‌రెడ్డి, ధర్మారెడ్డిపల్లి, గజ్వేల్ మండలం రుణాల ప్రక్రియలో జాప్యం జిల్లాలో రుణాల ప్రక్రియ వేగంగా సాగలేదు. ఫలితంగా ఫసల్‌బీమా పథకంలో రైతులు చేరలేకపోయారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. రుణమాఫీ ప్రక్రియ వేగవంతమయ్యే అవకాశముంది. బడ్జెట్ విడుదల కాగానే రైతులందరికి రుణాలు అందిస్తాం. - మాధవీ శ్రీలత, జేడీఏ