breaking news
Farooq Ahmad
-
‘పబ్జీ’ మొబైల్ గేమ్ సృష్టికర్త మృత్యువాత!
‘పబ్జీ (PUBG - Player Unknown's Battlegrounds)’.. ఈ ఆట గుర్తుండే ఉంటుంది కదా. పబ్జీ గేమ్ ఇప్పుడు చాలా దేశాల్లో నిషేధించినప్పటికీ 2019లో గేమింగ్ మోడ్‌తో ప్రపంచాన్ని శాసించింది. అప్పట్లో పిల్లల నుంచి పెద్దల దాకా పబ్ జీ గేమ్‌కు అలవాటు పడి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. కొందరు ఈ ఆటలో బానిసలుగా మారి ప్రాణాలు విడిస్తే.. కొంతమంది మానసిక రోగాల బారిన పడ్డారు. పబ్జీ గేమ్ అనేది ఒక ప్రాణాంతక వీడియో గేమ్ అని భావించిన ప్రపంచ దేశాలు దీనిపై యుద్ధాన్ని ప్రకటించి తమ దేశాల్లో నిషేధం విధించాయి. అందులో భారత్ కూడా ఒకటి.మరి ఇప్పుడు పబ్జీ గేమ్ గురించి ప్రస్తావన ఎందుకంటే.. తాజాగా పబ్జీ మొబైల్ సృష్టికర్తల్లో ఒకరైన ఫరూఖ్ అహ్మద్ కారు యాక్సిడెంట్లో మృత్యువాత పడ్డాడు. కెనడాలోని కాల్గరీలో కారు, తాను ప్రయాణిస్తున్న మోటారుసైకిల్‌ను ఢీకొట్టడంతో, ప్రమాదంలో 28 ఏళ్ల ఫరూఖ్ అహ్మద్ తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. కాగా ఫరూఖ్ అహ్మద్ మరణవార్తను పబ్ జీ మొబైల్ తన ఎక్స్ వేదికగా ప్రకటనను విడుదల చేసింది. "ఫరూఖ్, నీ ఆత్మకు శాంతి చేకూరాలి. నిన్ను ఎప్పటికీ గుర్తుంచుకుంటాం. పబ్జీ మొబైల్ కమ్యూనిటీ ఒక ఆత్మీయుడిని కోల్పోయాం. ఫరూఖ్ తన సేవలతో మన కమ్యూనిటీకి ఉత్సాహాన్ని అందించడంతో పాటు మరపురాని క్షణాలను అందించాడు. ఆయన మరణవార్త మమ్మల్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అతడి కుటుంబానికి, స్నేహితులకు మా ప్రగాఢ సానుభూతి." అని పబ్జీ మొబైల్ తన సంతాపం వ్యక్తం చేసింది.ఎవరీ ఫరూఖ్ అహ్మద్?1998లో పాకిస్తాన్లో జన్మించిన ఫరూఖ్ అహ్మద్, దక్షిణాసియా, అంతర్జాతీయ పబ్ జీ మొబైల్ రంగాలలో తనదైన ముద్ర వేశారు. యూట్యూబ్‌లో 9,25,000 మందికి పైగా సబ్స్క్రైబర్లను, ఇన్‌స్టాగ్రామ్‌లో సుమారు 85,000 మంది ఫాలోవర్లను సంపాదించుకున్న ఆయన, పబ్జీ గేమ్‌కు అధికారిక మొబైల్ భాగస్వామిగా, కెనడియన్ అంబాసిడర్‌గా అధికారిక హోదాను పొందారు.పబ్జీ అంటే?పబ్జీ అంటే.. ప్లేయర్ అన్నోన్స్ బ్యాటిల్ గ్రౌండ్ (PUBG) అని అర్థం. దక్షిణ కొరియాలోని ఓ గేమింగ్ సంస్థ ఈ మల్టీ ప్లేయర్ గేమింగ్ యాప్‌ను రూపొందించింది. ఈ గేమ్ ఆడాలంటే ముందుగా పబ్జీ యాప్‌ను మొబైల్‌లోకి డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ తర్వాత ఐడీ లభిస్తుంది. అయితే, ఈ ఆటను సింగిల్‌గా కాకుండా జట్టుగా ఆడితేనే మజా ఉంటుంది. దీంతో కొంతమంది టీమ్‌లుగా ఏర్పడి మరీ ఈ గేమ్ ఆడుతున్నారు. ఈ గేమ్ ఆడే వ్యక్తి.. ఆ ఆటలో సైనికులుగా మారిపోతారు. ఆ తర్వాత వందకు పైగా శత్రువులతో పోరాడాల్సి ఉంటుంది. ఒకసారి ఆట మొదలైందంటే.. యుద్ధంలో ఉన్నట్లే. అప్రమత్తంగా లేకపోతే శత్రువులు చంపేస్తారు. దీంతో ఈ ఆట ఆడేవారు పరిసరాలను మరిచిపోయి అందులో లీనమైపోతారు. ఈ ఆట పీసీ, ఎక్స్‌బాక్స్ వన్, ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఫోన్లల్లో అందుబాటులో ఉంది. Rest in peace, Farooq. You will always be remembered.The PUBG MOBILE community has lost one of its own.Farooq brought passion, kindness, and so many unforgettablemoments to our community. We are grateful to have known him and honored to have shared this journey with him.Our… pic.twitter.com/h4xdPNMZ9X— PUBG MOBILE (@PUBGMOBILE) August 28, 2026Read: ఎలా అనుమతిస్తారు? సంజయ్ బంగర్ కుమార్తెపై విమర్శలు -
కాల్పుల కేసులో ఫారూఖ్‌కు జీవిత ఖైదు
ఆదిలాబాద్‌టౌన్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 2020, డిసెంబర్ 18న జరిగిన కాల్పుల కేసులో ప్రధాన నిందితుడు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఫారూఖ్ అహ్మద్‌కు ప్రత్యేక న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో ఏ–2, ఏ–3లను నిర్దోషులుగా ప్రకటించింది. ఈ మేరకు ప్రత్యేక కోర్టు జడ్జి, జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి డాక్టర్ టి.శ్రీనివాస్‌రావు సోమవారం తీర్పునిచ్చారు. ఫారూఖ్‌ను కోర్టుకు తీసుకొచ్చినప్పటికీ కోవిడ్ దృష్ట్యా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తీర్పు చెప్పారు. ఫారుఖ్ మరో గదిలో ఉండి జడ్జి తీర్పు విన్నాడు. విచారణలో నిందితుడి నేరం రుజువైందని జడ్జి ప్రకటించారు. ప్రత్యేక కోర్టు .. ఫారూఖ్‌కు జీవిత ఖైదుతోపాటు రూ.12వేల జరిమానా విధించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముస్కు రమణారెడ్డి, జిల్లా ఎస్పీ డి.ఉదయ్‌కుమార్ రెడ్డిలు వెల్లడించారు. ఆదిలాబాద్ పట్టణంలోని తాటిగూడకు చెందిన ఫారూఖ్ అహ్మద్ తన ప్రత్యర్థి వర్గానికి చెందిన మాజీ కౌన్సిలర్ సయ్యద్ జమీర్, సయ్యద్ మన్నాన్, సయ్యద్ మోతిషీన్పై తుపాకీతో కాల్పులు జరిపాడు. గాయపడిన సయ్యద్ జమీర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. -
‘షాదీ ముబారక్‌లో అధికారులే బాధ్యులు’
ఆదిలాబాద్ కల్చరల్ : జిల్లాలో జరిగిన షాదీ ముభారక్ పథకంలో అవినీతికి ఎమ్మార్వో, ఆర్ఐ, వీఆర్వో వంటి అధికారులే బాధ్యులని వారిని సైతం చట్టపరంగా శిక్షించాలని ఎంఐఎం జిల్లా ఇన్చార్జి మున్సిపల్ చైర్పర్సన్ ఫరూక్ అహ్మద్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం కుటుంబీకులకు అధికారులు, నాయకులు దళారులు రూ. 10 వేల చొప్పున ఇచ్చి అది రుణంగా చెప్పినట్లు బాధితులు ఆరోపిసున్నట్లు పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.


