breaking news
Farmers Training Center
-
16న సేంద్రియ కూరగాయల సాగుపై శిక్షణ
సేంద్రియ వ్యవసాయ విధానంలో కూరగాయలు, ఆకుకూరల సాగుపై ఫిబ్రవరి 16 (ఆదివారం)న గుంటూరు జిల్లా కొర్నెపాడులోని రైతు శిక్షణా కేంద్రంలో శిక్షణ ఇవ్వనున్నట్లు రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ డా. వై. వెంకటేశ్వరరావు తెలిపారు. ఉద్యాన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రాజాకృష్ణారెడ్డి, సేంద్రియ రైతు శివనాగమల్లేశ్వరరావు(గుంటూరు జిల్లా) ఉ. 10 గం. నుంచి సా. 4 గం. వరకు శిక్షణ ఇస్తారు. వివరాలకు.. 97053 83666, 0863–2286255 సేంద్రియ ఉత్పత్తుల మార్కెటింగ్‌పై 5 రోజుల శిక్షణ సుస్థిర వ్యవసాయ కేంద్రం(సి.ఎస్.ఎ.), గ్రామీణ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో సేంద్రియ ఆహారోత్పత్తుల వ్యాపార నిబంధనలపై ఫిబ్రవరి 17 నుంచి 21వ తేదీ వరకు హైదరాబాద్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు సి.ఎస్.ఎ. ఈడీ డా. జీవీ రామాంజనేయులు తెలిపారు. వివరాలకు: 85006 83300 -
భావదేవరపల్లిలో మత్స్య పరిశోధన కేంద్రం
భావదేవరపల్లి (నాగాయలంక) : గ్రామంలో మత్స్య పరిశోధన, ఉప్పు నీటì æపరిశోధన కేంద్రాల ఏర్పాటుకు ఉన్నతస్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకుంటుంటామని రాష్ట్రవ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హామీ ఇచ్చారు. స్థానిక శ్రీవెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం–మండలి వెంకట కృష్ణారావు ఫిషరీస్ పాలిటెక్నిక్ కళాశాలలో రూ.81 లక్షలతో నిర్మించిన రైతుశిక్షణ కేంద్రం, విశ్రాంతి గదుల భవనాలను శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌తో కలసి మంత్రి ప్రత్తిపాటి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మత్స్యకారులకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తోందన్నారు. చేపల వేట విరామ కాలంలో ప్రభుత్వం ప్రకటించిన ఆర్థికసాయం అందలేదని పలువురు మత్య్స్యకారులు ఆందోళన వ్యక్తం చేయడంతో, పుష్కరాలు ముగిసిన వెంటనే ఉన్నతాధికారులను పిలిపించి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఫిషరీస్ పాలిటెక్నిక్ కాలేజీలో పనిచేస్తున్న ఉద్యోగాలను రెగ్యులర్ చేస్తామని, విద్యార్థుల సీట్లసంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకుంటానని మంత్రి పేర్కొన్నారు. బుద్ధప్రసాద్ మాట్లాడుతూ మత్య, ఉప్పునీటి పరిశోధన కేంద్రాల ఆవశ్యకతను వివరించారు. ఫిషరీస్ కాలేజీ, రైతుశిక్షణ æకేంద్రాలు దివిసీమ మానసపుత్రికలుగా అభివర్ణించారు. ఉప్పునీటి చేపల ప్రదర్శన నాగాయలంక కేజ్‌కల్చర్ శాస్త్రవేత్త తలశిల రఘుశేఖర్, విద్యార్థులతో కలసి ఏర్పాటు చేసిన 15 రకాల ఉప్పునీటి చేపల ప్రదర్శనను మంత్రి ప్రత్తిపాటి తిలకించారు. కళాశాల ప్రాంగణంలోని చెరువులలో వనామి జాతి రొయ్యపిల్లలు, రాగండి చేపపిల్లలను మంత్రి, ఉపసభాపతి వదిలారు. బాలబాలికల వసతిగృహాల మొదటి అంతస్తుకు శంకుస్థాపన కూడా చేశారు. ఎస్వీవీయూ ఫిషరీస్సైన్స్ డీన్ టి.వి.రమణ, దివి మార్కెట్ కమిటీ చైర్మన్ మండవ బాలవర్ధిరావు, సర్పంచ్ మండలి బేబీసరోజినీ, ఎంపీటీసీ సభ్యులు బొండాడ గణపతిరావు, తలశిల స్వర్ణలత, నీటిసంఘం అధ్యక్షుడు మండలి ఉదయభాస్కర్, కళాశాల ప్రిన్సిపాల్ ఎన్.వీరభద్రరావు పాల్గొన్నారు. -
మహారాష్ట్రలో మహిళా రైతుల పర్యటన
ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్: రాజేంద్రనగర్ రైతు శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన 23మంది మహిళా రైతులు ఇటీవల మహారాష్ట్రలో విజ్ఞాన యాత్రకు వెళ్లి వచ్చారు. వీరిలో ఇబ్రహీంపట్నం మండలంలోని చర్లపటేల్‌గూడ గ్రామానికి చెందిన ఏడుగురు మహిళా రైతులతో పాటు జిల్లాలోని పెద్దేముల్, ధారూరు, గండేడ్, చేవెళ్ల తదితర మండలాలకు చెందిన మరో 16 మంది మహిళా రైతులు ఉన్నారు. ఐదు రోజుల యాత్రలో మహారాష్ట్రలోని పలు వ్యవసాయ పరిశోధనా కేంద్రాలను, వ్యవసాయ క్షేత్రాలను సందర్శించడంతో పాటు ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేను కలుసుకోవడం విశేషం. యాత్ర మొదటి రోజున మహారాష్ట్రలో పూనే జిల్లాలోని బారామతి గ్రామాన్ని సందర్శించారు. అక్కడి కృషి (కేవీకే) విజ్ఞాన్ కేంద్రానికి వెళ్లి అక్కడ చేపడుతున్న పలు కార్యక్రమాలను పరిశీలించారు. కేంద్రం ప్రాజెక్టు ఆఫీసర్ డాక్టర్ సచిన్ కలాడే ఆధ్వర్యంలో అక్కడి మట్టి పరీక్షా ల్యాబ్, మ్యూజియం, బయో ఫర్టిలైజర్, శారద మహిళా సంస్థ నిర్వహిస్తున్న మేకల పెంపకం యూనిట్‌ను, రైతుల కోసం నిర్వహిస్తున్న ఎఫ్ఎం రేడియో స్టేషన్‌ను సందర్శించారు. ఆ తర్వాత కేవీకే నిర్వహిస్తున్న నర్సరీలో దానిమ్మ, సపోటా, జామ, చింత, చెరుకు పంటలను మహిళా రైతులు పరిశీలించారు. అక్కడే ఇజ్రాయిల్ పద్ధతిలో నిర్వహిస్తున్న డెయిరీని సందర్శించారు. పర్యావరణానికి ప్రతీకగా హజారే స్వగ్రామం రాలేగావ్‌సిద్ధి యాత్ర లో రెండో రోజు బారామతి సమీపంలోని షల్టాన్లో నారీ నీంబ్కర్ వ్యవసాయ పరిశోధనా సంస్థను సందర్శించారు. సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలకు సంబంధించిన డాక్యుమెంటరీని ప్రదర్శించారు. ఆ తర్వాత రైతులు అక్కడే ఉన్న మేకలు, గొర్రెల పెంపకం క్షేత్రాన్ని సందర్శించారు. యాత్ర మూడో రోజున రైతులు అహ్మద్‌నగర్ జిల్లా రాలేగావ్ సిద్ధి గ్రామాన్ని సందర్శించారు. ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే స్వగ్రామం ఇదే కావడం విశేషం. గ్రామాభివృద్ధికి అన్నా హజారే చేసిన కృషిని, కార్యక్రమాలను రైతులు పరిశీలించారు. పర్యావరణానికి ప్రతీకగా నిలిచిన ఈ గ్రామాన్ని చూసి రైతులు అచ్చెరువొందారు. మహిళా రైతులు అన్నా హజారేను కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి హజారే మాట్లాడుతూ గ్రామాల్లో వాటర్షెడ్లు నిర్మించుకోవాలని కోరారు. వర్షం చుక్కను సద్వినియోగం చేసుకున్నప్పుడే భూగర్భ జలాల పెంపు సాధ్యమవుతుందని ఆయన చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని రైతులకు హజారే సూచించారు. అనంతరం దేవ్రాలి ప్రవరా గ్రామంలో మందాతాయి చౌహాన్ అనే ఆదర్శ మహిళా రైతును కలుసుకున్నారు. ఐదుగురు పిల్లలు కలిగిన మందాతాయి తన భర్త చనిపోయినప్పటికీ అదైర్య పడకుండా తనకున్న 35 ఎకరాల భూమిని ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో ఎలా సాగు చేసింది వివరించింది. దీంతో ఆమె ద్వారా జిల్లా మహిళా రైతులు స్ఫూర్తి పొందారు. ఉత్సాహం నింపిన విజ్ఞాన యాత్ర యాత్ర నాలుగో రోజున రైతులు షిర్డీ సమీపంలోని బాబులేశ్వర్లోని కృషి విజ్ఞాన్ కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ 600 స్వయం సహాయక సంఘాల నిర్వహణతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలపై శిక్షణ నిస్తారు. స్వయం సహాయక సంఘాల కార్యక లాపాలకు సంబంధించి తాంబేర్, దేవ్రాలి ప్రవరా గ్రామాలను మహిళా రైతులు సందర్శించారు. యాత్ర చివరి రోజు షిర్డీలోని సాయిబాబా ఆలయాన్ని సందర్శించుకొని రైతులు హైదరాబాద్‌కు తిరిగి రైలులో బయలుదేరారు. ఈ పర్యటనలో రైతుల వెంట రాజేంద్రనగర్ రైతు శిక్షణ కేంద్రం సహాయ వ్యవసాయ సంచాలకులు కె. సునీత, వ్యవసాయాధికారి ఆర్. శ్రీలక్ష్మీ ఉన్నారు. ఈ పర్యటన తమకు ఎంతగానో ఉపయోగపడిందని, వ్యవసాయపరంగా ఎన్నో విజ్ఞానదాయకమైన విషయాలను తెలుసుకున్నామని మహిళా రైతులు తెలిపారు.