breaking news
Faces photo project
-
చిత్ర యాత్ర
తల్లిగా, చెల్లిగా, కూతురుగా... పలు రూ పాల్లో లోకాన్ని ముందుకు నడిపించే శక్తి స్త్రీ మూర్తి. ఆ శక్తి స్వరూ పాన్ని తన ఛాయాచిత్రాల్లో ఆవిష్కరించడానికి పన్నేండేళ్ల కాలాన్ని అంకితం చేస్తూ ప్రపంచ యాత్ర చేస్తున్నారు భరద్వాజ్ దయాల. 195 దేశాలకు చెందిన మహిళల ముఖకవళికల చిత్రాలను సేకరించాలనేది ఆయన లక్ష్యం....సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా కెరీర్ ప్రారంభించిన భరద్వాజ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో మూవీ గ్రాఫిక్స్ కంపెనీ నిర్వహిస్తున్నారు. ‘జీవితం చాలా చిన్నది. ఉన్న సమయంలోనే ప్రపంచాన్ని చూసెయ్యాలి. వీలైనంత మందితో మాట్లాడాలి’ అనేది భరద్వాజ్ లక్ష్యం. ఇందులో భాగంగా మహిళామణుల చిత్రాల ఆల్బమ్ రూపకల్పనకు సంకల్పించారు. ఈ డాక్యుమెంటరీలో మిలియ న్ అమేజింగ్ ఉమె న్ (10లక్షల మంది అసాధారణ మహిళలు)కు చోటు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం ప్రపంచ వ్యాప్తంగా 195 దేశాలకు చెందిన మహిళల ముఖకవళికల చిత్రాలను సేకరించే పనికి శ్రీకారం చుట్టారు.ఒంటరిగా... కెమెరా ఆయుధంగాప్రపంచంలోని మిలియ న్ (10లక్షల) మహిళామణుల ముఖకవళికలపై డాక్యుమెంటరీ తీయడానికి భరద్వాజ్ 100 మిల్లీమీటర్లు, 2.8 లెన్స్ గల కెమెరాను భుజాన వేసుకొని లక్ష్యం దిశగా ముందుకు కదులుతున్నారు. 55 ఏళ్ల భరద్వాజ ఒంటరిగానే, ఎవరి సాయం లేకుండా ప్రపంచయాత్ర చేస్తున్నారు. ఒక కారును తన ప్రయాణానికి అనుగుణంగా మార్చుకున్నారు. ఏడు ఖండాలు తిరిగి. 12 ఏళ్లలోగా అంటే 2037 నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలనేది తన లక్ష్యం.మహిళా దినోత్సవం రోజు శ్రీకారంప్రస్తుతం భరద్వాజ్ చేపడుతున్న మిలియన్ అమేజింగ్ మహిళ చిత్రసేకరణ ప్రాజెక్టు యాత్ర రెండోది. దీన్ని ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ప్రారంభించారు. మిలియన్ అమేజింగ్ మహిళా ఫొటోల సేకరణలో గుజరాత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పటిదాకా 500 మంది మహిళల చిత్రాలను కెమెరాల్లో బంధించారు. ఆల్బమ్‌లో 18 ఏళ్ల నుంచి 70 ఏళ్ల మహిళల వరకు ఉన్నారు.రాజమాతతో ప్రారంభం...గుజరాత్ రాష్ట్రం వడోదరలోని రాజవంశానికి చెందిన రాజమాత శుభాంగిణిరాజే చిత్రంతో ఈ మిలియ న్ అమేజింగ్ ఉమె న్ ప్రాజెక్టు ప్రారంభమైంది. రాజమాత జీవితానికి సంబంధించి బ్లాక్ అండ్ వైట్ కాలం నాటి పరిస్థితులకు అద్దం పట్టేలా చిత్రాన్ని తీశారు. రెస్టారెంట్ నడుపుతూ, నెలకు 8 లక్షల రూ పాయల ఆదాయాన్ని ఆర్జిస్తున్న గిరిజన మహిళతో పాటు పారిశుద్ధ్య కార్మికులు, గృహిణులు, విద్యార్థినులకు చోటు కల్పించారు. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజన ప్రాంతాల్లో భరద్వాజ్ పర్యటన సాగుతోంది.అమ్మకు ప్రేమతో...మా అమ్మకు ఐదుగురు సంతానం. మా అందరినీ పెంచి పెద్ద చేయడంలో ఆమె చూపిన కృషి అనిర్వచనీయం. అందుకే అమ్మకు ప్రేమతో ఏదో ఒకటి చేయాలనుకున్నాను. ఆ ఆలోచనలో భాగమే మిలియ న్ అమేజింగ్ ఉమె న్ ఆల్బమ్. ప్రస్తుతం నా ప్రయాణానికి అవసరమయ్యే ఖర్చునంతా నేనే భరిస్తున్నాను. నా కంపెనీ తరపున ఆ న్ లై న్ లో జాబ్ చేస్తూ వచ్చిన వేతనంతో టూర్‌ను కొనసాగిస్తున్నాను. – భరద్వాజ్ దయాల – కరుకోల తిరుమలరావు, సాక్షి, విజయవాడ -
ఏడాదిపాటు ఫేస్ బుక్ ఫ్రెండ్స్ ఫొటోలు తీసి..
సెయింట్ లూయిస్: ఫేస్బుక్ అనగానే అదో దగ్గరగా ఉన్నట్లు అనిపించే దూరంగా ఉండే మనుషుల గుంపు. ఇందులో ఒకరికి ఒకరు తెలిసినవారితోపాటు తెలియని వారు కూడా ఉంటారు. ఫేస్ బుక్ ఖాతా తెరవగానే తొలుత స్నేహితులకు ప్రాధాన్యం ఇచ్చి వారిని యాడ్ చేసుకున్నా.. తర్వాత మాత్రం తెలియనివారినే ఎక్కువగా స్నేహితులుగా చేసుకుంటుంటాం. ఆలోచనలు, ఫోటోలను పంచుకోవడం ద్వారా ఒకరంటే ఒకరికి ఓ రకమైన అభిమానం ఏర్పడి వెంటనే స్నేహితుడిగా ఆహ్వానిస్తాం. అయితే, ఇలా మీ ఫేస్ బుక్ లో వందల నుంచి వేలమంది స్నేహితులు ఉంటుంటారు. కానీ, చాలామందికి వారి అసలైన ఫేస్ లు ఎలా ఉంటాయో తెలియదు. అందుకు ప్రధాన కారణం చాలామంది తమ ప్రొఫైల్ పిక్చర్ ను ఒరిజినల్ గా పెట్టరు.. ఫ్లవరో, ప్రకృతి, ఇష్టమైన జంతువో, డిజైనో లేదంటే తమకు నచ్చిన హీరోనో హీరోయిన్ నో ప్రొఫైల్ పిక్ గా పెడుతుంటారు. ఇలా ఉండటం వల్ల మీ ఫేస్ బుక్ స్నేహితుడు మీ పక్కనే ఉన్నా, మీరు ప్రయాణించే సమయంలో మీ పక్క సీట్లోనే ఉన్నా గుర్తించే అవకాశమే లేదు. అలాంటప్పుడు ఎప్పుడైన మీ ఫేస్ బుక్ స్నేహితులు అసలు ఎలా ఉంటారోనని చూడాలనిపించిందా.. సరిగ్గా సెయింట్ లూయిస్‌కు చెందిన కోరే వూడ్రఫ్ అనే ఫొటో గ్రాఫర్ కు అలాగే అనిపించింది. వెంటనే చేతిలో కెమెరా తీసుకొని ఒక ఏడాది కాలంపాటు తన ఫేస్ బుక్ స్నేహితుల అసలైన ఫేస్ లను క్లిక్ మనిపించే పనిలో పడ్డాడు. అలా మొత్తం 738 మంది ఫేస్ బుక్ స్నేహితుల ఫొటోలను తీసుకున్నాడు. అవి కూడా సాదాసీదాగా కాకుండా తన ఐడియాలను జొప్పించి ఓ ఫొటో గ్రాఫర్ గా తన ప్రతిభ చాటుకున్నాడు. చక్కటి ఆల్బమ్ రూపొందించాడు. ఈ ఫొటోలు మొత్తం తీయడానికి ముందు పెద్ద కసరత్తే చేశాడు. ఫొటోలు తీయడానికి ముందు వారి అనుమతి కూడా వూడ్రఫ్ తీసుకున్నాడు.