breaking news
Expensive clothing
-
అంబానీ కంపెనీలో ఉద్యోగి అంటే అట్లుంటది.. అన్ని ఖరీదైన వస్తువులే!
సాధారణంగా సెలబ్రిటీలు, పారిశ్రామిక వేత్తలు ఉపయోగించే వస్తువులు చాలా ఖరీదైనవిగా ఉంటాయి. ఇందులో బ్యాగులు, వాచ్‌లు మొదలైనవి ఉంటాయి. మనం గతంలో జాన్వీ కపూర్, రాధిక మర్చంట్, ఇషా అంబానీ, భూమి పడ్నేకర్, నైసా దేవగన్, సమీక్ష పెడ్నేకర్ వంటి వారికి సంబంధించిన ఖరీదైన వస్తువులను గురించి తెలుసుకున్నాము. అయితే ఇప్పుడు 'ఓర్హాన్ అవత్రమణి' (Orhan Awatramani)కి సంబంధించిన ఖరీదైన వస్తువులను గురించి ఇక్కడ తెలుసుకుందాం. సాధారణంగా సెలబ్రిటీలు తరచుగా పార్టీలు చేసుకుంటారనే విషయం తెలిసిందే. ఈ పార్టీలలో వారు ఖరీదైన వస్తువులతో కనిపిస్తారు. అయితే ఓర్హాన్ అవత్రమణి కూడా ప్రముఖులతో పరిచయం ఉన్న వ్యక్తి. ఈ పేరు బహుశా ఎవరికీ పెద్దగా తెలియకపోవచ్చు. ఇతన్ని ఒర్రీ అని కూడా పిలుస్తారు. ఓర్హాన్ అవత్రమణి సంపన్న కుటుంబమైన అంబానీ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు. ఇటీవల ఇతడు జాన్వీ కపూర్‌తో కలిసి ఒక కార్యక్రమంలో కనిపించాడు. ఇందులో జాన్వీ మెటాలిక్ డిటైలింగ్‌తో కూడిన డ్రెస్ ధరించగా.. ఓర్రీ ఆప్టికల్ ఇల్యూషన్‌తో కూడిన బ్లూ కలర్ జాకెట్ ధరించాడు. Loewe బ్రాండ్‌కి చెందిన దీని ధర సుమారు రూ. 2.14 లక్షలు. అంతే కాకుండా అతడు ధరించిన ప్యాంట్ ఖరీదు రూ. 5,000 కాగా, ఫోన్ పట్టుకున్న కవర్ ధర రూ. 25,000 కావడం విశేషం. వీటితో పాటు ఓర్రీస్ నైక్ స్నీకర్స్ ధర రూ. 50,000. లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం ఓర్హాన్ రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో స్పెషల్ ప్రొడక్ట్ మేనేజర్ అని తెలుస్తోంది. ఎప్పుడూ బ్రాండెడ్ వస్తువులను ఉపయోగించే ఓర్హాన్ అవత్రమణి రూ. 40,000 రూపాయల విలువైన షార్ట్‌లు ధరించి ఇటీవల వార్తల్లో నిలిచాడు. ఇతని ఇన్స్టాగ్రామ్ ఖాతాకు సుమారు మూడు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నట్లు కూడా సమాచారం. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుస్కోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
అటు విలాసం.. ఇటు చిద్విలాసం..
ఖరీదైన దుస్తులు-ఉత్పత్తులు జిగేల్మన్న చోటే.. అందగత్తెల చిరునవ్వులు తళుక్కుమన్నాయి. విలాస-చిద్విలాసాల నడుమ మాదాపూర్ నొవోటెల్ హోటల్లో గురువారం హై-లైఫ్ ఎగ్జిబిషన్ సందడిగా ప్రారంభమైంది. లగ్జరీ ఉత్పత్తులకు పేరొందిన ఈ ఎక్స్పో ప్రారంభానికి నటి మధురిమ, మిసెస్ ఆసియా ఇంటర్నేషనల్ ప్లానెట్ అను బస్రీలు అందాల అతిథులుగా హాజరయ్యారు. చెన్నై, అహ్మదాబాద్, ముంబయి, బెంగళూరు, కొచ్చిన్, పూనె వంటి నగరాల నుంచి వచ్చిన డిజైనర్ ఉత్పత్తులతో పాటు శ్రీలంక తదితర విదేశీ వస్తువులు సైతం ఈ ఎక్స్‌పోలో కొలువుదీరాయి. దుస్తులు, ఇంటి అలంకరణ వస్తువులు, ఆర్ట్ పీసెస్.. ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ ప్రదర్శన 3 రోజుల పాటు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. - సాక్షి, లైఫ్‌స్టైల్ ప్రతినిధి