ఆ పంచ్‌లో  పవర్ తగ్గలేదు!
                  
	కజకస్థాన్కు చెందిన ఎవ్నిక అయిదు సంవత్సరాల వయసులోనే ‘యూ ట్యూబ్ సెన్సేషన్’గా పెద్ద పేరే తెచ్చుకుంది.  తక్కువ సమయంలో ఎక్కువ పంచ్‌లు ఇవ్వడం ద్వారా ఈ బాలబాక్సర్ ప్రపంచదృష్టిని ఆకర్షించింది. ఈ వీడియోను యూట్యూబ్‌లో లక్షలాది మంది చూశారు. ఇప్పుడు ఎవ్నిక వయసు ఎనిమిది సంవత్సరాలు.
	
	అయితే ఇప్పటికీ ఈ  చిన్నారిలో పంచ్ పవర్ తగ్గలేదని తాజా వీడియో చెబుతుంది. ఎవ్నిక హావభావాలు, కదలికలు ప్రొఫెషనల్ బాక్సర్‌ను తలపిస్తున్నాయి. ‘‘ఎవ్నిక వీడియోను 30సార్లు చూశాను’’ అని ఇయన్ రే అనే వీక్షకుడు తన ఫేస్బుక్లో రాశాడు. గతంలోలాగే ఎవ్నిక వీడియో సంచలనం సృష్టించే అవకాశం కనిపిస్తుంది.