breaking news
Estate Officer
-
ఇక్కడెలా పని చేస్తావో చూస్తా..!
సాక్షి ప్రతినిధి,ఏలూరు : ఇక్కడ ఎలా పని చేస్తావో.. త్వరలోనే నీ అంతు చూస్తా.. అంటూ ఎస్టేట్ మహిళా అధికారిపై ఏఎంసీ చైర్మన్ చిందులు వేశాడు. ఆదివారం స్థానిక ఫత్తేబాద్ రైతు బజారులో రైతులు, ఎస్టేట్ అధికారికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దాంతో కొందరు రైతులు ఏఎంసీ చైర్మన్ పూజారి నిరంజన్‌కు సమాచారం ఇవ్వడంతో ఆయన అక్కడికి చేరుకున్నారు. రైతులతో తరచూ గొడవలు ఎందుకు పడుతున్నావంటూ ఎస్టేట్ అధి కారిని గట్టిగా నిలదీశారు. ఏఎంసీ చైర్మన్, రైతుబజారులో కొందరు కలిసి తనను వేధింపులకు గురి చేస్తున్నారని ఎస్టేట్ అధికారి శ్రీలత ఆరోపించారు. తనపై దౌర్జన్యం చేసేందుకు ఏఎంసీ చైర్మన్ నిరంజన్ సొంత మనుషులతో వచ్చారన్నారు. ఆమె టూటౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకున్నారు. ఎస్టేట్ అధికారి శ్రీలత మాట్లాడుతూ తనను కావాలని వేధింపులకు గురి చేస్తున్నారని, రైతు బజారులో ఓ సామాజిక వర్గానికి చెందిన వారికి నచ్చిన చోట కూరగాయల విక్రయానికి షాపులు ఇవ్వాలని తనపై ఒత్తిడి తీసుకువస్తున్నారని, నిబంధనల ప్రకారం పని చేస్తున్నందుకు తనను బదిలీ చేయించాలని తప్పుడు సంతకాలతో ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారని ఆరోపించారు. హోల్‌సేల్ వ్యాపారి అయిన ఆ ప్రజాప్రతినిధి దగ్గర బంధువు చెప్పినట్టుగా ధరల పట్టిక పెట్టాలని ఒత్తిడి చేస్తున్నారని, దానివలన వినియోగదారులు నష్టపోతారని తాను నిరాకరించడంతో వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. ఓ మహిళ అధికారితో మాట్లాడాల్సినట్టుగా ఏఎంసీ చైర్మన్ మాట్లాడడం లేదని, తన అంతూ చూస్తానంటూ హెచ్చరించారని ఆమె వాపోయారు. రైతుబజారులో కొందరు ఓ వర్గంగా ఏర్పడి తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఎస్టేట్ అధికారి శ్రీలత పేర్కొన్నారు. రైతు సంక్షేమం కోసం రైతు బజారు దళారి వ్యవస్థను రూపుమాపేందుకు , రైతు సంక్షేమం కోసమే రైతుబజార్లు ఏర్పాటు చేశారని ఏఎంసీ చైర్మన్ పూజారి నిరంజన్ అన్నారు. ఎస్టేట్ అధికారి తమను వేధింపులకు గురి చేస్తున్నారని రైతులు తనకు ఫిర్యాదు చేశారని, దీనిపై అధికారిని వివరణ కోరానని, విచారణ చేసి రైతులను వేధింపులకు గురి చేసినట్లుగా రుజువైతే సదరు అధికారిపై చర్యలు తీసుకుంటామన్నారు. -
ముంపు ప్రాంతాల్లో ఎస్టేట్ ఆఫీసర్
సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల పరిధిలోని ముంపు ప్రాంతాల్లో స్థిరాస్తుల నిర్వహణ, వాటి సమాచారం అందించేం దుకు ప్రత్యేకంగా ఎస్టేట్ ఆఫీసర్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఆర్అండ్ఆర్ కమిషనర్‌కు ఈ బాధ్యత లను అప్పగిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. స్థిరాస్తులకు సంరక్షణా ధికారిగా ఎస్టేట్ ఆఫీసర్ వ్యవహరిస్తారని సాగునీటి పారుదల ప్రత్యేక సీఎస్ ఎస్కే జోషి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆంధ్రా బ్యాంకుకు రూ.50 కోట్లు మార్జిన్ మనీ కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ కోసం నిధుల సమీకరణకు కన్సార్టి యంగా వ్యవహరిస్తున్న ఆంధ్రా బ్యాం కుకు మార్జిన్ మనీ కింద రూ.50 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు ఇచ్చింది. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు బ్యారేజీల నిర్మాణానికి (లింక్ –1) అయ్యే రూ.17,500 కోట్ల వ్యయంలో రూ.7,400 కోట్ల రుణం ఇవ్వడానికి ఆంధ్రా బ్యాంకు అంగీకరిం చిన విషయం తెలిసిందే. దీంతో పాటే మూసీపై ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో, స్టోరేజీ సామర్థ్యాలను కొలిచేందుకు యంత్రాల కొనుగోలుకు సాగునీటి శాఖకు అనుమతిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.