breaking news
Equity funds section
-
మ్యూచువల్ ఫండ్ పథకానికి, న్యూ ఫండ్ ఆఫర్ల మధ్య తేడా ఏంటి?
ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో లార్జ్‌క్యాప్, లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ విభాగం మధ్య వేటిని ఎంపిక చేసుకోవాలి? – శిల్ప దీర్ఘకాలంలో ఏ విభాగం మంచి పనితీరు చూపిస్తుందన్నది ఊహించడమే అవుతుంది. ఈక్విటీల్లో పెట్టుబడులు పెడుతున్నప్పుడు కాల వ్యవధి కనీసం ఐదేళ్లకు తగ్గకుండా ఉండాలి. ఇన్వెస్ట్ చేసిన ఆ ఐదేళ్ల కాలంలోనే మార్కెట్ సైకిల్ ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో లార్జ్‌క్యాప్ కంపెనీలు మంచి పనితీరు చూపిస్తాయి. కొన్ని సందర్భాల్లో మిడ్‌క్యా ప్ మంచి ప్రదర్శన చేస్తాయి. కొన్ని సందర్భాల్లో స్మాల్‌క్యాప్ ఇంకా మంచి రాబడులను ఇస్తుంటాయి. కనుక వాటిని దృష్టిలో పెట్టుకుని ఫ్లెక్సీ క్యాప్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఫ్లెక్సీక్యాప్ ఫండ్ మేనేజర్‌కు ఏ విభాగంలో అయినా ఇన్వెస్ట్ చేసే స్వేచ్ఛ ఉంటుంది. మార్కెట్ సైకిల్లో ఒక విభాగం మంచి పనితీరు, మరో విభాగం బలహీన పనితీరు చూపిస్తున్న సందర్భాల్లో ఫ్లెక్సీక్యాప్ పథకం ద్వారా ఆ సైకిల్‌ను చక్కగా అధిగమించగలరు. మ్యూచువల్ ఫండ్స్ పథకాల మధ్య పెట్టుబడులను మర్చడాన్ని సూచిస్తారా? ఎటువంటి సందర్భాల్లో ఇది సూచనీయం? – సుఖ్‌దేవ్ భాటియా మీరు ఇన్వెస్ట్ చేస్తున్న మ్యూచువల్ ఫండ్స్ పథకాలను రెండు రకాల కారణాల వల్ల మార్చాల్సి రావచ్చు. మొదట మీ లక్ష్యాల్లో మార్పులు చోటు చేసుకున్నప్పుడు పెట్టుబడులను వాటికి అనుగుణంగా సవరించుకోవాల్సి ఉంటుంది. లేదంటే లక్ష్యాలను చేరుకున్నప్పుడు కూడా ఈ అవసరం ఏర్పడుతుంది. ఉదాహరణకు మీరు దీర్ఘకాలం కోసం అంటే రిటైర్మెంట్ లేదా పిల్లల ఉన్నతవిద్య కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారనుకుంటే.. ఆ మొత్తం సమకూరితే మీ పెట్టుబడిని మొత్తం మీరు తీసేసుకోవచ్చు. నిర్ణీత కాలవ్యవధికి ముందే మీకు కావాల్సిన మొత్తం సమకూరితే ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. ఇక మీరు ఏదైనా ఒక పథకంలో కొన్ని కారణాలను చూసి ఇన్వెస్ట్ చేసిన తర్వాత.. అవన్నీ మారిపోయినట్టయితే మీ పెట్టుబడులను విక్రయించుకోవచ్చు. ఉదాహరణకు ఫండ్ మేనేజర్ మారిపోవడం పథకం నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకోవడానికి సరైన కారణం కాబోదు. కాకపోతే మీరు అప్రమత్తం అయ్యేందుకు ఒక కారణంగా చూడొచ్చు. గతంలో మంచి రాబడులను ఇచ్చిన పథకం కొత్త ఫండ్ మేనేజర్ నిర్వహణలో అంత మంచి పనితీరు చూపించకపోతే అప్పుడు వేరే పథకానికి మారిపోయే ఆలోచన చేయవచ్చు. అలాగే, నిలకడగా మంచి రాబడులను ఇస్తుందన్న కారణంతో ఒక పథకంలో ఇన్వెస్ట్ చేసిన తర్వాత.. మీరు ఆశించిన విధంగా పనితీరు లేకపోయినా దాని నుంచి తప్పుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్ పథకానికి, న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్వో)కు మధ్య తేడా ఏంటి? – డి.తరుణ్ ప్రతీ మ్యూచువల్ ఫండ్ సంస్థ నూతన పథకాన్ని (ఎన్ఎఫ్వో) ప్రారంభిస్తుంటుంది. ఏళ్లు గడిచిన కొద్దీ ఆ పథకం పాతది అయిపోతుంది. పెట్టుబడుల తీరు, మార్కెట్ కరెక్షన్లలో, మార్కెట్ ర్యాలీల్లో ప్రస్తుత పథకాల పనితీరు ఎలా ఉందో పరిశీలించొచ్చు. ఎన్ఎఫ్వో అన్నది కొత్త ఆఫర్. ఇన్వెస్టర్లు అప్పగించిన పెట్టుబడులను ఆ ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడతారు. ఎన్ఎఫ్వో అంటే కొత్తగా ప్రారంభించడం. ఎవరు మీ పెట్టుబడులను చూసేదీ తెలుసుకోవచ్చు. ఆ కొత్త పథకం పెట్టుబడి లక్ష్యాల గురించి తెలుసుకోవచ్చు. ఆ పథకం ఆరంభమైన సమయంపై పనితీరు ఆధారపడి ఉంటుంది. మార్కెట్లు దిద్దుబాటుకు గురైన సమయాల్లో పథకాన్ని ప్రారంభించి, అనంతరం మార్కెట్లు పెరిగిపోతే సహజంగానే పథకంలో రాబడులు చక్కగా వృద్ధి చెందుతాయి. అందుకే కొత్త పథకం మార్కెట్లు గరిష్టాల్లో ఉన్నప్పుడా లేక కనిష్టాల్లో ఉన్నప్పుడు ప్రారంభమవుతుందా అన్నదానిపై ఇన్వెస్టర్‌కు అవగాహన ఉండాలి. ఎన్ఎఫ్వో రూపంలో మ్యూచువల్ ఫండ్స్ పెద్ద ఎత్తున పెట్టుబడులను సమీకరిస్తుంటాయి. ఇందుకోసం పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తాయి. చాలా మంది ఎన్‌ఎఫ్‌వోల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఇప్పటికే ఎన్నో పథకాలు అందుబాటులో ఉండగా ఎన్‌ఎఫ్‌వోల్లో అంత భారీ మొత్తంలో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారనేది మాత్రం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. - ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ చదవండి:ఐటీ రిటర్న్స్: ఆ గడువును పొడిగించిన ఐటీ శాఖ, ఎప్పటి వరకు అంటే.. -
ఇవి ఎలా పనిచేస్తాయంటే..!
ఈ ఆర్బిట్రేజ్ ఫండ్స్ కూడా ఈక్విటీ ఫండ్ల విభాగంలోకే వస్తాయి. కాకపోతే వీటి పనితీరు చాలా భిన్నంగా ఉంటుంది. సాధారణంగా ఈక్విటీ ఫండ్లు షేర్లను కొనటం... అమ్మడం ద్వారా వచ్చే లాభనష్టాలను ఇన్వెస్టర్లకు అందిస్తాయి. అదే ఆర్బిట్రేజ్ ఫండ్స్ విషయానికి వస్తే ఒక కంపెనీ షేరు ధర, ఫ్యూచర్ ధరలో ఉండే వ్యత్యాసంతో పాటు... వివిధ ఎక్స్ఛేంజీల్లో ఒక షేరు ధరలో ఉండే తేడాలను కూడా ఇవి సొమ్ము చేసుకుంటాయి. ఉదాహరణకు శుక్రవారం నాటి రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ధరనే తీసుకుందాం. బీఎస్ఈలో రిలయన్స్ షేరు ధర రూ.861.05 వద్ద ట్రేడయ్యే సమయంలో... ఎన్ఎస్ఈలో రూ. 860.95 దగ్గర ట్రేడయింది. అంటే ఎన్ఎస్ఈలో కొని, బీఎస్ఈలో విక్రయిస్తే షేరుకు 10 పైసలు లాభమొస్తుంది. ఈ ఫండ్లు పెద్ద ఎత్తున షేర్లను కొని విక్రయిస్తాయి కనక 10 పైసల లాభం కూడా వీటికి ఎక్కువగానే ఉంటుంది. అలాగే ఫ్యూచర్స్ అండ్ క్యాష్ మార్కెట్ ధరలో ఉండే తేడా నుంచి కూడా ఇవి లాభాలను ఆర్జిస్తాయి. ఎన్ఎస్ఈలో రిలయన్స్ ప్యూచర్ ధర రూ.861.6 గా ఉంది. అంటే క్యాష్ మార్కెట్ కంటే 65 పైసలు ప్రీమియంలో ట్రేడ్ అవుతోంది. ఇటువంటి సందర్భాల్లో క్యాష్ మార్కెట్లో షేర్లను కొని ఫ్యూచర్స్ మార్కెట్లో విక్రయిస్తారు. కాంట్రాక్టు ముగిసే సమయం వచ్చే సరికి ఈ ప్రీమియం తగ్గుతూ వచ్చి క్యాష్ మార్కెట్ రేటుకు సమానమవుతుంది. తద్వారా షేరుకు 65 పైసలు లాభం వస్తుంది. ముఖ్యంగా ఒడిదుడుకుల మార్కెట్లో ఈ వ్యత్యాసం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒడిదుడుకుల మార్కెట్లో ఆర్బిట్రేజ్ ఫండ్స్ అధిక లాభాలను ఆర్జిస్తాయి. నిజానికి ఆర్బిట్రేజ్ ఫండ్స్ కొనుగోళ్లు, అమ్మకాలు అనేవి భారీ మార్జిన్లతో జరగవు. వీటి మార్జిన్లన్నీ పైసల్లోనే ఉంటాయి. 10 పైసలు, 20 పైసలు... ఇంతకన్నా ఎక్కువ మార్జిన్ ఉండటం కష్టం. కాకపోతే భారీ పరిమాణంలో ట్రేడింగ్ చేస్తాయి కనక ఈ మొత్తం కూడా వాటికి చక్కని లాభాన్నిస్తుంది.