breaking news
Engineering jobs
-
హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ ఉద్యోగాల్లోకి మహిళలు.. పురుషులను మించి..
ముంబై: అన్ని రంగాల్లో పురుషుల ఆధిపత్యానికి చెక్ చెబుతూ మహిళలు పురోగమిస్తున్నారు. తాజాగా హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ పరిశ్రమలోనూ ఈ ధోరణి కనిపిస్తోంది. గతేడాది ఈ రంగంలో ఉద్యోగాలకు మహిళల నుంచి దరఖాస్తులు 26 శాతం పెరిగినట్లు జాబ్ పోర్టల్ వర్క్‌ఇండియా ఒక నివేదికలో తెలిపింది.హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ ఉద్యోగాలకు సంబంధించి పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు 19 శాతమే పెరిగినట్లు పేర్కొంది. ఇక పార్ట్‌టైమ్ ఉద్యోగాల కోసం మహిళల నుంచి దరఖాస్తులు పెరిగినట్లు వివరించింది. తృతీయ శ్రేణి పట్టణాల నుంచి కూడా అప్లికేషన్లు వస్తున్నప్పటికీ, ప్రథమ శ్రేణి మార్కెట్లలోనే ఎక్కువగా ఉద్యోగాలు ఉంటున్నట్లు వర్క్‌ఇండియా తెలిపింది.పురుషులకు మాత్రమే పరిమితమైన రంగాల్లోకి మహిళలు ప్రవేశించే కొద్దీ భవిష్యత్తులో ఇంజినీరింగ్‌ను పునర్విర్వచించే మార్పులు చోటు చేసుకుంటున్నాయని వర్క్‌ఇండియా సీఈవో నీలేష్ దుంగార్వాల్ తెలిపారు. పోర్టల్‌లో మొత్తం మీద టెక్ ఉద్యోగాల పోస్టింగ్స్ 11 శాతం పెరగ్గా, హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ లిస్టింగ్స్ మాత్రం 26 శాతం ఎగిసినట్లు వివరించారు. -
సాఫ్ట్వేర్ సృష్టి కంటే నిర్వహణవైపే మొగ్గు
ప్రముఖ మెసేజింగ్ టూల్ హాట్ మెయిల్ సహ వ్యవస్థాపకుడు సబీర్ భాటియా ఇటీవల భారతదేశ ఇంజినీరింగ్ వ్యవస్థ గురించి, ఆవిష్కరణల సామర్థ్యం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. సాంకేతికత ఆవిష్కరణలో చైనా సాధించిన విజయాలతో సరితూగే భారతదేశ సామర్థ్యానికి ఆటంకాలు ఎదురవుతున్నాయని చెప్పారు. చాలా మంది భారతీయ ఇంజినీర్లు కొత్త సాంకేతికత సృష్టించడానికి బదులుగా వాటి నిర్వహణ వైపు మొగ్గు చూపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.99 శాతం భారతీయ ఇంజినీర్లు అపార జ్ఞానాన్ని కలిగి ఉన్నట్లు తెలిపారు. కానీ చాలావరకు స్పష్టమైన ఉత్పత్తులను సృష్టించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆలోచించలేకపోతున్నట్లు చెప్పారు. ఈ మనస్తత్వం మెరుగైన ఆవిష్కరణలను ప్రోత్సహించే భారతదేశ సామర్థ్యాన్ని అణచివేస్తుందని అభిప్రాయపడ్డారు. ఒరిజినల్ సాఫ్ట్వేర్ సృష్టి కంటే ఔట్ సోర్సింగ్‌పై దృష్టి సారించే వ్యాపారవేత్తలపై భారత్ ప్రశంసలు కురిపించడం విడ్డూరంగా ఉందన్నారు. క్రిటికల్ థింకింగ్, ప్రాక్టికల్ స్కిల్స్‌ను ప్రోత్సహించేందుకు భారత్ తన విద్యావ్యవస్థను సమూలంగా మార్చాల్సిన అవసరం ఉందని భాటియా వ్యాఖ్యానించారు. దీన్ని చైనా సమ్మిళిత విద్యా విధానాలతో పోల్చారు. ఇది సృజనాత్మకత, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో వారి విజయానికి దోహదపడిందని తెలిపారు.ఇదీ చదవండి: గోల్డెన్ ఛాన్స్! తగ్గిన బంగారం ధర.. ఎంతంటే..ఇంజినీరింగ్ విద్య, వర్క్ కల్చర్ విషయంలో భారత్ పునరాలోచించుకోవాలని భాటియా పిలుపునిచ్చాయి. సాంకేతిక నైపుణ్యాలకు విలువనివ్వడం, సృజనాత్మకత వృద్ధి చెందేలా తగిన వాతావరణాన్ని పెంపొందించడంపై దృష్టి సారించాలని సూచించారు. -
ఎస్ఎస్సీ - ఇంజనీరింగ్ ఉద్యోగాలు
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ).. వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 1,000 గ్రూప్-బి నాన్ గెజిటెడ్ జూనియర్ ఇంజనీర్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో పోస్టుల వివరాలు, పరీక్షా విధానంపై ఫోకస్.. ఉద్యోగాల వివరాలు: సెంట్రల్ వాటర్ కమిషన్ (సివిల్, మెకానికల్): వయసు 32 ఏళ్లకు మించకూడదు. విద్యార్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సివిల్/మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా లేదా సివిల్/మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ. సెంట్రల్ పబ్లిక్ వాటర్ డిపార్ట్మెంట్ (సివిల్): వయసు 32 ఏళ్లకు మించకూడదు. విద్యార్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా. సెంట్రల్ పబ్లిక్ వాటర్ డిపార్ట్మెంట్(ఎలక్ట్రికల్): వయసు 32 ఏళ్లకు మించకూడదు. విద్యార్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ (సివిల్): వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. విద్యార్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా/తత్సమానం. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ (ఎలక్ట్రికల్): వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ద్యార్హత: ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా/తత్సమానం. మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్ (సివిల్): వయసు 30 ఏళ్లకు మించకూడదు. ద్యార్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమాతోపాటు సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో రెండేళ్ల పని అనుభవంవిద్యార్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రికల్/మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రికల్/మెకానికల్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమాతోపాటు ఎలక్రికల్/మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాల్లో రెండేళ్ల పని అనుభవం. మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్ (సర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్ విభాగాలు): వయసు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. విద్యార్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా లేదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్వేయర్స్ నిర్వహించే బిల్డింగ్ అండ్ క్వాంటిటీ సర్వేయింగ్ సబ్‌డివిజనల్-ఐఐ ఇంటర్మీడియెట్ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.గమనిక: అన్ని విభాగాల్లోని పోస్టులకు దరఖాస్తు చేసుకునే ఓబీసీలకు గరిష్ట వయోపరిమితిలో మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులకు పదేళ్లు సడలింపు ఉంటుంది. పేస్కేల్: రూ.9,300-34,800. గ్రేడ్ పే: రూ.4,200 పరీక్ష విధానం: రాత పరీక్షను రెండు దశల్లో నిర్వహిస్తారు. ఇది మొత్తం 500 మార్కులకు ఉంటుంది. మొదటి దశలో ఉత్తీర్ణత సాధిస్తే రెండో దశ పరీక్షకు అనుమతిస్తారు. రాతపరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఇంటర్వ్యూ (100 మార్కులు)కు అర్హులు. పేపర్-1; రాత పరీక్ష: మొత్తం పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. పరీక్ష సమయం: రెండుగంటలు. పరీక్ష మూడు భాగాలుగా ఉంటుంది. ఈ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత ఉంటుంది.1. జనరల్ ఇంటలిజెన్స్ అండ్ రీజనింగ్: ఈ పరీక్షను అన్ని విభాగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రాయాలి. ఇది 50 మార్కులకు ఉంటుంది.2. జనరల్ అవేర్నెస్: ఈ పరీక్షను అన్ని విభాగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రాయాలి. ఇది 50 మార్కులకు ఉంటుంది. 3. సివిల్/స్ట్రక్చరల్ విభాగాలకు దరఖాస్తు చేసుకున్నవారు పార్ట్-ఏ, ఎలక్ట్రికల్ విభాగానికి దరఖాస్తు చేసుకున్నవారు పార్ట్-బి, మెకానికల్ విభాగానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పార్ట్-సి భాగాలు రాయాలి. ఈ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది.పేపర్-2; రాతపరీక్ష: పేపర్-1లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను పేపర్-2 పరీక్ష రాసేందుకు అర్హులు. ఈ పరీక్ష 300 మార్కులకు ఉంటుంది. పరీక్ష సమయం: రెండు గంటలు. సివిల్/స్ట్రక్చరల్ విభాగాలకు దరఖాస్తు చేసుకున్నవారు పార్ట్-ఏ, ఎలక్ట్రికల్ విభాగానికి దరఖాస్తు చేసుకున్నవారు పార్ట్-బి, మెకానికల్ విభాగానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పార్ట్-సి భాగాలు రాయాలి. దరఖాస్తు రుసుం: రూ. 100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది. ముఖ్యతేదీలు: పార్ట్-1 ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ: జూలై 7, 2015 పార్ట్-2 రిజిస్ట్రేషన్ చివరి తేదీ: జూలై 10, 2015. కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం వెబ్సైట్: http://ssconline.nic.in, http://ssconline2.gov.in ప్రిపరేషన్ ప్రణాళిక జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కోసం బ్యాంకింగ్, ఆర్ఆర్బీ తదితర పరీక్షల పాత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయాలి. జనరల్ అవేర్‌నెస్‌లో ఇండియన్ జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, అవార్డులు-విజేతలు, క్రీడలు-విజేతలు తదితర అంశాలను చదవాలి. ఇంజనీరింగ్‌కు సంబంధించి ఆయా బ్రాంచ్‌ల టెక్నికల్ సబ్జెక్టు నుంచి ప్రశ్నలు వస్తాయి.ఎలక్ట్రికల్: సర్క్యూట్లలోని బేసిక్ ప్రిన్సిపుల్స్, బేసిక్ ఫార్ములాలు, వాటి యూనిట్లు తదితర అంశాల నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. ఎలక్ట్రికల్ మెషీన్స్, పవర్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్ అంశాలపై అవగాహన అవసరం. సివిల్ ఇంజనీరింగ్: స్ట్రెంథ్ ఆఫ్ మెటీరియల్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్,సర్వేయింగ్ వంటి అంశాలకు సంబంధించిన ప్రిన్సిపుల్స్, ఫార్ములాలు, యూనిట్లపై అవగాహన అవసరం.మెకానిక్స్: థర్మోడైనమిక్స్, ఇంజనీరింగ్ మెకానిక్స్, ఐసీ ఇంజన్, హీట్ ఇంజన్ వంటి అంశాల నుంచి ఎక్కువ ప్రశ్నలు ఇస్తారు. వీటికి సంబంధించిన బేసిక్ ప్రిన్సిపుల్స్‌ను అధ్యయనం చేయాలి.ఇంజనీరింగ్ బ్రాంచ్ సబ్జెక్టులకు సంబంధించిన ప్రాథ మిక సూత్రాలను ఒకచోట రాసుకొని,రివిజన్ చేస్తుండాలి.సమయపాలనను అలవరచుకోవడం కోసం నమూనా ప్రశ్నపత్రాలను సాధిస్తుండాలి.చదివిన అంశానికి సంబంధించిన ప్రశ్నలను సేకరించి, ప్రాక్టీస్ చేయాలి.- జి.రమణ, డెరైక్టర్, సాయిమేధ విద్యా సంస్థలు. -
గెయిల్ సీనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు
ఉద్యోగాలు: గెయిల్ ఇండియా లిమిటెడ్ సీనియర్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతోంది. ఖాళీల సంఖ్య: 61 విభాగాలు: కెమికల్, పీసీ ఆపరేషన్స్, మెకానికల్ - పీసీ ఓఅండ్ఎం, ఎలక్ట్రికల్ - పీసీ ఓఅండ్ఎం, ఇన్స్ట్రుమెంటేషన్ - పీసీ ఓఅండ్ఎం, మెకానికల్ - పైప్‌లైన్ ఓఅండ్ఎం, ఎలక్ట్రికల్ - పైప్‌లైన్ ఓఅండ్ఎం, ఇన్స్ట్రుమెంటేషన్- పైప్‌లైన్ ఓఅండ్ఎం అర్హతలు: సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ ఉత్తీర్ణులై ఉండాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్: ఆగస్టు 11 - 25 వెబ్సైట్: www.gail.nic.in భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కింద పేర్కొ న్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. - డిప్యూటీ ఇంజనీర్ (సివిల్) అర్హత: మొదటి శ్రేణిలో బీఈ/ బీటెక్ (సివిల్) ఉత్తీర్ణతతోపాటు సంబంధిత రంగంలో ఏడాది అనుభవం ఉండాలి. వయసు: 28 ఏళ్లకు మించకూడదు. - డిప్యూటీ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) అర్హతలు: మొదటి శ్రేణిలో బీఈ/ బీటెక్ (ఎలక్ట్రికల్) ఉత్తీర్ణతతోపాటు సంబంధిత రంగంలో ఏడాది అనుభవం ఉండాలి. వయసు: 28 ఏళ్లకు మించకూడదు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: ఆగస్టు 20 వెబ్సైట్: www.bel-india.com ప్రవేశాలు: అన్నా యూనివర్సిటీ చెన్నైలోని అన్నా యూనివర్సిటీ ఎంఎస్, పీహెచ్డీ ప్రోగ్రాముల్లో ప్రవేశానికి దరఖా స్తులు కోరుతోంది. విభాగాలు: ఇంజనీరింగ్/ టెక్నాలజీ, సైన్స, హ్యుమానిటీస్, మేనేజ్మెంట్, ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్. అర్హతలు: సంబంధిత విభాగంలో 55శాతం మార్కులతో ఎంఎస్ ప్రోగ్రాముకు బీఈ/ బీటెక్; పీహెచ్డీ ప్రోగ్రాముకు మాస్టర్స డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తులకు చివరితేది: ఆగస్టు 30 వెబ్సైట్: https://cfr.annauniv.edu నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ కాలికట్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖా స్తులు కోరుతోంది. పీజీ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్ సిస్టమ్ డిజైన్ (పీసీ-100) అర్హత: బీఈ/ బీటెక్ (ఈఈ/ ఈఈఈ/ ఐఅండ్‌సీ/ఈసీ/ఏఈఅండ్ఐ/ఇన్స్ట్రు మెంటేషన్/ మెకట్రానిక్స్/ సీఎస్ఈ). అడ్వాన్స్డ్ డిప్లొమా-పీఎల్సీ/స్కాడా/ డీసీఎస్ - (పీసీ - 500) అర్హత: డిప్లొమా, ఎమ్మెస్సీ (ఇన్స్ట్రు మెంటే షన్/ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్) లేదా బీఈ/ బీటెక్ ఉండాలి. వెబ్సైట్: http://calicut.nielit.in