endowments minister
-
AP: దేవాదాయశాఖపై మంత్రి కొట్టు సమీక్ష.. కీలక నిర్ణయాలు
సాక్షి, తాడేపల్లి: దేవాదాయ సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకున్నామని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంజూరు చేసిన రూ. 70 కోట్లతో అభివృద్ది పనులు జరుగుతున్నాయని తెలిపారు. మాస్టర్‌ప్లాన్‌కు అనుగుణంగా విజయవాడ ఇంద్రకీలాద్రి అభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ప్రసాదం పోటు తయారీ, ప్రసాదం కౌంటర్లు, స్టాక్ పాయింట్‌ను రూ. 27 కోట్లతో ఒకే భవనంగా నిర్మిస్తున్నామన్నారు. రూ. 30 కోట్లతో అన్నదానం భవనం.. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ.. రూ. 30 కోట్లతో రెండు ఫ్లోర్లుగా అన్నదానం భవనం, ఒకేసారి 1500 నుంచి 1800 మంది అన్న ప్రసాదం స్వీకరించే విధంగా నిర్మిస్తున్నట్లు తెలిపారు. భక్తుల రద్దీని తట్టుకునేలా రూ. 20 కోట్ల అంచనాలతో అదనంగా క్యూలైన్ల కాంప్లెక్స్ ఎక్స్ టెన్షన్ నిర్మాణం చేపట్టిన్నట్లు పేర్కొన్నారు. ఈ వారంలో టెండర్లు పిలుస్తున్నామని.. రూ. 28 కోట్లతో స్టెయిర్ కేస్ నిర్మిస్తున్నట్లు చెప్పారు. రూ.120 కోట్ల ఆలయ నిధులతో అభివృద్ధి అమ్మవారికి కుంకుమ పూజ ప్రత్యేకంగా నిర్వహించడానికి వీలుగా రూ. 6 కోట్లతో పూజా మండపం ఏర్పాటు. జులై రెండవ వారంలో టెండర్లు పిలుస్తున్నాం. విజయవాడ దేవాలయంలో ఒక మెగా వాట్ సోలార్ ప్లాంట్ త్వరలోనే ప్రారంభిస్తాం. రూ. 60 కోట్ల రూపాయిలతో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ నిర్మాణం చేయనున్నాం. రూ. 70 కోట్లలో ఇప్పటికే దాదాపు రూ. 14.70 కోట్ల పనులు పూర్తయ్యాయి. అదనంగా రూ.120 కోట్ల ఆలయ నిధులతో విజయవాడ ఇంద్రకీలాద్రి అభివృద్ది చేస్తున్నాం. చదవండి: దళిత ద్రోహి చంద్రబాబు: మంత్రి నాగార్జున కాణిపాకంలో రూ. 3.60 కోట్లతో అన్నదాన కాంప్లెక్స్ శ్రీశైలంలో రూ.75 కోట్లతో క్యూ కాంప్లెక్స్ నిర్మాణం. రూ.35 కోట్లతో శ్రీశైలం మాడవీధులలో 750 మీటర్లు పొడవుతో సాల మండపాలు నిర్మాణం. శ్రీ కృష్ణదేవరాయల కాలంలో సాల మండపాల నిర్మాణాలు జరిగాయి. మళ్లీ సీఎం వైఎస్ జగన్ హయాంలో నిర్మించబోతున్నాం. కాణిపాకంలో రూ. 3.60 కోట్లతో అన్నదానం కాంప్లెక్స్. రూ. 4 కోట్లతో క్యూ కాంప్లెక్స్ నిర్మాణాలు. శ్రీవాణి ట్రస్టుపై కొందరు దుష్పచారం చేస్తున్నారు. శ్రీవాణి ట్రస్టుపై వచ్చిన నిధులని ధర్మ ప్రచారం, ఆలయాల నిర్మాణాలకి ఉపయోగిస్తున్నాం. 1917 ఆలయాలు మంజూరు శ్రీవాణి ట్రస్టు నిధులతో 1917 ఆలయాలు మంజూరు చేశాం. ఆలయాల పాలనా వ్యవహారాల్లో గత సంవత్సర కాలంలో ఎన్నో కీలక సంస్కరణలు చేపట్టాం. ప్రీ ఆడిట్ విధానం ద్వారా అవినీతి ఆరోపణలకి చెక్ పెట్టాం. ఆలయాలలో ప్రతీ మూడు నెలలకి సిబ్బంధి అంతర్గత బదిలీలు చేయాలని ఆదేశించాం. ఆలయాలలో ఆభరణాలపై రూ. 450 కోట్ల సీజీఎఫ్ నిధులతో గత నాలుగేళ్లగా కొత్త ఆలయాల నిర్మాణాలకి, పురాతన ఆలయాల పునరుద్దరణ చేపట్టాం. నేను మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన గత ఏడాది కాలంలో పురాతన ఆలయాల పునరుద్దరణ, కొత్త ఆలయాల నిర్మాణాల కోసం 270 కోట్ల సీజీఎఫ్ విడుదల చేశాం’ అని తెలిపారు. -
దేవుడి మంత్రిగా మళ్లీ ‘ఇంద్రుడే’
సాక్షి, హైదరాబాద్ : ఆలయాల శాఖకు అమాత్యులుగా పనిచేసిన వారికి అనంతర రాజకీయ జీవితంలో దేవుడి కరుణ మాత్రం కలగలేదు. గతంలో 8 మంది నేతలు దేవాదాయ మంత్రులుగా పనిచేశారు. వారిలో ఎవరినీ మరోసారి మంత్రి పదవి వరించలేదు. ఎమ్మెల్యేగా గెలవడమే కష్టమైందని చరిత్ర చెబుతోంది. కానీ, నిర్మల్ ఎమ్మెల్యే అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మాత్రం 36 ఏళ్ల చరిత్రను తిరగరాశారు. గత కేబినెట్లో దేవాదాయ మంత్రిగా పనిచేసిన ఆయన ఈసారి కూడా మంత్రి అయ్యారు. మంత్రి కావడమే కాదు... దేవాదాయ మంత్రిగా రికార్డు సృష్టించారు. (కేసీఆర్ వద్దే ఆర్థిక శాఖ ) చరిత్ర ఇదీ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చివరి దేవాదాయ మంత్రిగా పనిచేసిన వారు మళ్లీ మంత్రి పదవి చేపట్టడం అనేది జరగలేదు. మంత్రి పదవి అటుంచితే తదుపరి ఎన్నికల్లో విజయం సాధించడమే గగనమైపోయింది. కొంతమందికైతే ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కూడా రాలేదు. మరీ పూర్వం నుంచి కాదు గానీ 1983లో ఎన్టీఆర్ కేబినెట్లో దేవాదాయ మంత్రిగా పనిచేసిన యతిరాజారావుతో పాటు 1994లో ఎన్టీఆర్ హయాంలో దేవాదాయశాఖ మంత్రిగా పనిచేసిన సీనియర్ నేత సింహాద్రి సత్యనారాయణ కూడా ఆ తర్వాత ఎన్నికల్లో ఎమ్మెల్యేగానే ఉండిపోయారు. ఇక 1995లో చంద్రబాబు కేబినెట్లో ఈ శాఖ నిర్వహించిన దామచర్ల ఆంజనేయులు తదుపరి ఎన్నికల్లో గెలవలేదు. ఇక 1999 ఎన్నికల తర్వాత ఏర్పడ్డ చంద్రబాబు కేబినెట్లో దండు శివరామరాజు దేవాదాయ శాఖ చేపట్టారు. 2004 ఎన్నికల్లో ఆయనకు పోటీ చేసే అవకాశం కూడా రాలేదు. తర్వాత ఈ శాఖ చేపట్టిన ఎం.సత్యనారాయణరావు మధ్యలోనే పదవి నుంచి తప్పుకున్నారు. తర్వాతి ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఎమ్మెస్సార్ తర్వాత ఆయన సామాజిక వర్గానికే చెందిన జువ్వాడి రత్నాకర్‌రావు ఆ శాఖ చేపట్టారు. అయితే, 2009 ఎన్నికల్లోనూ, అంతకుముందు జరిగిన ఉప ఎన్నికల్లోనూ ఆయన గెలవలేదు. ఇక, 2009 ఎన్నికల తర్వాత దేవాదాయశాఖ చేపట్టిన గాదె వెంకట్‌రెడ్డికి కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్లో మంత్రిపదవి దక్కలేదు. ఎమ్మెస్సార్‌కు, రత్నాకర్‌రావుకు మధ్యలో కొన్ని నెలలు దేవాదాయ బాధ్యతలు నిర్వర్తించిన జేసీ దివాకర్‌రెడ్డికి 2009లో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మంత్రి పదవి రాలేదు. అప్పుడు దేవాదాయ మంత్రిగా పనిచేసిన జూపల్లి కృష్ణారావు తెలంగాణ తొలి కేబినెట్లో మంత్రి కాలేకపోయారు. ఆ తర్వాత విస్తరణలో మంత్రి అయినా దేవాదాయశాఖ చేపట్టలేదు. అప్పుడు దేవాదాయ శాఖ బాధ్యతలు తీసుకున్న ఇంద్రకరణ్‌రెడ్డి 2018లో కేసీఆర్ ప్రభుత్వం రద్దయ్యేంతవరకు అదే శాఖ నిర్వహించారు. మళ్లీ 2018 ముందస్తు ఎన్నికల్లో గెలిచి మళ్లీ ఇప్పుడు కేసీఆర్ కేబినెట్లో దేవాదాయ శాఖ మంత్రిగా నియమింపబడటం విశేషం. -
‘బెల్టు’ తీయాల్సిందే
తాడేపల్లిగూడెం : పేదల ప్రాణాలను బలిగొంటున్న బెల్టు షాపులను తక్షణం మూసివేయాల్సిందేనని, అధికారులు స్పందించకుంటే పోలీసు విధులను నియోజకవర్గంలో తానే నిర్వహిస్తానని దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు హెచ్చరించారు. శనివారం మంత్రి క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు నాయుడు బెల్టు షాపుల రద్దుపై చాలా స్పష్టంగా ఉన్నారన్నారు. బెల్టు దుకాణాల కారణంగా తమ కుటుంబాలు నాశనమవుతున్నాయని అనేకమంది ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారన్నారు. బెల్టుషాపులను తొలగించాలని ఎక్సైజ్ అధికారులకు స్పష్టంగా ఆదేశాలిచ్చామన్నారు. మద్యం మహమ్మారి బారినపడి గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నో కుటుంబాలు నాశనమవుతున్నాయన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంలో బెల్టు దుకాణాల వల్ల కుటుంబాల ఆర్థికవ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటోందని తనకు చాలామంది బా«ధితులు వివరించారన్నారు. వీటి నిరోధానికి ఎక్సైజ్ అధికారులు సరైన రీతిలో స్పందించకుంటే నియోజకవర్గంలో బెల్టుషాపుల నిరో«ధానికి తానే రంగంలోకి దిగుతానని హెచ్చరించారు. బెల్టు షాపుల వివరాలు తెలపండి నియోజకవర్గంలో బెల్టు షాపుల వివరాలను తమకు తెలియచేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని మంత్రి మాణిక్యాలరావు చెప్పారు. ఏయే ప్రాంతాల్లో మద్యం గొలుసుదుకాణాలు నడుస్తున్నాయో తమ క్యాంపు కార్యాలయంలో వివరాలు తెలియచేయాలన్నారు. మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ యెగ్గిన నాగబాబు. బీజేపీ పట్టణ అ««ధ్యక్షుడు కర్రి ప్రభాకర బాలాజీ, ప్రధాన కార్యదర్శి ఐనం బాలకృష్ణ పాల్గొన్నారు. -
అనర్హులకు ఈఓ పోస్టులు!
- దేవాదాయశాఖలో తెరవెనుక బాగోతం - కొందరు ఎమ్మెల్యేల ఒత్తిడితో కదిలిన ఫైలు - సీనియర్ ఈఓలను మార్చి అస్మదీయులకు కేటాయించే యత్నం - ప్రధాన దేవాలయాల్లో సాగుతున్న తంతు సాక్షి, హైదరాబాద్: ప్రధాన దేవాలయాలకు అర్హత లేని అధికారులను కార్యనిర్వహణాధికారులుగా కూర్చోబెట్టేందుకు దేవాదాయశాఖలో పావులు కదులుతున్నాయి. కొందరు ఎమ్మెల్యేల ఒత్తిడి తో ఫైలు చకచకా కదిలి.. ఇప్పుడు దేవాదాయ మంత్రి వద్దకు చేరింది. దేవాదాయశాఖను ప్రక్షాళన చేసేందుకు దేవాదాయ మంత్రి చైర్మన్‌గా ఐదుగురు మంత్రులతో ఏర్పడ్డ మంత్రివర్గ ఉప సంఘం ప్రభుత్వానికి సిఫారసులు సిద్ధం చేస్తున్న తరుణంలోనే ఈ వ్యవహారానికి తెరలేచింది. ఆదాయం ఆధారంగా దేవాలయాల స్థాయి పెంచాలని ఇటీవల మంత్రివర్గ ఉపసంఘం తీర్మానించింది. ఈ మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోని కాళేశ్వరం, నిర్మల్ జిల్లా బాసర ఆలయాలకు అసిస్టెంట్ కమిషనర్(ఏసీ) స్థాయి అధికారులు ఈఓలుగా ఉండాలి. ప్రస్తుతం ఏసీ పదోన్నతికి సిద్ధంగా ఉన్న అధికారులు ఇక్కడ ఈఓలుగా ఉన్నారు. ఈ దశలో సాధారణ సూపరింటెండెంట్లకు ఆ పోస్టులు కట్టబెట్టేందుకు కొందరు ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. రకరకాల ఆరోపణలు, కేసుల్లో ఇరుక్కుని ఉన్న సూపరింటెండెంట్లకు ఇన్చార్జి ఈవోలుగా కూర్చోబెట్టాలని వారు ఒత్తిడి ప్రారంభించారు. దీంతో అధికారులు ఆ ఫైల్‌ను దేవాదాయ మంత్రి వద్దకు పంపినట్టు తెలిసింది. ఈ ఇద్దరు సూపరింటెండెంట్లు నేరుగా ప్రభుత్వం నియమించిన ఉద్యోగులు కాదు, అలాంటి వారిని ఈఓలుగా నియమించడం నిబంధనలకు విరుద్ధం. అయినా కూడా ఎమ్మెల్యేల ఒత్తిడితో ఫైలు చకచకా కదిలింది. వీరికి పోస్టింగ్స్ ఇస్తే మరికొందరు సూపరింటెండెంట్లు కూడా దొడ్డిదారిన ఈఓ పోస్టులు కొట్టేసేందుకు సిద్ధంగా ఉన్నారు. -
ప్రతిపక్ష నేతకు ఆ హక్కు ఉంది: మాణిక్యాలరావు
- వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన పై షాకింగ్ కామెంట్ రావులపాలెం (తూర్పుగోదావరి జిల్లా): రాష్ట్ర ప్రతిపక్ష నేతగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర మంత్రులను కలవొచ్చని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో శుక్రవారం ఆయన విలే కరులతో మాట్లాడారు. జగన్ మోహన్ రెడ్డికి అవాంతరాలు కల్పించే అవకాశం లేదని, దీనిపై టీడీపీ నేతలు, ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉందని అన్నారు. కేంద్ర మంత్రులను, అధికారులను కలిసే అర్హత వైఎస్ జగన్ కు లేదని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తారా? అని విలేకరులు అడిగినప్పుడు ఆయన పైవిధంగా స్పందించారు. ప్రతిపక్ష నేతగా, ఎమ్మెల్యేగా జగన్ మోహన్ రెడ్డి కేంద్ర హోం మంత్రి, ఇతర మంత్రులను, అధికారులను కలవడం సాధారణ విషయమేనన్నారు. యనమల మంచి పార్లమెంటేరియన్ అని, పార్లమెంటరీ సంప్రదాయూలపై అవగాహన కలిగిన ఆయన ఏం వ్యాఖ్యలు చేశారో తనకు పూర్తిగా తెలియదని అన్నారు. వైఎస్ జగన్‌కు అర్హత లేదన్నప్పుడు రాష్ట్ర రాజధాని శంకుస్థాపన సమయంలో ఆహ్వాన పత్రం ఇచ్చేందుకు మంత్రులు అయ్యన్నపాత్రుడు, కామినేని శ్రీనివాస్‌లను ప్రభుత్వం ఎందుకు పంపిందని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకోవడం ఆ పార్టీ విజ్ఞతకు సంబంధించిన విషయమన్నారు. పార్టీలు మారుతున్న ఎమ్మెల్యేలు అభివృద్ధి కోసం వస్తున్నామనడం వారి విశ్వాసానికి సంబంధించిన అంశమన్నారు. ఎవరైనా ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తామంటే ఆలోచించి నిర్ణయం తీసుకొంటామన్నారు. బీజేపీ మద్దతు అవసరం లేకుండా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను చేర్చుకొంటున్నారా అని ప్రశ్నించగా, రాష్ట్ర ప్రభుత్వానికి తమ మద్దతు అవసరం లేదని, మిత్రపక్షంగా మాత్రమే కలసి ఉన్నామని చెప్పారు. కేంద్రంలో మద్దతుకు, రాష్ట్రంలో మద్దతుకు సంబంధం లేదని మంత్రి అన్నారు. కృష్ణా పుష్కరాలకు రూ.150 కోట్లు ఈ ఏడాది జరిగే కృష్ణా పుష్కరాలకు దేవాదాయ శాఖ ద్వారా రూ.150 కోట్లు కేటాయించినట్టు మాణిక్యాలరావు చెప్పారు. ఈ నిధులతో సుమారు 500 దేవాలయాల పునరుద్ధరణ, అభివృద్ధి పనులు చేస్తామన్నారు. విజయవాడ కనకదుర్గ, శ్రీశైలం మల్లికార్జునస్వామి ఆలయాలకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందన్న అంచనాతో మాస్టర్ ప్లాన్ ద్వారా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. -
ఆగస్టు 12 నుంచి కృష్ణా పుష్కరాలు
-
ఆగస్టు 12 నుంచి కృష్ణా పుష్కరాలు
♦ దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు వెల్లడి ♦ ఫిర్యాదుల స్వీకరణకు టోల్‌ఫ్రీ నంబరు ♦ 1800 425 6656 ప్రారంభం సాక్షి, హైదరాబాద్: పవిత్ర కృష్ణా పుష్కరాలు ఈ ఏడాది ఆగస్టు 12వ తేదీ ప్రారంభమై 23వ తేదీతో ముగుస్తాయని దేవాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాలరావు వెల్లడించారు. పుష్కరాల నేపధ్యంలో కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో 173 పుష్కర ఘాట్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు మంత్రి వివరించారు. దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి జేఎస్వీ ప్రసాద్, కమిషనర్ అనురాధలతో కలసి మంత్రి శనివారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. పుష్కరాల నిర్వహణ, పర్యవేక్షణకుగాను ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర స్థాయిలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో మంత్రుల కమిటీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన అధికారుల కమిటీ ఏర్పాటు చేస్తారని తెలిపారు. అనంతరం ఆలయాల్లో భక్తులకు ఎదురయ్యే అసౌకర్యాలపై శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక టోల్ ఫ్రీ నంబరు 1800 425 6656ను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఇంటి వద్దకే దేవుడి పూజలు తిరుమలలో ఇటీవల జరిగిన హిందూ సాధు సంతుల సమ్మేళనంలో వ్యక్తమైన సూచనల మేరకు పలురకాల సేవలను భక్తుల ఇంటి వద్దకే తీసుకెళ్లాలని దేవాదాయ శాఖ నిర్ణయించినట్టు మాణిక్యాలరావు తెలిపారు. ఈ ఏడాది ఉగాది పండుగ నుంచి ఏడు సందర్భాల్లో గుడి పూజారి.. భక్తుని ఇంటి వద్దకే వచ్చి దేవుడి ఆశీస్సులు అందజేస్తార న్నారు. కొత్త దంపతులకు, గర్భవతులకు శ్రీమంతం కార్యక్రమం చేసేటప్పుడు, పిల్లలు పుట్టినప్పుడు, నామకరణం, అన్న ప్రాసన, అక్షరాభ్యాసం వంటి సమయాల్లో గుడి పూజారి దేవుడి పటంతో భక్తుల ఇంటికే వెళ్లి దీవెనలు, అమ్మవారి కుంకుమ అందజేస్తారని తెలిపారు. అలాగే మరణించిన వ్యక్తి ఇంటికి శివుడికి అభిషేకించిన జలాలతో వెళ్లి ఆ ఇంటిని శుద్ధి చేసే కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించామన్నారు.ఆసక్తి ఉన్న వారికి మాత్రమే ఇలాంటి సేవలు అందజేస్తామని విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు బదులిచ్చారు. -
మంత్రి 100 అడిగితే...10 ఇచ్చారు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖమంత్రి మాణిక్యాలరావు దీనస్థితి మరోసారి చర్చనీయంశమైంది. దేవాదాయశాఖలో అధికారులదే అధిపత్యంగా నడుస్తుంది. మంత్రిని ఇటు ఏపీ ప్రభుత్వం, అటు అధికారులు పూర్తిగా పక్కనపెట్టేశారు. మంత్రి మాణిక్యాలరావు నోటీసులో లేకుండానే అధికారులు జీవోలు జారీ చేస్తున్నారు. తాజాగా స్వయనా దేవాదాయ శాఖమంత్రి లేఖలను టీటీడీ పట్టించుకోలేదు. దర్శనం కోసం మంత్రి సిఫార్సు లేఖలు ఇచ్చినా టీటీడీ బుట్టదాఖలు చేసింది. సాక్షాత్తూ టీటీడీ కొత్త సంవత్సరం దేవుడి డైరీలు దక్కకపోవడంపై ఆయన ఆవేదన చెందారు. 100 టీటీడీ డైరీలు, క్యాలెండర్లు కావాలని మాణిక్యాలరావు ఆర్డర్ చేస్తే కేవలం పదే డైరీలు, క్యాలెండర్లు ఇచ్చి టీటీడీ చేతులు దులుపుకుంది. దీంతో మంత్రి తీవ్ర అసహానానికి గురైనట్లు తెలుస్తుంది. గోదావరి పుష్కరాల్లోనూ మంత్రి మాణిక్యాలరావు ప్రమేయం పరిమితం కావడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. -
పేరుకే మంత్రి.. పాపం మాట వినేవారులేరు
-
పోలవరంపై బీజేపీలో అసంతృప్తి
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న తీరుపై భారతీయ జనతా పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు ఆ పార్టీ నాయకుడు, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు చెప్పారు. బుధవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న ఏ మాత్రం సంతృప్తికరంగా లేదు. మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు ఈ విషయం స్పష్టంగా చెప్పారు. ఆయన ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి సైతం తీసుకెళ్లారు అని వివరించారు. జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపు పొందిన పోలవరం నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు రావడం ఇబ్బందే కాదని, ఇక్కడ పనులు చేపట్టడమే సమస్య అని తెలిపారు. రాష్ట్ర ప్రాజెక్టు పనులకు అంచనాలు తయారు చేసి, పనులకు సంబంధించిన బిల్లును కేంద్రానికి అందజేస్తే వెంటనే నిధులు విడుదల చేస్తామని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి స్పష్టంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో స్పష్టం చేశారని అన్నారు. పోలవరం ప్రాజెక్టు టెండరు దక్కించుకున్న కాంట్రాక్టరును మార్చడం సరికాదని.. అభిప్రాయపడ్డారు. పుష్కరాల అవినీతిపై విచారణ జరుగుతోంది గోదావరి పుష్కర పనుల అవినీతిపై ప్రభుత్వం విచారణ జరిపిస్తోందని మంత్రి మాణిక్యాలరావు చెప్పారు. వచ్చే ఏడాది జరగనున్న కృష్ణా పుష్కరాలకు స్నాన ఘట్టాల గుర్తింపు, దేవాదాయ శాఖ తరుఫున చేట్టాల్సిన పనులపై నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించినట్టు ఆయన చెప్పారు. -
కప్పట్రాల్లలో దేవాదాయ మంత్రి పర్యటన
దేవరకొండ (కర్నూలు) : పూరాతన దేవాలయాలకు సంబంధించిన భూముల వివరాలను సేకరించి ఇంటర్నెట్లో ఉంచుతామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. ఆయన మంగళవారం కర్నూలు జిల్లా దేవరకొండ మండల పరిధిలోని కప్పట్రాల్ల అటవీ ప్రాంతంలో వెలసిన కౌలుట్ల చెన్నకేశవస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆయన వెంట ఆలూరు ఎమ్మెల్యే, జిల్లా ఎస్పీ ఉన్నారు. -
దేవాలయ సిబ్బందికి రూ. 5వేల గౌరవవేతనం
ఆదాయాలు లేని దేవాలయాల సిబ్బందికి ప్రతినెలా 5వేల రూపాయల గౌరవ వేతనం చెల్లించాలని నిర్ణయించినట్లు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తెలిపారు. జనవరి నుంచి 2,645 మంది ధార్మిక సిబ్బందికి ఇది వర్తిస్తుందని ఆయన చెప్పారు. దీని కోసం రూ. 250 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేశామన్నారు. జనవరి 1న వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో మూడు రోజుల పాటు సిఫార్సు లేఖలను నిషేధించామని మాణిక్యాలరావు చెప్పారు. వీఐపీల లేఖలను అనుమతించేది లేదని, వీఐపీ సహా నలుగురికి మాత్రమే అనుమతి ఉంటుందని వివరించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు ఐదుగురు కుటుంబసభ్యులకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. వీఐపీ బ్రేక్ దర్శనాల సంఖ్యను కూడా 5వేల నుంచి 800కు తగ్గించినట్లు మంత్రి తెలిపారు. -
ఆలయాల పవిత్రతను కాపాడడం అందరి బాధ్యత
జుత్తిగ (పెనుమంట్ర) : ఆలయాల పవిత్రతను కాపాడే బాధ్యత భక్తులతో పాటు సిబ్బంది, అర్చకులపై కూడా ఉందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. జుత్తిగలోని ఉమావాసుకీరవి సోమేశ్వరస్వామి ఆలయాన్ని సోమవారం ఆయన సతీసమేతంగా సందర్శించి పూజలు నిర్వహించారు. స్వామి వారికి రుద్రాభిషేకం, పంచామృతాభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బీవీఎస్.వర్మ, మండల పార్టీ అధ్యక్షుడు గంటా హనుమంతరావు, మహిళామోర్చా అధ్యక్షురాలు చిటికెన నాగలక్ష్మిరామస్వామి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోకల రామోహనరావు తదితరులు పాల్గొన్నారు. సోమేశ్వరాలయ అభివృద్ధికి కృషి జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటైన జుత్తిగ సోమేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి అన్నివిధాలా సహకరిస్తానని మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. మంత్రి ఆలయ సందర్శనలో భాగంగా ట్రస్టుబోర్డు చైర్మన్ సత్తిరాజు వెంకటశ్రీ రామారావు ఆలయ ఆదాయ వివరాల నివేదికను మంత్రికి అందజేశారు. ఆలయానికి చెందిన సుమారు 37 ఎకరాల ఈనాం భూములు అన్యాక్రాంతమైన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై మంత్రి మాట్లాడుతూ ఈ అంశంపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. -
దేవుళ్ల మంత్రిని దూరం పెట్టారెందుకో!
తిరుపతి వెంకన్న, బెజవాడ కనకదుర్గమ్మ నవ్యాంధ్రప్రదేశ్‌కు సాంస్కృతిక రాయబారులని ఇటీవల ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు ఘనంగా ప్రకటించారు. ఆదాయపరంగా కూడా కొత్త రాష్ట్రంలో ఈ రెండు పుణ్యక్షేత్రాలే చాలా కీలకం కానున్నాయి. యాధృచ్ఛికమో, ఉద్దేశపూర్వకమో తెలియదు గానీ.. ఆ రెండు క్షేత్రాల్లో నిర్వహించిన ఉత్సవాల్లో దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుకు సరైన ప్రాధాన్యత దక్కలేదు. తిరుమల బ్రహ్మోత్సవాలకు కుటుంబ సభ్యులతో వెళ్లిన మంత్రిని అక్కడ సెక్యూరిటీ అధికారులు అడ్డుకోవడంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. ఆ తర్వాత ఉన్నతాధికారులు కల్పించుకున్నా దేవాదాయ శాఖ మంత్రికి గౌరవ మర్యాదలు దక్కలేదని స్వయంగా మంత్రి వర్గీయులే వాదిస్తున్నారు. ఇక విజయవాడ కనకదుర్గమ్మ శరన్నవరాత్ర ఉత్సవాలకు మంత్రి దూరంగా ఉండాల్సిన పరి స్థితి కల్పించారని అంటున్నారు. ఉత్సవాల సందర్భంగా ఏటా అమ్మవారి జన్మనక్షత్రం (మూలా నక్షత్రం) రోజున దుర్గమ్మకు ముఖ్యమంత్రి లేదా దేవాదాయ శాఖ మంత్రి పట్టు వస్త్రాలను సమర్పిం చడం ఆనవాయితీ. ఎప్పుడైనా ఆ ఇద్దరికీ కుదరని పక్షంలో దేవాదాయ శాఖ కమిషనర్ ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తారు. ఈ ఏడాది ఇందుకు భిన్నంగా అమ్మవారి జన్మ నక్షత్రం రోజున కృష్ణా జిల్లాకు చెందిన భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వాస్తవానికి సీఎం చంద్రబాబునాయుడు మూలా నక్షత్రం రోజుకు నాలుగు రోజులు ముందుగా దూరదర్శన్ సప్తగిరి ఛానల్ ప్రారంభోత్సవానికి విజయవాడ వచ్చి దుర్గమ్మను దర్శించుకున్నారు. దీంతో సీఎంకు బదులుగా దేవాదాయ శాఖ మంత్రి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని అందరూ భావించారు. కానీ మంత్రి మాణిక్యాలరావు అందుబాటులో ఉన్నప్పటికీ ఆయనకు అవకాశం ఇవ్వకుండా దేవినేని ఉమకు ఆ అవకాశం కట్టబెడుతూ ప్రభుత్వం జీవో జారీ చేయడం చర్చనీయూంశమైంది. అదే రోజున కేబినెట్ సమావేశం ఉన్నందున మాణిక్యాలరావుకు బదులు ఉమకు అవకాశం కల్పించారని అధికార వర్గాలు చెప్పుకొస్తున్నాయి. మరి ఆ సమావేశానికి కీలకమైన భారీ నీటి పారుదల శాఖ మంత్రి హోదాలో దేవినేని ఉమ కూడా వెళ్లాల్సి ఉంది కదా అన్న ప్రశ్నకు ఎవరి వద్దా సమాధానం లేదు. బీజేపీకి చెందిన మంత్రి కావడంతోపాటు సామాజిక వర్గ సమీకరణల నేపథ్యంలో కూడా మాణిక్యాలరావును పక్కనపెట్టి దేవినేని ఉమకు అవకాశం కల్పించారని బీజేపీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. వాస్తవానికి దసరా ఉత్సవాల తొలిరోజు నుంచి దూరంగానే ఉన్న మంత్రి మాణిక్యాలరావు పట్టువస్త్రాల సమర్పణ వ్యవహారంతో అమ్మవారి ఉత్సవాలు ముగిసేవరకూ దూరంగానే ఉన్నారు. దేవాదాయ శాఖకు మంత్రి ఉండి కూడా శరన్నవరాత్రి ఉత్సవాలకు హాజరుకాకపోవడం ఇదే ప్రథమం అని బెజవాడ శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వారి దేవస్థానం వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే తిరుమల సిఫార్సు లేఖల రద్దు వ్యవహారంలో మంత్రి మాణిక్యాలరావు మాట నెగ్గకపోవడం.. ఇప్పుడు దుర్గమ్మ ఉత్సవాలకు మంత్రి ఒక్కసారి కూడా వెళ్లకపోవడం తదితర పరిణామాలు ఎటు దారితీస్తాయోనని కమలనాథులు కలవరపడుతున్నారు. - జి.ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, ఏలూరు -
వర్షాల కోసం పూజలు చేయండి
-
వర్షాల కోసం పూజలు చేయండి
రుతుపవనాలు వచ్చేస్తున్నాయి.. ఇంకేముంది, వర్షాలు పడతాయని రైతన్నలు ఎంతగా ఎదురు చూసినా చుక్క వర్షం కూడా కురవలేదు. దీంతో వర్షాల కోసం ప్రత్యేక పూజలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 19, 20, 21 తేదీలలో రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాల్లో వరుణ జపాలు, సహస్ర ఘటాభిషేకాలు నిర్వహించాలని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అధికారులకు ఆదేశాలిచ్చారు. కోస్తా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో ఉండటం, ఎండలు మండిపోతూ వడదెబ్బకు పలువురు మృత్యువాత పడుతుండటంతో వర్షాల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. నాలుగు వర్షపు చినుకులు ఎప్పుడు పడతాయో, వాతావరణం ఎప్పటికి చల్లబడుతుందోనని జనం అల్లాడిపోతున్నారు. మళ్లీ వర్షాలు పడని రోజులు వచ్చేశాయంటూ వాపోతున్నారు.