breaking news
elizabeth princess
-
తప్పంతా మేఘన్ మీదకు నెడుతున్నారు..
ఇరాన్లో యుద్ధ మేఘాలు. ఇండియాలో పౌరసత్వ నిరసనలు. అగ్రరాజ్యాల్లో పర్యావరణ ఉద్యమాలు. ఒక్కోదేశం ఒక్కో సమస్యతో సతమతమౌతోందిప్పుడు. బ్రిటన్ ప్రజలు మాత్రం వీటన్నిటికీ భిన్నమైన ఒక హటాత్పరిణామంతో నివ్వెర పోయి రెండు రోజులుగా రాజప్రాసాదం వైపే చూస్తున్నారు. మనవడు ప్రిన్స్ హ్యారీ తన నానమ్మ క్వీన్ ఎలిజబెత్‌తో ఓ మాటైనా చెప్పకుండా భార్యతో కలిసి ఇంట్లోంచి బయటికి వెళ్లిపోతున్నట్లు ప్రకటించడమే ఇందుకు కారణం. స్వాతంత్య్రం కోసం ఎన్నో దేశాలు బ్రిటన్‌పై పోరాడి స్వేచ్ఛను సాధించుకు న్నట్లే.. స్వతంత్రంగా జీవించడం కోసం ప్రిన్స్ హ్యారీ.. రాయల్ ఫ్యామిలీ నుంచి వెళ్లిపోతున్నారా?! ఊరంతా తెలిశాక మనకు తెలిసే విషయం ఒకటి ఉంటుంది. మన ఇంటి విషయం! అబ్బాయి బయటేదో ఘనకార్యం చేసి ఉంటాడు. కాలనీ అంతా తెలిశాకే మనకు తెలుస్తుంది. అమ్మాయి ఎవర్నో ప్రేమిస్తుంటుంది. పొరుగూళ్లో బంధువులందరికీ తెలిశాకే, ఆ కబురు మన ఊళ్లో బస్ దిగి, మన ఇంటికి వస్తుంది. నమ్మకం మనకు మన అబ్బాయి మీద, అమ్మాయి మీద. ఆ నమ్మకాన్ని నమ్మకంగా ఉంచడానికి కావచ్చు.. తెలిసినవాళ్లు, తెలియనివాళ్లు విషయాన్ని దాచి ఉంచీ ఉంచీ ఇక చెప్పకపోతే నమ్మకద్రోహం చేసినట్లవుతుందని మనకు చెప్పేస్తుంటారు. ఇళ్లన్నీ ఒక్కటే. రాజుగారి ఇల్లయినా, పేదవాడి ఇల్లయినా! మనుషులంతా ఒక్కటే. గ్రేట్ బ్రిటన్‌లో ఉన్నా, పూర్ కంట్రీలో ఉన్నా! అందుకే.. మనవడు హ్యారీ, అతడి భార్య.. ఇల్లొదిలి వెళ్లిపోతున్నారనే విషయం అందరికీ తెలిశాక ఆఖర్న గానీ ఎలిజబెత్ రాణిగారికి తెలియలేదు. అప్పట్నుంచీ ఆమె మనసు మనసులో లేదు. నేనేం తక్కువ చేశాను అని ఆమె విలపిస్తున్నారు తప్పితే, వాళ్లేం ఎక్కువ కోరుకుంటున్నారోనని ఆలోచించడానికి కూడా ఆమెకు మనస్కరించడం లేదు. వెళ్లిపోతున్నారు.. వెళ్లిపోతున్నారు.. ఇదే ఆమె హృదయాన్ని పిండేస్తోంది. బుధవారం సాయంత్రం వరకు అంతా ప్రశాంతంగానే ఉంది. క్రిస్మస్ వేడుకల కోసం వారం ముందే శాండ్రింగ్ హామ్ ఎస్టేట్‌కి వెళ్లిన రాణిగారు మూడు వారాలు గడిచిపోతున్నా అక్కడే ఉండిపోడానికి కారణాలు ఏమైనా.. ఇప్పుడామె హుటాహుటిన బకింగ్‌హామ్ రాజప్రాసాదానికి తిరిగి వచ్చే ఏర్పాట్లలో ఉన్నారు. రాయల్ ఫ్యామిలీలోంచి వెళ్లిపోవాలని మనవడు హ్యారీ, అతడి భార్య కలిసి తీసుకున్న నిర్ణయంగా బ్రిటన్ పత్రికల్లో వస్తున్న వార్తలు.. తిరుగు ముఖానికి ఆమెను తొందర పెడుతున్నాయి. ‘కనీసం వాళ్లు రాణిగారికి చెప్పనైనా లేదు’ (దే డిడిన్ట్ ఈవెన్ టెల్ ద క్వీన్) అని ‘డైలీ మిర్రర్’ తన మొదటి పేజీ నిండా పెట్టిన హెడ్డింగ్ ఆమెను మరింతగా బాధిస్తుండవచ్చు. ప్యాలెస్ తలుపులు తెరుచుకోగానే గుమ్మం ముందు పడి కనిపించే అనేక తుంటరి పత్రికల్లో అదీ ఒకటి. ఈ భార్యాభర్తలిద్దరూ తాము ఇల్లొదిలి వెళ్లిపోతున్నట్లు రాణిగారికి మాట మాత్రంగానైనా చెప్పకపోవడం నిజమే. పైగా ఆ విషయాన్ని వాళ్లు తామిద్దరూ కొత్తగా ప్రారంభించిన వెబ్సైట్ లో బహిరంగ పరచడం ఆ వృద్ధ ప్రాణాన్ని మరింత అలసటకు గురి చేసినట్లు కనిపిస్తోంది. ‘హ్యారీ మొన్న క్రిస్మస్కి కూడా పొడిపొడిగానే మాట్లాడాడు. అది కూడా ఫోన్లో. అప్పుడైనా నేను అతడి అంతరంగాన్ని గ్రహించ వలసింది’’ అని రాణిగారు పొడి బారుతున్న గొంతుతో అన్నట్లు.. ఎప్పుడూ ఆమెను కనిపెట్టుకుని ఉండే వ్యక్తిగత సంరక్షకులు ఒకరు.. తనను పట్టి పీడిస్తున్న మీడియా ప్రతినిధులకు తప్పనిసరై వెల్లడించారు. భార్య మేఘన్ మార్కెల్‌తో ప్రిన్స్ హ్యారీ ‘‘మా కాళ్లపై మేము నిలబడాలని భావిస్తున్నాం. స్వతంత్రంగా జీవించాలని అనుకుంటున్నాం. మాకొక గుర్తింపు కోసం ఆశపడుతున్నాం. మేము బయటికి రావడం వల్ల రాచ కుటుంబం నుంచి వారసత్వంగా మాకు సంక్రమించవలసిన వాటన్నిటినీ కోల్పోతామని తెలుసు. అయినా అందుకు సిద్ధపడుతున్నాం’’ అని ప్రిన్స్ హ్యారీ, మేఘన్ కలసి చేసిన ఆ ప్రకటన ఎలిజబెత్ రాణి మనసులోనే కాదు, బ్రిటన్ ప్రజల్లోనూ కలవరం రేపుతోంది. ‘కలిసి ఉన్న ఒక గొప్ప కుటుంబం ముక్కలు కాబోతోందే! ఈ విలయాన్ని, విపత్తును నివారించలేకపోతున్నామే.. ఎలా దేవుడా..’ అని ఆ కుటుంబాన్ని తరతరాలుగా అభిమానించే వారు విలవిలలాడుతున్నారు. వారిలో కొందరైతే తమ మనసులో ఉన్న దానిని ఏమాత్రం దాచుకునే ప్రయత్నం చేయడం లేదు. ‘‘ఈ దుస్థితికి మూల కారణం హ్యారీ భార్య మేఘన్. ఆ మహాతల్లి వల్లే ఇదంతా జరుగుతోంది. హ్యారీ భార్యా విధేయుడైపోయి, కుటుంబాన్ని కాదనుకున్నాడు. కనీసం రాణి గారికి కూడా చెప్పి చేయడం లేదంటే ఏమనుకోవాలి?’’ అని తప్పంతా మేఘన్ మీదకు నెడుతున్నారు. ఇంట్లోంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకోవడం తప్పయినా ఒప్పయినా.. ఇంటికి పెద్దయిన రాణిగారికి చెప్పకపోవడం మాత్రం తప్పే. ప్రస్తుతం రాణిగారు, రాణిగారి భర్త; రాణిగారి కొడుకు, కూతురు; కొడుకు సంతానం, కూతురి సంతానం; వారి జీవిత భాగస్వాములు; వారి సంతానంలో కొందరు.. మొత్తం 24 మంది ‘రాయల్’ టైటిల్ ఉన్నవాళ్లున్నారు. మిగతా ఇంకా ఉన్నారు కానీ, వాళ్లంతా టైటిల్స్ లేనివాళ్లు. ఇప్పుడు బయటికి వెళ్లిపోతున్న హ్యారీ, మేఘన్ సొంతంగా బతకడం కోసం రాయల్ టైటిల్‌ని కూడా వదులుకోబోతున్నారు. బ్రిటన్‌లోని విండ్సర్‌లో ఫ్రాగ్మోర్ కాటేజ్ హ్యారీ పేరు మీద ఉంది. దాన్ని మాత్రం ఉంచుకుంటారు. అప్పుడప్పుడు అక్కడికి వచ్చి పోతుండటానికి. ఇకనుంచీ ఈ దంపతులు ఉండటమైతే బ్రిటన్ కాదు. కెనడా. 2018 మే లో హ్యారీ, మేఘన్‌ల వివాహం జరిగింది. వారికిప్పుడు ఎనిమిది నెలల కొడుకు. పేరు మౌంట్‌బ్యాటన్. సింహాసనాన్ని అధిష్టించే వారసత్వపు వరసలో అతడిది ఏడవ స్థానం. అంతఃపురంలో తమ స్థానాలన్నిటినీ వదులుకుని వెళ్తున్న ప్రిన్స్ హ్యారీ దంపతులకు ఆ కుటుంబ సభ్యుల హృదయాలలో మాత్రం స్థానం ఎప్పటికీ ఉంటుంది. అది కాదనుకున్నా పోయేది కాదు. కాదని వెళ్లిపోయినా విడిచి పెట్టేదీ కాదు. గతంలో! కింగ్ ఎడ్వర్డ్ VIII వాలిస్ సింప్సన్‌తో ఎనిమిదవ ఎడ్వర్డ్ ఇప్పుడు ప్రిన్స్ హ్యారీ బయటికి వెళ్తున్నట్లే.. బ్రిటన్ రాజ కుటుంబపు పూర్వీకుడైన ఎనిమిదవ ఎడ్వర్డ్ మహారాజు కూడా తను ప్రేమించిన యువతి కోసం ప్యాలెస్‌ను వదులుకున్నవారే! ప్యాలెస్‌తో పాటు తన సింహాసనాన్ని కూడా! అమెరికన్ వితంతువు అయిన వాలిస్ సింప్సన్‌ను ప్రేమించిన ఎడ్వర్డ్.. ఆమెను పెళ్లి చేసుకోవడానికి అడ్డుగా ఉన్నందుకు కిరీటాన్ని సైతం కాదనుకున్నారు. ‘‘నేనీ భారాన్ని మోయలేకపోతున్నాను. నేను ప్రేమించిన వ్యక్తి సహాయం, సహకారం లేకుండా ఈ రాజ్యాధికారానికి న్యాయం చేకూర్చలేను’’ అని రాజైన కొద్ది నెలలకే బహిరంగంగా ప్రకటించి పక్కకు తప్పుకున్నారు. ఆ మర్నాడే ఎడ్వర్డ్ తమ్ముడు ప్రిన్స్ ఆల్బర్ట్ బ్రిటన్‌కు రాజయ్యాడు. ప్రిన్స్ ఫిలిప్ ఎలిజబెత్ (ప్రస్తుత రాణి)తో ప్రిన్స్ ఫిలిప్ రెండవ ఎలిజబెత్ రాణి (హ్యారీ నానమ్మ) భర్త ఫిలిప్‌ది కూడా ఇలాంటి పరిత్యాగ ప్రేమ కథే. అయితే రివర్స్‌లో. అతడిది గ్రీసు, డెన్మార్క్‌ల రాచ కుటుంబం. ఎలిజబెత్‌ను చేసుకోవడం కోసం తన సొంత రాజ్యాన్ని వదులుకుని బ్రిటన్ కుటుంబంలో సభ్యుడు అయ్యారు. -
అత్యాచారాలు సిగ్గుచేటు
లండన్: చిన్నారులపై అత్యాచారాలు సిగ్గుచేటని, దీనిపై రాజకీయాలు తగవని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. కఠువా, ఉన్నావ్ ఘటనలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. తాను ప్రధానమంత్రిని కాదని, 125 కోట్ల మంది భారతీయులకు సేవకుడినని మోదీ పేర్కొన్నారు. అభివృద్ధి ప్రజా ఉద్యమంగా మారాల్సిన అవసరం ఉందన్న ప్రధాని.. భారత్ పట్ల ప్రపంచ దేశాల దృక్కోణం మారిందన్నారు. భారత్ శాంతికాముక దేశమే కానీ.. దేశ ప్రజల భద్రత ప్రమాదంలో పడితే ఉపేక్షించబోమంటూ పాక్‌పై గతంలో జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌ను గుర్తు చేశారు. బ్రిటన్ పర్యటనలో భాగంగా బుధవారం ఆయన లండన్‌లోని ప్రఖ్యాత సెంట్రల్ హాల్, వెస్ట్ మినిస్టర్ వేదికగా తన అభిప్రాయాలను ‘భారత్ కీ బాత్.. సబ్ కే సాథ్’ పేరుతో స్థానిక భారతీయులతో పంచుకున్నారు. సోషల్ మీడియాలో వచ్చిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ చైర్మన్ ప్రసూన్ జోషి ప్రయోక్తగా వ్యవహరించిన ఈ కార్యక్రమం దాదాపు గంటన్నర పైగా సాగింది. ఈ సందర్భంగా పలువురికి మోదీ ఇచ్చిన సమాధానాలు ఆయన మాటల్లోనే.. భారత్‌లో చిన్నారులపై అత్యాచారాలపై.. రేప్ అనేది దారుణం. ఆందోళనకరం. దాన్ని ఎలా అంగీకరిస్తాం? మన బిడ్డలపై అత్యాచారాలు దేశానికే సిగ్గుచేటు. ఈ దారుణాలకు పాల్పడే వారు కూడా ఒక తల్లి బిడ్డలే. దేశవ్యాప్తంగా చిన్నారులపై జరుగుతున్న ఆకృత్యాలు అత్యంత బాధాకరం. చిన్న బాలికపై అత్యాచారం జరిగినపుడు చాలా బాధనిపిస్తుంది. ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలి. కానీ మీ ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలు ఇన్ని జరిగాయి. మా ప్రభుత్వంలో తక్కువ జరిగాయని చెప్పవచ్చా. వయసొచ్చిన కూతురు సాయంత్రం ఇంటికి ఆలస్యంగా వస్తే తల్లిదండ్రుల్లో ఆందోళన నాకు తెలుసు. విమర్శలపై..: విమర్శలను స్వాగతిస్తాను. వాటికి మాటలతో సమాధానం ఇవ్వాలనుకోను. తప్పు ఎక్కడ జరిగిందో సమీక్షించుకుంటాను. నేను చరిత్రలో నిలిచిపోవాలనుకోవడం లేదు. నా విధిని సక్రమంగా నిర్వర్తిస్తే చాలనుకుంటున్నాను. నోట్ల రద్దుపై..: నోట్ల రద్దు చారిత్రక నిర్ణయం. నిజాయితీ, పారదర్శకత కోసం ప్రజలు కొంతవరకు త్యాగం చేస్తారని నేను విశ్వసించాను. బలహీనతలపై..: నేను సామాన్యుడినే. అందరిలో ఉండే బలహీనతలు నాకూ ఉన్నాయి. సామాన్య స్థాయి నుంచే వచ్చాను. నాకు గొప్పగొప్ప నానమ్మలు, తాతయ్యలు లేరు. నేను కష్టపడతాను. ఈ విషయాన్ని నా దేశ ప్రజలు కూడా నమ్ముతారు. అధికారంలోకి వచ్చాక..: గత ప్రభుత్వాలతో పోలిస్తే అభివృద్ధి దిశగా దేశం దూసుకుపోతోంది. అధికారమిచ్చాం, అవకాశమిచ్చాం.. ఎందుకు చేసి చూపించరని ప్రజలు ప్రశ్నించటమే నాకు సంతోషాన్నిస్తుంది. ప్రజలకు నా ప్రభుత్వంపై ఉన్న నమ్మకానికి ఇదే సంకేతం. 125 కోట్ల మంది భారతీయులు నా కుటుంబం. ఓ చాయ్ అమ్ముకునే వ్యక్తి ప్రధాని కావటమే.. భారత ప్రజాస్వామ్యం గొప్పదనం. నేను రాయల్ ప్యాలెస్‌కు అతిథిగా రావటం 125 కోట్లమంది భారతీయుల సంకల్పమే. ప్రజాఉద్యమంలా అభివృద్ధి: అభివృద్ధి కూడా స్వాతంత్య్రోద్యమం లాంటిదే. ప్రజలందరూ అభివృద్ధిపై తమ ఆలోచనలో మార్పు తెచ్చుకోవాలి. అభివృద్ధి మన బాధ్యత. దేశం నాది, ఈ ప్రభుత్వం నాదనే భావన పెంచుకోవాలి అప్పుడు అభివృద్ధి ప్రజా ఉద్యమంలా దూసుకెళ్తుంది. ప్రజల భాగస్వామ్యం లేకుంటే మరుగుదోడ్ల నిర్మాణం కార్యక్రమం విజయవంతం కాకపోయేది. రైల్వే సబ్సిడీని 4 లక్షల మంది సీనియర్ సిటిజన్లు, ఎల్పీజీ సబ్సిడీని 1.25 కోట్ల మంది పౌరులు స్వచ్ఛందంగా వదులుకోవటమే దేశంలో ప్రజా భాగస్వామ్యానికి తార్కాణం. సర్జికల్ స్ట్రైక్‌పై.. యూఎన్ శాంతిపరిరక్షక దళాల్లో ఎక్కువ భాగస్వామ్యం భారత్‌దే. అలాంటి శాంతికాముక దేశమైన భారత్.. పొరుగున్న పాకిస్తాన్‌పై సర్జికల్ స్ట్రైక్స్ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ.. నా దేశ ప్రజలను చంపేస్తూ.. వెన్నుపోటు పొడిచేందుకు ప్రయత్నిస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? మా జవాన్ల తలలు నరుకుతున్నా నేను ఓపికగా ఉండలేకపోయాను. ఏ భాషలో చెబితే అవతలి వారికి అర్థమవుతుందో అలా చెప్పాను. సర్జికల్ స్ట్రైక్స్‌తో నా సైనికులు చేసిన పనికి నేను గర్వంగా ఫీలవుతున్నాను. ఈ విషయంపై ముందు పాకిస్తాన్ మిలటరీకి సమాచారం ఇచ్చాకే భారత్‌లోనూ, మిగతా ప్రపంచానికి వెల్లడించాం. పేదరికంపై.. నేను పుస్తకాలు చదివి పేదరికం అంటే ఏంటో తెలుసుకోలేదు. అది ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఈ విషయంలో రాజకీయం సరికాదు. రాజకీయం వేరు, పేదల జీవితంలో మార్పు తీసుకురావాలనే నా సమాజ నీతి వేరు. 70 ఏళ్ల తర్వాత 18వేల గ్రామాలకు విద్యుత్ లేకపోవటం దారుణం కాదా? మా ప్రభుత్వం ఈ పరిస్థితిని మార్చకపోతే అది పెద్ద తప్పు అవుతుంది. సౌభాగ్య పథకం ద్వారా 4కోట్ల కుటుంబాలకు (ఇళ్లకు) వెలుగునిచ్చాం. కొండలు, లోయలు, ఉగ్రవాద, తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లోని గ్రామాలకు విద్యుత్ ఇచ్చాం. 3 లక్షల గ్రామాలు బహిరంగ మల విసర్జన లేని గ్రామాలయ్యాయి. ‘గరీబీ హఠావో’ నినాదంతో తొలగిపోదు. ఆ దిశగా పనిచేయాలి. ఆయుష్మాన్ భారత్ పిల్లలకు సరైన విద్య, యువతకు ఉపాధి, అసహాయులకు సరైన వైద్యం అందించటమే మా ప్రభుత్వ లక్ష్యం. దీనికోసమే పనిచేస్తున్నాం. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని మోదీ కేర్‌గా పిలిస్తే నాకు అభ్యంతరమేం లేదు. సమగ్ర వ్యూహంతో ఈ పథకాన్ని రూపకల్పన చేశాం. తొలిగా దేశవ్యాప్తంగా 2 లక్షల వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేస్తాం. మాతా, శిశు ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెడతాం. పేదల కుటుంబాలకు ఏడాదికి 5 లక్షల వైద్య ఖర్చులను ప్రభుత్వం భరిస్తుంది. జెనరిక్ మందులను అందుబాటులోకి తెచ్చాం. స్టెంట్ల ధరలు తగ్గించాం. పిల్లల ఆరోగ్యం కోసం గర్భిణులకు 26వారాల ప్రసూతి సెలవులిస్తున్నాం. ఇదే నా జీవితం సీఎంగా ఉన్నప్పుడు నాకు వచ్చిన కానుకలను వేలం వేసి.. ఈ డబ్బును బాలిక విద్యకు వెచ్చించాను. ఈ మొత్తం 100 కోట్లకు పైమాటే. రాజకీయ జీవితంలో ఉన్నందున రెండు దశాబ్దాలుగా రోజూ విమర్శలు నాకు అలవాటైపోయాయి. ఎవరిపైనా ఆధారపడకుండా.. నవ్వుతూ, ఆహ్లాదంగా ఉంటూ ప్రాణాలు పోవాలి. అందుకే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు యోగ, ధ్యానం చేస్తాను. యువతకూడా యోగపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అంతర్గత ఆరోగ్యానికి అదే అసలైన శక్తినిస్తుంది. గాంధీ, మార్టిన్ లూథర్ కింగ్, డయానా! ప్రధాని మోదీ ప్రసంగించిన లండన్‌లోని సెంట్రల్‌హాల్ వెస్ట్‌మినిస్టర్‌కు ఎంతో ప్రత్యేకత ఉంది. మహాత్మా గాంధీ, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ వంటి ఎందరో గొప్ప వ్యక్తులు గతంలో ఆ వేదికపై నుంచి ఉపన్యాసాలిచ్చారు. 1912 అక్టోబరులో ఈ వేదికను ప్రారంభించారు. అప్పట్లో ఇది మెథడిస్ట్ సెంట్రల్ హాల్ పేరుతో చర్చి, సమావేశ మందిరంగా ఉండేది. అప్పట్లో అనేక రకాల సమావేశాలకు, వేడుకలకు, చర్చలకు వేదికగా ఉండేది. 1946లో తొట్టతొలి ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం జరిగింది కూడా సెంట్రల్‌హాల్ వెస్ట్‌మినిస్టర్‌లోనే. 1931లో భారత స్వాతంత్య్ర ఉద్యమం ఉధృతంగా సాగుతున్నప్పుడు గాంధీ యూకేలో పర్యటించి ఇక్కడే ప్రసంగించారు. దక్షిణాఫ్రికాలో వర్ణవివక్షకు వ్యతిరేకంగా, మానవ హక్కుల కోసం పోరాడిన మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, బౌద్ధమత గురువు దలైలామా, యువరాణి డయానా తదితరులు ఈ వేదికపై నుంచి ప్రసంగించిన వారిలో అత్యంత ప్రముఖులు. బసవేశ్వరుడికి పుష్పాంజలి ప్రధాని మోదీ బుధవారం థేమ్స్ నది ఒడ్డున అల్బర్ట్ ఎంబ్యాంక్మెంట్ గార్డెన్‌లోని 12వ శతాబ్దపు సంఘ సంస్కర్త బసవేశ్వరుడి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. లండన్‌లోని బసవేశ్వర ఫౌండేషన ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. కర్ణాటకలో లింగాయత్‌లు, వీరశైవులకు రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ హోదా కల్పిస్తూ ప్రతిపాదనలు చేసిన నేపథ్యంలో మోదీ బసవేశ్వరుడికి నివాళులర్పించటం ప్రాధాన్యత సంతరించుకుంది. అదే స్నేహం..బలమైన బంధం! భారత్–యూకే ద్వైపాక్షిక బంధాలపై మోదీ, థెరిసా మే లండన్: బ్రెగ్జిట్ (ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగటం)తో సంబంధం లేకుండా భారత–యూకే సంబంధాలు మునుపటిలాగే బలంగా ఉన్నాయని భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. కామన్వెల్త్ దేశాధినేతల (చోగమ్) సదస్సుకోసం లండన్ చేరుకున్న మోదీ.. బ్రిటన్ ప్రధాని థెరిసా మేతో చర్చలు జరిపారు. ద్వైపాక్షిక సంబంధాల్లో మరింత పురోగతితో ముందుకెళ్లాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. బుధవారం ఉదయం 10, డౌనింగ్ స్ట్రీట్ (బ్రిటన్ ప్రభుత్వ కార్యాలయం)లో జరిగిన ఈ సమావేశంలో.. నేరస్తుల అప్పగింత, న్యాయపరమైన అంశాలు, రక్షణ, భద్రతాపరమైన అంశాలు, పరస్పర మిలటరీ సహకారంతోపాటుగా ఉగ్రవాద వ్యతిరేక పోరాటం, ఆన్లైన్ ఉగ్రవాదం తదితర అంశాల్లో కలిసి పనిచేసేందుకు నిర్ణయించినట్లు ఇరుదేశాధినేతలు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. ‘ఇరు దేశాధినేతల మధ్య ద్వైపాక్షిక బంధాలకు కొత్త నిర్వచనం పలికేలా చర్చలు జరిగాయి. భారత్–యూకే సంబంధాల్లోని బహుముఖ అంశాలపై వీరిద్దరు విస్తృతంగా చర్చించారు’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ పేర్కొన్నారు. బ్రెగ్జిట్ అనంతరం కూడా భారత్–యూకే సంబంధాల్లో ఎలాంటి మార్పు ఉండబోదని మోదీ తెలిపారన్నారు. చోగమ్ సదస్సుకోసం మంగళవారం రాత్రి ప్రధాని లండన్ చేరుకున్న మోదీకి ఆ దేశ విదేశాంగ మంత్రి బోరిస్ స్వాగతం పలికారు. కాగా, బ్రిటన్ యువరాజు చార్లెస్ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో భాగంగా సైన్స్ మ్యూజియంను మోదీ సందర్శించారు. భారత్–బ్రిటన్ కొత్త వాణిజ్య భాగస్వామ్యం మోదీ పర్యటనను పురస్కరించుకుని బ్రిటిష్ ప్రభుత్వం బుధవారం కొత్త భారత్–యూకే వాణిజ్య భాగస్వామ్య పథకాన్ని ప్రకటించింది. ఈ కొత్త భాగస్వామ్యంలో భాగంగా బ్రిటన్‌లో భారత్ పెట్టే బిలియన్ పౌండ్ల (రూ.9,340 కోట్లు) పెట్టుబడితో 5,750 కొత్త ఉద్యోగాలు వస్తాయని యూకే అంతర్జాతీయ వాణిజ్య విభాగం వెల్లడించింది. దీని లెక్కల ప్రకారం భారత్, బ్రిటన్ మధ్య వస్తు, సేవల రూపంలో 2017లో 18 బిలియన్ పౌండ్ల వ్యాపారం జరిగింది. 2016తో పోలిస్తే ఇది 15% పెరిగింది. బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో ఎలిజబెత్ రాణితో మోదీ లండన్‌లోని డౌనింగ్ స్ట్రీట్‌లో మోదీ వ్యతిరేక నినాదాలు చేస్తున్న నిరసనకారులు -
ఎలిజబెత్ రాణి క్షమాపణ చెప్పాలి
లాహోర్: భారత స్వాతంత్ర రణధీరుడు సర్దార్ భగత్‌సింగ్‌ను 1931లో ఉరితీసినందుకు బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 క్షమాపణ చెప్పాలని, ఆయన వారసులకు పరిహారం ఇవ్వాలని పాకిస్తాన్‌లోని మానవహక్కుల సంఘాల కార్యకర్తలు గురువారం డిమాండు చేశారు. భగత్ సింగ్ 85వ వర్ధంతి సందర్భంగా బుధవారం పంజాబ్ ప్రావిన్స్‌లోని రెండు ప్రాంతాల్లో ఆయన సృ్మత్యర్థం హక్కుల సంఘాలు కార్యక్రమాలు నిర్వహించాయి. వీటిలో ఒకటి ఆయన జన్మస్థలంలో చేపట్టగా, మరొకటి భగత్‌సింగ్ ఆయన సహచరులను ఉరితీసిన ప్రాంతంలో జరిగింది. ఈ కార్యక్రమాలకు వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు హాజరై అమర వీరునికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు బ్రిటన్ రాణినుంచి క్షమాపణ కోరుతూ తీర్మానించారు.