breaking news
Elesvaram
-
అడ్డదారితో అసలుకే ఎసరు
ఏలేశ్వరం : ‘ఏరు దాటే వరకూ బోటు మల్లయ్య.. దాటాక బోడి మల్లయ్య’ అన్న రీతిలో వ్యవహరించిన అవకాశవాదానికి భంగపాటు తప్పలేదు. పదవి కోసం పార్టీ ఫిరాయించిన ఆ నాయకురాలు చివరికి ‘రెంటికీ చెడక’ తప్పలేదు. హెచ్చరిఏలేశ్వరం నగర పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున కౌన్సిలర్‌గా గెలిచి, తర్వాత టీడీపీ ప్రలోభాలకు లొంగి, చైర్పర్సన్ పదవిపై వ్యామోహంతో ఆ పార్టీలోకి ఫిరాయించిన కొప్పాడ పార్వతిపై అనర్హత వేటు పడింది. పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం ఆమె చైర్పర్సన్, కౌన్సిలర్ పదవులను కోల్పోయారు. ఈ మేరకు ఎన్నికల అధికారి, ఇందిరాసాగర్ ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ ఎల్.విజయసారథి ఉత్తర్వులు జారీ చేసినట్టు ఏలేశ్వరం నగర పంచాయతీ కమిషనర్ కేటీ సుధాకర్ గురువారం తెలిపారు. ఈ పరిణామంపై వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. ఏలేశ్వరం నగర పంచాయతీకి తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో చైర్పర్సన్ పదవిని ఎస్సీ మహిళకు కేటాయించారు. నగర పంచాయతీలోని 20 వార్డుల్లో టీడీపీకి పది, వైఎస్సార్ సీపీకి తొమ్మిది, కాంగ్రెస్ ఒకటి గెలుచుకున్నాయి. టీడీపీకి ఆధిక్యత ఉన్నా చైర్పర్సన్ పదవిని చేపట్టడానికి ఆ పార్టీ తరఫున ఎస్సీ మహిళా అభ్యర్థులు గెలుపొందలేదు. ఎస్సీ మహిళలకు కేటాయించిన రెండు వార్డుల్లోనూ వైఎస్సార్ సీపీ అభ్యర్థులే విజయం సాధించారు. వీటితో పాటు మరో రెండు జనరల్ వార్డుల నుంచీ ఆ పార్టీకే చెందిన ఎస్సీ మహిళా అభ్యర్థులు గెలుపొందారు. ఈ పరిణామంతో టీడీపీ అనైతికంగానైనా చైర్పర్సన్ పదవిని దక్కించుకోవడానికి సిద్ధమైంది. వైఎస్సార్ సీపీ నుంచి గెలిచిన ఎస్సీ మహిళా కౌన్సిలర్లను తన వైపు తిప్పుకొనేందుకు ప్రలోభాలు పెట్టింది. చివరికి ఆరో వార్డు నుంచి వైఎస్సార్ సీపీ తరఫున గెలిచిన కొప్పాడ పార్వతి పార్టీ ఫిరాయించి, టీడీపీ తరఫున చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. దీనిపై వైఎస్సార్ సీపీ విప్ సామంతుల శ్రీరామసూర్యకుమార్ ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ నిర్వహించిన ఎన్నికల అధికారి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద పార్వతిపై అనర్హత వేటు వేశారు. వైఎస్సార్ సీపీలో ఆనందోత్సాహాలు చైర్పర్సన్ పార్వతిపై అనర్హత వేటు పడడంతో వైఎస్సార్ సీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. స్థానిక బాలాజీ చౌక్‌లోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహం వద్ద ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీఎత్తున బాణాసంచా కాల్చారు. స్వీట్లు పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. చివరికి న్యాయం గెలిచిందంటూ నినాదాలు చేశారు. పార్టీ నేతలు అలమండ చలమయ్య, సామంతుల సూర్యకుమార్, బదిరెడ్డి గోవిందు, మలకల వేణు, వాగుబలరామ్, దాకమర్రి సూరిబాబు, తొండారపు రాంబాబు, పతివాడ బాబూరావు, గంగిశెట్టి సత్యనారాయణ, కౌన్సిలర్లు వాడపల్లి శ్రీను, బదిరెడ్డి అశాలత, గొడత చంద్ర, భజంతుల మణి, ఎస్ఎం సుభానీ, వరుపుల నె హ్రూ, కోసూరి అప్పలకొండ తదితరులు పాల్గొన్నారు. -
కుటుంబ కలహంతో తల్లీబిడ్డల ఆత్మహత్యా యత్నం
ఏలేశ్వరం, న్యూస్‌లైన్ : కుటుంబ కలహాల నేపథ్యంలో తల్లీబిడ్డలు పురుగు మందు తాగి ఆత్మహత్యా యత్నం చేసుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తల్లి చనిపోగా, ఇద్దరు కుమారులు చికిత్స పొందుతున్నారు. పోలీసు లు, స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని జె.అన్నవరంలో నివసిస్తున్న నిట్టాల వెంకటేశ్వరరావు కిరాణా సామాన్లలు మోటార్ సైకిల్‌పై ఊరూరా తిరుగుతూ విక్రయిస్తుంటాడు. కొంతకాలం నుంచి భార్య పద్మ(36)తో గొడవలు జరుగుతున్నాయి. వీరి పెద్ద కుమారుడు సందీప్(18) ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండో ఏడాది, చిన్న కుమారుడు సాయిప్రసన్న(16) ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొదటి ఏడాది చదువుతున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో వెంకటేశ్వరరావుతో గొడవపడ్డ పద్మ ఇటీవల పుట్టింటికి వెళ్లి, గత శనివారం ఇంటికి తిరిగొచ్చింది. సోమవారం మళ్లీ భార్యాభర్తలకు గొడవ జరిగింది. ఈ క్ర మంలో సందీప్ ఏలేశ్వరంలో పురుగు మందు కొని ఇంటికి తెచ్చాడు. ఉద యాన్నే తల్లి, ఇద్దరు కుమారులు పురుగు మందు తాగారు. వారు వాంతులు చేసుకోవడాన్ని గమనించిన వెంకటేశ్వరరావు ఓ ప్రైవేట్ వాహనంపై ఏలేశ్వరం ప్రభుత్వాస్పత్రికి తరలించాడు. అక్కడ చికిత్స పొందుతూ పద్మ మరణించగా, ఇద్దరు కుమారులు చికి త్స పొందుతున్నారు. తల్లి పద్మకు తండ్రి లేనిపోని అక్రమ సంబంధం అంటగ డుతున్నట్టు సందీప్, సాయిప్రసన్నలు పేర్కొన్నారు. దీంతో పాటు చుట్టుపక్కల వారితో వచ్చి తమపై తగదాకు దిగాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఐ రామ్మోహన్ రెడ్డి, ఎస్సై గౌరీశంకర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. వెంకటేశ్వరరావుతో పాటు ఇరుగుపొరుగున ఉన్న ఎనిమిది మందిపై ఎస్సై గౌరీశంకర్ కేసు నమోదు చేశారు.