breaking news
electrocial shock
-
నిద్రమాత్రలతో అతడికి ఏమీ కాలేదు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీకి చెందిన ఓ మహిళ భర్తను చంపేందుకు చేసిన ప్రయత్నాలు తెలిసి పోలీసులే షాకయ్యారు. ఆమె సెల్ చాటింగ్ వివరాలు పోలీసులకు దొరికాయి. అందులో ఆమె..‘అతడికి ఆహారంలో చాలా నిద్రమాత్రలు కలిపి ఇచ్చాను. అయినా ఏమీ కాలేదు..బాగానే ఉన్నాడు. ఇప్పుడిక కరెంట్ షాకివ్వడమొక్కటే దారి. ఎంత సేపు షాకివ్వాలి?’అంటూ ప్రియుడిని సలహా అడిగింది. అందుకా ప్రియుడు..‘ముందుగా అతడి నోటిని, రెండు చేతులను టేప్‌తో కట్టేసి, ఆ తర్వాత కరెంట్ షాకివ్వాలి’అంటూ దారి చూపడం గమనార్హం. ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలోని ఉత్తమ్‌నగర్‌కు చెందిన కరణ్(36) భార్య సుశ్మిత, వరుసకు మరిది అయ్యే రాహుల్‌తో అక్రమ సంబంధం సాగిస్తోంది. వీరిద్దరూ కలిసి కరణ్‌ను చంపాలని ప్లాన్లు వేస్తున్నారు. ఈనెల 13వ తేదీన మాతా రూప్రాణీ హాస్పిటల్ నుంచి పోలీసులకు కరణ్ అనే వ్యక్తి విద్యుత్ షాక్‌తో చనిపోయినట్లు సమాచారం అందింది. కరణ్ కుటుంబీకులు తమకు సుశ్మితపై అనుమానం ఉందని, ఆమె రాహుల్‌తో సన్నిహితంగా ఉంటోందంటూ వివరించారు. పోలీసుల విచారణలో సుశ్మిత దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడించింది. ఈ నెల 12న రాత్రి సుశ్మిత సుమారు 15 నిద్రమాత్రలను కరణ్‌కు వడ్డించిన భోజనంలో కలిపినట్లు తెలిపింది. అయినా కరణ్ చనిపోలేదని రాహుల్‌కు తెలిపింది. అతడి సలహా మేరకు విద్యుత్‌షాక్‌కు గురిచేసింది. చనిపోయాడని నిర్థారించుకున్నాక సమీపంలోని అత్తమామల ఇంటికి వెళ్లి కరణ్ అపస్మారక స్థితిలో ఉన్నాడని తెలిపింది. అంతా కలిసి కరణ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అతడు అప్పటికే చనిపోయాడని వైద్యులు తెలిపారు. మరణానికి కారణం కరెంట్ షాకని శవపరీక్షలో తేలింది. అదేవిధంగా, కరణ్ సోదరుడు సుశ్మిత–రాహుల్‌లు ఇన్‌స్టాలో చేసిన చాటింగ్ వివరాలను పోలీసులకు అందజేశాడు. -
ట్రాన్స్ విమెన్‌కి రికార్డు స్థాయిలో రూ. 6 లక్షల నష్టపరిహారం..!
ట్రాన్స్జెండర్లు హక్కులను గౌరవించమని, తాము మనుషులమే అని ఎన్నో సార్లు మొరపెట్టుకున్నారు, పోరాటాలు చేశారు. సుప్రీంకోర్టు సైతం వాళ్లకు కూడా కొన్ని హక్కులను ప్రసాదించింది. వారికి సమాజంలో సుమచిత స్థానం, గుర్తింపు ఇవ్వాలని స్పష్టం చేసింది కూడా. కానీ ఎక్కడో ఒక చోట వారిపై దాడులు, లింగ వివక్షత వంటి సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నారు. చెప్పాలంటే వారి విషయంలో సమాజం తీరు చాలావరకు మారాల్సి ఉంది. అయితే ఇలాంటి పరిస్థితి వివిధ దేశాల్లో కూడా ఉండటం బాధకరం. కొన్ని దేశాలు వారిపట్ల చాలా అమానుషంగా ప్రవర్తిస్తాయి. కనీసం వారి హక్కులకు కూడా ప్రాధాన్యత ఇవ్వదు. అలాంటి ఓ దేశం ఓ ట్రాన్స్ విమెన్ కేసుకి ప్రాధాన్యత ఇవ్వడమే సత్వరమే ఆమెకు న్యాయం జరిగేలా చేసింది. ఈ ఘటనను చరిత్రలో ఒక గొప్ప మైలురాయిగా అభివర్ణించవచ్చు. ఈ సంఘటన ఏ దేశంలో చోటు చేసుకుందంటే..చైనాకు చెందిన ట్రాన్స్ విమెన్ మగవాడిగా జన్మించి.. స్త్రీగా మారింది. ఇలా ట్రాన్సవిమెన్గా మారడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన తల్లిదండ్రులు ఆమెను కిన్‌హువాంగ్‌డావో సిటీ ఫిఫ్త్ అనే మెంటల్ ఆస్పత్రికి తరలించారు. ఏదో మానసిక సమస్య వల్ల ఇలా చేసిందంటూ ఇదివరకటి వ్యక్తిలీ మార్చేలా ట్రీట్మెంట్ ఇవ్వమని చెప్పారు. అక్కడ నుంచి ఆమెకు మొదలైన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అక్కడ సిబ్బందితో సహా వైద్యులంతా తన ధోరణిని తప్పుపడుతూ బలవంతంగా మార్చే ప్రయత్నం చేశారు. అక్కడ ఎవ్వరూ ఆమెను విభిన్న లింగానికి చెందినదిగా అంగీకరించపోగా, హేళనలు, చిత్కారాలతో ఆమె మనసు మార్చే ప్రయత్నం చేశారు. ఆ నిమిత్తమైన సుమారు 97 రోజుల పాటు ఏడు సెషన్ల ఎలక్ట్రోషాక్ థెరపీ అందించారు. దీని కారణంగా మూర్చ(ఫిట్స్) వంటి సమస్యలు వచ్చాయి. ఆ ఆస్పత్రి బయట సమాజం అంగీకరించే విధంగా మార్చే ప్రయత్నంలో భాగంగా తనను శారీరకంగా మానసికంగా ఇబ్బందికి గురిచేసేలా వైద్యం చేశారు. దీని కారణంగా అనారోగ్యం పాలయ్యానంటూ కోర్టుని ఆశ్రయించింది. ట్రాన్స్ జెండర్లకి ప్రాధాన్యత ఇవ్వని చైనా దేశం ఆమె కేసుని టేకప్ చేయడమే కాకుండా సత్వరమే న్యాయం జరిగేలా చూసింది. చైనా మెంటల్ హెల్త్ చట్టాల ప్రకారం..వ్యక్తి ఇష్టానికి లోబడే చికిత్స చేయాలి. అలా కాకుండా వారి ఇష్టంతో సంబంధం లేకుండా ప్రమాదం కలిగించేలా చికిత్స చేస్తే దాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తుంది చైనా కోర్టు. ఈ మేరకు చాంగ్లీ కౌంటీ పీపుల్స్ కోర్ట్ స్వలింగ సంపర్కులు లేదా ట్రాన్స్ వ్యక్తులను "మార్చడానికి" హానికరమైన మందులు లేదా ఎలక్ట్రోషాక్ పద్ధతులను ఉపయోగించడం నేరం అని స్పష్టం చేసింది. ఆమెను అనారోగ్యం పాలు చేసినందుకు గానూ సదరు హాస్పిటల్ దాదాపు రూ. 6 లక్షలు పైనే నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా పేర్కొంది. (చదవండి: ఫ్యాషన్‌కి వయసు అడ్డంకి కాదంటే ఇదే..! లెజండరీ గ్రానీ స్టిల్స్ అదుర్స్..) -
ఆలయంలో తొక్కిసలాట, నలుగురికి గాయాలు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఓ దేవాలయం వద్ద తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ తొక్కిసలాటలో నలుగురు భక్తులు గాయపడినట్టు శనివారం పోలీసులు పేర్కొన్నారు. గతరాత్రి ఉత్తరప్రదేశ్‌లోని వ్రిందావన్‌లో బిహారి దేవాలయ ప్రాంగణంలో విద్యుత్ షాక్ అంటూ వదంతులు వ్యాపించాయి. దాంతో దేవాలయంలో ఉన్న భక్తులంతా తమకు ఎక్కడ షాక్ తగులుతుందోనని భయాందోళనకు గురయ్యారు. అయితే ఆలయంలో ఇరుకైన దారిగుండా వెళుతున్న ఓ మహిళ చేయి విద్యుత్ జంక్షన్ బాక్స్ వద్ద ఉన్న కరెంట్ తీగకు తగిలింది. దాంతో ఆమె తేలకపాటి షాక్‌కు గురైంది. ఆమె చేతిలో ఉన్న పసికందు చేతిలోనుంచి జారిపోయింది. దాంతో భయపడిన భక్తులంతా పరుగులు తీయడంతో తొక్కిసలాటకు దారితీసింది. దేవాలయ యాజమాన్యం అది కేవలం వదంతు మాత్రమే ఎలాంటి షాక్ లేదు అంటూ ప్రకటించిన కూడా భక్తులు నిలబడలేదు. కానీ, ఇదంతా సర్దుమనగడానికి దాదాపు గంటపాటు సమయం పట్టినట్టు పోలీసులు తెలిపారు. ఈ తొక్కిసలాటలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించగా, ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు.