breaking news
Ego problems
-
Ego అహం పతనానికి నాంది
గర్వం, అహంకారం అన్నవి మహాచెడ్డ దుర్గుణాలు. మానవులకు ఏవిధంగానూ శోభించని లక్షణాలు. నిజానికి ఇవి షైతాన్ గుణాలు. కేవలం అహం కారణంగానే దైవానికి అవిధేయుడై దుర్మార్గుల్లో కలిసి పొయ్యాడు, ధూర్తుడిగా మిగిలి పోయాడు. దైవం మానవుణ్ణి సృష్టించిన తరువాత, అందరూ అతనికి సజ్దా (సాష్టాంగ ప్రణామం) చెయ్యాలని ఆదేశించాడు. కాని షైతాన్ చెయ్యలేదు. ఈ విషయం పవిత్ర ఖురాన్లో ఇలా ఉంది.: ’ ... ఆ తర్వాత మేము ఆదంకు గౌరవ సూచకంగా అభివాదం చెయ్యండని దైవదూతలను ఆదేశించాము. అప్పుడు ఇబ్లీసు తప్ప అందరూ అభివాదం చేశారు. ఇబ్లీసు తనేదో గొప్పవాణ్ణన్న అహంకారంతో విర్రవీగుతూ, తిరస్కరించి అవిధేయుడై పొయ్యాడు.’(2 – 34). అల్ ఆరాఫ్ సూరా 11, 12 వాక్యాల్లో, సాద్ సూరా 73, 74, 75 లో కూడా ఈ ప్రస్తావన ఉంది.అహం అంటే.., తానే గొప్పవాడినని భావించడం. ఇతరులను తక్కువగా, హీనంగా చూడడం. అన్నీ, అంతా తనకే తెలుసని, ఇతరులకేమీ తెలియదని తల΄ోయడం. షైతాన్ ఇక్కడ రెండు తప్పులు చేశాడు. ఒకటి: దైవాదేశాన్ని తిరస్కరించాడు. రెండు: ఆదిమానవుణ్ణి తనకన్నా తక్కువ వాడుగా, నీచుడిగా చూశాడు. అంటే, తన సృజన అగ్నితో జరిగింది కాబట్టి, మట్టితో సృష్టించబడిన వాడికంటే తానే గొప్పవాడినన్న అహం అతడి సత్యతిరస్కారానికి కారణమైంది. ఈ విధంగా వాడు తన వినాశనాన్ని తానే కొని తెచ్చుకున్నాడు.సత్యాన్ని సత్యంగా అంగీకరించాలంటే, ఇతరులను గౌరవ దృష్టితో చూడగలగాలంటే, ’అందరి’ కన్నా గొప్పవాడయిన సృష్టికర్త ఆదేశాలను పాలించగలగాలి. కాని అతనిలోని అహం మరెవ్వరినీ తనకన్నా గొప్పవాడుగా అంగీకరించడానికి ఒప్పుకోదు. సమాజంలో తనకో గొప్పస్థానం ప్రాప్తం కావాలని కోరుకుంటాడు. మరెవరూ తన స్థాయికి, కనీసం తన దరిదాపుల్లోకి రావడాన్నీ సహించలేడు. అంతా తనకే తెలుసునని, ఎదుటివారికి ఏమీ తెలియదని, తనమాటే చెల్లుబాటు కావాలని అభిలషిస్తాడు. ఈ వైఖరి సరయినది కానప్పటికీ, ఎదురు దెబ్బలు తగులుతున్న ప్పటికీ అతనిలోని ’ అహం ’ తప్పుడు వైఖరి గురించి ఆలోచించే అవకాశమే ఇవ్వదు. మంచి అనేది ఉంటే అది తనలోనే ఉందని, ఇతరులు చేరుకోక ముందే తాను దాన్ని అంది పుచ్చుకుంటానని అతను భావిస్తాడు. ఎదుటి వారిలోని ఏమంచినీ, ఏ నైతిక సుగుణాన్నీ అతను అంగీకరించడు. నైతిక వర్తను డైనా, సౌజన్యశీలుడైనా అంతా తానేనని తల΄ోస్తాడు.చదవండి: Ashtavakra అష్టావక్ర సందేశంఇలాంటివారు తమ అహంకార వైఖరి కారణంగా తమను తామే నష్టపరుచుకుంటారు తప్ప మరొకటి కాదు. ఇదంతా తమకే అంతా తెలుసు, ఎదుటి వారికి ఏమీ తెలియదనుకున్న ఫలితం. వారి మనసులో తామేదో గొప్పవాళ్ళమన్న అహంకార భావం తిష్ట వేసుకొని ఉంటుంది. ఇది ఎంతమాత్రం మంచి విధానంకాదు. గర్వం, అహంకారం లాంటి దుర్లక్షణాల నుండి దైవం అందరినీ కాపాడాలని కోరుకుందాం.ఇదీ చదవండి: ఎవడు వివేకి? ఎవడు అవివేకి? -
భార్య ఫోన్ హ్యాక్ చేసిన భర్త.. భార్య ఏం చేసిందంటే..!
చైత్ర (పేరు మార్చడమైనది), వర్ధన్(పేరు మార్చడమైనది) ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు. పెళ్లై ఎనిమిదేళ్లు. ఇద్దరి జీతాలు నెలకు చెరో లక్ష రూపాయలకు పైనే. ఆరేళ్ల కూతురు. చింతల్లేని చిన్నకుటుంబం. అర్ధరాత్రి దాటింది. ల్యాప్‌ట్యాప్ మూసేసి బెడ్ మీద వాలింది చైత్ర. నోటిఫికేషన్ ఏదో వచ్చినట్టు ఫోన్లో ‘బీప్’ మని సౌండ్ వచ్చింది. ఫోన్ చేతిలోకి తీసుకుంది చైత్ర. మెసేజ్ చూడగానే పెదాల మీదకు యధాలాపంగా నవ్వు వచ్చింది. ఆ పక్కనే ఉన్న వర్ధన్ కూడా ఫోన్లోనే ఉన్నాడు. చైత్రను ఒకసారి చూసి, లైట్ ఆఫ్ చేసి, తన ఫోన్ పక్కన పెట్టి, పడుకున్నాడు. చైత్ర మరో అరగంట వరకు ఉండి తనూ పడుకుంది. ఏడాది క్రితం వరకు ఇద్దరూ ఆఫీసులకు వెళ్లేవారు. లాక్డౌన్ పుణ్యమా అని వర్క్‌ఫ్రమ్ హోమ్ కారణంగా ఇద్దరూ ఇంటినుంచే వర్క్ చేస్తున్నారు. ఓ రోజు చైత్ర ఇంటి నుంచి బయటకు వచ్చేసి, విడాకులు ఫైల్ చేసింది. ఇరువైపు తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినిపించుకునే స్థితి లేదు. ఇద్దరి ఒంటిమీద గాయాల తాలూకు మచ్చలు ఉన్నాయి. ఆరేళ్ల వారి కూతురు బిక్కుబిక్కుమంటూ తల్లితండ్రిని చూస్తూ ఉండిపోయింది. ఏమైందంటే.. భార్యాభర్త ఇద్దరూ ఇంటి దగ్గర ఉంటున్నారు. ఇంటి పనులు చేయడంలో వాటాలు వేసుకున్నారు. నువ్వంటే.. నువ్వంటూ .. ఇద్దరి ఇగోస్ దెబ్బతిన్నాయి. కొన్ని రోజుల వరకు భరించిన చైత్రకు వర్ధన్ అంటే అసహనం మొదలైంది. ఓ రోజు తన కొలీగ్ నుంచి ఓదార్పు మెసేజ్‌తో చైత్రకు పోగొట్టుకున్న పెన్నిధి దొరికినట్టయ్యింది. సాధారణంగా మొదలైన మెసేజ్.. రెగ్యులర్‌గా చాట్ చేయడం వరకు వెళ్లింది. భార్య అస్తమానం ఫోన్‌తో ఉండటం గమనించిన వర్ధన్ ఆమెకు తెలియకుండా ఆమె ఫోన్లో ఓ సాఫ్ట్‌వేర్‌ని ఇన్స్టాల్ చేశాడు. ఆమెకు వచ్చిన మెసేజ్‌లు, ఆమె వాడిన డేటా, రోజు మొత్తం ఎన్ని గంటలు ఫోన్లో ఉంటుందనే వివరాలన్నీ తను గమనించడం మొదలుపెట్టాడు. చైత్ర కూడా భర్త తనతో సరిగా లేకపోవడంతో చిన్న అనుమానం మొదలైంది. సాఫ్ట్వేర్ కావడంతో భర్త ఫోన్లో అతనికి తెలియకుండా అతని డేటాను తన ఫోన్లో చూసుకునేలా సాఫ్ట్‌వేర్‌ను ఇన్స్టాల్ చేసుకుంది. చిన్న డౌట్‌తో మొదలై ఒకరి ఫోన్లను ఇంకొకరు హ్యాక్ చేసుకునేంతవరకు వెళ్లారు. ఇద్దరిలోనూ ఒకరిపై ఒకరికి విపరీతమైన అనుమానం తలెత్తింది. ఫలితంగా గొడవలు. ఓ రోజు ఇద్దరూ కొట్టుకోవడంతో విషయం పోలీసు స్టేషన్‌కి వెళ్లింది. అటు నుంచి విడాకులకు దారితీసింది. స్మార్ట్‌గా.. విచ్ఛిన్నం అవుతున్న జీవితాలు సైబర్ సేఫ్టీ వింగ్ వారు ఒకరినొకరు చేసుకున్న ఫోన్ హ్యాకింగ్ గుర్తించి, అసలు విషయం తెలుసుకున్నారు. ‘ఒక ఇంటి కప్పు కింద ఉన్నవాళ్లైనా తమ వాళ్లను చేసే సాఫ్ట్ మోసం కూడా జీవితాలను చెల్లాచెదురు చేస్తుంది. కోవిడ్ వల్ల అందరూ ఇంట్లోనే ఉండే స్థితి. ఫలితంగా గృహహింస కేసులు 27 శాతం పెరిగాయి. అదే ఐటి కమ్యూనిటీలలో ఉన్నవారి కేసులయితే 28 శాతం ఉన్నాయి’ అంటూ వివరించారు సైబర్ సేఫ్టీ నిర్వాహకులు అనీల్ రాచమల్ల. స్మార్ట్‌గా ఉంటే సరిపోదు స్మార్ట్ ఫోన్ వాడకం పట్ల అవగాహన పెంచుకుంటే జీవితాలు దిద్దుకోవచ్చని చెబుతున్నారు. బానిసలవడమే అసలు కారణం స్మార్ట్ ఫోన్లో ఉండే సాఫ్ట్వేర్ వాడకంతో ఐటీ కమ్యూనిటీలో కొత్త ఆలోచనలు పెరుగుతున్నాయి. తమ భాగస్వాముల ఫొటోలు తీసి షేర్, ట్యాగ్ చేయడం చేస్తుంటారు. ఆన్లైన్ అవమానం అంటూ ఓ కొత్త తరానికి తెరతీస్తున్నారు. భర్త లేదా భార్య తనని పట్టించుకోవడం లేదని బాధపడుతూ బయటివారితో చాటింగ్ చేస్తూ ‘సో బ్యూటిఫుల్, గార్జియస్, అమేజింగ్’ అంటూ మెచ్చుకునే పదాలకు పొంగిపోతుంటారు కొందరు. స్మార్ట్ ఫోన్ ఎడిక్షన్ వల్లే డైవోర్స్ రేట్ పెరుగుతోందని మా నివేదికల్లో తేలింది. స్క్రీన్ టైమ్.. గ్రీన్ టైమ్ లెక్కింపు ఫోన్ స్క్రీన్ మీద ఎంతసేపు ఉంటున్నాం. పచ్చదనంలో ఎంతసేపు ఉంటున్నాం.. అనేది కూడా గ్రహించాలి. ఈ నిబంధన పెట్టుకోవడం వల్ల ఫోన్లో గడిపే సమయం తగ్గుతుంది. టెక్నాలజీని ఎలా వాడుకోవాలనే విషయాలపట్ల అవగాహన ఏర్పరుచుకోవాలి. బంధాలు విచ్ఛిన్నం చేసుకునేంతగా, మన ప్రవర్తన–అలవాట్లు మారేంతగా స్మార్ట్ ఫోన్‌ని ఉపయోగిస్తున్నామా అనేది కూడా గ్రహింపులోకి తెచ్చుకోవాలి. స్మార్ట్ ఫోన్‌ని బెడ్రూమ్లోకి తీసుకెళ్లకూడదు. ఒక టైమ్ పరిధి దాటగానే నోటిఫికేషన్ని బ్లాక్ చేసుకోవాలి. ఇప్పుడున్న కాలంలో నిజం చెప్పినా ‘ఈజ్ ఇట్ ట్రూ’ అని అడుగుతుంటారు. ఒక అబద్ధంలో బతికేస్తున్నామనే విషయం సోషల్ మీడియా వల్ల మనకు అర్థమవుతూనే ఉంది. అందుకే, మన ప్రైవసీని కాపాడుకుంటూ వ్యక్తిత్వాన్ని నిలుపుకోవాలి. ఇంటర్నెట్ వాల్యూస్, డిజిటల్ వెల్నెస్ గురించి మరింత తెలుసుకోవడానికి సైబర్ టాక్‌ను సంప్రదించవచ్చు. – అనీల్ రాచమల్ల, ఎండ్ నౌ ఫౌండేషన్, సైబర్ సేఫ్టీ, హైదరాబాద్ -
3వ నెల నుండి ఇగో సమస్యలు మొదలు
కేస్ స్టడీ లలిత, శ్రీనివాస్‌లది పెద్దలు కుదిర్చిన వివాహం. డాక్టర్ భార్య, ఆఫీసర్ భర్త సంసారం పెళ్లయిన 2 నెలలు గొడవల్లేకుండా గడిచిపోయింది. 3వ నెల నుండి ఇగో సమస్యలు మొదలయ్యాయి. ఒకరిమీద ఒకరు ఆధిపత్యం కోసం పోరాడుకుంటూనే ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. ‘నేను డాక్టర్‌ను, మంచి ప్రొఫెషనల్‌ను, నాకేంటి’ అని లలిత తరచు భర్తను కించపరిచేది. శ్రీనివాసేమో మగవాడిని, భర్తను, పైగా ఆఫీసర్‌ను అని ఇద్దరి మధ్యా తరచు గొడవలు. అలా ఒకరోజు మొదలైన గొడవ చినికి చినికి గాలివాన అయ్యింది. 6 సం॥8 సం॥వయసున్న ఇద్దరు కొడుకుల్ని భర్త ఆఫీస్‌కు వెళ్లిన సమయంలో దేవాలయంలో వదిలేసి లలిత హాస్పిటల్‌కు వెళ్లిపోయింది. తెలిసినవారెవరో చూసి, ఏడుస్తున్న పిల్లలకు ఆశ్రయమిచ్చి శ్రీనివాస్‌కి సమాచారం అందించారు. శ్రీనివాస్ హుటాహుటిన వచ్చి వారిని ఇంటికి తీసుకువెళ్లాడు. భార్య చేసిన పనికి కోపంతో మండిపడుతూ, ఇక ఆమెతో కాపురం చేసేది లేదని తెలిసిన వాళ్ల ముందు తెగేసి చెప్పి, అప్పటికప్పుడు ఇంట్లోని సామానంతా తెచ్చేసి వేరు కాపురం మొదలెట్టేశాడు. లలిత అంతకన్నా ఎక్కువ కోపంతో భర్త మీద 498 ‘ఎ’, గృహ హింస కేస్లు ఫైల్ చేసేసింది. అలాంటి భార్యతో తెగదెంపులు చేసుకోవడమే మేలంటూ శ్రీనివాస్ తనకు విడాకులు కావాలంటూ కోర్టుకెక్కాడు. ఇద్దరి వాదోపవాదాల నడుమ ఎనిమిదేళ్లు గడిచాయి. ఈ లోగా స్కూల్లో ఉన్న పిల్లలు, కాలేజ్ చదువులకు వచ్చేశారు. పిల్లల కష్టడీ తనకే అప్పగించాలంటూ లలిత భర్తపై కస్టడీ ఆఫ్ చిల్డ్రన్, రెస్టిట్యూషన్ ఆఫ్ కంజ్యూగల్ రైట్స్ (కాపురానికొస్తానని) కేసు, 498 ‘ఎ’, డీవీసీ కేసు పెట్టింది. తమను నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్లిందన్న బాధతో పిల్లలు తాము తల్లి దగ్గరకు వెళ్లేది లేదంటూ జడ్జిగారి ముందు చెప్పడంతో కోర్టులో అన్ని కేసులూ కొట్టేశారు. ఎట్టకేలకు శ్రీనివాస్‌కు విడాకులు మంజూరయ్యాయి. కోటీశ్వరురాలైన డాక్టర్ లలిత మొగుడు, భర్త, పిల్లలు లేకుండా భారంగా బతుకీడుస్తోంది. విడాకులు మంజూరు అయినప్పటికీ కాలేజీ చదువుల్లోకొచ్చిన ఇద్దరు పిల్లల తండ్రి శ్రీనివాస్‌కు పిల్లనిచ్చేందుకు ఎవరూ ధైర్యంగా ముందుకు రాలేదు. దాంతో ఆఫీసులో అందరి గుసగుసల నడుమ ఆడదిక్కులేకుండానే పిల్లలను పెంచి పెద్ద చేసుకుంటూ శ్రీనివాస్ నిస్సారంగా జీవితాన్ని గడప వలసి వచ్చింది. కోర్టుల చుట్టు తిరిగి తిరిగి ఇద్దరికీ ఆరోగ్యం పాడయింది. ఎంత సంపాదించినా ఏం లాభం, ఇద్దరూ రెంటికి చెడ్డ రేవడి అయ్యారు. నిశ్చల సిద్ధారెడ్డి అడిషనల్ గవర్నమెంట్ ప్లీడర్