breaking news
earlobe
-
చెవి తమ్మె పూర్తిగా తెగిపోతే..!
ఫ్యాషన్‌లో భాగంగానో లేదా తమ దుస్తులకు మ్యాచింగ్‌గా ఉంటాయనో కొందరు చాలా బరువైన ఇయర్ రింగ్స్‌ను వాడుతుంటారు. ఇలాంటి ఫ్యాషనబుల్ ఇయర్ రింగ్స్ ఎక్కువగా వాడుతుండటం లేదా హ్యాంగింగ్స్ తరచూ వేసుకుంటూ ఉండటంలో వాటి బరువు కారణంగా క్రమంగా చెవి రంధ్రం సాగితూ, ఆ రంధ్రం పెద్దదైపోయి ఒకదశలో చెవి తమ్మె పూర్తిగా తెగిపోయే ప్రమాదమూ ఉంటుంది. ఇది పూర్తిగా తెగిపోయాక అప్పుడు రిపేర్ చేయించుకోవడం కంటే రంధ్రం పెద్దది అవుతున్న సమయంలోనే చేయించుకోవడం మంచిది. చాలా ఎక్కువ బరువుండే ఇయర్ రింగ్స్ లేదా హ్యాంగింగ్స్ కారణంగా చెవి బాగా సాగిపోయిన లేదా తెగిపోయిన చెవి తమ్మెను ప్లాస్టిక్ సర్జరీ ప్రక్రియ ద్వారా రిపేర్ చేయడం సాధ్యమవుతుంది. ఈ ప్రక్రియలో బాధితులకు ఎలాంటి మత్తుమందు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. కేవలం ఆ ప్రాంతం వరకు శరీరం మొద్దుబారేలా మత్తు (లోకల్ అనస్థీషియా) ఇస్తే సరిపోతుంది. రెండుగా చీలిపోయినట్లుగా తెగిన చెవి తమ్మెను నేరుగా ప్లాస్టిక్ సర్జరీ చికిత్సలోనైనా లేదా చికిత్స తర్వాత గాయం మానిన తర్వాతనైనా... సదరు గాయం మచ్చను కనపడకుండా చేసేందుకూ చికిత్స అందించడం వచ్చు ఇందులో భాగంగా చెవి తమ్మెను వంకరటింకరగా (జిగ్‌జాగ్)గా అతికిస్తూ నిపుణులు రిపేర్ చేస్తారు. అయితే ఇలా చెవి తమ్మెలను అతికించే ప్రక్రియ అందరిలోనూ ఒకేలా ఉండకపోవచ్చు. అయితే ఈ అతికింపు ప్రక్రియ అందరిలోనూ ఒకేలా ఉండకపోవచ్చు. చెవి రంధ్రం చీరుకున్న తీరును బట్టి బాధితులకు ఎలాంటి ప్రక్రియ అవసరమో డాక్టర్లు నిర్ణయిస్తారు. ఆ తర్వాత వాళ్లతోనే మాట్లాడుతూ (కౌన్సెలింగ్ నిర్వహిస్తూ) వాళ్లకు అవసరమైన ప్రక్రియ గురించి వివరిస్తారు. వాళ్లు అంగీకరిస్తే అప్పుడు అతికింపు చికిత్స చేస్తారు. ఈ చికిత్సలో భాగంగా రెండుగా చీరుకున్న రంధ్రానికి కుట్లు వేయడం కోసం అత్యంత నాణ్యమైన, బయటకు కనపడని సున్నితమైన దారాన్ని ఉపయోగిస్తారు. ప్రక్రియ అంతా పూర్తయ్యాక చికిత్స నిర్వహించిన చోట కొన్నాళ్ల పాటు పైపూతగా ఉపయోగించే యాంటీబయాటిక్ క్రీమ్‌ను కొంతకాలం పాటు రాయాల్సి ఉంటుంది. కాక΄ోతే గాయం అంతా మానాక వెంటనే బయటకు కనపడదుగానీ... బాగా పరిశీలనగా చూస్తే ఓ పెన్సిల్‌తో గీసినంత సన్నగా ఉండే గీత అస్పష్టంగా కనిపిస్తుంది. ఈ అతికింపు ప్రక్రియ పూర్తయ్యాక మళ్లీ చెవి కుట్టించుకోవాలంటే... చెవి రంధ్రం పూర్తిగా పూడిపోయాక కనీసం ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు ఆగి, అప్పుడు కుట్టించుకోవచ్చు. అయితే ఈసారి మళ్లీ అలాంటి చాలా బరువైన హ్యాంగింగ్స్ కాకుండా తేలికైనవి వాడుతూ మాటిమాటికీ చెవి తమ్మె తెగి΄ోకుండా చూసుకునేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక చెవి తమ్మెలు బాగా లేతగా ఉండే చిన్నారి బాలికలూ, చెవి తమ్మెలో తగినంత స్థలం లేనివారు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. డా. ముఖర్జీ, సీనియర్ కార్డియాలజిస్ట్ (చదవండి: ఛాతీలో నీరు చేరితే...?) -
సహోద్యోగి చెవి కొరికిన ప్రవాస భారతీయునికి జైలు శిక్ష
సహోద్యోగి చెవి కొరికినందుకు సింగపూర్‌లో ప్రవాస భారతీయునికి ఐదు నెలల జైలు శిక్ష విధించింది అక్కడి న్యాయస్థానం. అంతేకాకుండా 1000 సింగపూర్ డాలర్ల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. మోహన్ శంకర్, తమిళనాడు నుంచి వెళ్లి సహచరులతో కలిసి సింగపూర్‌లో నిర్మాణ రంగంలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. 2020లో మద్యం మత్తులో ఈ ఘటనకు పాల్పడగా.. ప్రస్తుతం కోర్టు తీర్పునిచ్చింది. మద్యం మత్తులో సహోద్యోగిపై వాగ్వాదానికి దిగిన మోహన్.. అనంతరం అతనిపై దాడికి దిగాడు. ఈ క్రమంలో సహోద్యోగి చెవిని కొరికేశాడని పోలీసులు తెలిపారు. బాధితున్ని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స తీసుకుని కోలుకున్నాడు. కాగా.. మోహన్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. విచారణ తర్వాత ఈ మేరకు ఐదు నెలల జైలు శిక్షను విధించింది. అంతేకాకుండా 1000 సింగపూర్ డాలర్ల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఇదీ చదవండి: జాలరిని నీళ్లలోకి లాగేసిన సొరచేప.. వీడియో వైరల్.. -
సెల్ఫీ క్రేజ్.. అమెరికా యువతికి చుక్కలు!
పోర్ట్ లాండ్: సెల్ఫీ తీసుకునేందుకు యత్నించిన ఓ అమెరికా యువతికి చుక్కలు కనిపించాయి. ఓరెగాన్‌లోని పోర్ట్‌లాండ్‌కు చెందిన ఆష్లే గ్లేవ్ ఓ పామును పెంచుకుంటుంది. తన పెంపుడు పాము బార్ట్‌తో సరదాగా సెల్ఫీ తీసుకోవాలని భావించింది. కుడిచెంపకు పక్కన బార్ట్‌ను ఉంచి సెల్ఫీ తీసుకోవాలని చూసింది. ఇంతలో బార్ట్ అనే పాము ఆమె చివి రంద్రంలోకి దూరిపోయింది. చెవికి ఏదో ఆభరణం ధరించేందుకు పెద్ద సైజులో రంద్రాన్ని చేసుకోగా, అందులోకి దూరిన బార్ట్ కొన్ని సెకన్లలో అలాగే ఉండి ఇరుక్కుపోయిందని తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేసింది. తన పెట్ స్నేక్ బార్ట్ ఫొటోతో ఎదుర్కొన్న సమస్యను తన పోస్ట్ లో రాసుకొచ్చింది. చివరికి బార్ట్‌ను బయటకు తీయడం రాక, హాస్పిటల్‌కు పరుగులు తీయాల్సి వచ్చిందని చెప్పింది. హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డులో దిగిన ఫొటో పోస్ట్ చేయగా విపరీతంగా లైక్స్, షేర్లు సొంతం చేసుకుంది. సెల్ఫీ తీసుకునేందుకు ట్రై చేస్తే ఇలా జరిగి చుక్కలు కనిపించాయంటూ డాక్టర్‌కు వివరించి ఆష్లే గ్లేవ్. పాముకు ఏం జరగకూడదని చెప్పడంతో, వైద్యులు ఆమె చెవిని కాస్త కట్ చేసి పామును బయటకు తీశారు. దీంతో బాధితురాలు, పాము యజమాని గ్లేవ్ ఊపిరి పీల్చుకుంది. ఇలా ఎవరూ సెల్ఫీలకోసం ట్రై చేయకూడదని నెటిజన్లకు సూచించింది.